ఇట్స్ టూ హాట్ గురూ..!

ఎప్పటినుండో మా సప్పూ షాపింగ్ కి రమ్మని గోల చేస్తుండటం తొ ఈ రోజు వెళ్దామనుకొని డిసైడ్ చేయగ.. వామ్మో  బయట విపరీతమైన ఎండ.. నాకు భయం బాబు..అని రిప్లై.. సరే నీకు ఎండంటె భయం నాకు నువ్వంటె భయం అనుకొని సంతొషపడ్డాను.. కాని నాతొ ఆ సంతోషం ఎక్కువ సేపు గడపకుండ కొన్ని క్షణాల్లొ ఆవిరైపొయింది.. మా నీలెష్  ఫొన్ … నేను మీ రూం కి వస్తున్నాను…  అక్కడ రేణుకా ప్రసన్న థియేటర్ లొ బాలక్రిష్ణ సినిమా “మిత్రుడు” ఆడుతుందటగదా.. ఏయ్ టికెట్స్ దొరుకుతాయా..? నాకు టికెట్స్ ఇప్పిస్తావా..బ్లాక్ లొ నైనా సరే.. ఈరోజు  ఆ సినిమా ఎలగైనా చూడాలి అని.. (నేనైతే రానంటనని ముందే తెలివైన నిర్ణయానికొచ్చినట్లున్నాడు..) తను అలా అడిగేసరికి నాకు వడ దెబ్బ తగిలినట్లైంది.. ఎంత బాలయ్య గారికి ఫ్యాను / ఏ. సి.  గట్రా  అయితే మాత్రం వోడాఫోన్ ఆడ్స్ అంత  క్రియేటివ్ గా అడుగుతున్నాడని…. థియేటర్ దగ్గర ఎవరు లేరు.. నాకు డౌటే ! ఒక యాభై టికెట్స్ కొను.. షో వేసే చాన్స్ ఉండొచ్చు అని చెప్పాను…!
sun1
ఇక సూర్యుడు… చండ ప్రచండ ఎండలతొ జనాలను అల్లాడిస్తూ వేసవి తాపానికి గురిచేస్తున్నాడు… ఇక్కడికి రాక ముందు వేసవి కాలం లొ బెంగళూరు లొ చల్లగా ఉంటుంది అనుకునేవాడిని.. కాని ఆ చల్లదనం ఏమి లేదు… ఇక్కడ సైతం ఎండ తీవ్రత విపరీతంగ ఉంది.. ఇక హైద్రాబాదు ఐతే చెపాల్సిన పనే లేదు..! గత వారం అటెల్లినపుడు ఉన్న మూడు రోజుల్లొ హైద్రాబాద్ నుండి ఎప్పుడు పారిపోదమా అని అనిపించింది..

రోజు ఆఫిస్ లొ ఏ.సి వాతావరణం అలవాటుపడి వీకెండ్ లొ ఎటైన వెళ్ళాల్సి వస్తే ఇక అంతే ఒళ్ళంతా చెమటలు సెలయేరులా పారుతున్నాయి.. ఎయిర్ కూలర్ల అమ్మకాలు జోరందుకుంటున్నాయ్.. శీతల పానీయాల విక్రయదార్లు మంచి లాభాల్ని చవిచూస్తున్నారు.. ఇప్పటికె ఆర్దిక మాంద్యంతొ చాలా వరకు బిజినెసె ని కోల్పుతున్న షాపింగ్ మాల్స్ కి సూర్యుడి ప్రతాపం వల్ల.. ఎవరెక్కువుగా షాపింగ్ కి మొగ్గు చూపకపోవడం తొ వెల వెల బోతున్నాయి.

నేను ఎప్పటికి మర్చిపోని విషయం ఎండకాలం తొ ముడిపడి ఉంది.. అదేమిటంటె గత జన్మల్లొ చేసిన పాపాలకు ప్రాయొశ్చితంగ ఆ బ్రహ్మ దేవుడు నన్ను మూడు సంవత్సారల క్రితం మూడు మాసాల నిమిత్తం కై మద్రాస్ లొ గడపాల్సి వచ్చెలా చేయడం.. ఆ ఉన్న మూడు నెలలు ఎడారి లొ ఉన్నట్లుగా ఉంది… రోజుకి మూడు డ్రెస్సులు, ఆరు స్నానాలు, ఏడు శీతలపానియాలతొ గదిచేదాజీవితం.. రోజు లొ సగం కంటె ఎక్కువ బాత్ తూం లొ గడపాల్సివచ్చేది.. ట్యాప్ ఆన్ చేయాల్సిన పనే లేదు.. సబ్బు రుద్దుకోవడం చెమటలతొ శుభ్రమవడం అంతా క్షణాల్లొ జరిగేవి..

సుర్యుడి రికార్డులు – జనాల మరణాలు: ఇప్పటికే అత్యధిక ఉష్ణొగ్రతను అందిస్తూ రికార్డ్ లను బ్రేక్ చేస్తున్న సూర్యుడు తన ప్రతాపంతొ చాల మందిని పొట్టన పెట్టుకున్నాడు.. మన దేశం లొ గత ముప్పై రోజుల్లొ 300 మంది కి పైగా వడ దెబ్బతొ, తీవ్రమైన ఎండ తీవ్రతొ తొ మృత్యువాత పడ్డారు. దీనికి తోడు.. నేనుండె రూము కూడా నిప్పుల కొలిమిలా తయారైంది.. కిచెన్ రూం లొ వాష్ బేసిన్ లొ హాట్ వాటర్, బాత్ రూం లొ హీటర్ లేకుండా బాయిల్డ్ వాటర్.. ఫాన్ మైక్రొ ఒవెన్ గా పని చేస్తుంది..

శరీరమంత ఎండ సెగలతొ నిప్పులు కక్కిస్తుండతంతొ నో మచ్ విజిటింగ్స్, నో మచ్ డేటింగ్స్.. నో మచ్ మీటింగ్స్…! ఇప్పుడే వాన దేవుడికి సూర్యుడి పై కంప్లైంట్ చేసాను… కొద్ది రోజుల్లొ వర్షం కురవాలని ఆశిస్తూ..

ప్రకటనలు

7 Responses to ఇట్స్ టూ హాట్ గురూ..!

 1. మార్తాండ అంటున్నారు:

  శ్రీకాకుళంలో కూడా ఎండలు మండుతున్నాయి. ఎండల వల్ల నా ఇంటర్నెట్ కేఫ్ కి వచ్చేవాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోయింది. ఈ రోజు నా దగ్గరకి ఒక్క కస్టమర్ మాత్రమే వచ్చాడు.

 2. nelabaludu అంటున్నారు:

  @ మార్తాండ …
  అయ్యో…. ఎవరు ఎండలకి బయటకు రావలనుకోవట్లెదు తప్పనిసరైతె తప్ప !! .. ఈ నెలంత పెద్దగ ఆశించినంత రారెమో.. ఎవో పరిక్షల ఫలితాలొస్తె తప్ప ..

 3. మార్తాండ అంటున్నారు:

  పరీక్ష ఫలితాలు కూడా BSNL ఫోన్ల ద్వారా తెలుసుకున్నారు. సైడ్ బిజినెస్ ల వల్ల వచ్చే డబ్బులే కానీ ఇంటర్నెట్ బ్రౌజింగ్ వల్ల వచ్చేది దాదాపుగా ఏమీ ఉండదు.

 4. nelabaludu అంటున్నారు:

  @ మార్తాండ …
  అవునండోయ్..! అంతే కాక.. దాదపుగా.. ఎస్.ఎం.ఎస్ లొ రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి..

 5. మార్తాండ అంటున్నారు:

  సెల్ ఫోన్స్ ఉన్నవాళ్ళ కంటే ల్యాండ్ ఫోన్స్ ఉన్నవాళ్ళు ఎక్కువ. SMSల కంటే ల్యాండ్ ఫోన్స్ వల్లే మాకు ఎక్కువ నష్టం.

 6. swapna అంటున్నారు:

  nenu b’lore lo unapudu anukunedanni b’lore hyd kante em challa ga untadi ani anukunedanni.
  nenu malli hyd ki shift ayaka telisindi nijamgane b’lore lo challaga untundi hyd kante.
  hyd ki vachaka asalu thattukolekapoya b’lore climate ki alavatu padi. b’lore lo advantage enti ante evening aye sariki climate cool ayipotundi.kani ikada night kuda vedi galulu vastayi ade difference.

 7. sunil అంటున్నారు:

  here also very very hot. surigaadu chaala kopamga unnadu.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: