ఎంత కాలం ఈ పత్రికల చిల్లర లొల్లి – అనారోగ్యకర పోటి ;(

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ పొద్దున్న లేచి మా ఇంటికి దగ్గరగా ఉన్న ఒక చాయ్ హొటల్ కి వెళ్ళేవాన్ని. ఎందుకంటారా..? చాయ్ కోసం కాదు… టిఫిన్ కోసం అంతకన్నా కాదు..! “ఈనాడు” పేపర్ చదవడం కోసం..! అదే పేపర్ అని ఎందుకంటారా? ఆ హొటల్లొ అదే పేపర్ వేసుకుంటారు మరి! ముందుగా వసుంధర-ఈనాడు సినిమా ఎడిషన్ చదివి.. తర్వాత మెయిన్ ఎడిషన్ దెన్ జిల్లా ఎడిషన్ ఫినిష్ చేస్తాను..! ఇవన్ని చదివేసరికి నాకు పొద్దునే బ్రేక్ ఫాస్ట్ చేసిన ఫీలింగ్ కలిగేది..! (ఇది ఒకప్పటి సంగతి).

అలా సాఫి గా సాగుతున్న నా మార్నింగ్ షెడ్యుల్ లొ .. గత సంవత్సరం “అందమైన రేపటికి అందరం సాక్షి” అని టాగ్ లైన్ తొ , అన్ని పేజిలు రంగుల్లొ కేవలం రెండు రూపాయలకు మాత్రమే అని “సాక్షి” పత్రిక అరంగ్రేటం చెసింది..! ఒకానొక సాక్షి ఏజెంట్ ఆ హొటల్ వాడి చుట్టు పది సార్లు తిరిగి.. రెండు రూపాయలు, రెండు రూపాయలు మాత్రమే అనటం తొ ఆ హొటల్ వాడు ఎంతొ కొంతొ డబ్బులు మిగులుతాయి కదా అని ఆ పేపర్ కి OK చెసేసాడు..! మొదట్లొ రెండొ-మూడో రొజులు ఆ సాక్షి పేపరు చదివా.. అప్పటి నుండి నా మనస్సాక్షిగా ఇంతవరకు ఆ హొటల్ కి సాక్షి పేపర్ చదవడానికి వెళ్ళలేదు..!

ఈ మీడియా వల్ల తెలిసినవి, తెలియనివి, సంబందం లేనివి చాలా చాలా తెలుసుకుంటున్నాము అనేది నాణానికి ఒక వైపు ఐతే ఒకరి గురించి మరొకరు, ఒక పత్రిక గురించి మరొక పత్రిక రోజు కౌంటర్ ల మీద ఎన్ కౌంటర్ లు చేసుకోవడం మరొక వైపు. అరె పేపర్ తెరుస్తే చాలు ఒకడినొకడు తిట్టుకొవడం, విమర్శించుకోవడం న్యూస్ లొ ఉండె పెద్ద హైలైట్. అసలు వాస్తవాలేమిటొ తెల్సుకోలేకపొతున్నాను. ఈరోజు ఒక పేపర్ లొ ఒక న్యూస్ చదివితే రేపు మరొక పేపర్ లొ ఆ న్యూస్ తేడాగ కనిపిస్తుంది. వాడు అంత తిన్నాడు అని వీడంటే మరొక పేపర్ లొ వాడికి అసలు తినడమె తెలీదు అని దాని గురించి ప్రత్యేకమైన వ్యాసం ఉంటుంది.. అవినీతి మెండుగా ఉన్న మన రాష్ట్రంలొ పత్రికల ద్వార ఒకొక్కటి మెల్ల మెల్లగ వెలుగులొకి వస్తున్నాయి దాంట్లొ సందేహమే లేదు.. కాని అదే పనిగ పనికట్టుకొని అవినీతిని బయటపరుస్తున్నాయా అంటె ఖచ్చితముగ కాదు.. ఒకరి పైన ఒకరి ఆరోపణలతొ, కొపంతొ ఉన్న పోటి కాస్త పత్రికల పై పొటి పెరిగింది(ఈ మద్య విపరీతం గా తయారైంది) . సరిగ్గా చెప్పాలంటె రాజకియాలతొ పత్రికలు బ్రష్ఠు పట్టాయి.. రాజకీయలతొ ముడి పడి ఉన్న ఈ పత్రికలు రాజకీయల్లొ ఉన్న స్కాంలు, కుంబకోణాలు, అవినీతి లను తవ్వుతున్నాయి.. కాని అవి ఎంత వరకు నిజమో ప్రూఫ్ చెసుకోలెక పొతూన్నాయి.

ఒక దాని గురించి మరొకటి విమర్శించుకున్న విషయాలు చెప్పుకొవాలంటే నా బ్లాగ్ సరిపొదు.. ఒకప్పుడు ఈనాడు-వార్త మద్య చెత్త పోటి ఉండేది న్యూస్ లొ.. ఇప్పుడు అన్నిటికి – సాక్షి పేపర్ కి చెత్త పోటి ఉందని చెప్పొచ్చు. మచ్చుకు రెండు రోజుల క్రితం “ఈనాడు, అంధ్ర జ్యొతి లు కలిసి సాక్షి ని పంపించెయ్యాలి అనుకుంటున్నాయి” అని YS JAGAN గారు ప్రెస్ మీట్ లొ చెప్పడం జరిగింది. వాళ్లు పంపియ్యడమేంటి.. మీరు వెళ్లడమేంటి(సాక్షి పత్రిక). ఇలాంటి అనారొగ్యకరమైన పొటి జనాలకు పేపర్ చదవాలంటె ఆలొచించాల్సి వస్తుంది. ఎఫ్ఫెక్ట్స్ కలర్ లొ ఉన్న ఖరీదు తక్కువైన మాటర్ అప్ టొ ద మార్క్ లేకుంటె ఎవరు చదువుతారు? ఉచితం కన్న వెయ్యి రూపాయలు ఎదురు పుచ్చుకున్నా నేను మాత్రం చదవను బాబొయి..!

రోగులు ఉన్నంత కాలం డాక్టర్ లు ఉంటారు.. మరి ఈ పేపర్ లొ ఇలాంటి న్యూస్ లు ఇంకెంతకాలముంటయొ మరి(ఈ పత్రికలున్నంత కాలమంటార?).. ఇది ఇలా ఉంచుతె ఈరొజే సాక్షి TV News ఛానెల్ ప్రారంభమైంది.. ఇంకెలా ఉంటుందొ .. ఊహించుకుంటెనే అదొలా ఉంది.. సగటు కన్న ఎక్కువ పాఠకుడి కి కావల్సింది ఉపయోగపడే సమాచారం కాని.. ఒకరి పై ఒకరి విమర్శలు ఆపై వాటికి ప్రత్యేకమైన వ్యాసాలు కాదు, రాజకీయ మట్టి పూసే పూత మితి రాతలు అంత కన్నా కాదు…!!!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ప్రకటనలు

6 Responses to ఎంత కాలం ఈ పత్రికల చిల్లర లొల్లి – అనారోగ్యకర పోటి ;(

 1. a2zdreams అంటున్నారు:

  not just news papers .. every where okadiki padi inkokadu padi edvatam .. nothing we can do

 2. teja అంటున్నారు:

  this is the good, other wise how can we know ramoji did fraud

 3. sri అంటున్నారు:

  YSR and Jagan is very clever in fooling people. The very reason why Saakshi was setup by using fake companies and kickback money is because it want to create a situation where in people loose the credibility of the News media all together, so that their own looitng is forgot in the crossfire of hte media war.

  I wonder how this foolish people of Andhra Pradesh will come out of this evil designs of Saakshi & YSR & Jagan.

  While it took 25 or 30 years for Andhra Jyothi, Eenadu & Vaarttha, it only took just 2 years for Saakshi to come to life and be where it is now. You decide who looted the most based on this data. Also, while Andhra Jyothi and Eenadu are seperate entities from Chandrababu and prone to write negative about CBN if things turn out bad among them, Saakshi is not different from YSR and hence there is no way that saakshi will ever write about YSR or his own govt.

  Getting lured for the free current is the worst mistake that people of Andhra did. I guess, they deserve this looting and at the end, the people, especially the commn man will suffer the most.

  I guess, PEOPLE DESERVE THIS SUFFERING UNDER THE POLITICIANS, who promise free this, free that from tax payers money to come to power.

 4. sirisha అంటున్నారు:

  this is verygood.news papers politics ki related ga undakudadu.news unnadi unnattuga chadavalante eenadu.enadu is the best

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: