మనకు, మన మహా’రాజు’ కి తిరిగొచ్చేనా గత ‘సత్య’ వైభవం !!!

మీకు గుర్తు వుండే ఉంటుంది, అదేదో గత సినిమాలో డైలాగ్! “ఇద్దరు మగాళ్ళు కలిస్తే మాట్లాడుకోవడానికి వంద ‘టాపిక్’ లు వుంటాయి, కాని ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే మాత్రం మాట్లాడుకోవడానికి ఒకే ఒక ‘టాపిక్’ వుంటుంది అది ‘మగవాడు’ “. కాని ఇప్పుడు మగాళ్ళు అయిన ఆడవాళ్ళు అయిన ఎవ్వరైనా ఎక్కడ కలిసిన మాట్లడుకునే ఏకైక ‘టాపిక్’…”రాజు” ‘సత్యం’ … ‘సత్యం’ “రాజు” అని పదే పదిగ … ప్రతి నోటా వినే మాట.. అదేననమాట…! గత రెండు వారాల నుండి సగటు భూ మనిషి మరియు సాఫ్ట్ వేర్ / హార్డ్ వేర్ / ఏదో వేర్ ఇంజినీర్ మదిలో మెదిలి కుదిపేస్తున్నది “సత్యం”. ఏ సెర్చ్ ఇంజిన్ లో ఏమి search చేసిన… results పేజికి పైనో, క్రిందో, పేజి కి ఎడమ వైపో, కుడి వైపో భారీగా హెడ్ లైన్స్ “Raju brings down Satyam..”, “Raju shakes India..”, “Raju shocks India..”, “Raju Frauds Govt..”, “Senseless Politics in ‘Satyam’..” … Etc అని దర్శనమిస్తున్నాయి. అవి చాలక click here ఫర్ more info ఆర్ Full Coverage అని కలర్స్ లో ఎఫెక్ట్స్. ఇంతకూ ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను మీకు అనుకుంటున్నారా? బేసిక్ గ నేను “రాజు” గారి Fan ని… సారీ.. సారీ …Ultra Digital AC.. అంటె కరెక్టేమో! నేను inspire అయిన legends లిస్ట్ లో Raju గారు ఒకరు. అప్పుడప్పుడే విద్యాభ్యాసం పూర్తి చేసుకొని కాలేజి నుండి బయటపడి మొదటిసారి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న సమయంలో నాకు తెలిసిన మన పెద్ద I T కంపెనీలు సత్యం, విప్రో, ఇన్ఫోసిస్ & టిసిఎస్ లు మాత్రమే! అందులో తెలుగు ప్రజల కీర్తిని ప్రపంచమంతా వ్యాపింప చేసి తెలుగు యువతకు ఉపాది కల్పించి మన రాష్ట్రానికి, మన దేశానికి వన్నె తెచ్చిన ఘనత సత్యం ‘రాజు’దే …!
రాష్ట్రంలో ఏ మూలనైన వెళ్ళిన పలనా వాడు ‘సత్యం’ లో జాబ్ చెస్తున్నాడంటె సొసైటిలో అదొక గుర్తింపు.


ఇంతలోనే అమెరికా ఆర్దిక వ్యవస్థ దెబ్బ తినడం, స్టాక్ మార్కెట్ పతనం, రియల్ ఎస్టేట్ సంక్షోభం … వెరసి మన ఉద్యాగాల కి ఎసరు…! నాడు సినీ స్టారినీలు, మొడల్సు సైతము.. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ లు అంటె పడి చచ్చే వాళ్లు….. నేడు సినీ రచయితలు “సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కన్నా సాదరణ ఇంజినీర్ బెటెర్” అని డైలాగ్స్ రాసుకుంటున్నారు.
ఇలాంటి పరిస్థితిలో ‘రాజు’ రాజీనామా! అరెస్టు . …. ‘సత్య’ ద్రోహం అని.. అంకెల గారడి అని…లేనివి ఉన్నట్లుగా.. ఉన్నవి లేనట్లుగా…. మొత్తానికి చాలా చాలా దురదృష్టకరం..! ‘రాజు’ కు సంభందించిన సత్య అసత్యాలు, అసత్య సత్యాలు ఎలాగున్నా… ప్రభుత్వం త్వరితముగ తక్షనమే తీసుకోవల్సిన నిర్ణయాలు తీసుకొని.. ఇంప్లిమెంట్ చెస్తే.. అదే పది వేలు..! వాస్తవ అవాస్తవాలు & అవాస్తవ వాస్తవాలు MEDIA ద్వారా మనకు చాలానే తెలిసింది..! అన్నట్లు ఇప్పుడున్న రాజకీయ నాయకులకి ఇది హాట్ ‘టాపిక్’. ఒకరికొకరు మోస్తరు గ విమర్శించుకోవడానికి.
నాకు ఒక విషయము మాత్రం బాగా తెలుసు…! అదేమిటంటే తప్పు తప్పే !! అది తప్పని తప్పైన, తప్పించే తప్పైన తప్పే ! కాని నాకు తెలిసిన కొన్ని నగ్న సత్యాలు మాత్రం … ఎంతో మందికి ఉపాధి, స్వల్ప కాలంలో మంచి నేమ్, లాంగ్ టర్మ్ షేర్ హొల్డర్స్ కి మంచి రిటర్న్స్, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు,108 & 104 ..etc …! తెర వెనుక విషయాలు మాత్రం నాకంటే మీకే బాగా తెలుసనుకుంటా..!

ఏది ఎలాగున్నా, వీలైనంత త్వరగా పరిష్కారమవ్వలని సాటి సిలికనైట్ గ ఎన్నో ప్రాజెక్టులు రావాలని, ఎంప్లాయీస్ అన్ని రకాలుగ బాగుండాలని, ‘సత్యం’ తిరిగి పూర్వ వైభవాన్నిప్రదర్శించుకోవాలని, ‘రాజు’ ‘సత్య’రాజ్యమేలాలని, మన రాష్ట్రానికి, దేశానికి ఘనత తీసుకురావాలని…… ఆశిస్తూ..!!!

ప్రకటనలు

2 Responses to మనకు, మన మహా’రాజు’ కి తిరిగొచ్చేనా గత ‘సత్య’ వైభవం !!!

 1. rayraj అంటున్నారు:

  మీరింకా ఇలాగే ఆశిస్తున్నారా! చాలా తప్పండి! పొరపాటుగా “రాజు” కి AC అయినంత మాత్రాన -మీరు మళ్ళా ఇతను తప్పించుకోవాలనుకోవటం తప్పేమో!

  పర్వాలేదు – మీకిచ్చిన ప్రేరణ ఉంచుకోండి. అతను చేసిన తప్పును మీరు చేయగూడదని అనుకోండి. అతను తప్పు చేయడని వాడైతే – మీరు అతన్ని మించి గొప్పవాళ్ళయ్యే అవకాశం రాదని, మీకు నచ్చినది నిరూపించే అవకాశం విధి మీకిచ్చిందేమో నని నమ్మండి.

  డబ్బెక్కెడికీ పోలేదు; వాళ్ళ దగ్గరే ఉంది.ఇన్ని థియరీల్లో ఏది నిజమో ఎవరికి తెలుసు!?

  కాకపోతే, మీ హీరో ని మీరు హీరో గానే ఫీలయ్యే ఓ ధియరీ చెబ్తాను – మీరు స్వాంతన పడచ్చు –

  తనెలా పైకొచ్చాడో, అంత కంటే తన బిడ్డలు పైకి రావాలనుకున్నాడు; బిడ్డలు రియల్ ఎస్టేట్ లో దిగుతుంటే, ఇంత ఉదృతంగా వెళ్ళకూడదని వారించాడు; కానీ, వాళ్ళ ధియరీలు వాళ్ళు చెప్పారు.వ్యాపారంలో ఇది క్లిక్కు ఔతుంది అనేది ఏం ఉంటుంది- తన తీసుకున్న సాహాస నిర్ణయాలు బిడ్డలని తీసుకోనివ్వకుండ ఎలా ఆపటం? అందుకనే ధృతరాష్ట్ర ప్రేమ – as usual – గుడ్డిగా తలవగ్గింది. తిగిగి చూసుకునే సరికి, మెట్రో రైలు ప్రాజెక్టు వచ్చినా, క్యాష్ కవ్ సత్యం దెబ్బతింటోంది.అందరికి తర్వాత మార్కెటింగ్ చేసుకోవచ్చు, ముందు స్వంత కంపెనీకి డబ్బు పంపించేసేరు.తర్వాత అందరికి చెప్పే సమయం లేక, గప్ చుప్ గా రెసొల్యూషన్ పాస్ చేసేశారు.తరువాత ఇంటర్నేషనల్ గా అందరికి – సత్యం లో కంటే మేటాస్ లో లాభాలెలా ఎక్కువ వస్తాయి మెల్లిగా కన్విన్స్ చేద్దాం అనుకున్నాడు; విధి వక్రించింది. పెట్టుబడి దారులు ససేమిరా అన్నారు. దాంతో ఇక తప్ప లేదు; బిడ్డలు బాగుండాలి; అందుకని అసలు డబ్బే లేదు,అంతా నేనే చేసిన మోసం అని బుకాయించి – తప్పంత తన నెత్తిన వేసుకుని జైలు కెళ్ళి పోయాడు :

  ఎంత దీక్ష పూనినావయ్యా
  గుండెలో నిప్పులే నింపినావయ్యా
  త్యాగమంటె నీదయ్యా
  నరకమే కోటుకొంద ముడిచావయ్యా
  నిన్ను చూసి మృత్యువుకే
  రాజయ్యా! కళ్ళు చెమ్మగిల్లినాయయ్యా!!
  ఈ జారుతున్న రక్తధారలే నీ తెగువకు
  హారుతులు పట్టెనయ్యా!

  ఈ స్టోరీ మీ కోసం; “పోతురాజు” సినిమాలోలా – ఇదే సత్యానికి నా దగ్గర ఇంకా స్టోరీలు ఉన్నాయి; ఒక్కొక్క పార్శ్వంలో వారికి ఒక్కోరగంగా కనుబడుతుంది ఈ సత్యం – జస్ట్ విత్ స్లైట్ వేరియషన్స్!

  • nelabaludu అంటున్నారు:

   @ Rayraj….!!!

   నాకు తను ప్రేరణ ….
   కాని తను తప్పు చెయలేదు అని అనట్లేదు….! అన్నట్లు ఈ టపా తను వార్తల్లొకి వచ్చిన మరుక్షణమే రాసినది…… :-)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: