బాబోయ్! చాలా చాలా మిస్ అవుతున్నా ;(

2009/03/28

ఆఫిస్ లొ  అలసిపోయి ఆలస్యం గా ఇంటికి వస్తే అర్దం చేసుకోని అక్కున చేర్చుకునే  అమ్మ ఒడి కి దూరంగ…
తప్పు చేస్తే ‘అలా కాదు రా నాన్న, ఇలా చేయాలి’ అని సరిద్దుకోవడానికి సలహాలిచ్చే నాన్నకి దూరంగ…
మంచైన-చెడైన, చేదైన-తీపైన, సంతొషమైన-బాధైన… పంచుకోవాడానికి క్లోజు స్నేహితులకు దూరంగ…
ఇంట్లొ సరదా-సరదాగ ఎప్పుడు తిట్టుకుంటూ – కొట్టుకుంటూ ఉండే అన్నా-తమ్ముడికి దూరంగ..
మా కాలనీ వాళ్ళ పలకరింపులకు, ఇంట్లొ బుడతడులు చేసే అల్లర్లకు.. ఇలా చాలా చాలా వాటికి దూరంగ..

అలా దగ్గరలేని దూరం లోను…. మరీ దూరం లేని దగ్గరలోనూ.. ఓ మాదిరి దూరంగా ఉంటున్నాను..!
ఇక్కడ మా రూం లొ హాంగర్ కి వేలాడుతున్న విడిచేసిన షర్టు-ప్యాంటు లను అడుగుతే తెలుస్తుంది.. అవి నన్ను ఎంతగా తిట్టుకుంటున్నాయొ.. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు (ప్రాస బాగుందని వాడుతున్నా.. ఎక్కడొ చదివాం.. ఇక్కడ రాసాం) నెలకొకసారి  తప్పని పరిస్తితుల్లొ తప్పదైతె ఉతుకుతున్నాను వాటిని.. ష్.. ష్.. ఏదొ అనుకుంటున్నట్లున్నారు..? అదేం లేదండి.. స్నానం రోజు చేస్తున్నాను.. కావలంటె మా బాత్ రూం ని అడగండి.. బ్యాచిలర్  జీవితాలకి ఇవి షరా మాములె!

25 ఏళ్ళూగ హైద్రాబాదు ఇంటిపట్టున ఉన్న నేను సడెన్ గా ఇక్కడికొచ్చేసరికి అంతా అయొమయంలొ ఉన్నాను.. వారానికి ఒకటి లేదా రెండు సినిమాలు.. ఒక పార్టీ.. ఒక విజిటింగ్ ఫ్రెండ్స్/కొలీగ్స్/రిలేటివ్స్ దగ్గరికి.. అలా కాల్షీట్స్ లేని బిజి షెడ్యుల్ గా ఉండేది.. ముఖ్యంగా కుటుంబానికి దూరంగా ఉండటం..   ఏదైనా కార్యాలకు తరచుగా వెళ్ళాలంటె దూరం..  దూర ప్రయాణం..  సరైన ప్లాను ఉండాలి….  ప్రతీ సారి వీలు కల్పించుకోలెము… చాలా వారకు మిత్రుల వివాహాలకు హాజరు కాలేక పోతున్నాను.. కొన్ని కావలంటె మరి కొన్ని వదులుకోవాలి అన్నట్లు.,,  ఇష్టమైన రంగం లొ రాణించుదామని అదె ఏదొ పొడిచేద్దమని అక్కడినుండి ఇక్కడికొచ్చా..  పొడవటం ఏమో కాని ఇక్కడ నుండి త్వరగ బాక్ టు హైద్రాబాద్ వెళ్ళాలని ఛిరంజీవి గారు మన  రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికై ఎదురుచూస్తున్నట్లుగా ఉంది నా పరిస్థితి..!

ఇక తిండి విషయానికొస్తే బిర్యాని తెగ మిస్ అవుతున్నాను..  పండుగలు, పబ్బాలు అన్ని మిస్ అవుతున్నాను… అంత కంటె మించి.. క్లొజ్ కొలీగ్స్, ఫామిలీ, ఊర్లు తిరగడం, రిలేటివెస్, ఫ్రెండ్స్, ఫంక్షన్స్, ఎంటెర్-టైన్-మెంట్స్, ఇరాని చాయ్..  ఇలా ఎన్నెన్నొ !!!

ప్రకటనలు

అర్దం లేని ఆ వయసు సొగసులొ కలిగే ప్రేమ – ఒక పైశాచికమా!

2009/03/25

అనగనగా ఒక హైటెక్ హైదరాబాదులొ ఎక్కడొ ఒక మూల పుట్టి పెరిగిన చిన్నోడు.. ఎలాంటి కుర్రాడంటె అప్పుడప్పుడె టీనేజ్ లోకి అడుగుపెట్టి కేవలం చెప్పుకోవడానికి ఒక వయసు తప్ప ఎలాంటి విషయాలు తెలీవు.. ఇంట్లొ అందరికంటె  చిన్నాడు అనే గారభం అనేది ఏమి లేదు మరి.. సమాజం పై అవగాహన అసలు లేదు.. బరువు బాద్యతలు ఎలా ఉంటాయనెవి తెలియవు.. క్లాస్ లొ లాస్ట్ అంటె చదువు అబ్బలెదు అనుకొవచ్చు..  ఎంత చెప్పిన గంగిరెద్దులా తల ఊపడం తప్ప చేసె పనుల్లొ తేడా ఉండేది కాదు.. క్రమ క్రమంగా కుటుంబానికి  ఒక భారం అవుతున్నాడు . ఏదొ ఒక రోజు మారుతాడని, మంచి-చెడు బేరిజు వేసుకొగల్గుతాడని, రానున్న కాలం లొ వాడికి ఉజ్వల భవిష్యత్తు కలగాలని వాడి తల్లి తండ్రులు మరియు సోదరులు ఆశించగల్గడం తప్ప వేరే ఏమి చేయలేక పోయారు..

అనగనగా ఇంకెక్కడొ పుట్టిన ఒక  చిన్నది.. పుట్టి పెరిగిన నగరం అనంతపురం అనుకుంటా.  ఈ అమ్మాయి  కూడ ఇంట్లొ అందరికంటె చిన్నది. మంచి చదువు ఉంది… ఆ అమ్మాయి కూడ టీనేజ్ వయసులొ ఉంది.. సమాజం పైన కొద్ది అవగాహన ఉంది అనుకోవచ్చు  ఉద్యోగ అన్వేషణ లొ ఉన్నట్లుంది.. చివరగ తన ఇంట్లొ తనక్కొతే  పెండ్లి కావడానికి సిద్దం గ ఉంది. తల్లి దండ్రులు తన  పెళ్ళి కి ప్లాన్ చేస్తున్నారు.

ఒకే ఈడు లొ వున్న వీళ్ళు భగవంతుని శాపానికి  ఏదో రకంగా కలిశారు..  వాళ్ళిద్దరి జోడి బాగుందని.. డేటింగ్..  ఎంకరేజ్ చెయ్యడానికి  ఫ్రెండ్షిప్ డే, వాలంటైన్స్ డే.. కాల్స్, ఎస్ ఎం ఎస్ , మాటా మంతి… ఆ టీనేజ్ ఏజు..  సొ..  “నువ్వే నాకు ప్రాణం, నువ్వే నాకు లోకం, ప్రేమే మన బంధం” అని అనుకొని .. బరువు బాద్యతలు లేని ఒక కుర్రాడికి  కాస్తో కూస్తొ తెలివి ఉన్న ఆ చిన్నది ప్రేమ సాగరం లొ మునిగిపోయారు.  ఆ ప్రేమ మోజు లొ పెళ్ళి చేసుకోవాలి అని అనుకున్నారట.. ఇంత వరకు బాగానె ఉంది..  అప్పుడు వాళ్ళ తండ్రి తండ్రులు, వాళ్ళ సోదరులు.. ఇంకెవరు గుర్తులేరు.. గుర్తు రాలేదేమో..   ఒకరికొకరు నీకు నేను – నాకు నువ్వు  అనుకుంటూ ఫెవికాల్ కన్న ధ్రుఢమైన బంధం తొ భగ్న ప్రేమను కొనసాగిస్తున్నారు.. కనీసం వారి ప్రేమ ని ఇరు కుటుంబాలకి చెప్పే ప్రయత్నం చేయలేదు..

అలా మునిగి తేలుతున్న ఆ ప్రేమ జంటకి మూడు సంవత్సారాలు పూర్తయ్యాయి..ప్రేమ ముదిరింది.. వయసు పెరుగుతుంది.. ఇద్దరు ఏదొ రకంగ చిన్న చితకా ఉద్యొగం లొ స్థిరపడుతున్నారు.. కాని రాను రాను వారిలొ భేదాభిప్రాయలు మొదలయ్యాయి… ఇష్టాలు మారాయి..  అప్పుడు నచ్చేవి ఇప్పుడు నచ్చట్లెదు..  వారిలొ ఏదొ తప్పు చేసామన్న  ప్రశ్న వారిని ప్రతి నిమిషం వేదిస్తుంది.. ఇదంత నాణానికి ఒక వైపు ఐతె ఇంతవరకు వారి ఇరువురి ఇంట్లొ ఈ ప్రేమ విషయాలు పసి గట్ట లేక పోయారు అనేది మరొ వైపున్న నగ్న సత్యం. తల్లి తండ్రులకు ఎలా తెలుస్తుంది బయట జరిగె ఈ ప్రేమ కలాహాలు..

ప్రస్తుతం  వారి ఫీలింగ్స్ … ఒకరినొకరు మోసం చేసారు అని.. ఒకరికొకరి పై కక్షకు పాల్పడుతున్నారు…. ఎంతగా అంటె.. ఒకరికొకరు బద్ద శత్రువులు గా తయారయ్యారు..ఒకప్పుడు ప్రేమించా.. నిన్నె నిన్నే… ప్రాణం కన్నా ప్రాణంగా అనుకున్న వారు..ఇప్పుడు ద్వేషం, పగ, ఆవేశం తొ రగులుతుండటం విషయం తల్లి దండ్రులకి తెల్సినా ఏమి చేయలేక పోవడం..

మీ ప్రేమకి తల్లిదండ్రులను ఎందుకు నిందిస్తారు:
ఎవరి ప్రేమకి వారే కారణం.. వారు ప్రేమించుకుంటున్నప్పడు..  కనీసం ఒక కుటుంబానికి చెప్పే సాహసం చేసిన ఫలితం మరొలా ఉండేది..  గుడ్డి గా ఒకరిని ఒకరు నమ్ముకొని.. ఇప్పుడు ద్వేషం పెంచుకోవడం ఎంతవరకు సమంజసం.. మీ అమ్మాయి నా జీవితం తొ ఆడుకుంది అని వీడు,  మీ అబ్బాయి మోసం చేసాడు అని ఆ చిన్నది.. ఇలా తల్లి దండ్రులని నిలదేస్తె వారు ఏమి చేస్తారు.. కనడం …. సవ్యంగా పెంచడం వారి బాద్యత.. మీకు ఊహ తెలిసాక మీరు తీసుకునే నిర్ణయాలు, చేసే పనులు, ఆలొచన విదానం, ఇతరులతొ నడుచుకొనె  విదానం అంతా మీ చేతుల్లోనె ఉంది .. ఇప్పుడున్న సమాజం లొ  ఇవి  ప్రేమ వయసుకి సహజం అనుకొని పెళ్ళీ జరిపించినా..  భవిష్యత్తులొ మీరు కలసి మెలసి ఉంటారని మేము ఎలా చెప్పగలం..  మీది స్పష్టమైన ప్రేమ అని ఎలా నమ్మగలం..

మీ జీవితం – మీరు తీసుకునే నిర్ణయం:
మీరు నిజంగా ప్రేమ పైన నమ్మకాన్ని పెంచుకుంటె, మీ ప్రేమ నిజమైతె మీరు ఎవరిని అప్రొచ్ అవ్వాల్సిన పని లేదు..ప్రేమతోనె జీవితాన్ని పంచుకోండి..ఇంకా మీ లోని  అభిప్రాయాలు… ఇష్టాయిష్టాలు. మీకు వ్యతిరేకంగా ఉంటె.. మీరు కలవడం కష్టం.. ఒక వేళ ఎవరైన  కలగచేసుకొని మిమ్మల్ని కలిపించిన మీరు కలసి మెలసి జీవించడం కష్టం..


ఇట్స్ మై స్టేట్ – ఏ “సేటు” కి మేరా ఓట్ ఫర్ రైట్!

2009/03/18

ప్రస్తుతం మన ఆంధ్ర రాష్ట్రం వాడి వేడి ముసుగు రాజకీయాల తో వేడెక్కిపోతుంది. ఎలెక్షన్స్ దగ్గరపడుతుండతం తొ రాజకీయ హీరోలు,హీరోయినీలు.. ప్రముఖులు హాటు ప్రసంగాలతో జనానికి రాజకీయ వడ దెబ్బని తగిలిస్తున్నారు… చిన్నపటినుండి నేను పాలిటిక్స్ కి అదే రాజకీయాలకు భూమికి – ఆకాశానికి ఉన్నంత దూరం.. చిన్నప్పుడు రాజకీయాల అవసరమేంటి వీడికి అనుకుంటున్నారు కదూ.. అదేనండి ఇంట్లొ రాజకీయాలకు, బళ్ళొ రాజకీయాలకు, దోస్తాన్ లొ…. అలా చాల వాటిల్లొ (ముఖ్యంగా అవసరమున్న అనవసరమైన వాటిల్లొ) చాలా చాలా దూరం మెయింటెయిన్ చేసేవాడిని.. అందుకనో ఏమో ఇప్పటికి ఒక విదంగా ఎక్కడా తల దూర్చే పరిస్థితి రాకుండా చేసింది…. అర్రె సోషెల్ సబ్జెక్ట్ అంటె చాల బోరె…. మా సొషల్ టీచర్ ఆన్సర్ షీట్ లొ రాసె జవాబుకి మంచిగా బిగినింగ్ + ఎండింగ్ + కంటెంట్ సైజ్ పెద్దగ ఉంటె చాలు. కంటెంట్ లొ ఉన్న మాటెర్ జోలి కి అసలు వెళ్ళేది కాదు.. తన బలహీనతను బలంగ క్యాచ్ చేసిన నేను ఎడిషనల్ మీద ఎడిషనల్స్ నింపి ఒక రేంజ్ లొ కుమ్మేసేవాడిని.. నా రాత కళ కు ఎనిమిదికి ఏడున్నర మార్కులేసేది..(సొషల్ లొ ఫుల్ మార్క్స్ వేయరట మరి). ఇక మన దేశ / రాష్ట్ర రాజకీయాల గూర్చి నేను గత పదిహేను సంవత్సరాల నుండి కొంత కొంతగ బుర్రకెక్కిస్తున్నాను… వీడు పెట్టిన టైటిల్ కి ఇస్తున్న బిగినింగ్ కి అర్దం లేకుండా రాస్తున్నాడు అనుకుంటున్నారు కదూ.. నాకు రాజాకీయ వడ దెబ్బ తగలరాని చోట తగిలినట్లుంది… అందుకె ఏదెదొ రాసెస్తున్న…. ఇక అసలు విషయానికొస్తె..

నేను 500 మైళ్ళు ప్రయాణం చేసి ఓటు వెయ్యడం అవసరమా.. అని అనిపిస్తుంటుంది నాకు. కాని నాలో,అలాగే నాలాంటి వాళ్ళందరిలొ ప్రవహిస్తున్న యువ రక్తపు ఆలొచనలు దేశానికి ఆశాదీపం కావొచ్చు. సమాజం బాగు పడాలంటె దానికి యువతే మూలం అంటారు. సమాజం పైన అంతొ ఇంతొ అవగాహన ఉన్న నాకు రాష్ట్ర అభివౄద్ధి కై చక్కటి నిర్ణయాలు తీసుకొనే పార్టికి ఓటు వెయ్యాలనిపిస్తుంది. నాకైతె ఇప్పుడు మార్పు కావాలని కోరుకుంటున్నాను.. రాష్ట్ర అభివౄద్దిని పక్కన పెట్టీ రాజకీయం ఒక సంపాదన అనే వ్యాపారం గా నడుస్తున్న రోజులివి .. “మన రాష్ట్ర భవిష్యత్తు ఏమిటి, ఎటు వెళ్తుంది, మనం తిన్నా సరే.. ఒక పంథాలొ నడిపిద్దాం.. కొద్దో గొప్పో కౄషి చేద్దాం రాష్ట్రానికై – అనే మనసున్న రాజకీయ నాయకులని వికాలంగుడికున్న వ్రేళ్ళతొ లెక్కపెట్టొచ్చు” అని అనడం ఏ మాత్రం అతిశయోక్తి కాదనిపిస్తుంది.

రాజకీయ నాయకులంటె గొప్పగా చెప్పుకునె రోజులు క్రమ క్రమంగ అంతరించిపోతున్నాయి. మన రాష్ట్ర రాజకీయ సేటు లకు ఈ విషయం లొ పెట్టింది పేరు… సరైన నాయకున్ని ఎన్నుకోవడానికి మనకున్న ఒకే ఒక ఆయుధం., వజ్రాయుధం మన ఓటు.. అది సరిగ్గ్గ ఉపయొగించుకోవటం మన కర్తవ్యం.. సరైన వారిని ఎన్నుకున్నామంటే రాష్ట్రానికి సార్వభౌముడిని ఇచ్చిన వారమవుతాం , లేదంటె మన చెప్పుతొ మనమే కొట్టుకున్న వాళ్ళమవుతాం.. అవినితీ మెండుగా ఉన్న మన రాష్ట్రం లొ నేనేదొ పొడిచేయ్యమని మన రాజకీయ నాయకులకు చెప్పట్లేదు…. “మీరు తినే దాంట్లొ కరి వేపాకు కనిపిస్తే దాన్ని కూడ వదలకుండా తినేస్తున్నారు.. ఒక వేళ మీరు కరివేపాకే కదా అని వదిలేసిన ఆ కరివేపాకుని కూడ తినడానికి మీ కిందున్న నాయకులు నోరులు బారున తెర్చుకొని కూర్చున్నారు…. ఓటు వేసిన పాపానికైన పడేసె కరివేపాకు రుచి ప్రజల ప్రయోజనాలకి తగిలిస్తే మన రాష్ట్రం ఆశించన దానికన్న ఎక్కువ డెవెలప్ అవుద్ది.”

ఇక నా అమూల్యమైన ఓటు ని నాకు, మన రాష్ట్ర ప్రగతికై పురోగమించే నాయకుడికి, ఆ రాజకీయ పార్టీకి.. సొ, మై డియర్ ఫ్రెండ్స్ ఓట్ ఫర్ రైట్!


అమెరికా పై మోజూ.. తగ్గుతున్న క్రేజూ..

2009/03/14

అమెరికా ..  ఎంత లేదన్నా సగటులొ సగానికి పై గా భారతీయ యువతీ యువకులకు  కలల దేశం..  జీవీతంలొ  ఒక్క సారైన ఆ దేశం చుట్టి రావాలనో…. ఉన్నత చదువులు అక్కడే చదువు కోవాలనో… జాబ్ కూడ అక్కడే చేయాలనో….. కొంతకాలం అక్కడె జాబ్ చేసి ఇక ఇండియ కి తిరిగిరావాలనో .. కనీసం ఆన్ సైట్ అఫర్ వస్తే బాగుండు అనో.  ఇలా కారణం ఏదైన కావచ్చు..విజిట్ చెయ్యాలని అనుకుంటారు.. “ఏదో రకంగ వెళ్ళాలనుకోవడం” – అను జాబిత లొ నేనున్నాను అని నాకు గత కొన్ని సంవత్సరాలుగ… ప్రతిష్టాత్మకమైన  “”డ్రీం-క్రీం ఫార్చున్-500 మాగజైన్”” లొ ప్రతి త్రైమాసికానికి నా పేరు ప్రచురిస్తూ వచ్చింది..  కాని ఇంకా వెళ్ళలేదు… (వేళ్ళే అవకాశం రాలేదు – సవరణ చేసుకోగలరు).

గత సంవత్సరం చివరి దశలో సంభవించిన స్టాక్ మార్కెట్ పతనం, అమెరికా ఆర్దిక వ్యవస్థ దెబ్బ తినడం..రిసెషన్..  వెరసి.. ఉద్యొగాలకి గండి కొట్టాయి… నా మిత్ర బౄందం లొ కొందరు గత సంవత్సరం ఉద్యోగం కోసం హెచ్1బి కి దరఖాస్తు చేసి అక్కడికి వెళ్ళినవాళ్ళలొ నూటికి పదిమంది కూడ జాబ్ రాలేక పోయింది అక్కడ. పరిస్థితి చాల చండాలంగ ఉంది.. ప్రాసెసింగ్ చెసిన కన్సల్టన్సీలు చేసేది ఏమి లేక తెచ్చుకున్న పచ్చడిలతొ సహా ప్యాక్ చేసుకొని తిరిగి ఇండియా కి వెళ్ళిపొమ్మంటున్నారు..

గత నెల ఫిబ్రవరి లోనె అమెరికాలొ 6,51,000 ఉద్యోగాలు ఊడాయంటె పరిస్థితి ఎంత దారుణంగ ఉందొ అర్దమవుతుంది.   ఎన్నో అశలతొ అక్కడికి  అడుగుపెట్టిన మనవాళ్ళూ  చివరికి…. నిరాశ తొ వెనుదిరుగుతున్నారు..! ఆశలు అడియాసలు అయిపోతున్నాయి.  గత ఏడాది తొ పోలిస్తే చాలా వరకు వీసా ప్రాసెసింగ్ సంస్థలు మూతబడ్డాయి. పైగా ఈ సంవత్సరం ఎవరు పెద్దగ వెళ్దామని కూడ ఎవరిని అప్రొచ్ అవ్వట్లేదు..

కొద్దో గొప్పో కూడ బెట్టిన ధనం కాస్త..  బూడిద లొ పొసిన పన్నిరు లా ఆ ప్రయత్నాల్లో బాగంగా ..కాలిపోతున్నాయి.. జనాల్లొ ఒక్కప్పటి మోజు క్రమంగా తగ్గుతుంది.. మళ్ళీ ఆ క్రేజ్ రావాలంటె కొంత కాలం ఆగాల్సిందే….”what goes down will always go up, Markets will rebound” అని నా గట్టి నమ్మకం.. వీలైనంత తొందరగ అమెరికా  కోలుకోవాలని .. అంత మంచే జరగాలని కోరుకుంటూ..    ఈ చేదు కాలం నుండి విముక్తి కలగాలని..ఆశిస్తూ..
         —   కలల ప్రపంచం లొ “వెన్నెల” బాలుడు..


ఉష్.. గప్ చుప్ ! … ఈ పరిస్థితుల్లొ బోనసా?

2009/03/11

గత సంవత్సరం వరకు నాకైతె మార్చి నెల రాగనే అదొ ఆనందం.. ఎవరు ఎలా అడిగిన ఎండమావి లొ వర్షం లా.. “మార్చి వరకు ఒపిక పట్రా, తర్వాత నీ డబ్బులు నువ్విచ్చిన దానికన్న కూసింత ఎక్కువిస్తాలేవోయ్, యెధవ సంత నువ్వూను” అని అదొ ధీమాతో చెప్పేవాడిని.. మా అక్కయ్య “మా కిరాణ షాప్ కి ఒక లొకల్ కాయిన్ బాక్స్ పెట్టించు తమ్మి” అంటె ఏకంగ STD బూత్ పెట్టిస్తా అని వాగ్దానాలు చేసేవాడిని.. ఎందుకంటె ఈ నెల జీతం తొ పాటు ప్రాఫిట్ గ్రోత్ ఇన్ కం అని,పర్ఫామెన్స్ బోనస్ అని, అదీ అని .. ఇదీ అని .. కలిపి ఎక్స్ ట్రా గ ఒక నాలుగు – ఐదు అంకెల వరకు వచ్చేది.. కాని ఇప్పుడు ఆ ఊసే లేదు…. పైగా ఉన్న ఉద్యొగానికే ఎసరు అన్నట్లుగా ఉంది.. :(

———————————————————————————-

హాయ్ బిచ్చూ.. “ఏమిటి ఆఫిస్ లొ నిన్నెప్పుడు ఈ టైం వరకు చూడలేదు..? తెగ కష్టపడుతున్నట్లున్నావ్? దానికి బిచ్చుగాడు.. ఏమి లేదు రా.. మేనేజర్ నాపై ఒక సింపతీ లుక్ వెయ్యాలని” వినమ్రంగా చెబుతున్నాడు..

———————————————————————————-

ఇక మా జొగ్ రాజ్: గారు .. మేనేజర్ ఆఫిస్ నుండి రిటర్న్ అయ్యేటప్పుడు.. తన దగ్గరున్న లాప్ టాప్ తీసుకొని. కింది వరకు మోసుకొచ్చి మరి కార్లొ పెట్టీ గూడ్ బై అని చెప్పి అరనవ్వుతొ సాగనంపుతున్నాడు ఇంటికి..!.. గత వారం నుండి ఈ పని దిన చర్యలొ బాగం గ అయిపోయింది వీడికి..

———————————————————————————–

నేను: హాయ్ సప్పూ!

స్వప్న: హెలొ, నీకొక విషయం తెలుసా?

నేను: నువ్వు చెప్తేనే కదా నాకు తెలిసేది..

స్వప్న: చాల్లే ఆపు.. మన పవన్ గాడు లేడు.. వాడు పొద్దున మిరపకాయ బజ్జిలు తెచ్చి ఇచ్చాడట మేనేజర్ కి.. ఈ సారి వాడికి ఫుల్ బోనస్ పక్కా..

నేను: వాడొక సాంటా-బాంటా టైపు.. సిగ్గు ఏ మాత్రం లేదు… వాడికి అసలు మెదడు మోకాలు నుండి అరికాలికి వచ్చేసినట్లుంది..

స్వప్న: అవును, బోనస్ కోసం ఎంతకి దిగ జారుతున్నాడు కదూ..

నేను: కాదు సప్పు.. మిరపకాయ బజ్జిలు పొద్దున తేవడమేంటి.. ఏ సాయంత్రమో తీసుకురావలి గాని.

————————————————————————

ఇలా ఈ రిసిషెన్ టైం లొ… ఒకొక్కరు తన తెలివితేటలతో ఆకట్టుకుంటున్నారు మేనజర్స్ ని.. రేపో ఎల్లుండొ ఒక మీటింగ్ తగలబడుతుంది ..బోనస్ ఇస్తారొ.. ఇవ్వరో .. “మీరు ఇంత కాలం చెసిన సేవలకి మా కంపని నుండి ఒక “ప్రత్యేక థాంక్ యు” అని సాదా లెటెర్ ఇస్తారొ.. అది కూడ ఇవ్వకుండ పింక్ లెటెర్ ఇస్తారో, మన టైం బాగుండి ప్రింటరు బిజి గ ఉంది అని ఆ లెటెర్ కి టైం ఇస్తారొ …. తలుచుకుంటె దిన దిన గండం గా ఉంది.. :(


చిట పట చినుకులు పడుతూ ఉంటే…

2009/03/09

వాన వాసన రుచించక మూడు నెలలు అయి ఉంటుంది… గత నెల నుండి భానుడి వీర ప్రభంజనంతో నా శరీరం అంత యమ హీటు. మార్చి నెలకె నా బాడిలోని  గరిష్ట అవయవాలు కనిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీలకు దాటాయి.ఈ ఎండ భయానికి వీకెండ్స్ లొ ఫ్రెండ్స్ లంచ్ కి ఇన్వైటు చేసిన ససెమిరా రాను అని అంటున్నాను. బట్టర్ మిల్క్ లు, కొబ్బరినీళ్ళూ, లస్సీలు విచ్చలవిడిగా తాగుతున్నాను.. ఇప్పుడే ఇలా ఉంటె రానున్న రెండు నెలలు ఇంకెలా ఉంటుందొ అని అనుకుంటున్న తరుణం లొ…..

ఈ రోజు మధ్యాహ్నం  వాతవరణం లొ స్వల్ప మార్పు.. నడి నెత్తి మీద నిల్చోవాల్సిన సూర్యుడు కాస్త కనుమెరుగయ్యాడు. మబ్బులు కమ్ముకున్నాయి.. చల్ల గాలులు వీస్తున్నాయి…  చిలిపి చినుకులు రావడం మొదలు పెట్టాయి… ఒక అర గంట అలా… అలా వర్షపు జల్లుల్లొ  భూమి కాస్త చల్ల బడింది.. వాన దేవుడు ఒక ఊపు ఊపితే బాగుండు..అని మనసులొ అనుకున్నాను..

సాయంత్రం అయ్యింది.. సోమవారం కనుక ఆఫిస్ లొ కాస్త  ఈ రొజు పని ఎక్కువగానె ఉంటుంది.. పని ఎక్కువగ ఉంటుందంటె నమ్మలేకపోతున్నరా  ఏంటి? ఇదిగొ ఇలా సమయం మనకు తెలియకుండానే ఉదయం నుండి రాత్రి వరకు  గడిచిపోద్ది…
వీకెండ్  అనే సాకుతొ లేట్ గా  నిద్ర లేచి, తయారయ్యి ఆఫీసుకు చేరేప్పటికి 11:30 అయ్యింది..ఆఫీసు మెయిల్ నిదానంగా చెక్ చేసుకోవచ్చని ఉన్న ప్రదాన మెస్సెంజెర్ లు Yahoo, G-talk లోకి లాగిన్ అయ్యాను…

‘Hi….Hello…..Hi Dude …..Hi Hero….Hi  Ra… Hi machi’ అని అర డజను విండోలు తెరుచుకున్నాయి….
ప్రీతి,రమ్య, సీను , రజిని, జోగ్:రాజ్, గురు పింగింగ్స్ ….. అంతే టైం ఖల్లాస్ !!! (వీకెండ్ ఏమి చెసావ్ అనే దాని మీద ఒక డిబేట్ అయింది)

మెయిల్స్ చెక్ చేసి ఉన్న పనిలొ కొంచెం బాకి ఉంచి కొంచెం కానిచ్చే సరికి.. టైం రాత్రి 9 అయ్యింది.. మా రూం మేట్ ఫొన్ చేసి నేను రూం కి నీకంటె ముందుగా వచ్చేసా.. సాంబార్ చేస్తున్నాను.. త్వరగా వచ్చేయి అనగానె..  (మనసులొ.. ఈ రోజు ఎలా తినాలొ అని కుములుకుంటు..) ఆఫిస్ బయటకు వచ్చా..!

ఆహ… ఆహా .. చల్ల గాలి… చిరు జల్లులు… వర్షం బాగ వచ్చెట్లు గా ఉంది.. ఆఫిస్ బయటకు వచ్చాను.. ఆటొ వాళ్ళూ “చాల డిమాండ్ చేద్దాం.. ఎంతైన ఇస్తారు.. వర్షం భారిగా  వచ్చేలా ఉంది..” అని ఒకడికొకడు గొనుక్కుంటున్నారు.. ఆ చిరు జల్లుల వర్షం నన్ను .. ఆటొ వైపు చూడకుండా.. మా రూం వరకు నడుచుకుంటు వచ్చేలా చేసింది..  ఆ నాలుగు కిలొ మీటర్లు వర్షపు జల్లులతొ బాగా ఎంజాయ్ చేస్తు.. నవరంధ్రా ల్లో  ఉన్న వేడిని బయటకు కక్కిస్తు.. చల్లదనాన్ని ఆస్వాదిస్తు…. మొత్తం కూల్ గ అయిపొయా…..!

గత నెల నుండి ఎండకి కొట్టుమిట్టాడుతున్న నాకు ఈ చల్ల గాలి.. చిరు జల్లులు మన్సుకి చాల అనందాన్ని ఇచ్చాయి.. ఇప్పుడు కూడ ఆరు బయట చల్ల దనాన్ని పైనుండి కింది వరకు ఆస్వాదిస్తూ.. ఈ చల్లటి గాలిలొ.. ఏదో రాస్తున్నాను.. ఇంకా అర్దం కాలేదా.. అదిగొ.. ఇదిగొ.. $%%$% .. అందుకే ఈ టపా మరి..!


అనుకోకుండా ఒక మందు పార్టీ!

2009/03/07

ఈ రోజు… సూర్యుడికి ఒంట్లొ బాగోక సరిగా ఉదయించని రోజు. దట్టంగా కమ్మిన చిరు మబ్బుల్లో నేను ఆనవాళ్ళు లేని ఊహాలతొ సగం వరకు తడుస్తున్న సమయం.. సెల్ మోగింది.. ఆగింది.. మళ్ళీ మోగింది… కాస్త చురుగ్గా మిస్ కాల్ ని రిసివ్ కాల్ గ చేసి ఇవతలి వైపు “నేను” అవతలి వైపు ఎవరు.. అని అంటుండగానే అవతలి వైపు కూడా “నేను” అనే సమాధానం తొ పాటు ఎక్స్ ట్రాగ సేం-పించ్ అని అనడం తొ వీడు ఖచ్చితంగా ఆ జోగ్-రాజ్ గాడె అయి ఉంటాడని చెప్పరా జో: అని అనగానే … అరె, ఈ రోజు ఈవినింగ్ ధనుష్ గాడి పార్టి కి వస్తున్నవా.. లేదా? ధనుష్ గాడు నేను రాకుండ ఎలా పార్టీ చేస్తాడు.. ఓ.. వై నాట్… ఐ విల్ కం అనటంతో.. షార్ఫ్ 5 కి మన కామన్ పాయింట్ కి వచ్చేయ్.. నేను పిక్ అప్ చేసుకుంటా..! అటునుండి పార్టి కి వెళ్ళి నైట్ థార్డ్ షో వెళ్దాం. సరే రా అని మళ్ళీ ఊహాల్లొకి జారుకోని మొత్తం తడిసేసాను.

ధనుష్ గాడు మా ఆఫిస్ లొ గత మూడు నెలలుగా బెంచ్ పై నిద్రపోతుండగా రిసోర్స్ మెనేజింగ్ వాళ్ళు నిద్ర లేపి మరి నిన్న మా ప్రాజెక్ట్ లొ పడేసారు. మా ప్రాజెక్ట్ లోకి ఎవరు కొత్తగ జాయిన్ అయిన, ప్రాజెక్ట్ నుండి వెళ్ళి పోయిన, టీం మెంబర్ కి ఏమి జరిగిన, జరగబోతున్న టీం కి పార్టి ఇవ్వల్సిందే. లేకుంటే మా పార్టి ఆర్గనైజెర్ & అధినేత అయిన జోగ్ రాజ్ ఊరికె వదలడు…వీడి క్రెడిట్ కార్డ్ తొ గోకి మరి బిల్లు వసూలు చేస్తాడు.. నిన్నటికి మొన్న ఆఫిస్ లొ శిరీష తొ శ్రావణ్ గాడు జోగ్ గాడి కన్నG-Talk లొ రెండు మాటలు ఎక్కువ మాట్లాడుతున్నాడని, స్మైలీలు కూడా పంపుతున్నాడని .. సమాచారం శ్రావణ్ వైఫ్ కి అందజేస్తానని వైట్-మైల్ చేసి మరీ పార్టీ జరిపించేసాడు శ్రావణ్ స్పాన్సరింగ్ తొ…వీడితో పెట్టుకోవడం అంటే కంప-చెట్లొ కాలు పెట్టడమే!

సూర్యుడు మాత్రలు మింగి విధి నిర్వహణలోకి రాగానే సాయంత్రం 5 గం. అయింది..! సాయంత్ర స్నానం కెల్లి వచ్చె లోగా 12 మిస్ కాల్స్ మరియు 24 ఎస్ ఎం ఎస్ లు జోగ్: నుండి..! వాడి బాధ అర్దమైంది.. నేను అక్షరాల అర నిమిషం ఎక్కువ 6 గం.కి కామన్ గ కలుసుకొనే పాయింట్ చిత్రా కేఫ్ దగ్గర వెయిట్ చేస్తున్నాను.. వాడికి పంక్చువల్ గ ఉండకపోవడం అనేది పాల మీగడ తొ పెట్టిన విద్య.. ఆ విషయం ప్రతిసారి ప్రూఫ్ చేస్తుంటాడు. వాడి కోసం ఎదురుచూస్తూ మూడు ఛాయ్ లు తాగెసా! నాలుగో ఛాయ్ అర్డెర్ ఇస్తుండగ కి చటుక్కున వచ్చేసి సారీ రా! లేటు.. 6:30 అయ్యింది.. అని ఏవేవో వెధవ సంజాయిషి లు చెప్పి… ఛాయ్ బిల్లు కట్టెసి, కాస్త నన్ను కూల్ చేయడం… అక్కడినుండి వాడి పల్సర్ లొ పార్టి కి బయలు దేరాం..

వాడి పల్సర్ బండికి ముందున్న నెంబర్ ప్లేట్ కి సాక్షి టి.వి, సాక్షి న్యూస్ పేపర్ లోగో, చేతి గుర్తు మరియు వెనుక నెంబర్ ప్లేట్ కి హరితాంధ్ర ప్రదేశ్ అని వ్రాయబడిఉంటుంది. కావున హెల్మెట్ వాడకుండ., లైసెన్స్, అర్ సి బుక్ లేకుండ వాడిని ఎవరు ఏమి చెయలేరన్న ధీమా తో రోడ్ కి కుడి వైపున రఫ్ గా డ్రైవ్ చేస్తున్నాడు.తెలుగుదేశం హాయాం లొ స్వర్ణాంధ్ర ప్రదేశ్ లోగో, సైకిల్ బొమ్మలు వేయించుకునేవాడు. అయినా విధి వెక్కిరించింది బండి కున్న రెండు టైర్లు ఒక దానికొకటి పోటి పడి ఒకేసారిగ పంక్చర్ అయ్యాయి.. ఆ బండిని అక్కడే పడేసి(ఎవడు ఎత్తుకెల్లడు దాన్ని అని జోగ్: గాడి స్ట్రాంగ్ ఫీలింగ్) ఆటొ లొ పార్టి కి చేరుకున్నాం అప్పటికి మా వాళ్ళు సంపూర్ణం లొ సగభాగంగా రెండు రౌండ్ లు పూర్తి చేసేసారు..

ముచ్చటగ మూడో రౌండ్ కి కంపెని ఇచ్చి ఎప్పుడు వినని టీం మేట్స్ వెధవ కబుర్లతొ కాలక్షేపించి చివరి రౌండ్ కూడ పూర్తి చేసేసాం.. మా జో: గాడు మత్తులొ ఉన్నప్పుడే సరిగ్గా మట్లాడుతాడు.. సొ వాడి గోడుని కూడ ఆలకించేసి.. అప్పటికి సమయం రాత్రి 10:30 గం … సినిమాకని బయలుదేరాం..! రిటర్న్ లొ ధనుష్ గాడి మోపెడ్ లొ హై-వే పై దగ్గర్లొ ఉన్న థియెటర్ కి వెళ్తున్నాం..

చందమామ అలిగినట్లున్నాడు చిమ్మ చీకటిగా ఉంది.. చిరుజల్లులతొ వర్షం సరిగ కురవని రాత్రిలొ మా ప్రయాణం సాగుతొంది థియేటర్ వైపు.. అర్రె జోగ్: లేట్ అయ్యింది.. వర్షం కూడ కురుస్తుంది.. సినిమా ప్రొగ్రాం రేపు పెట్టుకుందాం ఇంటికి వెల్లిపోదాం అని చెప్పిన వినకుండా.. . గాలిలొ మాటిమటికి మోపెడ్ పై ఉన్న వీడి హండ్స్ ని వదిలేసి నేను ఒక సారి ప్లాన్ చేస్తె ఆ బ్రహ్మ దేవుడు కూడ నన్ను ఆపలేడు అని రోడ్ కి ఇష్టం వచ్చినట్లుగా వెళ్తున్నాడు.. నేను చేసెది ఏమి లేక దేవున్ని వేడుకోవడం నా వంతైంది..

విధి మళ్ళీ వెక్కిరిస్తున్నట్లనిపిస్తుంది నాకు.. బ్రహ్మ దేవుడు “రిసెషన్ లొ ఉన్నాం మనం.. మీకు మీరు ప్రూఫ్ చెసుకోవాలి లేకుంటె భూ లోకం పంపిచేస్తాం” అని తన టీం దేవుళ్ళతొ అన్నట్లున్నాడు.. ఇంకేముంది.. ఎక్కడొ తగిలించాడు ఈ మొపేడ్ ని మా జోగ్: గాడు….! ఇక కట్ చేస్తే…

తెల్లారి లేచె సరికి నేను మా జోగ్ గాడు మా ఇంట్లొనె ఉన్నాం.. కొసమెరుపు ఏమిటంటె మోపేడ్ లేదు కాని ఫల్సర్ ఉంది మా ఇంటి దగ్గర..! అయ్యో ధనుష్….! (సశేషం)