ఆహా.. ఏమి రుచి – తినవోయ్ ఒళ్ళు మరచి…

ఈ వీకెండు మూడు రోజులవడంతొ.. నేను, వంశీ ఆండ్ సుమన్ (నాతో పాటు చదివిన mca  క్లాస్ మేట్స్) ఎప్పటినుండొ పోస్ట్-పోన్ చేసుకుంటూ వస్తున్న కేరళ ట్రిప్ కి ప్రి -ప్లాన్ చేసాం…

మాతో పాటు చదువుకున్న గ్యాంగ్ లొ ఉండె సునిల్ ఇప్పుడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గ తన సేవలను కేరళ రాష్ట్రానికి అందిస్తున్నాడు.. తను ఎప్పటినుండో ఇన్వైటు (మేము కేరళ రాలేమనుకొని ఫార్మాలిటీస్ కోసం అలా…)చేస్తుండటం తొ ఈ సారి ఎలాగైన వెళ్ళాలి అని డిసైడ్ చేసాం…

ఇంతలొ వంశీ ఎప్పటి లాగె ఎక్కడికి ఏం ప్లాన్ చేసినా నేను రెడీ నాకు జ్వరం వస్తది ఆఫిస్ (వీకెండ్స్ లొ కూడ ఆఫిస్ దర్శనం చేస్తుంటాడు) కి సెలవ్ పెట్టేసి మీతో వచ్చేస్తా అని సత్య పలుకులు చెప్తూ తీరా ఆ టైం వచ్చేసరికి ఉన్న కొంచెం పని మీద లేని శ్రద్ద చూపుతూ ఉంటాడు. ఈ సారి వాడి హాండ్ తొ పాటు బోనస్ గా లెగ్ కూడ ఇచ్చేసాడు..

ఇంకేముంది.. కేరళ ట్రిప్ క్యాన్సిల్..  సునిల్ ఖాతాలొ మరొకసారి హ్యాపినెస్…

ఇక ఈరోజు ఏమి చెయ్యాలొ తోచక పసందైన వంటకం తయారు చేద్దామని నిర్ణయించుకున్నాను…

నా ఆరు మాసాలా వంటశాల అనుభవాన్ని  గట్టిగా ఉడకబెట్టి కమ కమ్మటి ఘాటు మసాలా తగిలించి మెత్తగ గార్నిష్ చేసి చక్కగా మీకు వడ్డిస్తాను..

నేనందిస్తున్న కిటుకులు, చిట్కాలు, సూచనలు, సలహాలు పొరపాటున కూడ మర్చిపోకండి..

మీరు ముందుగా చేయకూడని పనులు, చేయవల్సిన పనులు, తీసుకోవల్సిన అజాగ్రత్తలు, అతి జాగ్రత్తలు నేను విపులంగా చెప్పదల్చుకుంటున్నాను..

మీరు తూ.చా. తప్పకుండ పాటిస్తె మీరు గొప్ప చెఫ్ గా మారె ప్రమాదం ఉంది…

మీరు శాఖహారులా లేక మాంసాహారులా? ఏ హారులైతేనేం వెజ్ కర్రీ మాత్రం తింటారు కదా!  సొ మీకు నేను ఈరోజు  మీకిష్టమైన కూర టమాటా వేపుడు ఎలా వండాలొ వివరిస్తాను.. (హం.. నాకిష్టమని అనుకుంటున్నారు కదూ!)

ముందుగ వంటగది అదే కిచెన్ రూంకి వెళ్ళడానికి మినిమం అర్హతలు ..

* రెండు జతల కిచెన్ సూట్ కుట్టించుకోండి – ఒక జత వెజ్ కర్రీస్ చేసేటప్పుడు ధరించడానికి మరొకటి నాన్ వెజ్ కర్రీస్ వండెటప్పుడు వేసుకోవడానికి.

* ఉన్న A టు Z ఛానెల్స్ ఏదైన ఒక ఛానెల్  వారికి మీరు సింపుల్ గా ఒక కర్రీ చేస్తున్నామని ఒక కాల్ కాని ఎస్.ఎం.ఎస్ గాని చేయండి చాలు.. వాళ్ళూ వారి ఎక్విప్-మెంట్  తొ సహా మీ ఇంటికి రెడీ అవుతారు క్షణాల్లొ.. ఈ మద్యనే మొదలైన కొత్త  ఛానెల్స్ కి చేస్తే ఫలితం బ్రహ్మాండంగా ఉంటుంది.

* మీ ఊర్ళొ ఉన్న R.M.P డాక్టర్ ని  మీ ఇంటికి దగ్గర్లొ ఉండేటట్లుగ లేదా వీలైతె మీ ఇంటికి ఆహ్వానించండి..

ఆ తర్వాత.. వండటానికి కావల్సిన  తగిన పదార్దాలు రడీ చేసుకోండి..

రెండు ఉల్లి పాయలు అర డజను  టమాటాలు ఒక పచ్చి మిరప కాయ ఒక టీ చెంచాడు అల్లం పేస్టూ.. తగినంత ఉప్పు, నూనె, ఎండు మిరప కారం మొదలగునవి, పోప్ కి కావలిసినవి మరియు మసాల పౌడర్ తయారు చేసుకొని రెడీ గా ఉండాలి..

పాటించాల్సిన నియమాలు  మరియు  తయారు చేసే విదానం:

ముందుగా మీరు కుట్టించుకున్న వెజ్ సూట్ వేసుకొని వంటగదిలోకి ప్రవేశించండి..

మిగతాదంత ఛానెల్ వాళ్ళు వారికి నచ్చిన రీతిలొ మిమ్మల్ని వండిస్తారు లేదా వండెలా చేస్తారు..

అయినా మీరు కొన్ని గుర్తుంచుకోండి.. ఆ తర్వాత స్టవ్, లైటర్ ని వెతకండి, అవి దొరికినా తర్వాత స్టవ్ ని లైటర్ సహాయం తొ వెలిగించండి.

ముందుగా ఉల్లిపాయలు కావల్సినంతగా  పోప్ ఐటంస్ తొ నూనె లొ తాలించి అటు పై మిగిలిన ఐటంస్ ని, టమాటా లను గుమ్మరించండి, గుమ్మరించిన తర్వాత ఒక మూత తొ బోర్లించండి .. ఒక 10 నిమిషాలు కిచెన్ గది నుండి బయటకు వచ్చి విశ్రాంతి తీసుకొని అటు పిమ్మట మళ్ళి లోపలికి వెళ్ళండి.. మూత తీసి చూడండి..గరిట తొ అటూ-ఇటూ కొద్దిగ కలపండి..

అంతే… ఇక టమాటా వేపుడు రెడీ.. సొ సింపుల్ గా ఉంది కదు….!

మీకు లభించే ఆదరణ:

ఇక మా జోగ్:రాజ్ లంచ్ కి నేను పిలవకుండానే రావడం జరిగింది.

మన వాడు టమాటా వేపుడు కర్రీ తొ ఒళ్ళు మరిచేలా తిన్న తర్వాత నన్ను ఒకటి  అర్జెంటు గా తీసుకురమ్మనడం జరిగింది….

ఏమిటొ చెప్పండి? ఊ హు.  పాన్ కాదు….

చాకు తెమ్మన్నాడు.. సరె అడిగాడు కదా ఏం చేస్తాడొ చూద్దాం అని వంట రూం లొ కూరగాయలను కట్ చేసె చాకు అదేనండి కత్తి ఇచ్చాను..

తనకి వాడు బదులుగ నేను పొడుచుకొని చస్తాను…. నన్నెవరు ఆపకండి అని బిగ్గరగ అరుస్తున్నాడు..

వీడు అన్నంత పని చేసేలా ఉన్నాడు .. అని చేసెలోపూ కత్తి లాక్కొని ఎందుకిలా చేస్తున్నావ్ అని అడగటం తొ.. నా జీవితం లొ  ఇంత రుచికరమైన తిండి తినలేదు..  నా బతుకు ధన్యం అయింది..  ఇక ఇది తిన్న తర్వాత నేను బతుకుతే  నేను తిన్నదానికి ఆపై బతికినా దానికి కూడ విలువ ఉండదు…తర్వాత బతికినా ఏం ప్రయొజనం? దయ చేసి నన్నాపకండి.. అని కంటిన్యూ చేస్తూ ఉన్నాడు..

సీన్ కట్ చేస్తె తర్వాత సీన్ లొ మా జోగ్: తొ  RMP డాక్టర్ పక్కనే ఉండటం జరిగింది..

సొ మై డియర్ ఫ్రెండ్స్.. టమాటా వేపుడు రుచి చూసినట్లున్నారు కదూ!

ప్రకటనలు

3 Responses to ఆహా.. ఏమి రుచి – తినవోయ్ ఒళ్ళు మరచి…

 1. ravi అంటున్నారు:

  plzzzzzzzzzzz shankar,oka sari vamshi gaaaaaadu vachinappudu
  cheyyavaaaa
  aaaaaa kooooooora

 2. ravi అంటున్నారు:

  nuvvu kooda appudappudu thinu…

 3. nelabaludu అంటున్నారు:

  @ RAVI
  వంశీ గాడికి పక్క తినిపిస్తా.. అవసరమైతె పార్సెల్ అయిన పంపిస్తా..

  వండింది నేను కాబట్టి తప్పక తింటాను :-)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: