ఓ… నాన్నా! నీ మనసే వెన్నా…!!

2009/06/20

father_fin

ఓ… నాన్నా! నీ మనసే  వెన్నా…

అమౄతం కన్నా.. అది ఎంతో మిన్నా!

అనే పాటకు అచ్చమైన సాక్ష్యం గా నిలిచేది  “నాన్న” అని అనడంలొ అతిశయోక్తి లేదు..

“ఫాదర్స్- డే” సందర్భం గా నాన్న తొ పంచుకున్న అనుభవాలు మచ్చుకు కొన్ని నెమరువేసుకుంటున్నానిలా..

తల్లిదండ్రులే అందరికి మొదటి గురువులని అంటారు.  నాన్న గారు…! మొదటగా నాకందించిన స్నేహ హస్తం మీదే.. నా అభివౄద్దికి పునాది మీదే… మీరు కనికరించిన, కాఠిన్యం చూపిన, తిట్టిన, కొట్టినా, మెచ్చినా అంతా నా ఉన్నతి కోసమే.

ప్రైవేటు స్కూల్లొ అడుగుపెట్టిన రోజులవి… మా పి.ఈ.టి మాస్టారు మాతొ “సోమవారం నుండి కాళ్ళకి బూట్లు లేకుండ స్కూల్ కొస్తె..  తనదగ్గర ఉన్న పొడవాటి బెత్తం తొ ఒళ్ళంతా తూట్లు పడేలా చేస్తానని” బెదిరించాడు.  నాకు ఆ మాస్టారు అన్న మాటలకి భయం పట్టుకుంది.. సోమవారానికి ఇంకా రెండు రోజులె మిగిలి ఉంది… నాకు ష్యూస్ లేవు.. నాకు దెబ్బలు పడటం ఖాయం.. ఎలాగైన ఇంట్లొ మా నాన్నని ఒప్పించాలని నిర్ణయించుకున్నాను… నాన్నా.. నాన్నా.. నాకు ష్యూస్ కొనవా అని అడిగాను .. ఇంకొ ఒక వారం ఆగురా.. చేతిలొ చిల్లి గవ్వ లేదన్నాడు.. నాకు ఉన్న భయం కాస్తా రెట్టింపైంది.. ఏదొ విదంగా ష్యూస్ కొనిచ్చేలా చేయాలని పథకం పన్నాను..  ముఖం మాడ్చేసి.. అలిగి.. ఒలిగి.. ఆదివారం అంతా ఉపవాసం ఉండి..ఎవ్వరు తినమన్నా… ష్యూస్ కొంతే కాని తిననని ఏడ్చేసేవాడిని.. రాత్రి వరకు నన్ను ఓ మాదిరిగా గ్రహించిన నాన్న, ఇక లాభం లేదని.. తట్టుకోలెక అప్పటికప్పుడు నన్ను సైకిల్ పై ఎక్కించుకొని ఫుట్-వేర్ దుకాననికి తీసుకెల్లడం తొ నా  నిరహార దీక్షకి తెరపడింది.. అదేంటొ గాని ఆ మాస్టారు దగ్గర ఉన్న కర్ర మాత్రం ఎప్పుడు విరిగేది గాదు.. చాల బలం గా ఉండేది… నేను నా మిత్ర బ్రుందం సహయంతొ ఒక రోజు మాస్టారు రాని రోజున ఆ కర్రని ఎత్తుకొచ్చేసాను… కొన్ని రోజుల వరకు మా బర్రెల కోసం ఆ కర్ర సేవలు ఉపయోగించాను.(మేము వౄత్తి రీత్యా పాల వ్యాపారం చేసేవాళ్ళం, ఆవులు,బర్రెలు, మేకలు.. ఉండేవి)  ఒకానొక రోజు నాకొచ్చిన కోపానికి ఒక మొండి  బర్రె తాపంతొ ఆ కర్ర చచ్చి ఊరుకుంది.. ;(

కేవలం మాకు ఉన్నత స్థాయి ప్రమాణాలతొ కూడుకున్న విద్యనందించాలని, ప్రయోజకులుగా తిర్చిదిద్దాలని, మిగతా వారి బిడ్డల కన్నా తన బిడ్డలు విలాసవంతమైన, సౌకర్యవంతమైన జీవితం గడపాలని.. పుట్టి పెరిగిన ఊరొదిలి పట్నం బయలుదేరాడంటె మేము నిజంగ అదౄష్టవంతులం అని భావిస్తాను.. మా నాన్న తీసుకున్న తెలివైన నిర్ణయానికి మేము ఇప్పటికి.. ఎప్పటికి గర్వపడతాం.. లేదంటె ఏ భొర్ బండి పైనొ, బావులు తవ్వడమో మా భవిష్యత్తు అయి ఉండేది.. (ఈ టెక్నాలజి కి దూరం గా ఉండేవాడిని..)

father and son rise

కె.జి నుండి పి.జి వరకు ఫీజు విషయాల్లొ మాట్లాడటానికి మా నాన్నని ఖచ్చితంగా ప్రిన్సిపాల్ కి పరిచయం చేసేవాడిని.. పంచకట్టు, బొట్టు… ఆపై కండువా…అచ్చం రైతు లా ఉండె మా నాన్న ని చూసి.. ఫీజు లొ తెగ కన్సెషన్ వచ్చేది నాకు..  :)

సిటి లొ ఉండటానికి ఒక ఇల్లు..కాలని లొ మాకంటు ఒక గుర్తింపు.. ఇరవైదేళ్ళుగా ఒకే కాలనీ లొ ఉంటున్నాం.. ఇప్పటికి ఊర్ళొ ఉన్న బంధువులు.. బాగా తెలిసినవారు ఎవరైన ఏదొ పనితొ పట్నమొచ్చినా పని కాకున్నా మా దగ్గర ఒక రోజు వుండి మరి పనులు పూర్తి చేసుకొని తిరిగెళ్తారు. ఇల్లంటె తలదాచుకొనే ఒక  గూడు కాదు, ఆప్యాయత, మమతానురాగాల కలబోత అని తెలియబరిచేలా చేసారు..

ఇంతవరకు నాన్న మా దగ్గరి నుండి ఏమి ఆశించలేదు..! వెనుకటి తరం పద్దతులు, అలవాట్లు ఇప్పటికి మా నాన్నలొ కనిపిస్తాయ్.. ఈ జెనరేషన్ విదానలు ఏవి తెలియవు.. తెలిసిన వంటబడవు… నాకు ఉద్యొగం వచ్చిన మొదటి నెలలొ నేను టైటాన్ వాచ్ బహుకరించాను…! తరచుగా మా ఊరికి వెళ్ళొస్తుంటాడాని అస్తమానం ఊర్ళొవారికి ఫోన్ చెయడం బాగొక గత మాసం ఒక నోకియా సెల్ ప్రెజెంట్ చేసాను.. దాన్ని ఉపయొగించడం రాదు తనకి.. వాడుతుంటె కొద్ది రోజుల్లొ అలవాటైపొతుందని మెడకి తగిలించేసాను…!

నాన్నా! మళ్ళీ జన్మంటు ఉంటె మీ బిడ్డగానే పుట్టాలని..

మన మనసు తెలుసుకుని మసిలేది నాన్న!
మన ఆశలు, ఆకాంక్షలు తీర్చేది నాన్న!!
మన గురువు, దైవం అన్నీ నాన్న!!!


అనుబంధం – ఏదో పొరపాటు – అటుపై ఎడబాటు!

2009/06/06

వేగంగా సాగిపొతున్న ఈ జీవన మజిలీ లొ…మనతొ బాగా సన్నిహితం గా ఉన్నవారు, మనకి బాగా నచ్చిన వాళ్ళు కానివ్వండి, ఇష్టమైన వాళ్ళో కానివ్వండి లేక అన్నో, తమ్ముడొ, స్కూల్ బెంచ్-మేటొ, ఫ్రెండో, లవరో, క్లోజ్ కొలిగో ఎవరైనా కానివ్వండి.. వాళ్ళకి దగ్గరగా ఉన్నంత కాలం లేదా వాళ్ళతొ ఉన్నంత కాలం పెద్దగా తారతమ్యం ఉండదు.. కాని ఒక సారి దూరమయ్యాక, దూరం చెసుకున్నాక మనం ఎంతొ మిస్ అవుతున్నామో అని అనిపిస్తుంది… పదే పదే గుర్తుకి తెచ్చుకుంటూ ఉంటాం…

bandam

ఎప్పుడు ఏదో పనితొ గజి బిజిగా ఉండే నాకు గత వారమంతా కొంచెం కొత్తగా, విచిత్రంగా అనిపించింది. రెగ్యులర్ గా ఉండె నా హాడావిడి షెడ్యూల్ మారినట్లనిపించింది.. నా మిత్రుడు గురు (హైద్రాబాదు లొ నాతో పాటు ఒకే ప్రాజెక్ట్ కి పని చేసారు) ట్రైనింగ్ నిమిత్తం ఒక వారానికి బెంగళూర్ కి వచ్చాడు… ఇంకేముంది మా రూం లొ మకాం. ట్రైనింగ్ అటెండ్ అవ్వడానికి ఇక్కడినుండి వెళ్ళేవాడు… చాలా రోజుల తర్వాత నాక్కుడా మంచి కంపెని దొరికినట్లైంది… ఆ ఆరు రోజులు మూడు క్షణాలుగ గడిచిపొయాయ్.. నిన్ననే తిరిగి హైద్రాబాద్ కి వెళ్ళిపోయాడు.. ఈ రోజు పొద్దునే మళ్ళి షరా మాములే.. మా రూములొ ఇద్దరముంటాం.. కాని ఇప్పుడు నేను ఒంటరి గా ఉన్నట్లు నన్నేదొ ప్రశ్నిస్తుంది.. బహుశా గత ఆరు రోజులు ఇలా లేకపోవడమేమో.

మనకు ఎవరొ ఒకరు ఎక్కడో అక్కడ ఏదో సమయాన మరేదొ సంధర్భంలొ ఎలాగొ అలాగ తారసపడతారు… అందులొ ఎందరొ కొందరు మనకి గుర్తుంటారు.. మిగిలిన కొందరు మనల్ని మరచిపోతారు లేదా మనమే వారిని మరచిపోతాం. మరి కొందరు చిరకాలం గుర్తుండేలా విడిపోతారు.. కాని కొందరు మాత్రం కలకాలం మరెప్పడికి మనతొ ఉంటారు..

కలవడం, విడిపోవడం, ఆ తర్వాత మదన పడటం జీవితం లొ సర్వసాదారణం అయిపోయింది. చర్యకు ప్రతిచర్య ఉన్నట్లు..బంధానికి.. ఎడబాటు; పరిచయం..స్నేహం, ప్రేమ.. ఇవ్వన్ని బంధానికి పునాది.. మనము అణువనువుగా పంచుకొని అలవర్చుకున్న బంధం హటాత్తుగా దూరమవుతె కలిగే వ్యధ వర్ణణాతీతం.

మనకు కష్టమొచ్చిన నష్టమొచ్చిన పంచుకోవడానికి కనీసం ఒకరు అవసరం… అన్ని విషయాలు అందరితొ పంచుకోలేం.. మనతొ బాగా సన్నిహితంగా మెలిగిన వారితొ ఏదైనా పంచుకొంటాం. నా ఇరవైదేళ్ళ వసంతం లొ ఎందరినో కలిసాను… బాల్య మిత్రులదొ ఒక వర్గం. మొదటగా మన స్నేహం చిగురించేది అక్కడే. అటుపై ఇరుగు పొరుగు వారు…కాలెజ్ ఫ్రెండ్స్.. కోలీగ్స్.. ఇలా ఎందరొ..


ఆనంద్
గారు చెప్పినట్లు సంక్షోభాలతో నిండిపోయిన బతుకులు సంక్లిష్టమై ఒకరినొకరు అర్ధం చేసుకోవడం అటుంచి తమని తాము అర్ధం చేసుకోలేని స్థితి నేటి జీవిత విధానమై కూర్చుంది.ఏ ఇద్దరు మనుషుల మధ్యా సంపూర్ణ స్నేహమూ, పరి పూర్ణ ప్రేమ ఆశించడం ఈ రోజుల్లో అత్యాశే అవుతుంది.

పొరపాట్లు సహజం..ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి.. ఎదుటువారిని గౌరవిస్తూ పరిశుద్దమైన మనసుని కల్మషం చేసుకోకుండా ఒకరి నొకరికి విలువనిస్తూ కలిసిఉండటం, ఏమైన విభేదాలు ఉంటె పరిష్కరించుకోవడం బంధుత్వాన్ని బలపరుస్తుంది. అనుబంధంగా మారుస్తుంది. ఎడబాటుకి తావుండదు…

చివరగా జీవన పయనం లొ ప్రతి కలయిక ఒక విడిపోవడానికి నాంది.. అలాగని ప్రయాణం ఆగిపోకూడదు.. ప్రతీది మనొకొక ఒక గొప్ప అనుభవం.. తీపో చేదొ.. అనుభవిస్తేగాని తేల్చలేము..!!