అర్దం లేని ఆ వయసు సొగసులొ కలిగే ప్రేమ – ఒక పైశాచికమా!

అనగనగా ఒక హైటెక్ హైదరాబాదులొ ఎక్కడొ ఒక మూల పుట్టి పెరిగిన చిన్నోడు.. ఎలాంటి కుర్రాడంటె అప్పుడప్పుడె టీనేజ్ లోకి అడుగుపెట్టి కేవలం చెప్పుకోవడానికి ఒక వయసు తప్ప ఎలాంటి విషయాలు తెలీవు.. ఇంట్లొ అందరికంటె  చిన్నాడు అనే గారభం అనేది ఏమి లేదు మరి.. సమాజం పై అవగాహన అసలు లేదు.. బరువు బాద్యతలు ఎలా ఉంటాయనెవి తెలియవు.. క్లాస్ లొ లాస్ట్ అంటె చదువు అబ్బలెదు అనుకొవచ్చు..  ఎంత చెప్పిన గంగిరెద్దులా తల ఊపడం తప్ప చేసె పనుల్లొ తేడా ఉండేది కాదు.. క్రమ క్రమంగా కుటుంబానికి  ఒక భారం అవుతున్నాడు . ఏదొ ఒక రోజు మారుతాడని, మంచి-చెడు బేరిజు వేసుకొగల్గుతాడని, రానున్న కాలం లొ వాడికి ఉజ్వల భవిష్యత్తు కలగాలని వాడి తల్లి తండ్రులు మరియు సోదరులు ఆశించగల్గడం తప్ప వేరే ఏమి చేయలేక పోయారు..

అనగనగా ఇంకెక్కడొ పుట్టిన ఒక  చిన్నది.. పుట్టి పెరిగిన నగరం అనంతపురం అనుకుంటా.  ఈ అమ్మాయి  కూడ ఇంట్లొ అందరికంటె చిన్నది. మంచి చదువు ఉంది… ఆ అమ్మాయి కూడ టీనేజ్ వయసులొ ఉంది.. సమాజం పైన కొద్ది అవగాహన ఉంది అనుకోవచ్చు  ఉద్యోగ అన్వేషణ లొ ఉన్నట్లుంది.. చివరగ తన ఇంట్లొ తనక్కొతే  పెండ్లి కావడానికి సిద్దం గ ఉంది. తల్లి దండ్రులు తన  పెళ్ళి కి ప్లాన్ చేస్తున్నారు.

ఒకే ఈడు లొ వున్న వీళ్ళు భగవంతుని శాపానికి  ఏదో రకంగా కలిశారు..  వాళ్ళిద్దరి జోడి బాగుందని.. డేటింగ్..  ఎంకరేజ్ చెయ్యడానికి  ఫ్రెండ్షిప్ డే, వాలంటైన్స్ డే.. కాల్స్, ఎస్ ఎం ఎస్ , మాటా మంతి… ఆ టీనేజ్ ఏజు..  సొ..  “నువ్వే నాకు ప్రాణం, నువ్వే నాకు లోకం, ప్రేమే మన బంధం” అని అనుకొని .. బరువు బాద్యతలు లేని ఒక కుర్రాడికి  కాస్తో కూస్తొ తెలివి ఉన్న ఆ చిన్నది ప్రేమ సాగరం లొ మునిగిపోయారు.  ఆ ప్రేమ మోజు లొ పెళ్ళి చేసుకోవాలి అని అనుకున్నారట.. ఇంత వరకు బాగానె ఉంది..  అప్పుడు వాళ్ళ తండ్రి తండ్రులు, వాళ్ళ సోదరులు.. ఇంకెవరు గుర్తులేరు.. గుర్తు రాలేదేమో..   ఒకరికొకరు నీకు నేను – నాకు నువ్వు  అనుకుంటూ ఫెవికాల్ కన్న ధ్రుఢమైన బంధం తొ భగ్న ప్రేమను కొనసాగిస్తున్నారు.. కనీసం వారి ప్రేమ ని ఇరు కుటుంబాలకి చెప్పే ప్రయత్నం చేయలేదు..

అలా మునిగి తేలుతున్న ఆ ప్రేమ జంటకి మూడు సంవత్సారాలు పూర్తయ్యాయి..ప్రేమ ముదిరింది.. వయసు పెరుగుతుంది.. ఇద్దరు ఏదొ రకంగ చిన్న చితకా ఉద్యొగం లొ స్థిరపడుతున్నారు.. కాని రాను రాను వారిలొ భేదాభిప్రాయలు మొదలయ్యాయి… ఇష్టాలు మారాయి..  అప్పుడు నచ్చేవి ఇప్పుడు నచ్చట్లెదు..  వారిలొ ఏదొ తప్పు చేసామన్న  ప్రశ్న వారిని ప్రతి నిమిషం వేదిస్తుంది.. ఇదంత నాణానికి ఒక వైపు ఐతె ఇంతవరకు వారి ఇరువురి ఇంట్లొ ఈ ప్రేమ విషయాలు పసి గట్ట లేక పోయారు అనేది మరొ వైపున్న నగ్న సత్యం. తల్లి తండ్రులకు ఎలా తెలుస్తుంది బయట జరిగె ఈ ప్రేమ కలాహాలు..

ప్రస్తుతం  వారి ఫీలింగ్స్ … ఒకరినొకరు మోసం చేసారు అని.. ఒకరికొకరి పై కక్షకు పాల్పడుతున్నారు…. ఎంతగా అంటె.. ఒకరికొకరు బద్ద శత్రువులు గా తయారయ్యారు..ఒకప్పుడు ప్రేమించా.. నిన్నె నిన్నే… ప్రాణం కన్నా ప్రాణంగా అనుకున్న వారు..ఇప్పుడు ద్వేషం, పగ, ఆవేశం తొ రగులుతుండటం విషయం తల్లి దండ్రులకి తెల్సినా ఏమి చేయలేక పోవడం..

మీ ప్రేమకి తల్లిదండ్రులను ఎందుకు నిందిస్తారు:
ఎవరి ప్రేమకి వారే కారణం.. వారు ప్రేమించుకుంటున్నప్పడు..  కనీసం ఒక కుటుంబానికి చెప్పే సాహసం చేసిన ఫలితం మరొలా ఉండేది..  గుడ్డి గా ఒకరిని ఒకరు నమ్ముకొని.. ఇప్పుడు ద్వేషం పెంచుకోవడం ఎంతవరకు సమంజసం.. మీ అమ్మాయి నా జీవితం తొ ఆడుకుంది అని వీడు,  మీ అబ్బాయి మోసం చేసాడు అని ఆ చిన్నది.. ఇలా తల్లి దండ్రులని నిలదేస్తె వారు ఏమి చేస్తారు.. కనడం …. సవ్యంగా పెంచడం వారి బాద్యత.. మీకు ఊహ తెలిసాక మీరు తీసుకునే నిర్ణయాలు, చేసే పనులు, ఆలొచన విదానం, ఇతరులతొ నడుచుకొనె  విదానం అంతా మీ చేతుల్లోనె ఉంది .. ఇప్పుడున్న సమాజం లొ  ఇవి  ప్రేమ వయసుకి సహజం అనుకొని పెళ్ళీ జరిపించినా..  భవిష్యత్తులొ మీరు కలసి మెలసి ఉంటారని మేము ఎలా చెప్పగలం..  మీది స్పష్టమైన ప్రేమ అని ఎలా నమ్మగలం..

మీ జీవితం – మీరు తీసుకునే నిర్ణయం:
మీరు నిజంగా ప్రేమ పైన నమ్మకాన్ని పెంచుకుంటె, మీ ప్రేమ నిజమైతె మీరు ఎవరిని అప్రొచ్ అవ్వాల్సిన పని లేదు..ప్రేమతోనె జీవితాన్ని పంచుకోండి..ఇంకా మీ లోని  అభిప్రాయాలు… ఇష్టాయిష్టాలు. మీకు వ్యతిరేకంగా ఉంటె.. మీరు కలవడం కష్టం.. ఒక వేళ ఎవరైన  కలగచేసుకొని మిమ్మల్ని కలిపించిన మీరు కలసి మెలసి జీవించడం కష్టం..

ప్రకటనలు

2 Responses to అర్దం లేని ఆ వయసు సొగసులొ కలిగే ప్రేమ – ఒక పైశాచికమా!

 1. rayraj అంటున్నారు:

  బావుంది గానీ,నాది ఓ తింగరి ప్రశ్న!(శీర్షిక పై): అర్ధం లేనిది – వయస్సా!సొగస్సా!మనస్సా!(ప్రాస కోసం) బట్ చివరిది – ప్రేమ!

  ఇది నిజజీవితంలో ఒకరికి జరుగుతున్న విషయం ఐతే – వాళ్ళదారికి వాళ్ళని వదిలేయటం తప్పు.! స్నేహితులెవరైనా, పెద్దలెవరైనా – వాళ్ళ మధ్య “తప్పులని ఒకరినొకరు సహించుకొని కలవమని” చెప్పాలి.ఎలాంటి పెళ్ళి, ప్రేమలో ఐనా మూడు నాలుగేళ్ళ తరువాత గొడవలు చాలా అరుదు. ఒక్కసారి, వాళ్ళ ఇండెపెండెన్సీ లోకి వాళ్ళు వెళ్ళి, ఆలోచించుకొని, తిరిగి ఇంటర్ డిపెండిన్సీ ని తెలుసుకుంటారని అనుభవం చెబ్తోంది. ఆ కాలాన్ని వేగిర పరిచే ఎక్స్ టర్నెల్ ఫోర్స్ గా పనిచేయటం నాకు తప్పుగా అనిపించట్లేదు. ప్రేమ పుట్టిపెరగడానికి కూడా ఎన్నో బాహ్య కారణాలు పని చేస్తున్నాయి కదా!

 2. nelabaludu అంటున్నారు:

  @ RayRaj గారు…

  ముందుగ మీ అభిప్రాయాన్ని వెలువరించినందుకు ధన్యవాదములు…

  ఇక మీ విలువైన ప్రశ్న కు నేనిచ్చే జవాబు .. నేను గ్రహించింది ఏమిటంటే అర్దం లేనిది మనసు అని అనుకుంటున్నాను. ఎందుకంటె వయసు సొగసుకి ప్రేమ కలగటం సహజం. అది కాస్త పెళ్ళీ కి దారి తీసిందంటె మనసుతో అలొచించి ఒక అవగాహనకు రావడం అంతకన్నా అవసరం..!

  నిజజీవితంలో ఒకరికి జరుగుతున్న విషయం ఐతే.. జరుగుతున్నట్లు తెలిస్తె.. ఏదొ ఒకటి చేయగలం..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: