2014 జ్ఞాపకాలు – కొంచెం కష్టంగా.. కొంచెం ఇష్టంగా… !!!

2014/12/31

జీవితంలో ప్రతి సంవత్సరం ఎంతో కొంత నేర్చుకుంటాం. 2014 నాకు ఒక మరిచిపొలేని మధురానుభూతిని, బాధల్ని,  జ్ఞాపకాల్ని మిగిల్చింది..!

memory

 

 • నా జీవితంలో ముఖ్యమైనవారిలో ఇద్దరిని – కన్యాదానం చేసిన మామని, కళ్ళముందు తిరిగే మేనమామని  కోల్పొయాను..
 • గత రెండు సంవత్సారలుగా క్షీణిస్తున్న నాన్న ఆరొగ్యం ఈ సంవత్సరంలొ మెరుగుపడటం..
 • పనికిరాని పొలం లొ కొంత భాగాన్ని పనికొచ్చె పంటగా మార్చడం..
 • కెరీర్ పరంగా ఒక మెట్టు – విదేశీ విహారం..
 • చిన్నోడి బాల్యానికి అక్షరాభ్యాసం మొదలు..
 • మనసుని తాకే మహా మిత్రుల పరిచయాలు, బంధాలు, బంధావ్యాలు..
 • ప్రతి సంవత్సరంలా చిలుకూరుతో పాటు అదనంగా షిరిడి – మొదటిసారి, మంత్రాలయం – మరోసారి..

సంక్షిప్తంగా.. కాలగమనంలో ఈ 2014 కొంచెం ఘాటు బాధల్ని, కొంచెం స్వీటు జ్ఞాపకాల్ని మిగిల్చింది..


మిస్ యు బంగారం ..

2014/05/28


ప్రియమైన శ్రీమతీ….

మిస్ అవుతున్నాను… నన్ను హాయ్ తో మేల్కొలిపే నీ కమ్మటి ఛాయ్ ని
మిస్ అవుతున్నాను… నీకోసం ప్రతి వారం స్వీట్ షాప్ నుండి కొనే ఘాటిని
మిస్ అవుతున్నాను… నీకావల్సినప్పుడల్లా తెచ్చే పునుగుల్ని, మిర్చిని
మిస్ అవుతున్నాను… నోరురించేలా నువ్వు చేసే వంటకాల్ని
మిస్ అవుతున్నాను… నీ అమయాకత్వపు ప్రేమ కోపాల్ని
మిస్ అవుతున్నాను… ఆఫిస్ నుండి ఎప్పుడొస్తాడా అని ఎదురుచూసే నీచూపుల్ని
మిస్ అవుతున్నాను… మనం పంచుకునే సాయంత్రపు సంతోషాల్ని
మిస్ అవుతున్నాను… చపాతి కి ఆంలేట్ చేస్తే ఓకేనా అని నువ్వు పెట్టే మెసేజ్ లను
మిస్ అవుతున్నాను… మనం కలిసి చూసే సాథియా సీరియల్ ని
మిస్ అవుతున్నాను… మన వారంతపు విహార కాలక్షేపాల్ని
మిస్ అవుతున్నాను… బుడ్డొడి చేష్టల్ని చూసి నాన్నవే అనే ఆకతాయి మాటల్ని
మిస్ అవుతున్నాను…తలనొప్పి వస్తే నీ అప్యాయతతో తలదువ్వి అక్కున చేర్చుకునే అనురాగాన్ని


ఇంకా ఎన్నో ఉన్నాయి… ఎన్నెన్నో ఉన్నాయ్.. :(

ఎంత చెప్పినా తక్కువే సఖి…!


మన వైవాహిక జీవితం నేటికి ఐదు వసంతాలలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా..
వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు :)


ప్రేమతో….!!!


కొలాయి పంచ్ ల త్రివిక్రమ్ ‘జులాయి’..!

2012/08/29

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారు మరోసారి తన పంచ్ లను “జులాయి” ద్వారా అందించారు. నేను గ్రహించనవి రాస్తున్నాను.మీకు గుర్తున్నవి ఏమైనా ఉంటె కామేన్టేయండి :)

 • లక్షరూపాయలు తగిలే లాటరీ టిక్కెట్ కూడా కష్టపడి సంపాదించిన రూపాయితోనే కొనాలి.
 • జీవితం హైవే! గెలుపు వన్ వే!! అందులో షార్ట్ కర్ట్స్ కి నో వే!!!
 • క్లాస్ లో ఉన్నప్పుడు ఎవ్వడైనా ఆన్సర్ చెప్తాడు. కాని ఎగ్జాం లో రాసేవాడే టాపర్ అవుతాడు!
 • మీరు వేసిన 5 లాక్స్ తో మా బాంక్ లో 1500 క్రోర్స్ అయ్యాయి సార్ …! ఐతే ఇప్పుడు నాకు ఏమైనా గిఫ్ట్ ఇస్తారా? లేదు సార్ రిసిప్ట్ ఇస్తాము..!
 • కత్తికి ఫీలింగ్స్ ఉండవు బాబాయ్! పదునే!!
 • మీరు మాట్లాడుతుంటే నా చేతులకు చెమటలు పడుతున్నాయ్!
  మీరేం చేస్తుంటారు? దోచుకున్టుంటాను!
 • మనకు తెలిసిన పనిని ఫ్రీగా చేయకూడదు. మనకు రాని పని ట్రై చేయకూడదు.
 • లాకర్ తెరవడం మన ఆర్ట్. డబ్బులు తీసుకోచ్చేద్దాం! లాకప్ లోకి వెళ్ళకుండా చూసుకోవడం ఆయన పార్ట్.
 • ఆ లెక్కలోనే పెద్ద బొక్క ఉంది!
 • థాట్ లైనా రిచ్ గా ఉండనివ్వండి నాన్నా ఫ్రీ యేగా!
 • అలా పరిగెత్తితే ట్రైన్ కింద పడిపోతాం కదండీ.. పడితే చచ్చిపో, కాని లెక్క చేసి మీ నాన్న తో పంపించు. ఈ పూటకి కొంపకి చావండి, అడ్డులే!
 • పైకొచ్చే లక్షణం ఒక్కటి లేదు, రాత్రి రెండింటికి పడుక్కోవడం పొద్దున్న పదింటికి లేవడం. తెల్లారగట్రన్నలేచేడుస్తే బాగుపడుతాడు! తెల్లారగట్ర కోడి కూడా లేస్తుంది. ఏం బాగుపడింది. చికెన్ వండుకుని తెనేస్తున్నారు..!
 • ఏంటి అత్తలు వర్షం లో ఏం చేస్తున్నారు. .! కొత్త గొడుగు కొన్నాను అబ్బాయ్, పని చేస్తుందో లేదని..!
 • పార్టి చేసేంత డబ్బులు లేవు, పార్టి ఇచ్చేంత స్టేటస్ లేదు!
 • డబ్బులు జాగ్రత్త ఎవడన్న కొట్టేస్తాడు..
  నేను తెలివైనోన్ని సార్. నా దగ్గర ఎవడు కొట్టేయలేడు.
  తెలివైనవాడు ఎవడు అలా చెప్పడు.
  చెప్పాలి సార్.. ఆఫ్ట్రాల్ సిగరెట్ పాకెట్ మీదే నను తాగొద్దు పోతారు అని రాసినపుడు నాలాంటోడు నన్ను గెలకొద్దు చస్తారు అని చెప్పోతే ఎలా?
 • అరె ధోని సిక్స్ కొట్టాడు రా!
  నేను పన్నెండు కొట్టాన్రా ఎమన్నా అరుస్తున్నానా!
 • ఇవి ఎన్నేల్లు రా?
  ఏంటి సార్! మీ వేల్లు మీరే లెక్కెట్టుకునేంత తాగేశార?
 • నా దగ్గర లైసెన్సు ఉంది బార్ నడుపుతున్నాను. వారి దగ్గర డబ్బులు ఉన్నాయ్ తాగుతున్నారు ఏంటి ప్రాబ్లెం?
  నా దగ్గర ఇంఫర్మేషన్ ఉంది. రైడ్ చేసాను. ఇర్రిటేషన్ వచ్చేసింది కొడుతున్నాను..!
 • వాడికి గొంతుంది అరుస్తాడు
  వీడికి ఫామిలి ఉంది దడుస్తాడు!
 • పొద్దున్నే యోగా చేస్తాడు
  సాయంత్రం వాక్ చేస్తాడు
 • నీకు లక్షల్లో కావాలి వాడికి కోట్లల్లో కావాలి!
  అంకెల్లోనే తేడా! ఆలోచనలో కాదు.
 • నేను మాట్లాడితే అంత కామెడీగా ఉంటుందని నువ్వు నవ్వేదాక నాకు తెలీదమ్మా!
 • వాడు దొంగతనం చేస్తాడన్నా గారేంటి ఏంటి?
  వర్షం పడుతున్నపుడు అందరు ఒకే కార్ లో ఎక్కడికి వెళ్తారు? పెళ్లికా ముహూర్తాలు లేవు! ఊరుకా లగ్గేజ్ లేదు…!
 • లాజిక్ లు ఎవరు నమ్మరు. అందరికి మాజిక్ లే కావాలి. అందుకే మనకి సైంటిస్ట్ ల కన్నా బాబాలు ఫేమస్.
 • ధైర్యం గా ఉండటం మంచిదే కాని జాగ్రత్తగా ఉండటం తప్పు కాదుగా!
 • టూ మినిట్స్ బతకడానికి ట్రై చేయండి సార్. వన్ మినట్ లో చంపేద్దాం!
 • బాణం వేసేవాడికి బ్రొటన వేలు ట్రిగ్గర్ నోక్కేవాడికి చూపుడు వేలు కోసేస్తే దేనికి పనికిరాడు.
 • ఏదో ఒకటి అంటావ్ గా నాన్న అను..!
  నువ్వు బాగుండాలునుకునేవాన్నిరా అందుకే తిట్టేవాడిని..ఇప్పుడు నువ్వు ఉంటె చాలు అనుకుంటున్నాను అంతే!
 • గంట! కొట్టాలంటే ఇలా.. కొట్టేయాలంటే ఇలా..!
 • ఏందీ బావా అందరు హాల్లో ఉన్నారు?
  ఆ… బెడ్ రూం లు ఖాళి లేక..
 • లైఫ్-బాయ్… నా బతుకో లో లైఫ్ లేదు, బాయ్ లేడు :(
 • దొంగ పాస్ పోర్ట్ చేయడమంటే పాలకోవా చేయడం కాదు సార్…!
 • పేరు సత్తార్.. ఆరు అడుగులు ఉంటాడు..
  కూర్చున్నప్పుడు ఎంతుంటాడు?
 • సాఫ్ట్ వేర్ లో ఖాళీ లేదు
  హార్డ్ వేర్ లో గ్రోత్ లేదు
  రియల్ ఎస్టేట్ లో రౌడిలెక్కువ
  కన్స్ట్రక్షన్ లో సాలరీలు తక్కువ
 • నొక్కడానికి ట్రిగ్గర్ తగలడానికి తలకాయ్ ఉంటె చాలు..!
  వేయడానికి బేడీలు తోయడానికి జైల్లు కూడా ఉన్నాయిరా..!!
 • బాత్రూంకప్ బోర్డు లో బ్యాక్టీరియా పోవాలంటే ఆసిడ్ కొట్టాలి బాబాయ్ సెంట్ కాదు..!
 • గన్ను ఉంది కదా అని కాల్చేయడం.. ఆఫీస్ ఉంది కదా అని పిలిచేయడం…
 • నీకే తలనొప్పి తెస్తున్నాడంటే వాడు అమృతాంజన్ అమ్మ మొగుడై ఉంటాడు..
 • పిడికిలి మూసినపుడు వ్రేళ్ళ మద్యన వచ్చే యిసుక జారినట్లు జారిపోతాను..
  పిడికిలి బిగిస్తే గాలి కూడా ఊపిరి ఆడక చచ్చిపోద్ది!
 • మనం ఇష్టంగా అనుకునేదే అదృష్టం. బలంగా కోరుకునేదే భవిష్యత్తు!
 • పిచ్చోడా! స్విమ్మింగ్ పూల్ లో సునామి వచ్చిన నిన్నాపడానికి దేవుడోస్తాడా? అందుకే మేము వచ్చాం :)!
 • దానికి సైట్ కొట్టడమే రాదు. బాంక్ ఏం కొట్టుద్ది!
 • దీన్నో తోపు తోస్తే బ్రెయిన్ తో పాటు భయం కూడా బయటకోచ్చేస్తుంది కోటి!
 • బాటిల్ కున్న తదే ఆడి లాల్చి కుంది
  జీడిపప్పుకున్న మసాలా వాడి లుంగికి అంటుకుని ఉంది.
 • జెనరల్ గ ముదుర్లు ఎవరైనా ప్లాన్ చేసి పని చేస్తారు.
  కాని నాలాంటి దేశముదుర్లు పని చేస్తూ ప్లాన్ చేస్తారు!
 • మిస్ వర్స్ట్ గా ఉన్న అమ్మాయిని మిస్ వరల్డ్ గా తయారుచేసాను.
 • మోటార్ సైకిల్ లో మోటార్ తీసేసి సైకిల్ మాత్రం ఇస్తాన్నారండి.
 • ఆర్టిస్ట్ లను కూడా అరెస్ట్ చేస్తున్నారా?
 • కరువోచ్చిన కంట్రి కి అంబాసిడర్ ల పేలా గ తయారైంది.
 • నాకు దస్తా పేపర్లు బస్తా లు కావాలి
 • నాకు ఒక ఆత్మ ఉంది దానికి ఒక కథ ఏడ్చింది!
 • ఒక సారి ఓపెన్ చేస్తే ఇద్దరు వెళ్ళొచ్చు!
 • ఫాన్స్ కి ఎమోషన్స్ లే లాజిక్ లుండవ్.
 • ఎక్కడానికి క్రేన్ అడిగావు ఎత్తడానికి వాన్ అడిగావు!
 • పెళ్ళాం పక్కనే ఉన్నప్పుడు మొగుడు వేరే దానికి లైన్ వేస్తె అది ఎంత బాధ పడుతుందో తెలుసా? నాకెదురుగా వాణ్ని నువ్వు పొగుడుతూ ఉంటె నాకు అలాగే అన్పించింది!
 • హండి కాపేడ్ ని కామెంట్ చేయకూడదు.తప్పూ!
 • భయపడటం లోనే పడటం ఉంది. మనం పడొద్దు. లెగుద్దాం!
 • ఆశ కాన్సర్ ఉన్నోన్ని కూడా బతికిస్తే భయం అల్సర్ ఉన్నోన్ని కూడా చంపేస్తుంది.

ఎద లో ఏదో మొదలయ్యింది..!

2012/03/31

నిను చూడగానే…
నన్ను నేను మరచి
తీయని కలల్లో మునిగి
మతి చెడి మాట మౌనమై
మనసు మూగబోయి
ఆలోచనలతో సతమతమై
నిను కలవాలనే ఆరాటం…!

నువ్వు కనపడగానే…
మనసు సూర్యోదయమై
పరువం పాట పాడి
వలపు తేజమై
గుండె నాట్యమాడి
తనువంతా ఆనందంతో కోలాటం…!!

నువ్వు చూడగానే…
మెరుపులా మెరిసి
గాలై ఎగిరిన ప్రాణం
చినుకులా కురిసి
దరి చేరిన ఈ క్షణం
శృతి మించిన దాహంతో
నీ వెచ్చని కౌగిలికై పోరాటం…!!!


కళ్యాణాల జోరు…తప్పదిక హాజరు!

2012/02/05

ప్రతి మనిషి జీవితం లో ఒక అపురూపమైన ఘట్టం వివాహం. ఈ 2012 సంవత్సరం యుగాంతరం అనే భ్రమో సుముహుర్తాలు ఎక్కువగా లేవన్న నిజమో మరే ఇతర కారణాలో తెలీదు కాని నాకు తెలిసిన బ్రహ్మచారులు, బ్రహ్మచారిణిలు సాఫీ జీవితం లోనుండి సంసార జీవితం లోకి పరుగులేస్తున్నారు. అందునా ఈ ఫిబ్రవరి మాసంలో మరీను..! ఎక్కువగా వారాంతపు ముహుర్తాలు చూసే మా మిత్రులు కళ్యాణవేదికలు అందుబాటులో లేక ఆయా తేదిలో ముహూర్తములు కుదరక ఏకంగా నడివారంలో లాగించేస్తున్నారు.

గమ్మతైన విషయం ఏంటంటే గత కొన్నాళ్లుగా జాతకాలు కలవకో, అమ్మాయిలు నచ్చకో  ఈడెక్కువై ఇంకా  ఎదురుచూస్తున్న మా బ్యాచిలర్ బాబులను సైతం ఈ సంవత్సరం కళ్యాణ ఘడియలు రయ్ రమ్మంటూ పలకరిస్తున్నాయ్. ఇంటికి కూసింత దగ్గరలో ఉన్న కర్మాన్ ఘాట్, చంపాపేట్ తదితర ప్రాంతాల్లో సుమారు ఒక వంద ఫంక్షన్ హాళ్ళు కళ్యాణ శోభలతో దేదిప్యామానంగా వెలిగిపోతున్నాయ్.

ఈ పాటికి మీ ఇంట్లో  ఆహ్వాన పత్రికలు మిమ్మల్ని గుర్తుకు చేస్తుంటాయి. మన బంధువులో,  మిత్రులో,  సహోద్యుగులో ఎవరో ఒకరి పెళ్లికి మనం తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది. ఒక రోజు ఒక పెళ్ళికి వెళ్ళాలంటే చక్కగా ప్లాన్ చేసుకుంటాం. కాని ఒకే రోజు ఒకే ముహూర్తానికి రెండు మూడు పెళ్ళిళ్ళు అది కాక ఒకటి హైదరాబాదులో ఇంకోటి వైజాగులో మరొకటి కాకినాడలో ఉండి అవి కూడా తప్పక హాజారు కావాల్సిన వేడుకలైతే ఇంకేముంది నా బుర్ర సతమతవుతుంది. ప్రస్తుతం తొమ్మిది, పది, పదకొండు తేదిల్లో ఓ అరడజను పెళ్ళిళ్ళు, మూడు ఎంగేజ్మెంట్ లు రెండు మాటముచ్చట్లకు వేర్వేరు ప్రదేశాల్లో హాజరు కావాల్సింది. ఎంత సవ్యంగా ప్లాన్ చేసుకోవాలో నాకైతె అర్ధం కావట్లేదు.

ఏ శుభకార్యానికైన ఆలోచిస్తానేమో కాని కళ్యాణ వేడుకలకు మాత్రం నా హాజరు పక్కగా పడాల్సిందే. కుదరని పక్షంలో ముందు రోజో, తర్వాత రోజో వధూవరులని కలవడానికి ప్రయత్నిస్తాను. ఈ సందర్భంగా వివాహా బంధంలోకి అడుగు పెడుతున్న నా శ్రేయోభిలాషులకు, ముఖ్యంగా బ్లాగ్మిత్రులకు వివాహ మహోత్సవ శుబాకాంక్షలు…!


ఈ మకర సంక్రాంతి మీకు తేవాలి నిలువెత్తు నవ క్రాంతి..!

2012/01/14

సంక్రాంతి పర్వదినం సంబరాలకి నిర్వచనం. సంతోషాల్ని కలబోసుకునే ఒక మధుర వైభవం!

తెల్లవారక ముందే భోగి మంటలు…

ముంగిళ్ళ లో చక్కని చుక్కల ముగ్గులు…

పొలాల్లో చేతికొచ్చిన పంటలు…

ఇంట్లో పసందైన కమ్మని వంటలు…

కొత్త బట్టలు.. గొబ్బి పాటలు …

కొక్కొరోకో కోడి పందెములు…

గంభీర గంగిరెద్దు విన్యాసములు..

పిల్లల చిలిపి అల్లరులు..

మేళ తారాళాలు…

కనుమ మినుములు..

హరిదాసు కీర్తనలు..

గాలి పటాల ఆటలు..

అవధుల్లేని ఆనందపు అనుభూతులు..

ఇలా చెప్పుకుంటే పొతే ఎన్నో మరి ఎన్నెన్నో..! మీకు మీ కుటుంబానికి ఈ సంక్రాంతి సిరుల క్రాంతి కావాలి అని కోరుకుంటూ…

–  మీ నేస్తం


నే పెద్దగా బ్లాగని సంవత్సరం – 2011

2011/12/31

ప్రియమైన బ్లాగ్మిత్రులారా..

ఈ ఏడాది లో జరిగిన రెండు ముఖ్యమైన విషయాలు మీరు మనస్పూర్తిగా తెలుసుకోవాలి ఒకటి సచిన్ టెండూల్కర్ వందో శతకం చూసే భాగ్యం మనకి దక్కకపోవడం(హొపింగ్ ఇన్ 2012)  రెండు ఈ నెలబాలుడి బ్లాగోతముగా నేను పెద్దగా బ్లాగక పోవడం .. కావున బ్లాగ్ముఖంగా మనవి చేసుకుంటున్నదేమనగా ముజే మాఫ్ కర్నా..!

ఇక 2011 సంవత్సరం నాకు మంచి అనో చెడు అనో  చెప్పలేను.  మంచి చెడు అనేది చేసు పనుల్లో ఉంటుంది.. కాలానిదేముంది! కాని మంచో చెడో మరిచిపోలేనిదైతే ఓ జ్ఞాపకం గా ఎప్పటికి గుర్తుంటుంది.. అలాంటి జ్ఞాపకాలేమైన ఉన్నాయంటారా..ఈ సంవత్సరం నాకు ఆఫీస్ లో అంతర్జాలానికి ప్రవేశం లేక ఇంట్లో లాప్టాప్ అందుబాటులో లేక సరిగా బ్లాగింగ్ చేయలేకపోయాను..ఏ మాత్రం వీలు దొరికిన త్రైమాసికానికో చతుర్మాసికానికో ఒకటో రెండు టపాలు వ్రాసాను..

బ్లాగు విషయాలు వదిలేసి మిగతావాటిని పరిశీలిస్తే…

ప్రస్తుతం నా  బరువు = 74 కిలో గ్రాములు (కొవ్వు తో కలిపి)  కాని గత సంవత్సరం నా వయసు 28 సం: మరియు నా  బరువు 68 కిలో గ్రాములు. ఎంతగానో ఇంప్రూవ్ అయ్యాను కదండీ! అందుకే డాక్టర్లు నా ఈటింగ్ హాబిట్స్ మార్చుకొమ్మని సజెస్ట్ చేస్తున్నారు. ఎందుకనగా నేను తింటే ఆయాసం గా తినకపోతే నీరసంగా కన్పిస్తున్నాను మరి!

సినిమాల సంగతులు:
సినిమాలు మస్తుగా చూసాను.. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, తమిళ, మలయాళీ సినిమాలతో పాటు కొరియన్ సినిమాలు కూడా చూసాను.. :)

దైవ దర్శనాలు:
చిలుకూరు, యాదగిరిగుట్ట ప్లస్ తిరుపతి విత్ మై బిగ్ ఫామిలీ!

విహార యాత్రలు,షికార్లు వగైరా:
చుట్టుపక్కల ఇటు అటు.. స్టేట్ దాటి వెళ్ళలేదు కాని బానే తిరిగాను.. మిత్రుల వివాహ వేడుకలకు హాజరు.. టీం అవుటింగులు చాలా చాలానే ఉన్నాయ్.

క్రీడానందాలు:
క్రికెట్ అంటే అభిమానం.. కాబట్టి వరల్డ్ కప్ మ్యాచులన్ని తిలకించాను మరియు వీరేందర్ సెహ్వాగ్ వరల్డ్ రికార్డ్ మ్యాచ్..!

మరిచిపోలేని మధురానుభూతి:
మా ఆఫీస్ స్టాఫ్ తో కలిసి మూడు ప్రైమరీ స్కూల్ పిల్లలకు కావలిసిన కోరికలు తీర్చడానికి చిన్న ఈవెంట్ కండక్ట్ చేసి ఉచితంగా పుస్తకాలు, బ్యాగులు, బూట్లు..ఇలా వారికి కావలసినవి అందజేయడం లో పాలు పంచుకున్నాను. వారితో ఒక రోజంతా గడిపాం.థాంక్స్ టు టీం..!

సో మై ఫ్రెండ్స్.. అవండి కబుర్లు.. పాత సంవత్సారానికి వీడ్కోలు పలుకుతూ ముగిస్తున్నాను.. :)