నా తొలి బుల్లి కవిత్వం – ఓ మనసు తత్వం !

2009/07/23

మదిలొ మెదిలే ఆలొచనలకు మనసుని మాటలుగా, భావాన్ని అక్షరాలుగా మార్చాలనే పోరాట పటిమతొ “కవిత్వం” అనే సాగరం లొ ఒక చినుకుగా ప్రవహించాలని ఆశతొ ఈ నా తొలి బుల్లి కవిత్వం(?) తొ కవితారంగ్రేటం చేస్తూ మీ ముందుకొస్తున్నాను..

kavitwam

పెదవి పలకని మాటలెన్నో, మాటకు అందని మౌనాలెన్నో

ఊహకు అందని ఊసులెన్నో,బాషకు అందని భావాలెన్నో

సమయం సరిపోని స్వప్నాలెన్నో, తనువు గుర్తించని స్పర్శలెన్నో

చూపులకు తెలియని అందాలెన్నో, మంతనాలు సాగని రోజులెన్నో

గుండె దాటని తలపులెన్నొ,గుప్పిట్లొ దాచలేని వన్నెలెన్నో

వయసుకు అందని కోరికలెన్నొ, వర్ణనకు అందని సొగసులెన్నో

దాచకుండ ఉంచని తీపి గుర్తులెన్నో, పాటకు అందని రాగాలెన్నో

కలుపు ఎరుగని వలపులెన్నొ, పంచుకోలేని అనుభవాలెన్నో

వ్యక్తపరచని అనుభూతులెన్నో, ఎన్నెన్నో.. మరెన్నో…!!!

—————————————————————————–

ప్రకటనలు

ఈ లోకం .. డబ్బుకు దాసోహం!

2009/07/12

money_tree

డబ్బు.. డబ్బు.. డబ్బు… Rp, $, €, £..రూపాయలే కావొచ్చు.. డాలర్లే ఉండొచ్చు.. యూరోలే అయి కూడా ఉండవచ్చు… ఏవైనా డబ్బు డబ్బే.. డబ్బు మనకు ఒక కనీస అవసరం.ఆ నోటు లే మన లోటు లని ని తీరుస్తాయ్. డాలర్ ఉంటే కాలర్ ఎగిరేసినట్లే కదా మరి…!

మనం తినడానికి బ్రతుకుతున్నా లేక బ్రతకడానికి తింటున్నా డబ్బే మూలాధారం. నేను పొద్దున్నే లేచి బ్రూ కాఫి తాగడం తొ మొదలుకొని రాత్రి పడుకొనేటప్పుడు ఆల్-అవుట్ ఆన్ చేసే వరకు ప్రతిది డబ్బుతొ ముడిపడి ఉంది.. ఏ పని చేయలన్నా డబ్బు కావాలి కాబట్టి అనుదినం డబ్బు కోసం పరిగెడుతుంటాం.

ధనం మూలం ఇధం జగత్… ప్రస్తుత పరిస్థితుల్లొ ఏది కొనాలన్నా ధరలు ఆకాశాన్ని అంటుకుంటున్నాయ్ డబ్బులు నీళ్ళలా కారిపోతున్నాయ్..! పోయేటప్పుడు తీసుకపోం అయినా ఉంటున్నప్పుడు మాత్రం అవసరం. డబ్బుంటె ఏ పనిజరగాలన్న సులభం అవుతుంది.. ఈ ధనలక్ష్మి ఎందరినొ వరిస్తుంది… కొందరిని ముంచుతుంది..మరెందరినొ మారుస్తుంది.. ధనం ఒకరి నుండి మరొకరి చేతుల్లొకి నిత్యం మారుతుంటుంది.. నాకున్న ధైర్యలక్ష్మితొ నాకే కష్టమొచ్చిన, నష్టమొచ్చిన ప్రతి మాసం స్నేహితుల దగ్గరి నుండి ధనలక్ష్మి రూపాన్ని అనుగ్రహిస్తుంటాను….థాంక్స్ టూ మై డియర్ ఫ్రెండ్స్ ఫర్ హెల్పింగ్ మి ఔట్..

మనీ మేక్స్ మెనీ థింగ్స్… చిన్న పిల్లలకి ఒక చేత్తొ ఒక చాక్లెట్ మరొ చేత్తో ఒక వంద రూపాయల నోటు చూపించి ఏది కావాలి అని అడిగితె చటుక్కున చాక్లేటే కావాలని తీసేసుకుంటారు. ఎందుకంటె వాళ్ళకి చాక్లేట్ ముఖ్యం కనుక. ఒకవేళ ఆ వందరూపాయలకు వంద చాక్లేట్లు వస్తాయని తెలిస్తె వాళ్ళ దౄష్టి ఆ నోటు మీదికెళ్తుంది..

పైసామే పరమాత్మ హై… నిజంగా కష్టపడేవాళ్ళకు తెలుస్తుంది డబ్బు విలువ అంటె ఏమిటొ అని విన్నాను.. కాలేజికి వెళ్ళే రోజుల్లొ ఇలా పాకేట్ మనీ కని తీసుకున్నవి అలా అవీరైపోయేవి.. మరుసటి రోజు అమ్మ నాన్నతొ క్లాస్ ఉండేది.. చెప్పింది వింటునట్లుగ ఒక పక్క సరే అని తల ఊపుతూ… మరొ పక్క చలొ… ఈరోజు ఏ మూవి కెళ్దాం అని మా మిత్రులకి ఫోన్ చేసేవాడిని.. ఆ రోజుల్లొ ఖర్చు చేయడం మాత్రమే తెలుసు.. ఆ వయసలాంటిది.. స్నేహితులతొ. సినిమాలు.. షికార్లు…. ఇప్పుడు తెలిసొస్తుంది..ఒక సారి బరువైన బాధ్యతలు నెత్తి మీద పడ్డాకా జాగ్రత్తగా అచి తుచి అవసరాలకు మించి ఖర్చుపెట్టకుండా జాగ్రత్త వహిస్తూంటాం.

దీపం వెలుగుతున్నప్పుడె ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు.. సినీస్టారులు, క్రీడాకారులు ప్రొఫెషన్ పరంగా కాకుండా ఎడిషనల్ గా ఆడ్స్ రూపం లో తెగ నిరూపించేసుకుంటున్నారు.. ఒక రకం గా అత్యాశేమో అని అనిపించినా దొరికిన సాధనాన్ని సద్వినియోగం చేసుకోవడం లొ తప్పులేదనిపిస్తుంది..వారు ఆ స్థాయి కి రావడానికి కఠొర శ్రమని అనుభవించుంటారు..

సగటు మనిషికి డబ్బంటె కొండంత ఆశ… సైకిలున్నవాడికి బైకు కావలనిపిస్తుంది.. బైకు ఉన్నవాడికి కారు కావలనిపిస్తుంది..మనిషి బతకడానికి రోటి-కపడా-మఖాన్ అదేనండి కూడు-గూడు-గుడ్డ ఉండాలి.. మరి వాటికి డబ్బే మూలం… డబ్బు లేని వాడు డుబ్బుకు కూడా గోరకాడు అనే నానుడి ఉండనె ఉంది. ఈరోజుల్లొ ధనం లేని వాడు గడ్డి పోచ తో సమానం.

నా మిత్రుడు పవన్ డబ్బుదేముంది ముందు మన అవసరం ముఖ్యం అంటారు .. ఆ అవసరానికి డబ్బే మూలం కదా అని నేనంటాను. డబ్బు శాశ్వతం కాలేదు కాని మనం ఉన్నంతవరకు దాని చుట్టూ తిరుగుతునే ఉంటాం.

అడుక్కునే బిచ్చగాడినుండి అత్యంత సంపన్నుడి వరకు అందరికి కావల్సిందే డబ్బు.. డబ్బు…!!!