గుండె నిండ గుడి గంటలు..!!!

========================================================
అసలు నాకేమైంది? ఏమవుతుంది? ఇంకా ఏమవ్వబోతుంది? గత మూడు నెలల నుండి తూ.చ. తప్పకుండ గుడి కి వెళ్తున్న..! సడెన్ గ దైవ భక్తి పుట్టుకొచ్చింది వీడికి అనుకుంటున్నారు కాదు.. నాకదే అర్ధం కావట్లే!
బెంగుళూరు మహత్యమా..! ఇక్కడ గల్లికొక గుడి ఉందనా?
అమ్మాయిల కోసమా లేక మంచి పెళ్ళాం రావాలనా?
ప్రసాదం ఎక్కువ పెడ్తారనా లేక ఆధ్యాత్మిక తత్వాన్ని అలవర్చుకోవాలనా?
ఆర్దిక మాంద్యం ఉండడం వల్ల ఉన్న జాబ్ ఊడి పోవద్దనా లేక హైదరాబాద్ కి తిరిగి వెళ్లి పోవాలనా ?
కారణం ఏదో సరిగా నిర్ణయించుకోలేక పోతున్న కాని మనసు ఎందుకో ప్రశాంతం గ ఉంటుంది….! నాలో నాకు తెలియకుండానే ప్రతి వీకెండ్ దేవుడి దర్శనం జరుగుతుంది..!
గత 25 ఏళ్ళుగ మహా అంటె.. సుమారుగ ఒక 100 సార్లు వెళ్ళుంటాను గుడికి.. కాని ఇక్కడ బెంగుళూరు లో మూడు నెలల్లోనే హాఫ్ సెంచరీ కొట్టేసా..! కుర్రాడు చాలా ఫామ్ లో ఉన్నాడు అనుకుంటున్నారు కదూ..! ఏమో మరి? 25 ఏళ్ళకే ఇంత భక్తి వచ్చేస్తుంది..! ఒకప్పుడు.. ఏ పండగకొ గుడి కి వెళ్ళాల్సి వస్తె జనాలు ఎక్కువగా ఉండటం చూసి ‘విండో’ దర్శనం చెసుకునేవాడిని.. కాని ఇప్పుడు ఎంత సేపైన క్యూ లొ నిలబడి దర్శనం చేసుకొని ప్రసాదం ఆరగించి ఒక రెండు నిమిషాలు ఆలయ ప్రాంగణం లొ బైఠాయించి బయలు దేరుతున్న..! సబ్ క మాలిక్ ఏక్ సాయి బాబా! వెంకన్న స్వామి.. ఆంజనేయ స్వామి … శివుడు … అన్ని దేవుళ్ళ గుడిలు నా రూమ్ కి చుట్టు పక్కల ఉండటం తో నాకు భక్తి మరింత ఎక్కువైంది..! అంతే కాక పొద్దున్న లేవగానే లింగాష్టకం, భక్తి రస , కీర్తనలు ఓ రేంజ్ లో వింటున్నాను..!
“లా లను చొ నువు చేరు” అను అన్నమయ్య కీర్తన తెగ వినాలనిపిస్తుంది..! ఏది ఏమైనా సరే నాకు దేవుడంటే ఒక మోరల్ సపోర్ట్ !! కాని ఈ నా భక్తి నిత్య భక్తుణ్ణి చేస్తుందా అని నా సందేహం! భక్తి ఉండాలి కాని మరి ఎక్కువ ఉండొద్దు అని నా భావన. మన ప్రయత్నాలు మనం చేస్తూ పోతూ ఉండాలి.. భగవంతుండు ఒక కన్నేసి ఉంచుతాడు అని నా నమ్మకం..! ఒకొక సారి అనిస్పిస్తుంది నేను ఇలాగె భక్తి అని దేవుడు అని విపరీత దర్శనాలు జరిగితె.. ఏ రాం బాబా గొ శాం బాబ గొ మారుతానని! ఉంటాను మరి.. ఓం నమః శివాయాః !!! (సశేషం)

ప్రకటనలు

2 Responses to గుండె నిండ గుడి గంటలు..!!!

 1. sri అంటున్నారు:

  if you have devotion increasing in you, donot stop it. let it grow by leaps and bounds. Please read the book autobiograpy of a yogi by Swami Paramahamsa Yogananda. It gives a view that while we are involved in the worldly duties, it is perfectly possible to be in touch with the ALL PERVADING DIVINITY OR GOD. Please read the book on the tricks to balance spiritual and material aspects of life. This book reveals the lives of saints who have perfectly fulfilled their duties at the material level, while in spiritual plane they are no less than a Lord Jesus Christ or Swami Vivekananda or Lord Buddha or Lord Krishna(State of GOD).

  This book is also available in telugu as “Oka Yogi Aatma Kadha”

  Here is the online link to this book:
  http://www.crystalclarity.com/yogananda/

  Here are the acclaims for this book from all over the world:

  http://www.yogananda-srf.org/special_ancmnts/ayanniversary/intro.html
  GO TO ABOVE SITE AND CLICK ON “GO TO” & THEN CLICK ON “COMMENTS & REVIEWS”

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: