సంక్రాంతి పర్వదినం సంబరాలకి నిర్వచనం. సంతోషాల్ని కలబోసుకునే ఒక మధుర వైభవం!
తెల్లవారక ముందే భోగి మంటలు…
ముంగిళ్ళ లో చక్కని చుక్కల ముగ్గులు…
పొలాల్లో చేతికొచ్చిన పంటలు…
ఇంట్లో పసందైన కమ్మని వంటలు…
కొత్త బట్టలు.. గొబ్బి పాటలు …
కొక్కొరోకో కోడి పందెములు…
గంభీర గంగిరెద్దు విన్యాసములు..
పిల్లల చిలిపి అల్లరులు..
మేళ తారాళాలు…
కనుమ మినుములు..
హరిదాసు కీర్తనలు..
గాలి పటాల ఆటలు..
అవధుల్లేని ఆనందపు అనుభూతులు..
ఇలా చెప్పుకుంటే పొతే ఎన్నో మరి ఎన్నెన్నో..! మీకు మీ కుటుంబానికి ఈ సంక్రాంతి సిరుల క్రాంతి కావాలి అని కోరుకుంటూ…
- మీ నేస్తం


సంక్రాంతి శుభాకాంక్షలు .
ధన్యవాదములు :)
మీ బొమ్మ చాలా బాగుందండి . నేను గ్రీటింగ్ కార్డ్ లో వుపయోగించుకోవచ్చా ప్లీజ్ .
ఒహు.. విచ్చల విడిగా ఉపయోగించుకోండి :)
అవన్నీ ఒకప్పటి ముంగిట్లో సరదా సందడులు…
ఇప్పుడు టీవీ ల్లోనే అదరా బదరా భోగి మంటలు….
బావుందండీ కవిత…
సంక్రాంతి శుభాకాంక్షలు!
బొమ్మ బాగుందండీ! ఇప్పటివరకూ ఈ సీజన్లో ముగ్గులేసే వాళ్ళనే తప్ప గొబ్బెమ్మలు పెట్టే అమ్మాయిని మీ బ్లాగులోనే చూస్తున్నా!
@ చిన్ని ఆశ ..
అవునండి.. ఇప్పుడు అసలు విషయం తక్కువ హడావిడి ఎక్కువ…. :P
@ సుజాత ..
ధన్యవాదములు.. హ.. హ.. ఏరి కోరి ఊరి నుండి పిలిపించానండీ!..:)
చాలా బాగుందండి. మీకు హృదయ పూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.
superga vundi