ఎన్నికల హొరు – ప్రచారాల జోరు !!!

ఎన్నికల సమయం దగ్గర పడుతుంది… రాజకీయ నాయకులు వాడి వేడి ప్రసంగాలతొ ఆంధ్ర జనాన్ని ముంచేస్తూ . దబుల్ ధమాక అఫర్స్ అంటు.. బంపర్ అఫర్స్ అంటు.. అర చేతిలొ వైకుంఠం చూపిస్తూ ముందుకు వస్తున్నారు..!

గమనిక: నా బ్లాగ్ రీడర్ లకు తెలియజేయునది ఏమనగ నేను ఇప్పుడు  మహా కూటమి పార్టి లొ ఉన్న TDP  తప్ప మిగతా  పార్టీస్ (TRS, CPI and CPM.. if any other)  గాని ఆ  పార్టి ప్రముఖుల ప్రచారాల గురించి ఇక్కడ ప్రస్తావించడం లేదు..  కారణం అడుగొద్దు !  ఆ  మహా కూటమి ఫ్యాన్స్  అన్యదా భావించకూడదని నా మనవి.

నేనభిమానించె పార్టీ : LSP

lokstaమార్పు… కావలి మనకు.. తరం.. కొత్త తరం.. ఆ కొత్త తరానికి  సరి కొత్త రాజకీయం అనే నినాదం తొ సత్తా చూపించుకోవాడానికి రెఢీ  అవుతున్నారు లోక్ సత్తా పార్టి కెప్టన్ శ్రీ జయ ప్రకాష్ నారయణ్ గారు..     IAS టాపర్ గా అరంగ్రేటం చేసి.. 16 సంవత్సారలుగా  పబ్లిక్ సర్విస్(జాయింట్ కలెక్టర్, కలెక్టర్.. etc..) లొ అనుభవం ఉన్న తను ఒక  ex-IAS ఆఫిసర్  గ మన భారత రాజకీయాల్లొ సరి కొత్త  మార్పు తీసుకురావలని  2006 లొ పార్టి ని స్థాపించి ఈ సారి మొదటిసారి గా పోటి కి 50 గ్యారంటీలతొ  సంసిద్దమయ్యారు.

ఈయన గారి ప్రచారం లొ బాగా  వినిపిస్తున్నవి ఇంక నన్ను ఆకట్టుకున్నవి కొన్ని .. ఇవిగొ:

*** యువతరానికి నవ తర రాజకీయం  *** ప్రతి జిల్లాకి ఒక ప్రభుత్వం *** మంచి ప్రమాణాలతొ కూడుకున్న  విద్య మరియు ఆరొగ్యం… *** సామజిక న్యాయం  & కరెప్షన్ ని నిరొదించడం (నాకు తెల్సి చాల కష్టం) ***

ప్రచారం లొ బాగంగా ప్రత్యేకంగ ఈ మద్యన రైళ్ళో ప్రయాణిస్తు ప్రజలను కలుసుకుంటున్నారు. కాస్త పార్టీ జనాల్లొకి పూర్తి గా వెళ్ళలేదు…  ప్రస్తుత పరిస్థితుల్లొ ముఖ్యమంత్రి గా కాకపొయిన ప్రతిపక్షంగ అసెంబ్లి లొ ఉండటం మనకు, మన రాష్ట్రానికి, మన రాష్ట్ర అభివౄద్ది కి  చాలాల చాలా అవసరం!!!

నేనభిమానించె పార్టీ : PRP

chiruprajarajyampartyphoto

కులం కొసం ఉన్న  పొలం అమ్ముకున్న వాళ్ళు  కొకొల్లలు గ ఉన్న మన రాష్ట్రం లొ ప్రజల పిలుపు అందుకుని సామాజిక న్యాయం చెయ్యటానికి 3 దశాబ్దాల సిని అనుభవ సుమభంధంతొ మరియు  అఖిలాంధ్ర ప్రేక్షకుల మద్దతుతొ రాష్ట్రంలొ రాజకీయంగ్రేటం చేసి ప్రజా రాజ్యం అనే పార్టి ని స్థాపించి    సంచలన ప్రకటనలు ఇస్తూ వస్తున్న మెగా స్టార్.. మన అన్నయ్య … శ్రీ చిరంజీవి  గారు ..!!!

ఈయన గారి ప్రచారం లొ బాగ వినిపిస్తున్న  సంగీతమిదిగొ:

$$$  ప్రజా రైతు బంధు పథకం  $$$  ఆడ పిల్లలకు KG నుంచి PG  వరకు ఉచిత విద్య.   (ఉన్నత ప్రమాణాలకు అనుగుణంగ ఉంటె బాగుంటుంది) $$$ మెయిన్ గ SC,ST,BC & మైనారిటీస్ పై ఫోకస్ $$$ అన్ని సెక్టార్ లను ప్లాన్ చేసారు $$$

చిత్ర పరిశ్రమలొ ఇప్పటి వరకు కథానాయకుడు గ చూసాం.. ఆనందించాం.. గర్వించాం..ఇప్పుడు రాజకీయనాయకుడి వేషం లొ చూడబోతున్నాం.. సోదరుడు   పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యువరాజ్యం  యూత్ ని బాగా మోటివేట్ చేస్తున్నాడు..

పార్టీ లో కన్సిస్టెన్సీ మెరుగుపడితె రానున్న కాలం లొ తెర పై చూసిన హీరొ ని CM గా చూడొచ్చు.. అంతేకాక  ప్రతిపక్షం లో నైనా  మార్పు కొసం తపించే  ఇలాంటి వ్యక్తుల సేవలు అవసరం!

నేనభిమానిస్తున్న పార్టీ : TDP

tdp

ఈ పార్టీ ని, పార్టీ ప్రముఖున్ని మన తెలుగోల్లకు పెద్దగ పరిచయం  చెయక్కర్లేదు! 9 సంవత్సరాలు ఆంధ్ర రాజ్యమేలి  మన రాష్ట్రాన్ని  అందునా హైద్రాబాదు ని  ప్రపంచ మాప్  లొ స్థానాన్ని స్పుష్టపరిచిన వ్యక్తి.. మాస్టర్ మైండ్..  శ్రీ  చంద్ర బాబు గారు!

హైదరాబాదు ని సైబరాబాదు గా చేసిన ఘనత బాబు కె దక్కుతుంది..! ఎవరిని ఎలా ఉపయొగించుకోవాలి అనే దాంట్లొ Ph.D సర్టిఫైడ్. మంచి అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్.   ఈ ఎలక్షన్స్ కోసం పొయిన స్థానం కోసం పాటు పడుతున్న బాబు నుండి జాలు వారిన వరాల్లొ కొన్ని వరాలివిగొ:

%%% పేదలకు ఉచితంగ కలర్ TV లు %%%
%%% ఉచిత చికిత్స (జ్వరం నుండి — గుండె జబ్బు వరకు) %%%
%%% రైతులకు బంపర్ ఆఫర్స్ %%%

ఇక ప్రచారానికి బామ్మర్ది బాలయ్య అల్లుడు Jr. NTR చేసే రోడ్ షోస్ లకు చాలా ఆదరణ లభిస్తుంది. ముఖ్యం గ NTR ఐతే ప్రచార హోరు లొ కాంగ్రెస్ అవినీతిని చక్కగా వివరిస్తున్నాడు.. జనాల్లొ చైతన్యానికి పార్టి ఎదుగుదలకి తన ప్రచారం కేంద్ర బిందువైంది. “మంచి పాలిచ్చె ఆవును గద్దె దించి మీరు అందరు  ఒక దున్నపొతును గద్దె ఎక్కించారు”  ఆహా.. ఏమి డైలాగ్.. ఒక సామన్యుడిని తప్పకుండా అలొచింపజేస్తాయి.గత ఎన్నికల్లొ రైతులను ఆదుకోలేదని ఓటమి పాలైన బాబు తిరిగి ఈ సారి అధికారాం తన చేతుల్లొకి తెచ్చుకోవాడానికి బ్రహ్మాండమైన హోం వర్క్ చేస్తున్నారు.. ఒకసారి బెస్ట్ CM గా ప్రూఫ్ చేసిన తను.. మరొక సారి  ౠజువు చేసుకొవడానికి సిద్దం గా ఉన్నారు..

నేనభిమానించిన పార్టీ : Congress

ysrనాకు ఊహ తెలియనప్పుడు అభిమానించిన పార్టి కాంగ్రెస్.. రైతులకు అన్యాయం జరిగిందని పాద యాత్ర చేసి  సానుభూతి తొ రాష్ట్రాన్ని తన చేతుల్లొకి తీసుకున్న ప్రియతమ నాయకుడు.. శ్రీ YSR గారు.అధికారం లొ ఉన్నారు కదా.. మళ్ళీ తనే రావాలి అంటూ ప్రజలకిస్తున్న దబుల్ ధమాకా లొ కొన్ని ఆఫర్స్ ఇవిగో:

~~~ LPG గాస్ ధర తగ్గింపు అది కూడ 100/- లెస్సు మరి ~~~
~~~  కిలొ రెండు రూపాయల బియ్యం కోటా పెంపు ~~~~
~~~ ఇందిరమ్మ x.y మరియు రాజివ్ y.z  ~~~


ఇక ప్రచారం సెంటిమెంట్ చెల్లమ్మ చేవెళ్ళ నుండి స్టార్ట్ చేసి.. జన భేరి, తర్జన, గర్జన, భర్జన సదస్సులతొ దూసుకెళ్తున్నారు…. గత ఐదేళ్ళ పాలన లొ మనం సాదించిన దానికంటే కోల్పొయింది చెప్పుకోవాలంటె నా బ్లాగ్ చాలదు! మన రాష్ట్రానికి మార్పు అవసరం.. ఇది కావాలంటె నాకైతె ఇక రెస్ట్ తీసుకొంటె మంచిదని లేదంటే ప్రతి పక్షానికి  తిరిగి వెళ్తె చాలు అని అనిపిస్తుంది.. బెస్ట్ ఆఫ్ లక్!

ఇక BJP పార్టి కి చాన్సెస్ తక్కువగ ఉన్నాయ్.. ప్రచారాలు కూడ అంతంత మాత్రం గానె కనిపిస్తున్నయి..
ఏది ఏమైన వివిద పార్టీ ల ప్రచార హోరులు.. జనాల్లొ మార్పు తీసుకొచ్చేలా కనిపిస్తుంది..

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

అన్నట్లు ఈ బుల్లి బ్లాగ్ మూడు నెలలు పూర్తి చేసుకొని నాల్గొ నెలలోకి అడుగు పెట్టిన సందర్భం గా బ్లాగ్ రీడర్స్ కి ధన్యవాదాలు !

ప్రకటనలు

4 Responses to ఎన్నికల హొరు – ప్రచారాల జోరు !!!

 1. a2zdreams అంటున్నారు:

  @పార్టీ లో కన్సిస్టెన్సీ మెరుగుపడితె రానున్న కాలం లొ తెర పై చూసిన హీరొ ని CM గా చూడొచ్చు.. అంతేకాక ప్రతిపక్షం లో నైనా మార్పు కొసం తపించే ఇలాంటి వ్యక్తుల సేవలు అవసరం!

  WELL SAID about Chiranjeevi and PRP

 2. nelabaludu అంటున్నారు:

  @a2zdreams..

  THANX DUDE !!!!

 3. bonagiri అంటున్నారు:

  మీకిష్టమైన ఆర్డరులొ వ్రాసారా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: