మళ్ళీ మళ్ళీ వినాలనిపించే మధుర గానం "నిదరే కల ఐనది"

************************************************************************
కొన్ని పాటలు వినలేము ఎప్పటికి
కొన్ని పాటలు వినగలము కొంత కాలనికి
కొన్ని పాటలు వింటునేవుంటాం మరెప్పడికి!!! ఇదే కోవ లోకి వస్తుంది ఈ గానామృతము.

“నిదరే కల ఐనది.. కలయే నిజమైనది”, సుధా రఘునాథన్ స్వర పర్చిన ఈ గీతం Surya S/O Krishnan చిత్రం లోనిది. ఈ సినిమా ఆడియో రిలీజ్ అయి ఐదు నెలలు దాటింది. హారిస్ జైరాజ్ సంగీతము సమకూర్చారు. వేటూరి సాహిత్యం మనసుకి ఆహ్లాదకరమైన మత్తెక్కిస్తుంది. నాకైతే ఈ పాట ప్రత్యేకంగా ఎన్ని సార్లు విన్న, మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది, చూడాలనిపిస్తుంది ..!

నిదరే కల ఐనది.. కలయే నిజమైనది
బతుకే జత ఐనది.. జతయే అతనన్నది
మనసేమో ఆగదు…క్షణమైన తోచదు
మొదలాయె కథే ఇల….!

వయసంత వసంత గాలి..మనసనుకో మమతనుకో
ఎదురైనది ఎడారి దారి..చిగురులతో చినుకులతో
యమునకొకె సంగమమె కడలి నది కలవదులే
హ్రుదయమిల అంకితమై నిలిచినది తన కొరకె
పడిన ముడి పడుచోడి యెదలో చిరు మువ్వల సవ్వడి

నిదరే కల ఐనది.. కలయే నిజమైనది
బతుకే జత ఐనది.. జతయే అతనన్నది
మనసేమో ఆగదు…క్షణమైన తోచదు
మొదలాయె కథే ఇల…!

అభిమానం అనేది మౌనం పెదవుల పై పలకదులే

అనురాగం అనే సరాగం స్వరములకే దొరకదులే
నిను కలిసిన ఈ క్షణమే చిగురించే మధుమురళీ
నిను తగిలిన ఈ తనువే పులకరించే ఎద రగిలి
ఎదుట పడి కుదుట పడి మమతారపు నివాళులే ఇది

నిదరే కల ఐనది.. కలయే నిజమైనది
బతుకే జత ఐనది.. జతయే అతనన్నది
మనసేమో ఆగదు…క్షణమైన తోచదు
మొదలాయె కథే ఇల….!

ఈ పాట మీకూ వినాలని, చూడాలని వుందా? ఇంకేంటి వెతకండి..! గూగుల్ !!!
************************************************************************

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: