ఈ ఏప్రియల్ మాసం – నాకొక మరవలేని మధుమాసం !!!

ఈ జీవితం చాలా చిన్నది.. ఒడుదుడుకులతొ సాగిపోతున్న ఈ జీవన ప్రయాణంలొ నెలబాలుడి ని కలవక దాదాపుగ రెండు వారాలు దాటింది.గత కొన్ని రోజులనుండి గజి బిజి షెడ్యుల్స్ తొ సతమవుతుండటం వల్ల కొన్ని నిత్య కార్యక్రమాలకు హాజరు కాలేకపోయాను. ఎలక్షన్స్ లొ బాగంగా ఈ రోజు బెంగళూర్ లొ హాలిడె కనుక ప్రశాంతంగ ఉదయం 8 గంటల వరకు నిద్ర దేవత కు బాకీగా ఇవ్వాల్సిన నిద్ర మొత్తాన్ని సమర్పించుకుంటుండగా టక్.. టక్.. అను శబ్దం… ఎవరొ తలుపును బాదుతున్నారు. లేచి తలుపు తెరిచేసరికి నెలబాలుడు నాతొ ఇంటర్వ్యుకి సిద్దంగా ఉన్నాడు.. నేను మిమ్మల్ని పిలవలేదు గా అని అంటుండగానె ఇప్పటికి రెండు వారాల నుండి పోస్ట్ పోన్ చేస్తున్నావ్… కమాన్.. ఈ రోజు నానుండి తప్పించుకోలెవు గా అని ఎదురు ప్రశ్నలు సంధిస్తూ రూం లొ సెటిల్ అయిపోయాడు.. వీన్ని ఎలాగైన త్వరగా పంపించెయ్యాలి అనుకొని తనతొ సంబాషణలొ మునిగిపోయాను ఇలా…

ఎందుకొ ఈ నెలలొ కొన్ని నాకు ఎప్పటికి గుర్తుండిపొయే మధురమైన అనుభూతుల్ని, అనుభవాల్ని భద్రపరుచుకున్నాను, సుమారుగా 5000 మైళ్ళూ ప్రయాణించాననుకుంటా….

april


కొలీగ్ పెళ్ళికి హాజరు.— విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం — దర్శనం..
ఇంతకు ముందు టపా లొ ఈ ట్రిప్ గూర్చి వివరించడం జరిగింది.. మొదటిసారిగ కనకదుర్గ ఆలయాన్ని దర్శించాను… It was fantastic Experience ..

డిగ్రీ దోస్త్ వివాహం – తిరుపతి టూర్ & వేలూరు దర్శనం
నాకు ఊహ అనేది తెలియనప్పుడు.. నాకు 11 నెలలు వయసున్నప్పుడు తిరుపతి కి వెళ్ళానట.. ఇంతవరకు వెళ్ళే భాగ్యం దక్కలేదు… ఎప్పడినుండో వెళ్ళాలనుకుంటున్నా వీలు కాలేదు… (వీలు కల్పించుకోలెదు). సొ.. మా mca ఫ్రెండ్స్ తొ ప్లాన్ చేసాను.. అక్కడే పెళ్ళి జరుపుకుంటున్న నా డిగ్రీ మిత్రుడి ని కలిసి.. వెంకన్న స్వామి ని దర్శనం చేసుకున్నాం.. మొత్తానికి 26 ఏళ్ళు వచ్చేసరికి ఒక సారైన వెళ్ళగలిగాను అనే సంతౄప్తి మిగిలింది. . అటునుండి వేలూర్ కి.. గోల్డెన్ టెంపుల్.. లక్ష్మినారయణ దేవస్థానం. దర్శనం… ఉన్నది నలుగురే అయిన బాగా ఎంజాయ్ చేసాం… It was marvelous..

మొదటిసారిగ ఓటు హక్కుని వినియొగించుకున్నా..
గత ఎలక్షన్స్ టైం లొ ఓటర్ల జాబిత తారు మారైందని నా ఓటు ని సద్వినియొగ పరుచుకోలెకపోయాను.. ఈ సారి బెంగళూర్ నుండి హైద్రబాద్ కి ప్రత్యేకంగా వెళ్ళి మొదటిసారిగ ఓటు వేసాను.. ఎవరికి వేసాననేది ప్రస్తుతానికి అప్రస్తుతం.. It shows me I casted my vote wisely..

ఇవేకాక..

మా మిత్రుడు రవి ఇంట్లొ లంచ్ టైం – మనొడి కి పెళ్ళైంది… ఒక కూతురు… చాల రోజుల నుండి వెళ్ళాలి..కలవాలి… అనుకుంటూ ఈ సారి వెళ్ళాను..అలా తన ఇంట్లొ కుడి అడుగు లొ ఎడమ అడుగు పెట్టానేమొ మరొలా పవర్ వెక్కిరించింది నన్ను.. అయిన చెమటలు కక్కుతు.. ప్రతి క్షణం ఆస్వాదించాను…ఆనందించాను.. I had good time there with his family..

మా ఊరికి సుడిగాలి పర్యటన – వరి కోతల టైం కావడం తొ అమ్మా నాన్న సిటి లొ లేరు.. సొ మా ఊరికి ఈవెనింగ్ మా గాలి శీను కార్ లొ మా అల్లుడ్స్ తొ సుడిగాలి పర్యటన జరిగింది.. కాసెపు పొలం ముచ్చట్లు విని డిన్నర్ కానిచ్చి.. బాక్ టు హైద్రాబాద్ … Though its short I had Nice time with my parents.

కొలిక్కి వచ్చిన మా సోదరుడి ఇష్యూ – తెలియకుండా వేలు పేడితె కాలదేమో అనుకొని గత కొంతకాలం గా మా వాడు చిక్కుకున్న ఇష్యు కాస్త కొలిక్కి వచ్చింది.. Hope this issue will be closed asap.

ఆకాశమంత.. సినిమా చూసానోచ్ – మండుటెండలకు తట్టుకోలెక ఏదొ ఒక సినిమా కి వెళ్ళాలని దిల్-సుఖ్-నగర్ లొ మా శీను రూం కి వెళ్ళాను…పైగా సంక్రాంతి నుండి ఒక్క సినిమానైన చూడలేదు ఎండలు.. వేడి .. చెమట.. అటుపై బుర్ర టెన్షన్స్ తొ ఉంది కదా అని.. కాస్త ఎమొషనల్ మూవి చూడాలని.. దగ్గర్లొ ఉన్న రాజధాని థియేటర్ లొ విజయవంతగ ప్రదర్శిస్తున్న ఆకాశమంత సినిమా కి వెళ్ళాం.. ప్రకాష్ రాజ్ పెర్ఫార్మన్స్ ఎప్పటిలాగె అదుర్స్! సెంటిమెంట్ + కామెడి + ఎమోషనల్ వాల్యుస్… నైస్ మూవి… ఒక సారి చూడొచ్చు…

క్లైమాక్స్ లొ మీటింగ్ విత్ బాలు – బెంగళూర్ కి తిరిగి బయలుదేరె ముందు.. చాలా చాలా రోజుల తర్వాతా నేను, శీను మా mca క్లాస్ మేట్ కం నా కోలిగ్ అయిన.. బాలు ని కలిసాం… కాస్త కాలక్షేపం… వర్క్ వర్క్ అంటూ జన జీవన స్రవంతి కి దూరంగ ఉన్న బాలు ని కలవడం.. ఆపై… రెండు మూడు గంటలు గడపటం.. హైలైట్ ..It was Fun and memorable !

ఓవరాల్ గా ఈ మూడు వారాలు ఓ క్షణం లా గడిచిపోయాయి… థాంక్స్ టు ఎవ్రీవన్!

వ్యాఖ్యానించండి