కొంచెం ఇష్టం, చాలా కష్టం

========================================================
ఈ రోజు ఆదివారం,లేచెసరికి టైం 8 గంటలు! వీకెండ్ కాబట్టి అలారం కి రెస్ట్ ఇచ్చా.!టైం 8 గంటలే కదా అని మళ్లీ పడుకున్నా.. ఇంతలో ట్రింగ్ ట్రింగ్ అని సెల్ మోగుతూ ఉంది.. తెల్లారకముందే ఎవడ్రా అని పక్కనే ఉన్న సెల్ ని అందుకోబోయా.. గేబ్ కాలింగ్.. మా కొలీగ్ గాడి నెంబర్.. చెప్పరా గేబ్ అని అంటుండగ.. అవతలి వైపు ఎవరో ఆడంగి గొంతులో అన్నయ్య నేను పింటో ని (మా గేబ్ గాడి వైఫ్, వాల్లది ప్రేమ వివహం.. ఇంట్లో ఒప్పుకోకపోతే జంప్ అయ్యరు..! నేను పెళ్ళి జరిపించిన పెద్దల్లొ ఒకడిని)..
నేను: చెప్పమ్మా.. ఇంత పొద్దునే ఫోన్ చేసావు..!

పింటో: అన్నయ్య నాకు భయం గా ఉంది..
నేను: ఏమయింది..?
పింటో: ఏడుస్తూ.. అన్నయ్యా…గేబు..
నేను: ఆ గేబ్ గాడు ఏం చెసాడు వెధవ..
పింటో: మళ్ళి కుమిలి కుమిలి ఏడుస్తూ..
నేను: నాకు పిచ్చి ఎక్కి, ముందు ఏమైందో చెప్పు.. ఆ తర్వతా ఏడువచ్చు ..
పింటో: ఇంట్లో వున్న కామెల్ రెడ్ కలర్ పర్మనెంట్ మార్కర్ లు తీసుకొని నా మొహం పై “ఇంటు” మార్క్ పెట్టి ఆఫిస్ కి అని బయలు దేరిండు… :( …
నేను: ఈ రోజు ఆఫిస్ ఏంటి? వాడి బొంద. అసలు వాడికేమైంది
పింటో: రాత్రి ఫ్రెండ్స్ తో సెకండ్ షో సినిమాకి వెళ్ళోచ్చాడు..
నేను: సరే! ఆఫిస్ కి వెళ్తూ ఏమైన పట్టుకెళ్ళాడా?
పింటో: ఆ మీరు గత నెల టీం ఔటింగ్ అని వెళ్ళిన ఫోటో ఆల్బం ఇంక మూడు మార్కర్ పెన్ లు తన జేబు లో పెట్టుకెళ్ళిండు.
నేను: ఓ! అసలు వీడికేమైంది? సరె నేను ఆఫిస్ కు వెళ్ళి ఏమైందో కనుక్కుంటను..!
పింటో: మళ్ళీ ఏడుస్తూ, ” ఇక ఇంటికి తిరిగి రాను” అని చెప్పి వెళ్ళాడన్నయ్యా!
నేను: నువ్వేమి కంగారు పడకు..! నేను చూసుకుంట..!
ఫోన్ పెట్టేసి, మా ఓనర్ ఆంటి ఇచ్చిన మసాల దోసలు లాగించి.. మా రూం-మేట్ బైకు తీసుకొని నేను అఫిస్ కు వెళ్ళా…!

ఆఫీస్ లో వాడు కూర్చునే cubic చుట్టూ .. వాడి ప్రాజెక్ట్ మేనేజర్ ఫోటో, టీం లీడ్ ఫోటో, వాడి x-ప్రాజెక్ట్ టీం మెంబర్ ఫొటొ లు అతికించి వాటిఫై X (ఇంటూ) మార్క్ అడ్డంగా పెట్టిండు..! అవి చాలక వాడి పై వచ్చిన ఎస్కలేషన్ మెయిల్స్ ప్రింట్ అవుట్ తీసుకొని వాటి పై కూడ X మార్క్ చేసి క్యూబిక్ అంతా X మార్క్ తగిలించిన ఫొటొ లతొ ఎరుపుగ కనిపిస్తుంది..
ఇంతలొ… అరే గేబ్ ఎమైందిరా నీకు..! ఏమిటి ఈ ఇంటూ మార్కులు .. చక్కగ ఉన్న ఫొటొ లు ఇలా పాడు చెసి, పాడు చెయ్యడమె కాకుండా ఇలా అతికించావెమిట్రా..? అని అడిగా ..
క్యుబిక్ లొ ఒక చోట వాడి పెళ్ళి ఫొటో ఒకటి చూసా..మా టీం అంత కలిసి వాడితో దిగిన ఫొటొ.. ఆ ఫొటో కి కూడా మా ప్రాజెక్ట్ మేనేజెర్ కి, ఇంక రెండు మూడు తలలకి X మార్క్ పెట్టిండు.. (అదృష్టమో,దురదృష్టమో నా తలపై X మార్క్ పెట్టలేదు..)..!

ఏమైందిరా? నీకు పిచ్చి గాని పట్టిందా..? మనిషివా లేక మొహన్ బాబు వా అని అడిగా?దానికి వాడు.. నా దగ్గరకొచ్చి నా మొహం పై X (ఇంటూ) మార్క్ పెడుతున్నాడు….! మార్కర్ లొ ఇంక్ అయిపొయే సరికి చేత్తో X.. X .. X అని గీస్తున్నాడు..!ఉన్న మూడు మార్కర్ లు తీసుకొని వాడి తలపై గాప్ లేకుండ ముప్పై సార్లు తగిలిస్తె .. అప్పుడు వాడు …. X మార్కులు ఎందుకు పెడుతున్నడో చెప్పసాగాడు..
ఆ మేనేజర్ గాడు.. పని చెసేది MS Excel, Word, Power Point ఓపెన్ కాకపోతే అఫిస్ కి డుమ్మా కొడుతడు.. నేను మాత్రం ప్రతి రోజు ఉదయం 9 నుండి రాత్రి 9 వరకు ఇక్కడే తను అడిగిన reports అన్ని ఇస్తూ ఉండాలి.. salary నాకంటె రెండు రెట్లు ఎక్కువ తీసుకుంటడు.. కాని నాకు మాత్రం నిండు సున్నా అని నో ఇంక్రిమెంట్
అని అంటడు.. అందుకే X మార్కు… నాకు ఇప్పుడు చాలా చాలా హాపి గా ఉంది..
నాకొకటి అర్దమయ్యింది… వాడికి నచ్చని వాళ్ళకి, వాన్ని తిట్టిన వారికి… ఇంటూ మార్క్ పెడుతుండు అని…! మరి వాడి వైఫ్ ఫేస్ పై X మార్కు….! ఇద్దరికి ఏదో గొడవ అయి వుంటుందెమొ.. .అని అనుకున్నా..!
నాకు వాన్ని ఎలా handle చెయ్యాలా అని వెధవ అలొచనలతో….. సతమవుతున్న..
నాకు ఒక ఆలొచన తట్టింది.. అరెయ్… నువ్వు కత్తి.. కెవ్వు.. కేక .. అసలు నీకు ఈ Idea ఎలా వచ్చింది అని అడిగా..
దానికి వాడు.. మా తమన్నా.. చెప్పింది…. మనకు నచ్చని వారి ఫొటొ ల పై.. X ఇంటూ మార్క్ చేస్తే మన మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది అని… మీ తమన్నా? ఎవర్రా? .. అని అడిగేసరికి… అదే రా.. “కొంచెం ఇష్టం కొంచెం కష్టం” సినిమాలో …. !!
నేను ఆ సినిమా ఇంకా చూడలేదు.. . సొ వాడి చెస్తున్న వెర్రి పనులు చూసి ఒక సారి ఆ సినిమా కి వెల్దామనుకున్నా..!
సరె కాని, ఇంటికి పదరా.. అంటే.. నేను రాను.. పింటో.. రాత్రి సాంబర్ లొ నాకు తెలియని మసాలా పౌడ ర్ వేసింది… అని చాలా కొపంతో చెబుతున్నాడు..! నేను చెప్తా కాని పదరా.. అంటూ.. వాన్ని వాడి ఇంటికి తీసుకెళ్ళా.. వాడు.. మళ్ళీ పింటో మొహం పై X మార్క్ పెడుతుండు..! వాళ్ళ marriage ఆల్బమ్ తీసుకొచ్చి చూపించాడు.. అందులో పింటో ఫేస్ కనపడిన ప్రతి ఫోటొ పైన x మార్క్ చేసాడు.. వెర్రి వెధవ..!
వీడితో కష్టమని, పక్కనే మూసి వున్న CD లైబ్రరి షాప్ ని తెరెపించి.. బాలయ్య సినిమా.. ఒకటి తీసుకొచ్చి.. ఇంట్లో DVD player లో చూపిస్తుండగా… వాడు మాములు మనిషిగా మారాడు..!
పింటో: థాంక్ యు అన్నయ్య! నేను: నొ ప్రాబ్లమ్ అని.. వాడికి ముందు రాత్రి చేసిన సాంబర్ లొ కలిపిన్ masala powder పేరు చెప్పు….! అని తిరిగి మా రూమ్ కి వెళ్ళిపొయా..!
సరే సినిమా ఒక సారి చూద్దామని
మా మిత్రులతో matny షో కి వెళ్ళా.. సినిమ first హాఫ్ చూస్తుంటే ఇంటర్వెల్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూడాల్సి వచ్చింది.. బాగా నచ్చినవి.. ** గచ్చిబౌలి దివాకర్ బ్రహ్మానందం కామెడీ ** సిద్దార్థ్
పెర్ఫార్మన్స్ ** కొన్ని సీన్స్ డైరెక్టర్ బాగా పండించాడు..** ప్రకాష్ రాజ్ పాత్రలో చక్కగా ఒదిగి పోయాడు..*** బట్ సాంగ్స్ అంతగాబాగా లేవు.. ** స్క్రీన్ ప్లే కూడా ఒక మాదిరిగానే ఉంది..***
బట్ ఓవర్ అల్ గ నేను చెప్పదలచుకుంది..
కొంచెం ఇష్టం.. చాల కష్టం..
…………………………….. (సశేషం)


ప్రకటనలు

6 Responses to కొంచెం ఇష్టం, చాలా కష్టం

  1. aswinisri అంటున్నారు:

    ha ha ha!

  2. a2zdreams అంటున్నారు:

    nice review and interesting .. LOL :)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: