యేలేటి సరదా “ప్రయాణం” ఇక్కట్లు – కమ్మని ముచ్చట్లు

2009/05/30

prayanam

ప్రత్యేకంగా ఏదైనా కారణంతొ ఈ సినిమా చూడటానికి వెళ్ళావా?
కథని స్క్రీన్ మీద అందంగా చూపించే ఈ జెనెరేషన్ దర్శకుడి కోసం… అదే చంద్రశేఖర్ యేలేటి కోసం…వెళ్ళాను.

ఇంతకి కథ ఏంటొ?
సింపుల్ స్టొరీ…. మలేసియా ఏయిర్‌పోర్ట్ లో ప్రయాణమె జీవన పయనం అనుకునే సొట్టబుగ్గల హీరో ధ్రువ్(మంచు మనొజ్) ఒక అమ్మాయి(హారిక – హీరోయిన్)ని చూసి చూడగానే మనసు పారెసుకుంటాడు.. ప్రేమ సంద్రంలొ మునిగి తన ప్రేమను గెలిపించుకోవడానికి నానా పాట్లు పడుతుంటాడు.. (కథ అంతా మలేసియా ఏయిర్‌పోర్ట్ లో మూడు – నాలుగు పాత్రల చుట్టూ తిరుగుతూ ఉంటుంది..)

మరి కొత్తదనమేముంది ఇందులొ?
ఒక ఎయిర్‍ పోర్ట్ లో ఓ రెండు గంటల పాటు జరిగే ప్రేమకథను ఒక్క ఫైటు లేకుండా,ఏ క్రైమూ,సస్పెన్సూ లేకుండా సినిమాగా తీయటం అనేది అతిపెద్ద సాహసం.అయితే తన మీద తనకు నమ్మకమున్న దర్శకుడు చంద్రశేఖర్‍ యేలేటి చక్కని స్క్రీన్‍ప్లేతో ఈ కథను మరింత చక్కని కథనంతో నీట్‍గా ప్రెజేంట్‍ చేశాడు. అంతేకాక కథలో ఫ్రెష్‍ నెస్‍ ఉంది.కథనంలో కూడా కొత్తదనం ఉంది.ఈ చిత్రాన్ని తనే తీయటం దర్శకుడి ధైర్యానికీ,ఆత్మవిశ్వాసానికీ నిదర్శనం.

కామెడీ ఏమైన ఉందా..?
పుష్కలంగా ఉంది… వరైటి గా కూడా ఉంది.. హిరో తన మిత్రులతొ ఉన్న సన్నివేశాల్లొ మరియు, హీరొయిన్ స్నేహితురాలు జూడో… … హాస్య కిరీటం బ్రహ్మానందం నవ్వులు పండించారు.. కామెడి లొ కూడ కొత్తదనం చూపించారు.. సినిమా మొదలైనప్పడినుండి చివరివరకు నవ్వుకోవచ్చు.. నాకైతే నచ్చేసింది..

టెక్నికల్ ఎఫర్ట్స్ ఎలా ఉన్నాయ్..?
ఒక ఎయిర్‌పోర్ట్ ని రెండుగంటల పాటు బోర్ కొట్టకుండా చూపించటంలో సర్వేష్ మురారీ కెమెరా పనితనం చాలా బాగుంది.. అనంతశ్రీరామ్ సాహిత్యం ఒక మాదిరిగా ఉంది.. ఉన్న మూడు పాటల్లొ రెండు నిమిషాల్ నిడివి ఉన్న ఓ పాట అమ్రుత వర్షిని అనే ఏడు సంవత్సరాల పాప పాడింది.. చాల చక్కగా పాడింది.. వాయిస్ చాల స్వీట్ గా ఉంది.. కాన్సెప్ట్ బేస్డ్ కొరియోగ్రఫీని ఈ చిత్రంలో నోబుల్‍ చాలా చక్కగా కంపోజ్ ‍ చేశాడు..మహేష్ శంకర్ సంగీతం కథ కు తగ్గట్టుగా ఉంది.. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం, స్క్రీన్ ప్లే సినిమా కి పెద్ద అసెట్ .. ఎడిటింగ్ బాగుంది.

ప్రేమ ఫిలాసఫీలు, ఫీట్లు..?
ప్రేమ ని నిరూపించడానికి రెండు మూడు సంవత్సారాలు పడుతున్న ఈ తరానికి.. లవ్ ఎట్ ఫస్త్ సైట్ అనే ఫిలాసఫితో రెండు గంటలు పడె పాట్లు… హిరోయిన్ ని చివరికి ఇంప్రెస్ చేయటం.. కొత్తగా చూపించారు..

క్లైమాక్స్ ఎలా ఉంది…?
క్లైమాక్స్.. ఏడు ప్రశ్నలు – జవాబులు అదీ ఆబ్జెక్టివె పేపర్ అనే కాన్సెప్ట్ తొ కొత్తగ అనిపించింది..

ఐతే ఒకసారి థియేటర్ కి ప్రయాణించమంటారా…
విచిత్రంగా ఒక కొత్తరకం కథతో కొత్తగా ఉండే సినిమా చూడాలనుకుంటే ఈ సినిమా చూడండి. మరీ అంత గొప్పగా, అద్భుతంగా లేకపోయినా ఈ చిత్రం కచ్చితంగా కొత్తగా ఉంటుంది. కొత్తదనం కనిపిస్తుంది…! వినిపిస్తుంది…!

ప్రకటనలు

ఓటరు దేవుడి తీర్పు – దేవుడి పాలన వైపు

2009/05/18


ఆహా..!  ఓహొ..!   గత రెండు రోజులుగా ఎవరిని పలకరిచ్చినా ఓటరు దేవుడిచ్చిన  తీర్పుతో మైండ్ బ్లాక్ అయినట్లుగా… బ్రైయిన్ బెలూన్ లా ఉబ్బినట్లుగా… చెంప చెళ్ళుమనిపించినట్లు గా  ముప్పై జీర్ణ మాత్రలు వేసుకున్నా అజీర్ణంగ ఉన్నట్లు రెస్పాండ్ అవుతున్నారు…. ఎన్నికల ఫలితాలు ఎవరు ఊహించని విదంగా అశ్చర్యకరం గా రావడంతొ అనందబాధల్లొ తడిసి ముద్దవుతున్నారు..

ఓటరిచ్చిన ఫీట్లలో నేను పడుతున్న కొన్ని పాట్లే.. ఈ హై లైట్లు  – లో లైట్లు:

YS1

చంద్రన్న పాలనలొ లోటుపాట్లతో తెలుగు దేశం  పార్టి ని విమర్శిస్తూ… పాదయాత్రతొ జనాల్లోకి వచ్చి… 2004 లొ అధికార పీటమెక్కి.. అయిదు సంవత్సారలు పూర్థి చేసి మళ్ళి గద్దె నెక్కీన  రాజశేఖరుడు సామాన్యుడు కాదని ౠజువు చేసుకునేలా ఓటరన్న తీర్పిచ్చాడంటె ….

ఎప్పటికప్పుడు ప్లేట్ మార్చే టి. అర్. ఎస్ – టి. డి. పి తొ కలవడం మూలాన మహా కూటమి కి ఓటమి సరైనదనుకోవడం…

ప్రజా ఆకర్షణ పథకాలు క్లిక్ అవ్వడం… రాజివ్ ఆరోగ్య శ్రీ , ఇందిరమ్మ గౄహనిర్మాణ  పథకం,   పావల వడ్డికే మహిళలకు ౠణాలు.. 2 /- కిలొ బియ్యం.. మొదలగునవి…

చిరు ప్రజా రాజ్యం లొ పార్టి లోనికి కుప్పిగెంతులేసిన ప్రముఖనాయకులు పదవికోసం ఆశిస్తారె తప్ప పని చేయరెమో అని విముఖత చూపడం.. ఫలితం గా పాలకొల్లు లొ చిరుకి పరాభవం..

లోక్ సత్తా & ప్ర. రా. పా. వల్ల   ఓట్లు చీలడం కాంగ్రెస్ కి అనుకూలం కూటమి కి ప్రతికూలం..

ఇలా ఎన్నెన్నొ అంశాలు కాంగ్రెస్ కి అనుకూలించాయని చెప్పొచ్చు…

అన్నట్లు.. ఈ సారి అసెంబ్లి లొ ప్రతిపక్షం తరుపున  చిరు ని, జె.పి ని కూడా చూడబోతున్నాం.. లెట్స్ సీ హవ్ ఇట్ గోస్…!!!!


మే పదహారు – ఎవరు ఖరారు?

2009/05/14

ap-cm రాష్ట్ర రాజ్ కీయం – కౌన్ బనేగా ముఖ్యమంత్రి ?

నాకెందుకొ ఈ మధ్యన రాష్ట్ర రాజకీయం పై కాస్త పట్టొచ్చినట్లునపిస్తుంది.. కారణం మొదటి సారి ఓటు వేసినందుకొ లేక చిరంజీవి రాజకీయాంగ్రేటం చెసినందుకొ లేక లొక్ సత్తా పార్టీ మొదటగా బోణి చేస్తున్నందుకో గాని.. ఎక్కడ కెల్లిన ఇవే డిస్కషన్స్ నడుస్తున్నాయ్..  ఫ్రెండ్స్ తొ, కోలిగ్స్ తొ అనామకులతొ చిట్ చాట్ లొ, తెలియని వారితొ, తెలిసిన వారితొ, ఎవరు కలిసిన, మరెవరు కలవకపోయిన ఎవరు గెలుస్తారు అని తెగ ఇంట్రెస్టింగ్ గా మాట్లెడుసుకుంటున్నాం..

ఇండియా – పాకిస్తాన్ క్రికెట్  మ్యచ్ ఫైనల్ కి ఉన్నంత ఆసక్తి నెలకొంది.. ప్రజా తీర్పు వెలువడడానికి, కొత్త గవర్నమెంట్ ఏర్పరుచుకోవడానికి ఒకే రోజు మిగిలి ఉంది.. రేపే త్రిమూర్తుల జాతాకాలు తెలియబోతున్నాయ్..కేంద్రం లొ మరియు రాష్ట్రం లొ ఫలితాలు రేపటి మధ్యహ్నం లోపు తెలిసిపోతాయ్.. కేంద్రం ఫలితాలు అటుంచితె మన రాష్ట్ర ఫలితాలు ఎలా ఉంటాయొ మరి!

ఎవరికి వారు మేమంటె మేమే!  మాకిన్నొస్తాయ్..  గెలుపు తధ్యం అని లొట్టలేసుకుంటున్నారు..నాకున్న అవహగాన బట్టి ఆయా పార్టీ లకు సీట్లు ఈ విదంగా వస్తాయెమో అని అనుకుంటున్నాను.

మహాకూటమికి 100 -120
కాంగ్రెస్ కి 80 -100
ప్రజారాజ్యానికి 60 -80
మిగతావాటికి 30-60

అదేదొ సాంఖ్యక శాస్త్రం లొ పౌన:పున్యం పట్టిక కి కొలతలు సరిగాలేని తరగతి అంతరం తలక్రిందులయినట్లుంది కదూ!

కాంగ్రెస్ వెంటె ఆంధ్ర రాష్ట్రం అని చెప్పుకొస్తున్న దేవుడి పాలన కు మళ్ళీ పగ్గం కడుతారో… మాజిక్ ఫిగర్ 200 సీట్లు మావె అని నరకాసుర వధ తొ ఉన్న మనకు మే 16 న దీపావళి జరుపుకుందాం అంటూ తిరిగి అందలమెక్కాలనుకుంటున్న చంద్రబాబుకు సై అంటారొ,..   సేవే లక్ష్యం అని సంచలన మార్పు తొ శ్రీకారం చుట్టాలనుకుంటున్న సెన్సేషనల్ స్టార్ చిరంజీవి కి స్వాగతం పలుకుతారొ… తెలుసుకోవడానికి కుతూహలం గ ఉంది.. మీకెలా ఉంది? ఏ రాయ్ ఐతె ఏంటి తగలిచ్చుకోవడానికి అని అనుకుంటున్నారా..

మీ  కీలక సేవలు మరోసారి అవసరం:

submahan

అసలె ఏది జరిగిన హడావిడి గా ఉండె రాష్ట్రం లొ ఈ సారి ఎన్నికలు సాఫిగా… సరిగా జరిగాయంటె ముఖ్యంగా ఈ ఇద్దరె కారణం అని చెప్పొచ్చు.. ఒకరు సి.ఇ.ఒ. సుబ్బారావు గారు మరొకరు డి. జి. పి. మహంతి గారు. ఎన్నికలు

సజావుగ కండక్ట్ చేసి శభాష్ అనిపించుకున్న సుబ్బరావ్ ఫలితాలు ప్రకటించడానికి అన్ని ఏర్పాట్లు పకడ్భందిగా చేసుకున్నట్లు పక్కా గా చెబుతున్నారు… నాకు తెలిసి ఇది కూడ విజయవంతగ పూర్తి చేస్తారని నమ్మకం..

ఇక మరో హీరొ మహంతి గారు.. ఎన్నికల సమయంలొ ఆలస్యంగ రంగంలొకి దిగినా ఆక్రమాలకు అడ్డు కట్టి తనంటె ఏమిటొ చేసి చూపించారు.. వీరిద్దరికి సమన్వయం, సహకారం సరిగ్గా కుదరడం వల్ల పోలింగ్ సరిగా జరిగిందని చెప్పొచ్చు..  మళ్ళీ ఈ కాంబినెషన్ ఎన్నికల ఫలితాలు ప్రకటించడానికి తగిన ఏర్పాట్లు, చర్యలు తీసుకొని విజయవంతం చెయడానికి కౄషి చేస్తున్నారు.. వెల్ డూయింగ్…లెట్స్ అప్రిషియేట్ దెం….!

చెప్పేవాడికి వినేవాడు లోకువ అన్నట్లు…   ఓడిన వారు ప్రజా తీర్పు ని శిరసావహిస్తాం అనో..  గెలిచిన వారు ప్రజల మా పై ఉంచిన విశ్వాసానికి  కట్టుబడి ఉంటాం అనో మార్కులు వేసుకుంటుంటారు..

మే పదహారు.. శని వారం .. శని ఎవరికి తగులునో…   మరి ఇంతవరకి  పట్టినావరిని శని వదిలిపోవునో…. ఎవరొచ్చినా.. మన రాష్ట్రానికి పట్టిన శని అలాగే ఉండునొ… వేచి చూద్దాం మరీ.. అంత కంటే ఏమి చేయగలం..!!!

—————————————————————————————


కిక్ ఎక్కువైనట్లుంది..!!!

2009/05/10

నా మిత్రుడు సుమన్ ఇచ్చిన కిక్ తో కిక్ సినిమా గూర్చి కిక్కుల పై కిక్కులతొ రాస్తున్నాను..! చదవండి మీకు ఒక కిక్ ఉంటుంది..

గమనిక : నేను రాస్తె  కిక్ ఉండాలని కిక్ స్టొరి ని పెద్దగా రివీల్ చేయట్లెదు… సొ మీకు కూడా కిక్ ఉండాలి కదా మరి.. కిక్ ఉండాలంటె తెరపై చూడాల్సిందేనండోయ్..

Kick-Movie-Walls-0

మొన్నటి కిక్: మా మరో మిత్రుడు వంశీ ఈ వీకెండ్ హైద్రాబాదు వెళ్ళాడు.. అక్కడ ఇంకొక మిత్రుడి తొ కిక్ సినిమా కెళ్ళాడట.. చూసాక కిక్ ఉండాలని మాకు ఫోన్ చేసి కిక్ సినిమా చూడండి అని చెప్పడం జరిగింది.. అసలే అధినేత చూసి సినిమాలు ఒక నెల వరకు చూడొద్దనకున్న మాకు ఒక కిక్ ఉండాలని కిక్ సినిమా కెళ్దాం అని నిర్ణయించుకున్నాం..

నిన్నటి కిక్: నిన్న అర్దరాత్రి జి-టాక్ లొ ఉండగా సోమేశ్వర్ (కలవక రెండు సంవత్సరాలైంది)  అనే మిత్రుడు పింగింగ్స్… హెలొ మామా రేపు కలుద్దామా….! కలుద్దాం మామా ..చాల రోజులైంది కదా… కలుస్తె కిక్ ఉండాలని అనడం తొ.. కిక్ సినిమా కెళ్దాం అని అనుకొని… ఇద్దరమె వెళ్తె కిక్ ఉండదని నాతొ సుమన్ తనతొ తన మిత్రుడు…. వెరసి నలుగురికి నాలుగు టికెట్లు జయనగర్ ఐనాక్స్ లొ కిక్ సినిమాకి ఈ రోజుకి (ఆదివారం – సాయంత్రం 4 గం. షో) టికెట్స్ బుక్ చేసేసాడు..

నేటి కిక్: ప్లాన్ లొ కిక్ ఉండాలని నేను/సుమన్ – సోమేశ్వర్/తన మిత్రుడు 4 గం. కి ఐనాక్స్ లొ కలుద్దామనుకొన్నాం. నేను ఈ ఉదయాన్నే సుమన్ కి ఫోన్ చేసేసి అన్నాయ్ లంచ్ కొచ్చేయ్. అటు పై కిక్ సినిమా కెళ్దాం అని చెప్పేసాను.. మా వాడు కిక్ ఉండాలని కాస్త లేట్ గా వచ్చేసాడు.. కిక్ ఉండాలని భోజనం సగం మాత్రమె  తినేసి.. ఆటొ పట్టుకొని సరిగ్గా నాలుగు గం. కి ఐనాక్స్ కి చేరుకున్నాం… థియటర్ లొ కిక్ సినిమా స్టార్ట్ అవ్వక ముందే కిక్ ఉండాలని కొంతమంది అక్కడ కలిసినవారిని పలకరించాను.

ఇక కిక్ లోకి వెళ్దాం …..

మనకోసం మనం బ్రతుకుతె అది సాదారణ జీవితం…. అదే ఎదుటివారికోసం మనం బ్రతుకుతే ఉంటుంది చూడండి కిక్ …. అనే మోరల్ కనిపిస్తుంది…. సొ … ఒక తప్పును కప్పి పుచ్చడానికి మరొక తప్పు చేసినట్లు ..ఆ కిక్ కోసం ఎన్నో కిక్ లు చూస్తాం ఈ కిక్ సినిమాలొ మనం…

గజిని లొ షార్ట్ టర్మ్ మెమోరి లాస్.. అర్జున్ జెంటిల్ మెన్.. ధూం లొ దొంగతనాలు.. ప్రేమ…. హాలివుడ్ సినిమాల గ్రాఫిక్ లాంటి ఫైట్లు… కిక్ తొ  ఈ సినిమా చూస్తుంటె అవి గుర్తొచ్చాయ్…

సినిమా మొదటి సీన్ —  ఇలియాన అందాల ఆరబోతలతొ ఆరంభమవుతుంది.. యోగా చేస్తూ.. చూసెవారికి కిక్ ఇస్తూ (లావెక్కింది..) చివరి సీన్ శుభం కార్డ్ పడేటప్పుడు కూడా – మొదటి సీన్ రీపీట్ చేయబడుతుంది…  ఇక్కడ దర్శకుడు ఇలియానా ని  మర్చిపోకండి (మనకి కాదు.. నిర్మాతలకి – అసలు ఈ ముద్దు గుమ్మకి అవకశాలు అంతంత మాత్రం ఉన్నాయ్ కదా) అని కిక్ ఇచ్చినట్లనిపించింది నాకు..

కిక్ లొనాకు బాగా నచ్చినవి/నచ్చనివి..

కామెడి సీన్స్ బాగున్నాయ్

బ్రహ్మానందం.. హల్వరాజ్ పాత్ర. / ప్రకాష్ రాజ్ పాత్ర / పరుగు రాజ్ పాత్ర -ముఖ్యంగా బ్రహ్మానందం…. వాళ్ళ అబ్బాయ్.. కమ్యునికేషన్….. ఫెంటాస్టిక్ థాట్.. గ్రేట్ జాబ్..

రవితేజ క్యారెక్టరైజేషన్ –  కొంచెం కొత్త దనం.

టైమింగ్ కరెక్ట్ కాకపోయిన…. హాస్పిటల్ లొ బేబి నేహ – రవితేజ సీన్ .. ఎమోషనల్… బాగా పండిచారు..

ఇలియానా – కాట్ వాక్… గ్లామరస్.. బట్ సింపుల్ పెర్ఫామెన్స్.. అఫ్ కొర్స్ అది చాలు..

సంగీతం:ఎస్.ఎస్.తమన్ –   పర్వాలేదు.. బాగుంది.. ( మొదటి అటెంప్ట్ అని అనుకుంటున్నా.!)- బాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకా బాగా రావాల్సింది..కిక్ ఇచ్చారు

రసూల్  –  కెమెరా  పనితనం బాగుంది..కొన్ని పాటలు… టెకింగ్ ఈజ్ టూ నైస్..

తమిల్ ఆర్టిస్ట్ శ్యాం… నటన పర్ఫెక్ట్.. క్యారక్టర్ తగ్గట్లుగా ఉంది..

హీరొకి ఎటువంటి సమస్యా ఉండదు… కిక్...  అంటూ…. స్క్రీన్ ప్లే హీరొ కి ఫేవర్ గా ఉన్నట్లుంటుంది…. బట్.. “అతిధి” కన్నా… సురేందర్ రెడ్డి గారు… బాగా చేశారు..

ఫస్ట్ ఆఫ్ సాఫి గా కామేడి గా సాగిపొతుంది… ఆ కిక్ తొ  సెకండ్ ఆఫ్ బోర్ అనిపించింది..ఫస్ట్ ఆఫ్ స్టోరి నే లేదెమో అనిపించింది.. సెకండ్ ఆఫ్ చాలా స్టోరిలు ఒకే కిక్ లొ ఉన్నాయనడం మరొ కిక్

ఒక సారి వర్త్ వాచ్ అని నా అభిప్రాయం..నా అభిప్రాయం కిక్ అని మీకనిపించిందా.. లేదా..?  కిక్ కావలంటె కిక్ చూడకండి.. కిక్ ఎక్కువ కావాలంటె… కిక్ చూడండి…


అమ్మంటె మెరిసే మేఘం ….

2009/05/10

moth
ఈ రోజు మదర్స్ డే సందర్భంగ ప్రత్యేకంగా అమ్మ గురించి ఒక టపా వ్రాయాలని తపించి యోచించక ఆలస్యం చేయకుండా ఇక్కడ రాసెస్తున్నాను..

దేవుడి సౄష్టించిన ఒక గొప్ప వరం అమ్మ.. అమ్మ గురించి ఎంత చెప్పిన తక్కువే..!

మహా కవి శ్రీనాధుడు అమ్మ గొప్పతనాన్ని వివరిస్తూ “హర విలాసం” అనే కావ్యం రాసేసాడు..

“అమ్మంటె మెరిసే మేఘం… కురిసే వానా…” అని చిత్ర-బాలు తన గొంతుతో ఆలాపించారు..

” పెదవె పలికిన మాటల్లోనె తీయని మాటే అమ్మ.. కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ..” అని చంద్రబోస్ గారు తన సాహిత్యాన్ని చాటారు..

అమ్మ సెంటిమెంటు, అమ్మతొ అనుబంధం ఉండె సినిమాలు “అమ్మ, అమ్మ చెప్పింది, మాతౄదేవోభవ, చత్రపతి, యోగి ….” ఇలా ఎన్నెన్నొ సినిమాలు వచ్చాయ్..

అమ్మకు ఎవరు తీసిపోరు… అమ్మంటే ఓ అందమైన అపురూపం.. చెరగని బంధం.. వర్ణించలేని అనురాగం..మాటల్లొ చెప్పలేని ఆత్మీయం..

మనకేమాత్రం అలసట అనిపించినా వెనువెంటనే అమ్మా.. అని ఆటోమాటిక్ గా మన నోటి నుండి మనకు తెలియకుండానే ఉచ్చరించేస్తాం. ప్రతి రోజు ఏదో ఒక సందర్భం లొ గుర్తుకుతెచ్చుకుంటాను.. ఎందుకంటె అమ్మతొ పెనవేసుకున్న బంధం అలాంటిది మరి..అమ్మతొ అనుబంధం లేని జీవితం ఊహించుకోలేను…

నేను ఈ సౄష్టి మీద కొచ్చి ఇరవై ఆరు సంవత్సరాలై ఉంటుంది.. పాతికేళ్ళ తర్వాత ఉద్యోగ నిమిత్తం కుటుంబానికి దూరం గా ఉంటున్నాను.. కేవలం సంవత్సరం వ్యవధి అయినా ముఖ్యంగా అమ్మని చాల మిస్ అవుతున్నాను.. ఏదైనా అమ్మతొ షేర్ చేసుకునేవాడిని.. ఆ పాతికేళ్ళూ అమ్మతొ ప్రత్యక్షంగా ఉన్న అనుబంధం, ఆ అనురాగం చెప్పాలంటె తెరలు తెరలుగా కల్లెదుట కమ్ముకొస్తుంది..

మా అమ్మా-నాన్న పిల్లలకి బెటెర్ ఎడ్యుకెషన్ ఇవ్వాలని హైదరాబాదు పట్నం బయలుదేరిర్రట.. నాకు పలక బలపం ఇప్పించి అక్షరాబ్యాసానికై మొదటగ సరస్వతి శిశు మందిర్ లొ మా అన్నయ తొ పాటు పంపించారు.. మొదటిరోజు కదా.. ఇప్పటికి గుర్తుంది.. బోండాం లాంటీ శ్రీదేవి టీచరు (సూర్యకాంతం లా ఉంటుంది – మాటల్లొ – చేతల్లొ) నేను నాన్ స్టాప్ గా ఏడుస్తున్నాని చెప్పి ఒక రూం లొ బందించేసింది…. ఇక నా ఏడుపు ఉన్నదానికి ముప్పై రెట్లు పెరిగింది… ఇంట్లొ మొదటి రోజు విద్యాబ్యాసం ఎలా జరిగింటుందని మా కోసం ఎదురుచూస్తున్నారు. అన్నయ్య జరిగినదానికి పది రెట్లు ఎక్కువ మా అమ్మకి చెప్పేసాడు.. ఇంకేముంది అమ్మ ఆ శ్రీదేవి టిచర్ ని సంస్కౄతం లొ తిట్టేసి మరసటి రోజు మా అక్కయ్యని స్కూల్ కెల్లి టిచర్ సంగతి చూడమనటం.. మా అక్కయ్య ఆ టిచర్ ని సాటి టీచర్ లు పిల్లల సాక్షిగా ఉన్న కోపాన్ని కక్కేసింది… ఆ కోప తాపాన్ని ఒంటికి పూర్తిగ పట్టించుకున్న మా బోండాం టీచరు ఇక పిల్లలు కావాలని ఏడ్చిన గౄహ నిర్బంధ శిక్ష విధించేది కాదు…. ఇప్పటికి ఏ స్కూల్ పిల్లాడు ఏడ్చిన ఆ సీన్ గుర్తొస్తుంది.

ఇక మా అన్నయ ఏ ప్రయోగాలు చేసిన ఫలితం కోసం నా పై ప్రయోగిస్తుండే వాడు… ఒక రోజు నాతొ అర్రె.. నాకు సైకిల్ తొక్కడం వచ్చేసింది.. “కాంచి” నేర్చుకున్నాను.. (“కాంచి” అంటె సైకిల్ డ్రైవింగ్ లొ మొదటిది.. ఆ తరవాత “దండు” ఆ పై “సీటు” అనే ఫేజ్ లున్నాయి) అదీ కాక ఎవరినైన వెనుక కూర్చోపెట్టుకొని అమాంతం నడపగలను… నాకు సైకిల్ రాదు కాబట్టి కనీసం వెనుక ఎక్కుదామని ఆత్రుతగా ఎక్కేసాను.. మనోడు కొద్ది దూరం చక్కగా తీసుకెల్లి .. చక్కగా తీసుకెళ్తున్నానె ఆనందం లొ బాలెన్స్ తప్పి డాంబార్ రోడ్ పై బోర్లపడేసాడు… నా ఎడమ కాలు క్రింది బాగం వెనక చక్రం లొ నుజ్జు నుజ్జు అయింది.. మోకాల్లు మోచెక్కలయ్యాయ్ .. విషయం తెల్సి ఆ టైం లొ ఊర్లో ఉన్న అమ్మ నెక్స్ట్ బస్ కి ఈవినింగ్ కల్లా ఇంటికి చేరుకుంది.. మా వాడికి అక్షింతలు.. నాకు ఇంజక్షన్లు.. నెల రోజులు ప్రతి రోజు సాయంత్రం ఎల్ .బి. నగర్ లొ ఉన్న 786 క్లీనిక్ కి తీసుకొని వెళ్ళేది.. అదెంటో మా అన్నయ కి ఎంత గాయమైన త్వరగ తగ్గేది.. నాకు ఎంత చిన్న గాయమైన తగ్గాలంటె మినిమం గా ఒక పది రోజులు పడుతుంది… ఒక సారి మా అన్నయ్య తుమ్మచెట్టునుండి క్రింద పడ్డాడు.. మూడు రోజుల్లొ గాయాలు మటాష్…. నాకైతె ఇప్పటికి ఆ ఎడమ కాలి మచ్చ.. పట్టుకుంటె నొప్పి మొదలవుతాయ్.. గాయం తగ్గేవరకు.. నెల రోజులు అమ్మ పొద్దున పనికెల్లి తిరిగొచ్చి నాకు సెపరేటు గా రొట్టెలు చేసిపెట్టేది….

నేను పదో తరగతి చదువుతున్న రోజుల్లొ నా తోటి స్నేహితుడొకరు నా తొ పాటు మా ఇంటికి వచ్చేవాడు.. ఇద్దరం కలిసి కంబైండ్ స్టడి చేసేవాళ్ళం. రోజు సాయంత్రం టైం లొ వాడితో రోడ్ వరకు వెళ్ళి అక్కడ పక్కనే ఉన్న చాట్ బండార్ లొ కట్లీస్ తిని తనకు సెండాఫ్ ఇచ్చేవాడిని… రోజు వాడే తినిపించేవాడు.. ఒక రోజు ఎలాగైన వాడికి నేను తినిపించాలని మా అమ్మ ఎప్పటినుండో దాస్తు వస్తున్న ఐదు రూపాయల నాణేల కల్లెక్షన్ డబ్బాకి చిల్లు పెట్టి ఒక 5 రూ.. నాణేం తీసి వాడికి ఒక రోజు కట్లీస్ తినిపించా…. చిల్లు పెట్టిన డబ్బా ఎలా గ్రహించిందో మా అమ్మ తెలీదు కాని తీసింది నేను అని చెప్పింది.. తర్వాత చెప్పాల్సివచ్చింది. ఆ తర్వాత మరెప్పుడు ఇంట్లొవారికి తెలియకుండా ఏమి తీయలేదు…. ఒక వేళ తీసిన చెప్పేవాడిని..

అప్పట్లొ వౄత్తి రీత్యా పాల వ్యాపారం చేసేవాళ్ళాం. ప్రతి రోజు పొద్దున్నే లేచి చుట్టుపక్కల ఉన్న హొటేల్స్ కి కొంతమంది ఇంటివాళ్ళకి పాలు పోసేవాళ్ళం.. ఒక రోజు పొద్దునే అలా పాల చెంబు పట్టుకొని మా ఇంటి గుమ్మం కూడ దాటలేదు.. పాల చెంబు చేతినుండి జారిపడింది… మా అమ్మకి వచ్చిన కోపానికి నా చెంప ఎర్రటి అద్దులతొ చెళ్ళుమంది… తర్వాత మళ్ళి నన్ను అక్కున చేర్చుకొని ఓదార్చడం.. నేను మారాం చేయడం…మా నాన్న అమ్మని మందలించడం… నాన్న గారైతె మమ్మల్ని ఊసెత్తి మాటనేవాడు కాదండొయ్.. ఇప్పటికి మా నాన్నని మేము ధర్మరాజు అని ముద్దుగా పిలుస్తూ ఉంటాం… ఒక వేళ అమ్మ మమ్మల్ని కొట్టిన మా నాన్న తొ మా అమ్మకి షంటింగ్స్ ఖాయం.. అన్నట్లు అదే మొదటి మరియు చివరి దెబ్బ నాకు.. :-)

ఇక నేను ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న సమయం లొ ఇచ్చిన సహాకారం, సలహాలు.. గైడెన్స్ అంతా ఇంతా కాదు….కొండంత ధైర్యాన్ని నూరి పోసింది.. ఒకొక్కసారి ఎక్కడొ ఉన్న కోపాన్ని అమ్మపై కక్కేస్తుంటాను… చిరాకు పడతాను.. ఆ తర్వాత బాధ పడతాను.. కాని అమ్మ మాత్రం ఒకేలా ఆస్వాదిస్తుంది..

మా అన్నయ్య తన ప్రొఫెషన్ రీత్యా దేశ విదేశాలు తిరుగుతూ ఉంటాడు.. మా అమ్మ పై మాటల్తొ అదీ ఇదీ అని కామిక్ గా ఆదిపత్యం చలాయించాలని సెటైర్లు వేస్తుంటాడు.., దానికి మా అమ్మ డిల్లీ కి రాజైన తల్లికి కొడుకేరా అని నోరు మూయిస్తుంటుంది…. అది విని నేను హి.. హి.. హ.. హ.. అని నవ్వడం.. భలే సరదాగ ఉండేది..

నేనెప్పుడైన అతి తెలివిని ప్రదర్శించినట్లు మాట్లాడిన.. వెధవ వేషాలు చేసిన….. అర్రె.. నీకే అన్ని తెలివి తేటలు ఉంటె నిన్ను నవమాసాలు.. మోపి కని.. పెంచిన నాకు ఇంకెంత తెలివి ఉండాలిరా అని నా నోరు మూయించడం.. అబ్బొ భలే సరాదాగా ఉండేది…!

ఇక అమ్మ తీసుకునే కేరింగ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు…. ఇలా చెబుతూ పొతె ఎన్నొ.. మరెన్నొ … ఎన్నెన్నొ ఉన్నాయ్…. ఎంతైన మాతౄ ప్రేమని మించింది లేదు….


ఇట్స్ టూ హాట్ గురూ..!

2009/05/02

ఎప్పటినుండో మా సప్పూ షాపింగ్ కి రమ్మని గోల చేస్తుండటం తొ ఈ రోజు వెళ్దామనుకొని డిసైడ్ చేయగ.. వామ్మో  బయట విపరీతమైన ఎండ.. నాకు భయం బాబు..అని రిప్లై.. సరే నీకు ఎండంటె భయం నాకు నువ్వంటె భయం అనుకొని సంతొషపడ్డాను.. కాని నాతొ ఆ సంతోషం ఎక్కువ సేపు గడపకుండ కొన్ని క్షణాల్లొ ఆవిరైపొయింది.. మా నీలెష్  ఫొన్ … నేను మీ రూం కి వస్తున్నాను…  అక్కడ రేణుకా ప్రసన్న థియేటర్ లొ బాలక్రిష్ణ సినిమా “మిత్రుడు” ఆడుతుందటగదా.. ఏయ్ టికెట్స్ దొరుకుతాయా..? నాకు టికెట్స్ ఇప్పిస్తావా..బ్లాక్ లొ నైనా సరే.. ఈరోజు  ఆ సినిమా ఎలగైనా చూడాలి అని.. (నేనైతే రానంటనని ముందే తెలివైన నిర్ణయానికొచ్చినట్లున్నాడు..) తను అలా అడిగేసరికి నాకు వడ దెబ్బ తగిలినట్లైంది.. ఎంత బాలయ్య గారికి ఫ్యాను / ఏ. సి.  గట్రా  అయితే మాత్రం వోడాఫోన్ ఆడ్స్ అంత  క్రియేటివ్ గా అడుగుతున్నాడని…. థియేటర్ దగ్గర ఎవరు లేరు.. నాకు డౌటే ! ఒక యాభై టికెట్స్ కొను.. షో వేసే చాన్స్ ఉండొచ్చు అని చెప్పాను…!
sun1
ఇక సూర్యుడు… చండ ప్రచండ ఎండలతొ జనాలను అల్లాడిస్తూ వేసవి తాపానికి గురిచేస్తున్నాడు… ఇక్కడికి రాక ముందు వేసవి కాలం లొ బెంగళూరు లొ చల్లగా ఉంటుంది అనుకునేవాడిని.. కాని ఆ చల్లదనం ఏమి లేదు… ఇక్కడ సైతం ఎండ తీవ్రత విపరీతంగ ఉంది.. ఇక హైద్రాబాదు ఐతే చెపాల్సిన పనే లేదు..! గత వారం అటెల్లినపుడు ఉన్న మూడు రోజుల్లొ హైద్రాబాద్ నుండి ఎప్పుడు పారిపోదమా అని అనిపించింది..

రోజు ఆఫిస్ లొ ఏ.సి వాతావరణం అలవాటుపడి వీకెండ్ లొ ఎటైన వెళ్ళాల్సి వస్తే ఇక అంతే ఒళ్ళంతా చెమటలు సెలయేరులా పారుతున్నాయి.. ఎయిర్ కూలర్ల అమ్మకాలు జోరందుకుంటున్నాయ్.. శీతల పానీయాల విక్రయదార్లు మంచి లాభాల్ని చవిచూస్తున్నారు.. ఇప్పటికె ఆర్దిక మాంద్యంతొ చాలా వరకు బిజినెసె ని కోల్పుతున్న షాపింగ్ మాల్స్ కి సూర్యుడి ప్రతాపం వల్ల.. ఎవరెక్కువుగా షాపింగ్ కి మొగ్గు చూపకపోవడం తొ వెల వెల బోతున్నాయి.

నేను ఎప్పటికి మర్చిపోని విషయం ఎండకాలం తొ ముడిపడి ఉంది.. అదేమిటంటె గత జన్మల్లొ చేసిన పాపాలకు ప్రాయొశ్చితంగ ఆ బ్రహ్మ దేవుడు నన్ను మూడు సంవత్సారల క్రితం మూడు మాసాల నిమిత్తం కై మద్రాస్ లొ గడపాల్సి వచ్చెలా చేయడం.. ఆ ఉన్న మూడు నెలలు ఎడారి లొ ఉన్నట్లుగా ఉంది… రోజుకి మూడు డ్రెస్సులు, ఆరు స్నానాలు, ఏడు శీతలపానియాలతొ గదిచేదాజీవితం.. రోజు లొ సగం కంటె ఎక్కువ బాత్ తూం లొ గడపాల్సివచ్చేది.. ట్యాప్ ఆన్ చేయాల్సిన పనే లేదు.. సబ్బు రుద్దుకోవడం చెమటలతొ శుభ్రమవడం అంతా క్షణాల్లొ జరిగేవి..

సుర్యుడి రికార్డులు – జనాల మరణాలు: ఇప్పటికే అత్యధిక ఉష్ణొగ్రతను అందిస్తూ రికార్డ్ లను బ్రేక్ చేస్తున్న సూర్యుడు తన ప్రతాపంతొ చాల మందిని పొట్టన పెట్టుకున్నాడు.. మన దేశం లొ గత ముప్పై రోజుల్లొ 300 మంది కి పైగా వడ దెబ్బతొ, తీవ్రమైన ఎండ తీవ్రతొ తొ మృత్యువాత పడ్డారు. దీనికి తోడు.. నేనుండె రూము కూడా నిప్పుల కొలిమిలా తయారైంది.. కిచెన్ రూం లొ వాష్ బేసిన్ లొ హాట్ వాటర్, బాత్ రూం లొ హీటర్ లేకుండా బాయిల్డ్ వాటర్.. ఫాన్ మైక్రొ ఒవెన్ గా పని చేస్తుంది..

శరీరమంత ఎండ సెగలతొ నిప్పులు కక్కిస్తుండతంతొ నో మచ్ విజిటింగ్స్, నో మచ్ డేటింగ్స్.. నో మచ్ మీటింగ్స్…! ఇప్పుడే వాన దేవుడికి సూర్యుడి పై కంప్లైంట్ చేసాను… కొద్ది రోజుల్లొ వర్షం కురవాలని ఆశిస్తూ..