మా పల్లెటూరి సోయాగాలు, మైమరిపించే మధురానుభూతి !!!

========================================================
“ఏ దేశమేగిన, ఎందుకాలిడిన,
పొగడరా నీ తల్లి భూమి భారతిని,
నిలుపరా నీ జాతి నిండు గౌరవం”
– అని ప్రముఖ కవి గురజాడ గారు ఎందుకు రాసారో, “పుణ్యభూమి నాదేశం నమోః నమామి” అని NTR గారు ‘మేజర్ చంద్రకాంత్’ సినిమాలో ఎందుకు పాడారో బచ్-పన్ లో తెలిసేదికాదు! పైగా నేను “చదువు”నుకొనే రోజుల్లో ఈ కవులు, సైంటిస్టులు మన జీవీతాలతో ఎందుకు ఆడుకుంటారో అని నా మిత్రులతో గేళి చేస్తూ తిట్టుకునేవాడిని. ఎందుకంటే అవి చదవకుంటే మాస్టరు తో రెండో-మూడో బెత్తముతో చురుగ్గా తగిలించికోవాల్సివస్తుంది. చదువుకునేటప్పుడు బాల్యంలో వాటి ప్రాముఖ్యత అంతగా తెలియదు, ఎవరైన తెలిసెలా చెప్పిన వినే వాడిని కాదు…! ఎందుకా ‘?’ మార్క్ చూపూ! అదంతే!! – అప్పట్లో అదో style!!!

ఇక అసలు విషయానికొస్తే, చాన్నాళ్ళ తరువాత నాకు కూడా మా ఊరి గాలి పీల్చే అదృష్టం వరించింది. గత కొన్ని సంవత్సరాలుగా నేను ఎంత కోల్పోయానో నాకు ఈ మద్యనే తెలిసింది. కొంచెం ఫ్లాష్ బ్యాక్ అవసరం అనుకుంటాను..! వివరాల్లోకి వెళితే…..

సరిగ్గా 23 సంవత్సరాల క్రితం ……
ఊరు: దంతూరు, నల్గొండ జిల్లా! (పోచంపల్లికి రఫ్ గా 15 km)
(పోచంపల్లి ఎక్కడంటారా? – అయ్యో !! పట్టు చీరలకు ప్రత్యేకమైన గుర్తింపు-Ramoji Film City కి రఫ్ గా ఒక 20 km వేసుకొండి)!
ఏ తల్లిదండ్రులకైన తమ పిల్లలకి మంచి Education ఇప్పించి ఒక ప్రయోజకులుగా తీర్చిదిద్దాలనుకుంటారు. అదే ఆలోచన మా అమ్మ-నాన్నకి తట్టినట్లుంది, నాకు ఇప్పటికి గుర్తుంది, నాకు అప్పుడు సుమారుగా మూడేళ్లు ఉండొచ్చు అనుకుంటా! (నాతోపాటు అక్కయ్యకు -8 సం. అన్నయ్యకు-51/2 సం. తంబికి- బుడ్డొడు కదా!-6 నెలలు..), మా ఊరు వదిలి(ఉన్న పోలాలు కాస్త కౌలుకి ఇచ్చి) మమ్మల్ని ఇటో చేత్తో అటో చేత్తో పట్టుకొని పట్నం కి బయలుదేరిర్రు..! (పట్నమంటే హైద్రాబాద్.. మేము చెరుకున్న చోటు- అప్పట్లో దాని పేరు అవస్థల పురం-ఇప్పుడు దానిని వనస్థలి పురం అని పిలుస్తున్నారు.)

ప్రస్తుతం …..
అక్క – స్వయం ఉపాధి, వాళ్ల కుటుంబం… ! వగైర, వగైరా!
అన్న – రంగుల ప్రపంచాన్ని బంధించడం – Operative Cameramen in Film Industry (ముంబయ్ లో వర్క్, దేశ విదేశాలు విపరీతంగా సంచరిస్తుంటాడు)
నేను – Software Engineer గ హైద్రాబాద్ లో గాలించి ఇప్పుడు బెంగళూరు లో తిరుగుతున్నా..!
తంబి – Modelling & Still Photography లో ఇప్పుడిప్పుడే ఓనమాలు నేర్చుకుంటుండు.(అన్ని ఏరియాలు వాడియే)
గత వారం ఆఫీసుకి సెలవు ప్రకటించుకొని నేను, షూటింగ్ “గజిబిజి”లో బిజి నుంచి కాస్త రిలాక్స్ అవుదామని మా అన్నయ్య హైద్రాబాద్ కి చేరుకున్నాము... అప్పటి నుండి మా అమ్మా-నాన్నే ఊళ్లో పొలం పనులు, పంటలు ఎలా జరుగుతున్నాయో పరిశీలిస్తుండేవారు. నెనేప్పుడో మా ఊరెళ్ళి 10 సంవత్సరాల పైనే అయింది..! ఇప్పటికే నన్ను మా ఊరొల్లు ఎవరు గుర్తిపట్టరు…! ఒక సారి ఓ trip వేస్తే బాగుంటుంది అని అనుకున్నా..! మా తమ్ముడు & అన్నయ్య కూడా ఛలో ఛలో we are ready then అన్నారు!
మా అన్నయ్య santro రెడీ చేసుకుంటున్నాడు.! బంధువులోస్తే ఇంట్లొ ఉన్న పెరుగు కాస్త మజ్జిగ అయినట్లు.. మా బామ్మర్దిస్(2) & అల్లుడ్స్(2) కూడా గోల చేయడంతో మా బామ్మర్ది గాలి శీను QUALIS కార్ లోనే(వాడే కార్ ఓనర్ కమ్ డ్రైవింగ్ స్టార్, వాడికి backup మా అన్న) బయలుదేరాం..!! బయలుదేరిన మూడు నిమిషాల్లోనే కార్ అగి ఉంది, ఎమిటా అని చూస్తే మా వాడు PETROL BUNK లో పెట్రొల్ కోసం ఆపాడు. ప్రతి కుక్కకి ఒక రోజంటూ వస్తుంది అని ఎన్ని రోజులనుండి మా గాలి శీను గాడు వడి గాపులు కాస్తున్నడో , పెట్రోల్ బిల్ కి డబ్బులు అడిగితే నేను INIDAN OIL PETROL BUNK కదా పాయింట్ లు వస్తాయని అని citibank indian oil క్రెడిట్ కార్డ్ ఇచ్చా! ఇచ్చిన పాపానికి 5000 రూపాయల పెట్రోల్ నింపిండు. వెనకనుండి మామయ్య! నీకు citi bank నుండి గిఫ్టు పక్కా అని బుల్లి అల్లుడి కామెంట్!
ఇక కార్ స్టార్ట్ అయి నేషనల్ హైవే-9 (హైద్రాబాద్-విజయవాడ) రూట్ దిశగ వెళ్తుంది. వెళ్తు, వెళ్తూ మా అన్నయ్య తన సేవలను భీభత్సంగా అందిచ్చిన రామోజి ఫిల్మ్ సిటీ ని విండో విజిట్ చేసుకొని, అదే ఊపులో అది దాటాక mount ఒపెరా ను కూడా కానిచ్చి ఓ మాదిరి ఉషారుగా వెళ్తూ ఉన్నాం. ఇంతలో తిండి తినక 10 సంవత్సరాలు అయినట్లు ఆకలి.. ఆకలి.. అంటూ వెనుక కూర్చొని వున్న మా అన్నయ్య వెంకీ, పెద్ద అల్లుడు లింగుస్వామి & చిన్న బామ్మర్ది మహేష్ గాడి అరుపులు…!
కార్ లో చివరి సీట్ లో కూర్చొని ఉన్న మిగిలిన మిగతా ఇద్దరు మా తమ్ముడు సత్యం & బుల్లి అల్లుడు శివశంకర్ సెల్ ఫొన్ లో వారికి రాని games అడుతున్నారు..! వీళ్ళ ఆకలిని తీర్చడానికి మా గాలి శీనుని కార్ ని కాస్తా straight గ మా అక్కయ్య ఉండే ఊరు చిట్యాల (రామోజి ఫిల్మ్ సిటి కి రఫ్ గా 50 km)కి తీసుకెళ్ళమని చెప్పా..! వాడు ఫార్ములా ర్రేస్ హీరో కార్తికేయన్ ల డ్రైవ్ చేసి 20 నిమిషాల్లో మా అక్కయ్య ఇంటిముందు కార్ పార్క్ చేసిండు..!
అక్కడ పదకొండు గంటల్లోపే అక్కయ్య చేసిన తీపి, చేదు, ఘాటు వంటకాలను రుచించి బావ & పిల్లలతో కబుర్లు చెప్పుకొని.. నిద్రపోతున్న లింగుస్వామి, మహేష్ ని లేపి అన్ని సర్దుకొని అక్కడినుండి మా ఊరు దంతూర్ కి షార్ట్ కట్ రోడ్ లో బయలుదేరాము..! బుల్లి అల్లుడు కార్ లో అందరిని కౌంట్ చేసి తనను మిస్ చేసుకొని ఒకరు మిస్ అయ్యారు అని కంగారు పడ్డాడు..! సెల్ ఫోన్ ఇవ్వడం తో ఆ కంగారు నుండి బయటపడి, మళ్లి తను నెర్చుకున్న games ఆడటం మొదలుపెట్టాడు..! సత్యం & మహేష్ నిద్రలోకి జారి ఒకరినొకరు కొట్టుకుంటున్నారు.
ఇంతలొ నేను విండో నుండి తొంగి చూసాను..! వాహ్: వాహ్: ఏమి పచ్చదనం, ఏమి పచ్చదనం… ప్రకృతి దేవుడిచ్చిన ఒక గొప్ప వరమనుకుంటా..! మా ఊరు కి దగ్గర్లో చేరుకోబోతున్నాము. ఇంతలో మార్గ మద్యన పిల్లలు బడి నుండి ఊరికి తిరిగి నడుస్తూ ఉన్నారు..! మా కార్ ని గమనించి వెనక నుండి పరిగెత్తుతూ వస్తున్నారు..! అది గమనించిన మా వెంకీ & మహీ ఆటొగ్రాఫ్ కోసం ఫాలో అవుతున్నారని జిడ్డు మొహాలని సరి చేసుకుంటున్నారు..! లింగు & సత్యం మిర్రర్ వైపు ఒక లుక్ ఇచ్చి తల దువ్వుకుంటున్నారు..! బుల్లి అల్లుడు ఆ పిల్లలకు సైగలు చెస్తున్నాడు..! మా గాలి శీను సడెన్ గా బ్రేకు వేసాడు.. దగ్గరికి వచ్చిన పిల్లలు కాస్తా ఒక్క సారిగా భయంతో 100 మీటర్లు దిక్కులు చూడకుండ తిరిగి వెనక్కు పరిగెత్తారు..! అప్పుడు నాకు అర్దమైంది..! ఆ పిల్లలు మా గాలి శీను గాడి ఫేస్ మా కార్ సైడ్ గ్లాస్ లో చూసి ఉంటారని…!
మా ఊరు పొలిమేరకు వచ్చేశాం.. అందరిలో ఏదో తెలిసి తెలియని ఆనందకరమైన ఫీలింగ్.. ఊరు జనమంతా మా వైపు విచిత్రంగా చూస్తున్నారు..! ఎందుకంటే మేమవరమో వారికి తెలీదు గనక..! మా గాలి శీను రఫ్ఫ్ మంటు రోడ్ కి దగ్గర్లో ఉన్న మా స్థలం (ఒకప్పుడు మేము ఉండే చోటు) దగ్గర ఆపాడు..!

కార్ పార్క్ చేసి దిగేలోపే అక్కడ మమ్మల్ని గమనిస్తున్న ఊరు జనంలో సగం జనం మా దగ్గరికి వచ్చి పలకరింపులు అది ఎంతో ఆత్మియతగా.! కేవలం మా అమ్మా-నాన్న పలుకుబడితోనే వారు ఎంతో అప్యాయతగా మమ్మల్ని పలకరిస్తుంటే నా కళ్ళల్లో అనంద భాష్పాలు రాలయి..! సిటి లో ఒకటే అపార్ట్ మెంట్ లో పక్క పక్కనే ఉన్న ఒకరికొకరు గురించి అంతగా రిలేషన్స్ ఉండేవి కావు మనకు.. కాని ఇక్కడ వీళ్ళు చూపించిన మర్యాద, కలుపుగోలుతత్వంతో వారు నాకు ఇంతకు ముందు తెలీదు అనే భావన నాలో కలగలేదు..! ఇక బంధుజనమైతే చెప్పాల్సిన పనేలేదు.. ప్రతి ఇంట్లో ఏదో ఒకటి తినమని, ఆ అనురాగము, ఆ బంధము.. మాటాల్లో చెప్పాలంటే.. వర్ణాతీతం..

మేము ముందుగా మా తాత-నానమ్మల ఘోరిలు చూసి అటునుండి మా పొలానికి పాదయాత్ర మొదలెట్టాం..!
ఆహా..! ఏమి పచ్చదనపు పైరు… ఒక వైపు వరి పంట మరొక వైపు ఆముదపు చేను..మద్యలో పెద్ద చింతకాయ చెట్టు.. గట్టుకి ప్రతివైపులా తాటి చెట్టులు.. ప్రతి గట్టు అంచు చివర మోటార్ పైపులో నీళ్లు విరజిమ్మడం, ఒక వైపు బావి , ప్రక్కనే జామ చెట్లు.. ఇంకా ఎన్నెన్నో.! ఇంతలో పొలం దున్ని, నాగలి పట్టుకొని చింతకాయ చెట్టు దాగర సేద తీరుతున్న మా పెద నాన్న మమ్మల్ని గమనించి..! ఎవరో గట్టు మీద వెళ్తున్న వెంకట నర్సన్న గౌడ్ కి “తాటి కల్లు” తెమ్మని కబురేసాడు..!

మా గాలి శీను గాడు.. కల్లు అనగానే పది నెలలు కట్టెసిన బర్రెని విడుస్తే ఎలా ఫీలవుతుందో అంతకు రెట్టింపు సంతోషంలో ఉన్నాడు..! వరసకు బావ అయిన బొంగారాల రంగయ్య అక్కడికి వచ్చి మాతో సటైర్స్..! నేను తాటి ముంజలు అనగానే చిటికలో మా ముందు ప్రత్యక్షమయ్యాయి..! ముంజలు జుర్రి పక్కనే ఉన్న జామ చెట్టుకి ఒక కొమ్మకు ఆరు జామపండ్లు మా కోసమే అన్నట్లుగా వ్రేలాడుతుండగా, మా బుల్లి అల్లుడు చక చకా చెట్టెక్కి తెంపుకొచ్చాడు..!
ఇంతలో తాటికల్లు రానే వచ్చింది.. ఒక మొస్తరు కుండ & 4 ముంతలతో, గౌడ్ గారు వస్తుండగ మా గాలి శీను గాడు గౌడ్ కి సాయంగా ఎదురుగా వెళ్ళి రిసీవ్ చేసుకుండు..!
మేమంతా చెరో ముంత కల్లు తాటి ఆకులతో స్వీకరించాం.. మా గాలి సీను ఎత్తిన ముంత దించకుండా 8 ముంతలు లాగించిండు..! ఆ తర్వాత మా పొలానికి అనుకొని ఉన్న చిన్న యేరు.. (కాలువ లాంటిది) లో జలకమాడి.. ఒక కునుకు తీసి పొద్దు పొయేవరకు అక్కడే ఉండి… మెల్లగా అందరికి గుడ్ బై చెప్పి.. హైద్రాబాద్ కి తిరుగుముఖం పట్టాం..!
నాకైతే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలన్పిస్తుంది.. ఈ మద్యనే శివాలయం, వాటర్ టాంక్ ప్రారంభించారు..! దానికి మాకు చేతనంత సాయం అందిచ్చాము. మన రాష్ట్ర ముఖ్యమంత్రి Y S గారు గతనెలలో textile park ప్రారంభించారు. మా ఊళ్ళో కొంతవరకు జీవనోపాధి కలుగుతుంది..!
పొలిమేరలో అడుగుపెట్టిన క్షణం నుండి.. నాకు ఒక వింత మధురైన అనుభవం. కాలుష్య రహిత వాతవరణం, ప్రయాణములో నో ట్రాఫిక్స్, రణగొణ శబ్దాలకు దూరం..ఆ చిన్న-పెద్ద పలకరింపులు, పెరట్లో పండిచ్చిన కూరగాయలు… స్వఛ్చమైన పాలు….! మా వాళ్ళు తయారుచేసే కుండల్లో నీళ్ళు.. చెరువులో చేపలు…. ట్రాక్టర్ లో పొలానికి వెళ్ళుతుండము… ఇలా ఎన్నెన్నో నన్ను ఎంత గానో కదిలించాయి..! నెనక్కడున్నా మా ఊరికి కనీసం సంవత్సరానికి రెండు సార్లైన వీక్షించి కోకిల కుహు కుహు రాగాలను, ఆ చల్ల -పిల్ల గాలిని పీల్చాలని కోరిక..!! (సశేషం)

========================================================


ప్రకటనలు

5 Responses to మా పల్లెటూరి సోయాగాలు, మైమరిపించే మధురానుభూతి !!!

 1. Anonymous అంటున్నారు:

  ohh, baaga enjoy chesaranukunta.gaali seenu paatra baagundi. :-)

 2. మా గాలి శీను గాడు.. కల్లు అనగానే పది నెలలు కట్టెసిన బర్రెని విడుస్తే ఎలా ఫీలవుతుందో అంతకు రెట్టింపు సంతోషంలో ఉన్నాడు..! niceone

 3. శ్రీవాసుకి అంటున్నారు:

  మీ బ్లాగ్ బాగుంది. మీ జ్ఞాపకాలు బాగున్నాయి. సొంతూరికి రావడం ఎప్పుడు ఒక మరిచిపోలేని అనుభవమే. నాలుగేళ్ళ క్రితం వరకు నేను ఇలాంటి అనుభవమే పొందాను. ఇప్పుడు సొంతూరిలోనే ఉంటున్నా చక్కని పొలం గాలులు, పక్షుల కికిలారావాలు మధ్య. సొంతూరికి రావడం ఎప్పుడు మరువద్దు.

 4. nelabaludu అంటున్నారు:

  @ శ్రీవాసుకి
  Thank You, Sure.. ;)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: