అమ్మంటె మెరిసే మేఘం ….

moth
ఈ రోజు మదర్స్ డే సందర్భంగ ప్రత్యేకంగా అమ్మ గురించి ఒక టపా వ్రాయాలని తపించి యోచించక ఆలస్యం చేయకుండా ఇక్కడ రాసెస్తున్నాను..

దేవుడి సౄష్టించిన ఒక గొప్ప వరం అమ్మ.. అమ్మ గురించి ఎంత చెప్పిన తక్కువే..!

మహా కవి శ్రీనాధుడు అమ్మ గొప్పతనాన్ని వివరిస్తూ “హర విలాసం” అనే కావ్యం రాసేసాడు..

“అమ్మంటె మెరిసే మేఘం… కురిసే వానా…” అని చిత్ర-బాలు తన గొంతుతో ఆలాపించారు..

” పెదవె పలికిన మాటల్లోనె తీయని మాటే అమ్మ.. కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ..” అని చంద్రబోస్ గారు తన సాహిత్యాన్ని చాటారు..

అమ్మ సెంటిమెంటు, అమ్మతొ అనుబంధం ఉండె సినిమాలు “అమ్మ, అమ్మ చెప్పింది, మాతౄదేవోభవ, చత్రపతి, యోగి ….” ఇలా ఎన్నెన్నొ సినిమాలు వచ్చాయ్..

అమ్మకు ఎవరు తీసిపోరు… అమ్మంటే ఓ అందమైన అపురూపం.. చెరగని బంధం.. వర్ణించలేని అనురాగం..మాటల్లొ చెప్పలేని ఆత్మీయం..

మనకేమాత్రం అలసట అనిపించినా వెనువెంటనే అమ్మా.. అని ఆటోమాటిక్ గా మన నోటి నుండి మనకు తెలియకుండానే ఉచ్చరించేస్తాం. ప్రతి రోజు ఏదో ఒక సందర్భం లొ గుర్తుకుతెచ్చుకుంటాను.. ఎందుకంటె అమ్మతొ పెనవేసుకున్న బంధం అలాంటిది మరి..అమ్మతొ అనుబంధం లేని జీవితం ఊహించుకోలేను…

నేను ఈ సౄష్టి మీద కొచ్చి ఇరవై ఆరు సంవత్సరాలై ఉంటుంది.. పాతికేళ్ళ తర్వాత ఉద్యోగ నిమిత్తం కుటుంబానికి దూరం గా ఉంటున్నాను.. కేవలం సంవత్సరం వ్యవధి అయినా ముఖ్యంగా అమ్మని చాల మిస్ అవుతున్నాను.. ఏదైనా అమ్మతొ షేర్ చేసుకునేవాడిని.. ఆ పాతికేళ్ళూ అమ్మతొ ప్రత్యక్షంగా ఉన్న అనుబంధం, ఆ అనురాగం చెప్పాలంటె తెరలు తెరలుగా కల్లెదుట కమ్ముకొస్తుంది..

మా అమ్మా-నాన్న పిల్లలకి బెటెర్ ఎడ్యుకెషన్ ఇవ్వాలని హైదరాబాదు పట్నం బయలుదేరిర్రట.. నాకు పలక బలపం ఇప్పించి అక్షరాబ్యాసానికై మొదటగ సరస్వతి శిశు మందిర్ లొ మా అన్నయ తొ పాటు పంపించారు.. మొదటిరోజు కదా.. ఇప్పటికి గుర్తుంది.. బోండాం లాంటీ శ్రీదేవి టీచరు (సూర్యకాంతం లా ఉంటుంది – మాటల్లొ – చేతల్లొ) నేను నాన్ స్టాప్ గా ఏడుస్తున్నాని చెప్పి ఒక రూం లొ బందించేసింది…. ఇక నా ఏడుపు ఉన్నదానికి ముప్పై రెట్లు పెరిగింది… ఇంట్లొ మొదటి రోజు విద్యాబ్యాసం ఎలా జరిగింటుందని మా కోసం ఎదురుచూస్తున్నారు. అన్నయ్య జరిగినదానికి పది రెట్లు ఎక్కువ మా అమ్మకి చెప్పేసాడు.. ఇంకేముంది అమ్మ ఆ శ్రీదేవి టిచర్ ని సంస్కౄతం లొ తిట్టేసి మరసటి రోజు మా అక్కయ్యని స్కూల్ కెల్లి టిచర్ సంగతి చూడమనటం.. మా అక్కయ్య ఆ టిచర్ ని సాటి టీచర్ లు పిల్లల సాక్షిగా ఉన్న కోపాన్ని కక్కేసింది… ఆ కోప తాపాన్ని ఒంటికి పూర్తిగ పట్టించుకున్న మా బోండాం టీచరు ఇక పిల్లలు కావాలని ఏడ్చిన గౄహ నిర్బంధ శిక్ష విధించేది కాదు…. ఇప్పటికి ఏ స్కూల్ పిల్లాడు ఏడ్చిన ఆ సీన్ గుర్తొస్తుంది.

ఇక మా అన్నయ ఏ ప్రయోగాలు చేసిన ఫలితం కోసం నా పై ప్రయోగిస్తుండే వాడు… ఒక రోజు నాతొ అర్రె.. నాకు సైకిల్ తొక్కడం వచ్చేసింది.. “కాంచి” నేర్చుకున్నాను.. (“కాంచి” అంటె సైకిల్ డ్రైవింగ్ లొ మొదటిది.. ఆ తరవాత “దండు” ఆ పై “సీటు” అనే ఫేజ్ లున్నాయి) అదీ కాక ఎవరినైన వెనుక కూర్చోపెట్టుకొని అమాంతం నడపగలను… నాకు సైకిల్ రాదు కాబట్టి కనీసం వెనుక ఎక్కుదామని ఆత్రుతగా ఎక్కేసాను.. మనోడు కొద్ది దూరం చక్కగా తీసుకెల్లి .. చక్కగా తీసుకెళ్తున్నానె ఆనందం లొ బాలెన్స్ తప్పి డాంబార్ రోడ్ పై బోర్లపడేసాడు… నా ఎడమ కాలు క్రింది బాగం వెనక చక్రం లొ నుజ్జు నుజ్జు అయింది.. మోకాల్లు మోచెక్కలయ్యాయ్ .. విషయం తెల్సి ఆ టైం లొ ఊర్లో ఉన్న అమ్మ నెక్స్ట్ బస్ కి ఈవినింగ్ కల్లా ఇంటికి చేరుకుంది.. మా వాడికి అక్షింతలు.. నాకు ఇంజక్షన్లు.. నెల రోజులు ప్రతి రోజు సాయంత్రం ఎల్ .బి. నగర్ లొ ఉన్న 786 క్లీనిక్ కి తీసుకొని వెళ్ళేది.. అదెంటో మా అన్నయ కి ఎంత గాయమైన త్వరగ తగ్గేది.. నాకు ఎంత చిన్న గాయమైన తగ్గాలంటె మినిమం గా ఒక పది రోజులు పడుతుంది… ఒక సారి మా అన్నయ్య తుమ్మచెట్టునుండి క్రింద పడ్డాడు.. మూడు రోజుల్లొ గాయాలు మటాష్…. నాకైతె ఇప్పటికి ఆ ఎడమ కాలి మచ్చ.. పట్టుకుంటె నొప్పి మొదలవుతాయ్.. గాయం తగ్గేవరకు.. నెల రోజులు అమ్మ పొద్దున పనికెల్లి తిరిగొచ్చి నాకు సెపరేటు గా రొట్టెలు చేసిపెట్టేది….

నేను పదో తరగతి చదువుతున్న రోజుల్లొ నా తోటి స్నేహితుడొకరు నా తొ పాటు మా ఇంటికి వచ్చేవాడు.. ఇద్దరం కలిసి కంబైండ్ స్టడి చేసేవాళ్ళం. రోజు సాయంత్రం టైం లొ వాడితో రోడ్ వరకు వెళ్ళి అక్కడ పక్కనే ఉన్న చాట్ బండార్ లొ కట్లీస్ తిని తనకు సెండాఫ్ ఇచ్చేవాడిని… రోజు వాడే తినిపించేవాడు.. ఒక రోజు ఎలాగైన వాడికి నేను తినిపించాలని మా అమ్మ ఎప్పటినుండో దాస్తు వస్తున్న ఐదు రూపాయల నాణేల కల్లెక్షన్ డబ్బాకి చిల్లు పెట్టి ఒక 5 రూ.. నాణేం తీసి వాడికి ఒక రోజు కట్లీస్ తినిపించా…. చిల్లు పెట్టిన డబ్బా ఎలా గ్రహించిందో మా అమ్మ తెలీదు కాని తీసింది నేను అని చెప్పింది.. తర్వాత చెప్పాల్సివచ్చింది. ఆ తర్వాత మరెప్పుడు ఇంట్లొవారికి తెలియకుండా ఏమి తీయలేదు…. ఒక వేళ తీసిన చెప్పేవాడిని..

అప్పట్లొ వౄత్తి రీత్యా పాల వ్యాపారం చేసేవాళ్ళాం. ప్రతి రోజు పొద్దున్నే లేచి చుట్టుపక్కల ఉన్న హొటేల్స్ కి కొంతమంది ఇంటివాళ్ళకి పాలు పోసేవాళ్ళం.. ఒక రోజు పొద్దునే అలా పాల చెంబు పట్టుకొని మా ఇంటి గుమ్మం కూడ దాటలేదు.. పాల చెంబు చేతినుండి జారిపడింది… మా అమ్మకి వచ్చిన కోపానికి నా చెంప ఎర్రటి అద్దులతొ చెళ్ళుమంది… తర్వాత మళ్ళి నన్ను అక్కున చేర్చుకొని ఓదార్చడం.. నేను మారాం చేయడం…మా నాన్న అమ్మని మందలించడం… నాన్న గారైతె మమ్మల్ని ఊసెత్తి మాటనేవాడు కాదండొయ్.. ఇప్పటికి మా నాన్నని మేము ధర్మరాజు అని ముద్దుగా పిలుస్తూ ఉంటాం… ఒక వేళ అమ్మ మమ్మల్ని కొట్టిన మా నాన్న తొ మా అమ్మకి షంటింగ్స్ ఖాయం.. అన్నట్లు అదే మొదటి మరియు చివరి దెబ్బ నాకు.. :-)

ఇక నేను ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న సమయం లొ ఇచ్చిన సహాకారం, సలహాలు.. గైడెన్స్ అంతా ఇంతా కాదు….కొండంత ధైర్యాన్ని నూరి పోసింది.. ఒకొక్కసారి ఎక్కడొ ఉన్న కోపాన్ని అమ్మపై కక్కేస్తుంటాను… చిరాకు పడతాను.. ఆ తర్వాత బాధ పడతాను.. కాని అమ్మ మాత్రం ఒకేలా ఆస్వాదిస్తుంది..

మా అన్నయ్య తన ప్రొఫెషన్ రీత్యా దేశ విదేశాలు తిరుగుతూ ఉంటాడు.. మా అమ్మ పై మాటల్తొ అదీ ఇదీ అని కామిక్ గా ఆదిపత్యం చలాయించాలని సెటైర్లు వేస్తుంటాడు.., దానికి మా అమ్మ డిల్లీ కి రాజైన తల్లికి కొడుకేరా అని నోరు మూయిస్తుంటుంది…. అది విని నేను హి.. హి.. హ.. హ.. అని నవ్వడం.. భలే సరదాగ ఉండేది..

నేనెప్పుడైన అతి తెలివిని ప్రదర్శించినట్లు మాట్లాడిన.. వెధవ వేషాలు చేసిన….. అర్రె.. నీకే అన్ని తెలివి తేటలు ఉంటె నిన్ను నవమాసాలు.. మోపి కని.. పెంచిన నాకు ఇంకెంత తెలివి ఉండాలిరా అని నా నోరు మూయించడం.. అబ్బొ భలే సరాదాగా ఉండేది…!

ఇక అమ్మ తీసుకునే కేరింగ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు…. ఇలా చెబుతూ పొతె ఎన్నొ.. మరెన్నొ … ఎన్నెన్నొ ఉన్నాయ్…. ఎంతైన మాతౄ ప్రేమని మించింది లేదు….

ప్రకటనలు

10 Responses to అమ్మంటె మెరిసే మేఘం ….

 1. parimalam అంటున్నారు:

  అమ్మ ప్రేమను ఏదీ మరిపించలేదు ….మాతృ దినోత్సవ శుభాకాంక్షలు .

 2. కె.మహేష్ కుమార్ అంటున్నారు:

  హ్మ్ ఇలా గుర్తుతెచ్చుకోవడం. అనుభవాల్ని నెమరేసుకోవడం బాగుంది. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.

 3. nelabaludu అంటున్నారు:

  @ మహేష్ ….
  ధన్యవాదాలు..

 4. aswinisri అంటున్నారు:

  నెల బాలుడు గారు! మీ టెంప్లేట్ చూసి “భలే వున్నాడే ఈ చంటి పిల్లాడూ” అనుకుంటుంటాను! మీ అమ్మగారిని మాకు ఇంత అందం గా పరిచయం చేసినందుకు అభినందనలు. idi chaalaa nice gurugaaru!

 5. aswinisri అంటున్నారు:

  paina commentloe template kaadu gravatar correct word cheppaanaa?

 6. nelabaludu అంటున్నారు:

  హెలొ aswinisri..
  ధన్యవాదాలు…. గ్రావాతారం లొ మరియు పైన ఫోటొ లొఉన్నవి రెండు నచ్చాలి మీకు.. :-) :-)
  చాల రోజుల తర్వాత ఇటు వైపు వచ్చినట్లున్నారు….

 7. vinay chakravarthi అంటున్నారు:

  baagundi……………..

 8. nelabaludu అంటున్నారు:

  @ vinay chakravarhi…
  ధన్యవాదాలు….

 9. Nutakki Raghavendra Rao అంటున్నారు:

  అమ్మ గురించి అధ్భుత భావ వీచికలు హాయి గొలిపాయి.అభినందనలు. మా అమ్మ గురించి నే వ్రాసిన “పేరాశ” ఓసారి వీక్షించండి….with corDial wishes…
  Nutakki

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: