నరకం! ఆ మూడు+మూడు …. 6 గంటలు !!!

========================================================

ఒక సినిమా పిచ్చోడు రెండుషోలు చూడడానికి ఎంత సమయం పడుతుందో, ఒక స్కూల్ పిల్లాడు స్కూల్ లో గడపడానికి ఎంత టైం పడుతుందో, రెండు ట్వంటీ-ట్వంటీ మ్యాచ్ లు ఆడడానికి ఎంత సమయం పడుతుందో ఇంకా చెప్పాలంటే ఒక భగ్న ప్రేమ జంట ఒకరికొకరు NOKIA విత్ టూ batteries సెల్ ఫొన్ లో ఘాటు-ఘాటూగ మట్లడుకునేంత టైంఇంక.. ఇంకా …. రాజకీయ నాయకుడు తన తర్జన గర్జన భర్జన సదస్సులో ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించడానికి ఎంత టైమ్ తీసుకుంటాడో….ఇంక ఇంక ఇంకా… ఏంచెప్పను! (ఇంత చెప్పడానికి కారణం,నా ఘోష మెల్ల మెల్లగ వంటబడుటుంది) ఇప్పటికే ఎక్కువ చెప్పేశా..! అంతే టైం నేను నా రూమ్-ఆఫీసు & ఆఫీసు-రూమ్; ప్రయాణించడానికి పడుతుంది. ఈపాటికి టైం ఎంతో తెల్సి ఉంటుంది. … ఆ కరక్టే! ……. అక్షరాల ఆరు గంటలు…!

ఆఫీస్ ఎక్కడో ఒక అడవిలో వుండి రూమ్ ఇంకేక్కడో ఒక ఊర్లో వుండి అది కూడా 150 km దూరము ఉంటుండొచ్చు అని అనుకుంటున్నారు కదూ! కానే కాదు !!! నేను ఉండే రూమ్ నుండి మా ఆఫీసుకి 16 km (JP నగర్నాగవర Manyatha IT పార్క్) కన్నా ఎక్కువ దూరం ఉండదు. ఇంతకీ వీడు ఇంత బిల్డ్ అప్ ఇస్తున్నాడు, ఏమి చేస్తాడు అనుకుంటున్నారు కదూ? నేనొక IT Laborని పొద్దున్నే లేచి చక చక చేసుకోవాల్సిన పనులు పూర్తి చేసుకొని అడ్డ మీదికొచ్చి అదేనండి JP నగర్ అడ్డ రాస్తా దగ్గర. బస్ కోసం ఎదురుచూస్తూ ఉంటాను. వెళ్ళాల్సింది మాన్యత IT పార్క్ కి. ఇంకేముంది ప్రియుడు ప్రియురాలి కోసము ఎదురుచూస్తునట్లుగ BMTC బస్ కోసం వడి గాపులు కాస్తుండాలి. ఇంతలో 500 నెంబర్ బస్ ఒకటి వస్తుంది, హేబ్బల! హేబ్బల! అనుకుంటూ కండక్టరు అరుస్తూ ఉంటాడు..! నేను కాస్త వెయిట్ చేసి అందరు ఎక్కాక హీరో చేజ్ చేద్దామనుకుంటాను. అప్పుడు తెలుస్తుంది నాకు ఇది హైదరాబాద్ కాదు బెంగుళూరు అని. ఎందుకంటే డోర్ లు Automatic మూసుకుపొతాయి. సో! తరువాత బస్ కోసం ఎదురు చూడడం; కాస్త జాగ్రత్త పడి తొందరగా ఎక్కడం..!
అసలు కథ ఇక్కడ మొదలవుతుంది….
నేను టికెట్ తీసుకొని సీట్ కోసం ఎవడు దిగుతాడ అని సీట్ లో కూర్చున్న వారి వైపు బిత్తర చూపులు చూస్తుంటాను..! ఒక్కడూ దిగడు కాని ఇంకా ఎక్కేవాళ్లు ఎక్కువే ఉంటారు..! బస్ రెండు స్టేజిల క్రాస్ వరకు కళ్లు మూసి తెరిచే లోపు చేరుతుంది..! తరవాత మాత్రం ఒక ఇంచు కదలాలంటే నిద్ర దేవత వరమిచ్చిన ఇవ్వకపోయినా నిల్చోనే ఒక కునుకు తియ్యోచ్చు..! అసలు నరకం అంటే ఏమిటి ఎలాగుంటుంది? అని నాకు చిన్నపటినుండి తెలుకోవాలని దెవుడికి కాస్త తెలిసిందో ఏమో కాని! చూడ చక్కని నరకం చూపిస్తున్నాడు..! నరకం ఎలా ఉంటుందో నరకం లో ఎలాంటి ఉత్ప్రేరకాలకు బలి అవుతామో ప్రత్యక్ష్యం అనుభవించా..! ఇంతకూ ఈంచ్ కూడా కదలని రూటు BTM – Silk బోర్డు. ట్రాఫిక్ కి మారు పేరు అనుకుంటా.. రూటు లో బస్ ఒక అర్దపావు కదిలిందంటే అర నిమిషం ఆగాల్సిందే! బస్ కి బాడీ గార్డు ఇరు వైపులా పది ఆటోలు పార్క్ చేసి ర్రేస్ చేస్తూ ఉంటాయి..(అన్ని వైపులా; సవరణ చేసుకోగలరు). ధ్వని కాలుష్యం తోపాటు బోనస్ దుర్వాసన..! (‘ఆటో వాలగురించి క్లైమాక్స్ లో మాట్లాడుకుందాం) ఇక సిగ్నల్ ఎక్కడో కిలోమీటర్ దూరం లో ఉంటుంది. మన బస్ మాత్రం ఇక్కడే ఆగి ఉంటుంది..! బస్ డ్రైవర్స్ పురుసత్ ఇంజన్ ఆపేసి మాటామంతి మొదలు పెడతారు..! సీట్ దొరికినవాళ్ళు నిద్రలోకి జారుకొని పగటి కలలు కనేస్తు ఉంటారు..! దొరకనివాళ్ళు నీల్చోనే Installment లో రాత్రి కలలు కాస్తా పగలు కంటూ ఉంటారు…! కలలు రాని వాళ్లు బస్ దిగి దగ్గర్లో ఉన్నా Cafe / Condiments లో బత్తి లాగించి Half Cup టీ త్రాగి మెల్లగా బస్ ఎక్కుతారు..! బస్ మాత్రం అదే…! బస్ అక్కడే ఉంటూంది ..! అక్కడలేకపోయిన ఒక ఇంచు ముందు ఆగి ఉంటుంది..! (మీకొక డౌటు వచ్చి ఉండొచ్చు, డోర్ లాక్ అని..కంగారు పడొద్దు ..! Refreshment కోసం డోర్ తెరుస్తారు… ) సిల్క్ బోర్డు దాటేసరికి సరిగ్గా గంటన్నర పడుతుంది. అక్కడినుండి marathalli కి కాస్త ఊరటగా కిటికీ నుండి చిరు గాలి, చిల్లెర ట్రాఫిక్ జామ్ effects తో మరో నలభై నిముషాలు..! marathalli నుండి మాన్యత పార్క్ కి ఎంత ఇస్పీడ్ లో పోయిన సిగ్నల్స్ తర్వాత సిగ్నల్స్.. మరొక నలభై నిమిషాలు..! వెరసి సుమారుగా మూడు గంటలు..! తర్వాత ఆఫీసు కష్టాలు ఎలాగో ఉంటాయి!
ఇక ఆఫీసు నుండి తిరిగి బయలుదేరేటప్పుడు ఉంటుంది నరకానికి రెట్టింపు నరకం! అసలే ఆఫీసు టెన్షన్సుతో boss పై కోపం తోనో లేక team మెంబెర్ పై ఆవేశం తో బస్ స్టాప్ లో అడుగు పెట్టేసరికి సరిగ్గా ఏడు గంటలు..! బస్ ఎక్కేసి సీట్ కోసం కాకుండా నిలబడడానికి ప్లేస్ దొరుకోతే చాలు అన్నట్లుగా రక రకాలుగా ప్రయత్నాలు …! ఒక వైపు కడుపులో రైళ్లు నువ్వా నేనా అని పోటి పడి పరిగేడుతుంటూ ఉంటాయి మరో వైపు తోపుసులాటలు…! గత జన్మలో చేసిన అన్ని పాపాలకు ప్రాయోశ్చితముగ ఉన్నట్లుగ ఉంటుంది అనుభవం ! అనుభవం లో నాకొక్కటి అర్దమైంది, రోజుకు ఆరు గంటలు వృధా అయిపోతుందని! ఆటో లో వెళ్దామంటే…! వామ్మో !! జేబులకి చిల్లు…! ‘ఆటో వాలప్రస్తావన వచ్చింది కాబట్టి బెంగుళూరు ఆటో వాల గురించి రెండు మాటలు మాట్లాడుకోవడం మంచిది..! సరిగ్గా మనమెక్కడికైతే రమ్మంటామో అక్కడికి రామంటారు..! ఒక వేళ వస్తే మీటర్ కి డబల్ లేక మీటర్ అండ్ హల్ఫ్ అంటారు..! వాళ్ల tariff lu పలు రకాలుగా ఉంటాయి…! ప్యాసింజర్ ని బట్టి, దూరాన్ని బట్టి, ప్లేస్ ని బట్టి Ex: ఫోరం, Shopper Stop, Life స్టైల్ అంటే దానికొక tariff మరి..! ప్యాసింజర్ నల్లోడైతే ఒక రేటు, తెల్లోడైతే ఒక రేటు , మీసాలు లేనివాడికి మరో రేటు. కారణం లేకుంటే రిటర్న్ ఖాళీగ రావాల్సి వస్తదని యాభైయో వందో extra! ఆటో పట్టామంటే పట్టుమని పట పట రాలల్సిందే! ఇందులో బెంగుళూరు ఆటో వాళ్ళకి ప్రత్యెకమంటూ ఒక స్థానముంది. ఎక్కడ cut కొడతారో ఎవరికీ తెలీదు , ఎక్కడ ఆపకూడదో అక్కడే ఆపుతారు. మన ఆయూషుః పెరిగితే మంచిది కాదు కాబట్టి గాస్ (అక్కడ ఆటోకి ప్రదాన ఇంధనం ఒకటే .. గాస్), సుదుర్వాసన భరించక తప్పదు.!
అలా ఆరు గంటలు నరకాని అనుభవిస్తున్న నాకు నరకం లో కూడా ఏదో ఒకటి పనికొచ్చే పని చేస్తే బాగుందని ఒక వెధవ ఐడియా వచ్చింది..! ఐడియా ఏమిటి అంటారా? ఆరు గంటల్లో పగటి మరియు రాత్రి కలలు కనటానికి నిద్రకి నలుగు గంటలు ఉపక్రమిస్తే మిగతా రెండు గంటలు నా డ్యూయల్ సిమ్ సెల్ ఫోన్ తో …. ఇంకేముందిపబ్లిక్ కం ప్రైవేటు రిలేషన్స్ … improvment..! కొసమెరుపుగా నాకు అర్థమైంది ఏమిటంటే అయిష్టంలో ఇష్టం ఉంటుందని, నచ్చని పనుల్లో నచ్చేవి ఉంటాయని…!
నా రూమ్-అఫిస్ & అఫిస్ -రూమ్; ప్రయాణానికి అయ్యె సమయము లో వీడియో కోచ్ సర్వీసు బస్ లో విజయవాడ నుండి బయలుదేరి విత్ డిన్నర్ ఒక గంటతో జాలీ రెండు DVD సినిమాలు చూసి ప్రశాంతంగ హైదరాబాద్ కి చేరుకోవచ్చు. ఆరు గంటల ప్రయాణానికి స్వస్తి పలకాలంటే పలు మార్గాలు చూసా! వేరే రూటులు పరిశీలించా, ఇంకా ప్రయతించలేదు..! ప్రయత్నం పురుష లక్షణం కావున.. ప్రయత్నించబోతున్నాను! నరకం ++; లేక నరకం –; కలుగునో !!! దెవుడికే ఎరుక !
ఉంటా మరి !!

(సశేషం)

========================================================

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: