ఉష్.. గప్ చుప్ ! … ఈ పరిస్థితుల్లొ బోనసా?

గత సంవత్సరం వరకు నాకైతె మార్చి నెల రాగనే అదొ ఆనందం.. ఎవరు ఎలా అడిగిన ఎండమావి లొ వర్షం లా.. “మార్చి వరకు ఒపిక పట్రా, తర్వాత నీ డబ్బులు నువ్విచ్చిన దానికన్న కూసింత ఎక్కువిస్తాలేవోయ్, యెధవ సంత నువ్వూను” అని అదొ ధీమాతో చెప్పేవాడిని.. మా అక్కయ్య “మా కిరాణ షాప్ కి ఒక లొకల్ కాయిన్ బాక్స్ పెట్టించు తమ్మి” అంటె ఏకంగ STD బూత్ పెట్టిస్తా అని వాగ్దానాలు చేసేవాడిని.. ఎందుకంటె ఈ నెల జీతం తొ పాటు ప్రాఫిట్ గ్రోత్ ఇన్ కం అని,పర్ఫామెన్స్ బోనస్ అని, అదీ అని .. ఇదీ అని .. కలిపి ఎక్స్ ట్రా గ ఒక నాలుగు – ఐదు అంకెల వరకు వచ్చేది.. కాని ఇప్పుడు ఆ ఊసే లేదు…. పైగా ఉన్న ఉద్యొగానికే ఎసరు అన్నట్లుగా ఉంది.. :(

———————————————————————————-

హాయ్ బిచ్చూ.. “ఏమిటి ఆఫిస్ లొ నిన్నెప్పుడు ఈ టైం వరకు చూడలేదు..? తెగ కష్టపడుతున్నట్లున్నావ్? దానికి బిచ్చుగాడు.. ఏమి లేదు రా.. మేనేజర్ నాపై ఒక సింపతీ లుక్ వెయ్యాలని” వినమ్రంగా చెబుతున్నాడు..

———————————————————————————-

ఇక మా జొగ్ రాజ్: గారు .. మేనేజర్ ఆఫిస్ నుండి రిటర్న్ అయ్యేటప్పుడు.. తన దగ్గరున్న లాప్ టాప్ తీసుకొని. కింది వరకు మోసుకొచ్చి మరి కార్లొ పెట్టీ గూడ్ బై అని చెప్పి అరనవ్వుతొ సాగనంపుతున్నాడు ఇంటికి..!.. గత వారం నుండి ఈ పని దిన చర్యలొ బాగం గ అయిపోయింది వీడికి..

———————————————————————————–

నేను: హాయ్ సప్పూ!

స్వప్న: హెలొ, నీకొక విషయం తెలుసా?

నేను: నువ్వు చెప్తేనే కదా నాకు తెలిసేది..

స్వప్న: చాల్లే ఆపు.. మన పవన్ గాడు లేడు.. వాడు పొద్దున మిరపకాయ బజ్జిలు తెచ్చి ఇచ్చాడట మేనేజర్ కి.. ఈ సారి వాడికి ఫుల్ బోనస్ పక్కా..

నేను: వాడొక సాంటా-బాంటా టైపు.. సిగ్గు ఏ మాత్రం లేదు… వాడికి అసలు మెదడు మోకాలు నుండి అరికాలికి వచ్చేసినట్లుంది..

స్వప్న: అవును, బోనస్ కోసం ఎంతకి దిగ జారుతున్నాడు కదూ..

నేను: కాదు సప్పు.. మిరపకాయ బజ్జిలు పొద్దున తేవడమేంటి.. ఏ సాయంత్రమో తీసుకురావలి గాని.

————————————————————————

ఇలా ఈ రిసిషెన్ టైం లొ… ఒకొక్కరు తన తెలివితేటలతో ఆకట్టుకుంటున్నారు మేనజర్స్ ని.. రేపో ఎల్లుండొ ఒక మీటింగ్ తగలబడుతుంది ..బోనస్ ఇస్తారొ.. ఇవ్వరో .. “మీరు ఇంత కాలం చెసిన సేవలకి మా కంపని నుండి ఒక “ప్రత్యేక థాంక్ యు” అని సాదా లెటెర్ ఇస్తారొ.. అది కూడ ఇవ్వకుండ పింక్ లెటెర్ ఇస్తారో, మన టైం బాగుండి ప్రింటరు బిజి గ ఉంది అని ఆ లెటెర్ కి టైం ఇస్తారొ …. తలుచుకుంటె దిన దిన గండం గా ఉంది.. :(

ప్రకటనలు

10 Responses to ఉష్.. గప్ చుప్ ! … ఈ పరిస్థితుల్లొ బోనసా?

 1. మనోహర్ అంటున్నారు:

  మిరపకాయ బజ్జీలు మీ ఆఫీసుకు కూడా చేరాయన్న మాట, గౌతమ్ వాళ్ళ ఆఫీస్ లోనే అనుకున్నాను…
  ఏమైతేనేం, ఆల్ ది బెస్ట్

 2. మనోహర్ అంటున్నారు:

  గౌతమ్ ఎవరా అనా? లాస్య బ్రహ్మ తోటరాముడు గారు
  http://thotaramudu.blogspot.com/2008/12/123.html

 3. lakshmi అంటున్నారు:

  all the best :)

 4. Naresh అంటున్నారు:

  Hay Shankar,

  It’s not time for Mirapakaya Bajji’s… Its so Hot man… So think in different way… like.. Bonda’s… Maazaaaa…. or @least book a ticket to your Manager to Goa… Definately you get <<<<>>>>

  All da Best buddy..

 5. మనోహర్ అంటున్నారు:

  మేనేజర్ కి గోవా టికెట్, ఆ దెబ్బతో ఈ రిసెషన్ లో వీడు ఇంత ఖర్చు పెట్టాడంటే డబ్బు బాగానే మూలుగుతుందనుకుంటాడు, అసలుకే మోసం వస్తుందేమో?

  • nelabaludu అంటున్నారు:

   @ మనోహర్ …

   హహహ్హహ్హహ్హ… మేనేజర్ కి గోవా టికెట్.. అదీ నేనా, బాబోయ్..! నాకు బోనస్ రాకున్న పర్లేదు కాని.. ఉన్న ఉద్యోగం ఊడిపోకుంటే చాలు..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: