ఈ వీకెండు విహార సమయం – ఓ మిత్రుడి వివాహానికై బెజవాడ పయనం!

గత రెండు మూడు నెలల నుండి మిత్రుల పెళ్ళిల్లకు గైర్హాజరవుతుండంటంతొ ఇప్పటికే నా మిత్రబౄందం నాపై కారాలు-మిరియాలు నూరుతున్నారు.. ఇంతలొ నా క్లొజు మిత్రుడు కం మా ఆఫిస్ కొలీగైన కొండపల్లి ప్రసన్న పెళ్ళి రానే వచ్చింది.. బెజవాడ లొ పెళ్ళి… మా వాళ్ళకు నా పై గసాల, దాచెనచెక్క నూరి పోసే అవకాశం ఇవ్వకూడదని ఎలాగైన ఆ పెళ్ళి కి అటెండెన్స్ వేసుకోవాలని నిశ్చయించుకున్నాను… బెంగళూరి నుండి విజయవాడ కి మూడు రోజులముందే ఫ్రైడే రాత్రి 11:30 కి గౌహతి ఎక్స్ ప్రెస్ కి నాలుగు టికెట్ లు బుక్ చేసేసాం. నేను, మా జోగ్ రాజ్, నీలేష్ & స్వప్న ఆఫిస్ లొ లేని పనులు కూడ చేసేసి స్టేషన్ లొ ఆన్ టైం మీట్ అవుదాం అని ప్లాన్ వేసాం..

‘పక్కీంటోడికి పెళ్ళి చూపులట..’ నాకావిషయం ఇప్పుడె తెల్సింది అని స్వప్న, ‘ఆఫిస్ లొ కొత్తగా జాయిన అమ్మాయి అనుకోకుండా ఈ శనివారం సాయంత్రం నాకు డేటింగ్ ఇచ్చింది’ అని నీలెష్ ఇద్దరు చెత్త సాకులతొ తప్పించుకున్నారు .. ఇక నలుగురి లొ ఇద్దరిలా నేను నాతొ పాటు జోగ్: రాజ్ ఏ కారాణాలు చెప్పుకోకుండా రాత్రి 11:10 కి స్టేషన్ కి చేరుకున్నాం.. ఎండాకాలమనా? లేకా జనరేటర్ ప్రాబ్లమా అర్దం కాలేదు మాకు…. ట్రైను అంధకారం లొ ఉంది…ట్రైను లొ కుడా పవర్ కట్టా.. నాయాన శ్రీమాన్ లాలు జీ… ఎక్కడున్నావ్.. నీకొక దండం అంటుండగానె 11:20 కి కరెంటు వచ్చింది.. మొత్తానికి కేటాయించిన సీట్ల లొ బైటాయించాం… అరచి అరచి విసిగి పోయిన ఒక ఆడగొంతు స్వరం తొ “మే ఐ హావ్ యువర్ అటెన్షన్ ప్లీజ్” అనటం మొదలు అంతే.. మా జోగ్: రాజ్ 11:29:00 కి కిందికి దిగి పరిగెత్తుతూ 11:29:59 కి చేజ్ చేస్తు లోపలికి వచ్చాడు… సరిగ్గ టైమంటె టైము 11:30 కి ట్రైను కదిలింది..

చుట్టు పక్క బెర్తులు అంతగా ఆకట్టుకోకపోవడంతో అర గంటలొ నిద్ర లోకి జారుకున్నాం.. చాయ్ .. చాయ్.. గర్మా గరం చాయ్.. అనే చప్పుడు వినపడటం తొ మెలుకవ వచ్చింది… సమయం మర్నాడు అనగా శనివారం ఉదయం 9 గంటలు.. ఒక టేస్ట్ లేని టి త్రాగి మత్తు రావడం తొ మళ్ళి పడుకొన్నాను… ఇంతలొ.. ఇంకా విడుదల కాని సినిమాల పాటల్ని ఎవరొ ఆలపిస్తున్నారు… ఈ విరళ కంఠ స్వరం ఆడు వారిదా లేక మగ వారిదా అనే సందిగ్దం లొ నేనుండగా పెద్ద సౌండు.. మా జోగ్: వీపు పై.. సర్రున చార్చిన శబ్దం. ఎవరబ్బా అనుకొని కిందికి తొంగి చూడగ కింద బెర్తులొ మా జోగ్: ని డబ్బుల కోసం ఆటు ఈటు కాని వాళ్ళూ..( ఆ వాళ్ళే..) పాటలు పాడి ఆ పాటల్తొ హింస పెడుతున్నారు.. ఇంకెముంది.. మా జోగ్: ఆ ఎఫెక్ట్స్ లను.. బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్న డబ్బులు సమర్పయామి…

నేను ప్రయాణించిన చెత్త ట్రైనుల లిస్టులొ గౌహతి ఆడ్ చేసుకోవడం జరిగింది.. ఇక మరొక గంటలొ బెజవాడ చేరుకోబోతున్నాం.. సమోసా.. సమోసా.. అని అరుస్తున్నవాడి నోరు కి ఐదు నిమిషాలు బ్రేక్ ఇచ్చి.. రెండు.. సమోసాలు లాగించేసాం.. పచ్చి ఆలుకి ఎండిన చపాతి తొడిగించినట్లుంది ఆ సమోసా టేస్టు.. “జబ్ తక్ బీహార్ మే లాలు రహెతా తబ్ తక్ సమోసా మె ఆలు రహెతా” మరొ సారి లాలు ని గుర్తు కి తెచ్చుకోవడం నా వంతైంది.. మా జోగ్: కి టీ తాగాలనిపించింది.. గ్లాసులు పట్టుకొని టీ.. చాయ్ .. అంటు.. మరొకడు రానే వచ్చాడు.. గ్లాస్ లు మాత్రం చాల స్టైలిష్ గా మన ఆఫిస్ లొ పాంట్రీ లొ చాయ్ కి వాడె గ్లాస్ లాగా.. ఆపై.. IRCTC సింబల్ తొ ఆకర్షణీయం గా ఉన్నాయి… గ్లాస్ లొ ఒక టీ సాచెట్ తగిలించి ఆ నీళ్ళా పాలు పోసాడు.. అలా పడుతున్నాడు.. ఇలా కింది నుండి కారిపోతుంది.. ఇంకో గ్లాస్ ఇరికించినా దాని నుండి కూడా కారిపోతుంది.. అలా వాడి దగ్గరున్న అన్ని గ్లాస్ లకు తూట్లు ఉన్నాయ్…. ఇక అక్కడున్న అందరం చెసేది ఏమి లేక రైల్వే వ్యవస్థ – లాలు పై ఒక డిబేట్ ఇవ్వడం జరిగింది.. ఇంతలో విజయవాడ వచ్చేసాం….

weekend-praksహోటల్ ఐలాపురం లొ దిగాం.. మాతొ హైదరాబాదు నుండి వచ్చిన మిత్రబౄందం చేరింది… ఇంకేముంది.. రాత్రి 7 గంటలకు రెసెప్షన్ ఉండటం తొ … అలా అలా షికారు కెళ్దాం అని.. ముందుగా.. కనకదుర్గమ్మ దేవాలయం దర్శించి అక్కడినుండి.. ఫొటొ సెషన్ లొ బాగంగా ప్రకాశం బారేజ్. క్రిష్ణమ్మ అందాలు.. చిన్ని పరవళ్ళు… చుట్టుపక్కలా గాలించి.. చివరికి ఆ ఫంక్షన్ హాలు ..అమ్మా హాలు కి చేరుకున్నాం.. రెసెప్షన్ కార్యక్రమం వైవిద్యం గా జరిగింది.. నేను అలా చూడటం నాకు కొత్త మరి… ఒక వ్యాఖ్యాత తన దైన శైలి లొ ముందుగ వధూ వరులని లని స్టేజ్ పైకి పిలవడం.. వచ్చిన అతిధులతొ చప్పట్లు కొట్టించడం.. ఇరువురి కుటుంబాలని వేదిక పైకి పిలవడం.. ఒక బిజినెస్ మీటింగ్ లా కార్యక్రమం అద్యంతం వరకు కామెంట్ కొనసాగుతూ ఉంది… వరుడు.. చిరంజీవి.. ప్రసన్న కుమార్ ప్రముఖ బహుళ జాతి సంస్థలొ మూడెళ్ళుగ ఉద్యోగం చేస్తున్నాడు అని.. .అలా… అలా చివరి వరకు కామెంట్ తొ కార్యాక్రమం కొనసాగింది… మేము.. కొన్ని స్టెప్పు లేసి… బోజనం లాగించి తిరిగి బెజవాడ రైల్వే స్టేషన్ కి చేరాం.. 11 గంటలకి శేషాద్రి ఎక్స్ ప్రెస్…

శేషాద్రి ఎక్స్ ప్రెస్.. నాకెందుకొ ఈ ట్రైను పర్వాలేదు అని అనిపించింది..పడుకొని లేచి మాకు తెల్లరే సరికి ట్రైను..మళ్ళీ.. మర్నాడు.. అదే ఈరోజు .. ఆదివారం మధ్యాహ్నాం… బెంగళూరికి చేరింది.. ఇంకేముంది.. ముప్పై ఐదు గంటల్లొ ఇరవై ఇదు గంటలు జర్నీ చేసినా చాల రోజుల తర్వాత జనాల్ని కలిసామన్న సంతోషం నాకు కలిగింది.. చాల గాప్ తర్వాత ఒక చిన్న ఔటింగ్ లాగా అనిపించింది.. ఇంతకి మీరేమి చెసారు? .. వీలైతే నాలుగు జాబులు కుదిరితే ఒక కామెంటు.. ఇక్కడ రాసేయండి మరి..!

ప్రకటనలు

4 Responses to ఈ వీకెండు విహార సమయం – ఓ మిత్రుడి వివాహానికై బెజవాడ పయనం!

 1. మేధ అంటున్నారు:

  వరుడు ప్రసన్నకుమార్ ??
  వధువు – అజిత నా..?!

  I mean మా స్నేహితురాలి పెళ్ళి కూడా మొన్న శనివారమే(విజయవాడ లో) జరిగింది.. కొన్ని పనులవల్ల పెళ్ళికి రాలేకపోయాను.. ఆ పెళ్ళికుమారుడు పేరు కూడా, ప్రసన్న కుమారే! అదీ కాక, మీరు కామెంటరీ జరిగింది పెళ్ళిలో అన్నారు కదా.. అందుకే డౌట్ వచ్చింది..
  మా స్నేహితురాలి ఇంట్లో అన్ని పెళ్ళిళ్ళూ అలానే జరుగుతాయి…
  ఇంతకీ మీరు వెళ్ళిన పెళ్ళి మా స్నేహితురాలిదేనా..?!

 2. nelabaludu అంటున్నారు:

  మేధ గారు..

  పెళ్ళి కూతురి పేరు అజిత ..అక్షరాల అదేనండి..!! it was nice trip for me…!!!

 3. మేధ అంటున్నారు:

  నేను ఇందాకే మా స్నేహితురాలితో మాట్లాడాను… మీరే అని కన్ఫర్మ్ చేసింది.. :)

 4. nelabaludu అంటున్నారు:

  ohh.. great.. thats cool :-)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: