బ్రతుకు బండి సాగేదెలా?

“కనులు తెరిస్తె జననం
కనులు మూస్తె మరణం
ఆ రెప్పపాటు లోనే మన జీవితం” – రాసింది శ్రీ శ్రీ గారనుకుంట! నేనైతె కాదు మరి!
అక్షరాల కుదిరినా ఇది నగ్న నిజం…. ఆ రెప్ప పాటులొనే మన అలొచనల దర్పం, ప్రయత్నం.. ఒడి దుడుకులతొ జీవన పోరాటం!!!

నాకిమద్య రాత్రి పడుకుందామాన్న నిద్ర రావట్లెదు…! వీకెండ్ వస్తె సినిమాకి వెళ్దామని ఫ్రెంఢ్స్ పిలిచిన “నొ” అని అనెస్తున్నాను.. షికార్లకి కూడ వెళ్ళట్లేదు… విపరీత అలొచనలతొ బుర్ర వెడెక్కుతుంది.. పగలు సమయంలొ మరీ ఎక్కువ.. సూర్యుడు తన ప్రతాపాన్ని ఈ సంవత్సరం ముందుగానె మొదలు పెట్టడం తొ తల బద్దలైనట్లనిపిస్తుంది …. రూం లొ సరిగ వండుకొవడమూ లేదు… బయత తినడం కూడ అంతంత మాత్రమె !

మెంటల్ గ కాకపొయిన శారిరకంగ నైన నా మనసు కుదుట పడుతుందని మా జొగ్ రాజ్ గాడు జిమ్ము కి వెల్లమని ఉచిత సలహ ఇవ్వడం తొ.. వాడి మాట కాదనలేక ఇక్కద దగ్గర్లొ ప్రసిద్ది పొందిన “పాడు మల్లె” జిం లొ 2100/- సమర్పించుకొన్నాను…. అంతెందుకంటార..? ఆ జిమ్ము ఫర్ బోత్ “లేడిస్ & జంట్స్” అని బోర్డ్ తగిలించాడు. రెండు రొజులేమో వెళ్ళా అంతే….! మూడో రోజు జొగ్ రాజ్ గాన్ని బండ బూతులు తిట్టుకొని.. మానేసా! ఆ జిం కి జంట్స్ మాత్రమె వస్తున్నారు :-( ఇక జిం వైపు ఇంతవరకు తొంగి చూడలేదు..! పక్కనే ఉన్న ప్రశాంతమైన ఉద్యానవనం కి వెళ్తున్నాను… అదేనండి పార్క్ కి….! అయినా.. అక్కడ ఉన్న పచ్చదనం నా మనసుకి ప్రశాంతత ను అందించలేక పొతున్నాయి… పార్క్ లొ తిరిగే వాళ్ళూ నా గొడు ని ఆలకించలేకపొతున్నారు.. దెవుడు ప్రత్యక్ష్యమైతే బాగుండు కాస్త నా కసలు ఏమైందొ తెలుసుకొవాలని అనుకునేవాడిని…. కనీసం కలొలొనైన దెవుడు క్లిక్ మంటాడెమో అని బలవంతం గ నిద్ర తెచ్చుకుంటున్నా.. దేవ లొకం లొ కూడ రిసెషన్ ఉన్నట్లుంది.. ఇంతవరకు ఎవరు ప్రత్యక్ష్యం అవ్వలేదు..!


ఈ జీవిత కాల చక్రం లొ మొదటి 25 సంవత్సరాలు మన డిగ్రీ లకి .. మిగత 25 సంవత్సరాల్లొ ఉద్యొగ కష్టాలు … ఇంకా పెళ్ళిల్లు .. పిల్లలు..వాళ్ళ డిగ్రిలకై కష్టాలు.. వగైరా వగైరా..!!! ఇంతేనా జీవితం !!! అని అనిపిస్తుంటుంది.. 50 సంవత్సరాలే అని డెసైడ్ ఎందుకు చేసానంటె.. మనం ఇప్పుడున్న యుగం లొ అంతకన్న ఎక్కువ కాలం బతకలేం కదా! ఇష్టమున్న రంగాన్ని ఎంచుకొవడం .. ఎంచుకున్న రంగంలొ కష్టాల్ని భరించడం అంటె ఏమిటొ నాకు ఇప్పుడిప్పుడె తెలిసొస్తుంది..

ఏదొ 4000/- తొ సంసారాం సాఫి గా సాగించుకోవచ్చు కొన్ని రాళ్ళు కూడ మిగుల్చుకొవచ్చు అని కాచిగూడ రైళ్ళో ఎన్నొ అశలతొ బయలు దేరానిక్కడికి..! 3500/- లొ పేయింగ్ గెస్ట్ హౌస్ లొ ఉండొచ్చని మా వాళ్ళు భరొసా ఇవ్వడంతొ 500/- నా మంత్లీ ఎంటెర్ టైన్ మెంట్ కని అనుకున్నా!ఇక్కడికొచ్చాక తెలిసింది.. రాత్రి పూట నల్లు లు ఇచ్చే ఎఫ్ఫెక్ట్స్ ల తొ గెస్ట్ హౌస్ లొ నేను నిద్ర పొలేనని రూం తీసెసుకున్న..! బయట ఫుడ్ పడదని కిచెన్ రూం లొ విద్యలు మొదలెట్టా..! ఇంకేముందీ.. కాస్ట్లీ ప్రయొగాలు…. ఇక ఆఫిస్ విషయానికొస్తె … ఆఫిస్ మరి అంత దూరం గాను లేదు… అలా అని నడిచి వెళ్ళెంత దగ్గరగాను .. లేదు..! ఇంకెముంది బెంగలూరు ఆటొస్ కి సై…. . వాల్లు మన పాకెట్ కి జై.. .. వెరసి “కేవలం 12000/- మాత్రమే” తొ సంసారం సాగిస్తున్నాను…!!!

అసలు నేను ఇక్కడ అడుగు పెట్టడంతొ .. మార్కెట్ డాంః అయ్యింది..! రిసెషన్ .. ఎకనామి క్రిసిస్ … ఫైరింగు లు.. వేతనం లొ కోతలు.. నొ మచ్ ఇంక్రిమెంట్స్.. నొ మచ్ బోనస్.. జీతం విషయనికొస్తె… అసలు ..ఉన్న అవసరాలకు సరిపడదు..! నెలలొ నా సంపద… ఇలా ఆవిరైపొయుద్ది ..

మొదటి వారం రెంట్లు, చిన్న చిన్న బిల్లులు.. కట్టుకోవడం..
రెండవ వారం లోన్ రి పేమెంట్ లు… గత నెలలొ చేసిన అప్పులు సగం తీర్చడం..
మూడవ వారం క్రెడిట్ కార్డు పేమెంట్ లు….
నాలుగవ వారం మళ్ళి అప్పులు చేయడం……బ్రతుకు బండి సాగడానికి ..


ఐ థింకు.. నేనే కాదూ.. ఇది సగటు IT ప్రొఫెషనల్ పరిస్థితి అనుకుంటా..!
పెళ్ళి కి సై అనాలన్న… ఆలొచించాల్సొస్తుంది.. ఎప్పుడు మార్కెట్ కుదురుకుంటుందో….!
బ్రతుకు బండి.. సాగించడం.. కష్టం గ అనిపిస్తుంది…! బండి సరైన మార్గం లొ వెళ్తున్న చార్జింగ్ చాలా అవసరం.. మరి ఆ చార్జింగ్ కి ఇం”ధనం” మూలం..!!!
bratuku
ఈ గడ్డు కాలం నుండి విముక్తి కలగాలని.. మనకు మంచి రొజులొస్తాయి అని ఆశిస్తూ..!!!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

అన్నట్లు నా ఈ బుల్లి బ్లాగ్ కి రెండు మాసాల అనుభవం వచ్చేసింది .. ముచ్చటగ మూడొ మాసం లోకి అడుగు పెట్టిన సందర్భముగ మీకు, మీరిస్తున్న సలహాలకి, మీరు వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలకి నేను ఈ బ్లాగ్ నుండి ప్రత్యేక కౄతజ్ఞతలను తెలియజేస్తున్నాను..!!!

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: