నా తొలి బుల్లి కవిత్వం – ఓ మనసు తత్వం !

మదిలొ మెదిలే ఆలొచనలకు మనసుని మాటలుగా, భావాన్ని అక్షరాలుగా మార్చాలనే పోరాట పటిమతొ “కవిత్వం” అనే సాగరం లొ ఒక చినుకుగా ప్రవహించాలని ఆశతొ ఈ నా తొలి బుల్లి కవిత్వం(?) తొ కవితారంగ్రేటం చేస్తూ మీ ముందుకొస్తున్నాను..

kavitwam

పెదవి పలకని మాటలెన్నో, మాటకు అందని మౌనాలెన్నో

ఊహకు అందని ఊసులెన్నో,బాషకు అందని భావాలెన్నో

సమయం సరిపోని స్వప్నాలెన్నో, తనువు గుర్తించని స్పర్శలెన్నో

చూపులకు తెలియని అందాలెన్నో, మంతనాలు సాగని రోజులెన్నో

గుండె దాటని తలపులెన్నొ,గుప్పిట్లొ దాచలేని వన్నెలెన్నో

వయసుకు అందని కోరికలెన్నొ, వర్ణనకు అందని సొగసులెన్నో

దాచకుండ ఉంచని తీపి గుర్తులెన్నో, పాటకు అందని రాగాలెన్నో

కలుపు ఎరుగని వలపులెన్నొ, పంచుకోలేని అనుభవాలెన్నో

వ్యక్తపరచని అనుభూతులెన్నో, ఎన్నెన్నో.. మరెన్నో…!!!

—————————————————————————–

ప్రకటనలు

30 Responses to నా తొలి బుల్లి కవిత్వం – ఓ మనసు తత్వం !

 1. prasuu అంటున్నారు:

  annay chala bagundi annay

 2. ఉష అంటున్నారు:

  ఎన్నెన్నో అనే ఆ మనసే వుండబట్టలేక ఇంకెన్నో పోగుచేసుకునేదే తన తత్వం. తొలి కవిత అన్నారు ఎంతగా తరచి చెప్పారు!

 3. కత్తి మహేష్ కుమార్ అంటున్నారు:

  హ్మ్మ్ ఏదో రొమాంటిక్ మూడ్ లో ఉన్నట్టున్నారే!

 4. sunil అంటున్నారు:

  daaaaal,
  its suuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuper,

 5. nelabaludu అంటున్నారు:

  @ ఉష
  అంతే కదా :-)
  @ మహేష్
  హాహ… ఏమో మరి ;)
  @ సునీల్
  థాంక్స్ డియర్..

 6. nelabaludu అంటున్నారు:

  @తృష్ణ ..
  థాంక్స్!

 7. ఆత్రేయ అంటున్నారు:

  కవిత బాగుందండి.. మీ మొదటి కవితలా లేదు. ఇక విజృంభించండి. కానీ ఆబొమ్మలో వాళ్ళేంటండీ మొగుడూ పెళ్ళాల్లాగా అలా ఎడముఖం పెడముఖం వేసుకుని కూర్చున్నారు ?

 8. nelabaludu అంటున్నారు:

  @ ఆత్రేయ..
  థాంక్స్!.. ఓ ప్రేమ జంట మనస్పర్దలొచ్చి తమ తొ గడిపిన అనుభవాలను నెమరు వేసుకుంటున్నట్లుగా లేదు! ;) ;)

 9. Dr.Acharya Phaneendra అంటున్నారు:

  నవ కవికి సాహిత్య క్షేత్రంలోకి సాదరాహ్వానం !
  సాహిత్య లోకంలో ఒక కొత్త కవి ఉదయించాడంటే ఆనందించేవాళ్ళలో నేను ముందు వరుసలో ఉంటాను.
  అయితే కవిత్వాన్ని ” సీరియస్ ” ప్రవృత్తిగా స్వీకరించి, కృషి చేస్తేనే మీరు మంచి కవిగా నిలబడతారు.
  తొలి కవిత అన్నారు కాబట్టి శ్రేయోభిలాషిగా ఒక విషయం చెప్పాలనిపించింది.
  ఇలా ” ఎన్నో ” లు ఎక్కువగా వ్రాస్తే కవిత పలచబడుతుంది. అందులో ముఖ్యమైనవి కొన్ని ఉంచి, చివరలో ఒక చరుపు చరిచినట్టో, లేక ఒక మెరుపు మెరిసినట్టో ఒక వాక్యం పడాలి. అలా ముగిసిన కవిత మంచి కవిత అవుతుంది.
  All the best !

 10. nelabaludu అంటున్నారు:

  Dr.Acharya Phaneendra గారు..
  మీ అమూల్యమైన సలహాలు తెలిపినందుకు కౄతజ్ఞతలు. నా తదుపరి కవితల్లొ కౄషి చేస్తాను..
  ధన్యవాదాలు…

 11. aswinisri అంటున్నారు:

  “సమయం సరిపోని స్వప్నాలెన్నో, తనువు గుర్తించని స్పర్శలెన్నో….” “కలుపు ఎరుగని వలపులెన్నొ,….”
  These two lines I liked very much ! Good attempt! Keep it uP…UP…..UP!

 12. nelabaludu అంటున్నారు:

  @ Aswinisri..!
  Thank you ;)

 13. mohanrazz అంటున్నారు:

  baagundi basu.. :)

 14. navi అంటున్నారు:

  chaala bagundhi andi. Nijam cheppandi idhi mee modhati kavitha kadhu kada?

 15. nelabaludu అంటున్నారు:

  @ Navi…
  naa modati kavite nandi.. ;)

 16. srilakshmi అంటున్నారు:

  hi chalaaaaaaaaaaaaaaaa bagudi sir THANQ SO MUCHHHHHHHHHHHHHHH

 17. nelabaludu అంటున్నారు:

  @ Srilakshmi
  Thank you !

 18. v. jayaram అంటున్నారు:

  mee kavithalu chala bagundi.
  Thank you

  Jayaram – Hosur

 19. v. jayaram అంటున్నారు:

  mee kavathalu chala bagundhi

 20. krishna అంటున్నారు:

  chala bagundi……………nee kavithala kosam yeduru chusee oka abhini……..

 21. nelabaludu అంటున్నారు:

  @ Jayaram, Krishna

  Thank you

 22. suresh అంటున్నారు:

  haii this is very very good and beautiful

 23. sasi అంటున్నారు:

  bagundi mee kavitha janamantha mechchentha,prati manasuki hai kaliginchentha ide na abinandhanala padaala lata

 24. ANIL అంటున్నారు:

  ANNYA NEU KEKA NE KAVITVAM KEKA

 25. rathnamsjcc అంటున్నారు:

  మనసు నిలుపకున్న ముక్తి లేదయా చూపు నిలుపకున్న సుఖము లేదుబ్రహ్మ మనగ వేరె పరదేశమున లేడు బ్రహ్మ మనగ జూడు బట్ట బయలు, తనకు తానె తారక బ్రహ్మo
  హృదయమే మనసుకి మూలస్ధానం. ఇది మనసుయొక్క పరమ కేంద్రం. దీనిని చూడటానికి ప్రయత్నించక అది నీవై ఉండనేర్చుకో.నిన్ను నీవు తెలుసుకో. నీ నిజస్ధితి ,
  ఈ ఆత్మకు కులమతములు లేవు. స్త్రీ పురుష బేధంలేదు. చావుపుట్టుకలు లేవు. అదియే సజీవాత్మ. జాగ్రత్, స్వప్న, సుషుప్తి, తురీయ సూక్ష్మచైతన్య స్ధితి
  మదిని నిగ్రహించుట మనసు నిలిపి తన సాధనాబలం చేత దాటిన జ్ఞాని మాత్రం మనసు నిలిపి నిశ్చల స్థితిని పొంది మనసు నిలిపి లగ్నమై ఉంటుంది.
  మనసు నిలిపి శరణాగతినే కోరుకుంటుంది జ్ఞాని మార్గ ఆత్మ జ్ఞానం అనేది ఎంతటి అత్యున్నతి స్థితి సూక్ష్మచైతన్య సాధనల యొక్క అత్యున్నత లక్ష్యం ఆత్మ )సాక్షాత్కారం తన్ను వీడి తాను నిలుచు సూక్ష్మతత్త్వమే నిత్యం. తానని గ్రహించటం సూక్ష్మ తత్వం అంతటా వ్యాపించి ఉన్న సూక్ష్మ తత్వం ఆత్మా సాక్షాత్కారం .’
  ఉపదేశం అన్న మాటకు అర్థం ఆత్మలో ఉండడం లేక ఆత్మగా ఉండడం. అతీతమైన సూక్ష్మచైతన్య స్థితి ఒక క్షణంలోమనసు నిలిచి అమనస్కమైన .క్షణంలోగురువు ద్వారానే దర్శనం చేసుకోవాలి మట్టిచే తయారు చేయబడిన పాత్రలలో నామ రూప భేదమే కాని వాస్తవ భేద మెంత మాత్రము లేదు.
  ఉన్నది ఒకే బ్రహ్మo . ఆత్మలో ఎరుక స్వరూపాము. ఆత్మలో ఏ బేధం లేదని” అనుగ్రహించి తన నిజరూపంతో దర్శనమిచ్చి.. వారి అహంకారాన్ని మట్టికలిపినట్లు చెబుతున్నారు. బ్రహ్మo.సత్యాన్ని గ్రహించాలి.జీవన మార్గంలో సూక్ష్మసాధన ద్వారా “తత్వమసి” అనే సత్యాన్ని గ్రహించాలి. అనుభవించేవాడికి, అనుభవానికి భేదం లేదని సూక్ష్మసాధన ద్వారా తెలుస్తుంది. ఇలా బ్రహ్మ జ్ఞానాన్ని తెలిసికొన్నవారే జీవన్మిక్తులు, “అది” బ్రహ్మo వున్నది. సూక్ష్మచైతన్య స్థితి దీనినే పరతత్వం, పరబ్రహ్మము అమరత్వము.అని కూడా అంటారు. బ్రహ్మo తత్త్వమేసాధించి విషయాన్ని మానవ జాతికి అందించడానికి సూక్ష్మసాధన
  బట్టియేమనసు సంకల్పము సృష్టి గోచరించుర సూక్ష్మ దృష్టి జ్ఞానమయమైన జగమంతయు బ్రహ్మ0చూడర అంతరంగ సూక్ష్మ దృష్టి బ్రహ్మజ్ఞాని లక్షణము దాటిననె మోక్షజ్ఞాన ఫలమురబహుజన్మ పుణ్యఫలమున మానవజన్మ దొరికెరఅమూల్య అవకాశము సద్వినియోగ పరుచర నరుడే నారాయణ స్వరూపుడని తెలియరబ్రహ్మం భావనిష్టలోమనసును నిలువరతెలియర నీవు ఆనందము చెందరా ఆనందము చెంది నీవు అచలుడవై నిలువర అచలాత్మానందమే అమర పదవిర అమర పదవినిచ్చు అఖిలాండ
  మనసును నిలువటమే లేనిపూజ పత్రిచేటని తెలియర నీ హృదయ మందిరంలో విశ్వేశ్వరుని చూడరజగన్మిధ్యా బ్రహ్మసత్యమని నమ్మర జీవో బ్రహ్మైవ నాపర:యని తెలియర అద్వైత మార్గంలో ఆత్మనిలుకడ చెందర ఆత్మ లోఎరుక చైతన్యం .లేని స్ధానంలేదు. ఆత్మ లో ఎరుక చైతన్యం.లేని వస్తువు లేదు. ఆత్మ లో ఎరుక చైతన్యం.లేని జగము లేదు. ఆత్మ లో ఎరుక చైతన్యంలేని జీవము లేదు. ఆత్మ లో ఎరుక చైతన్యం లేని దైవం లేదు. ఆత్మ లో ఎరుక చైతన్యం.లేని ఏ నేనే లేదు. సమస్త ఆత్మ లో ఎరుక చైతన్యం నేనే సర్వాధారం. అట్టి నన్ను తెలుసుకొనుటయే సమస్త మత ధర్మముల, సమస్త వేదాంత యోగసూత్రముల, సమస్త జ్ఞాన యజ్ఞముల ఫలితం. నన్ను మరిచి ఎన్ని గ్రహించినా సర్వం అధోగతియే. నాతో ఈ సమస్తం ఆత్మ లో ఎరుక చైతన్యం ఏకీభవించి ఆత్మ లో ఎరుక చైతన్యం నాయందే లీనమైయున్నది నేనే సర్వమునకు మూలం. మనో జగత్తులకు తేడాలేదు. జగము మనోకల్పితము. నిన్ను నీవు పూర్తిగా భగవంతునికి సమర్పించుకోవాలి. అప్పుడే మనకు దైవానుభూతి కలుగుతుంది. … నిన్ను నీవు నిండా తెలుసుకున్నట్లైతే నీ స్వరూపమే పూర్తిగా మారి పోతుంది. నీలో జ్ఞాన తరంగాలు వెల్లివిరుస్తాయి. … మనసు నిలిపి శుద్ధి ఆత్మనిష్ఠకు తోడ్పడుతుంది. నిన్ను నీవు తెలుసు కొను స్ధితిలో ఏ బ్రహ్మరాతలు నిన్ను అడ్డగించలేవు. దేనికైనను దైవా నుగ్రహం సహకరించవలయునని సమస్త భక్తులు మరువరాదు. నీవు ఒక వ్యక్తివద్ద బాకీ తెచ్చుకున్నావనుకో. ఆ బాకీని అడుగను అని రుణపత్రం చింపివేసిన పిదప బాకీ వసూలుచేసే వారెవరు ఉండరు. తన్ను తాను తెలుసుకొనక బ్రహ్మాండమంతయు పరిశీలించినను వృధా శ్రమయే మిగులుతుంది. తన నిజస్ధితిలోనే అఖిలాండకోటి బ్రహ్మాండ ములు విలీనమై యున్నవి.
  B.రత్నం

 26. rathnamsjcc అంటున్నారు:

  ఆత్మ-జ్ఞానము

  ఓ సోదరా! నీ భార్య ఎవరు? ఎవడు నీ పుత్రుడు? వారికిని, నీకును గల సంబంధమేమి? నీవు ఎవరవు? ఎక్కడనుండి వచ్చితివి? ఈ సంసారమే అతి విచిత్రమైనది. ఈ ఆత్మ తత్వమును బాగా ఆలోచించి తెలుసుకొనుము.
  . ఆత్మ స్వరూపులమైన మనమందరమూ ఈ జన్మలో అమ్మ, నాన్న, భార్య, భర్త, పుత్రుడు, కూతురు, బంధువులు అన్న బంధములతో జీవించుచున్నాము. నీవు పుట్టక ముందు నీ తల్లిదండ్రులతో ఏమి నీకు సంబంధము? అలాగే నీకు పుట్టిన బిడ్డలతో వారి జన్మకు ముందు నీకేమిటి సంబంధము? పెండ్లాడక ముందు నీ భార్య ఎవరు, నీవెవరు? ఈ భవ బంధములేవి పుట్టుక మునుపు లేవు, మరణము తరువాత ఉండవు. కనుక ఈ బంధములు శాశ్వతములు అని నమ్మి వ్యామోహములో పడి చింతనొందకుము. ఈ బ్రతుకు ఒక మాయా నాటకము, అందులో పాత్రలము మనము, నాటకము ఆడునంత వరకు మన పాత్రల బాంధవ్యములు వేరు. అదే విధముగా ఈ జీవన్నాటకము కూడా. అది నిజమని భ్రమించకుము. ఆ భ్రమలో ఉన్నంత వరకూ నా భార్యాబిడ్డలని వ్యాకుల పడుతూ, వారి కొరకు నీ సమయము వృధా చేయకుము. ఉన్నదానితో తృప్తి పడి వారిని పోషించుము, మిగిలిన సమయము భగవన్నామస్మరణలో గడుపుము.

  సర్వవ్యాపకుడైన భగవంతుడు నీయందును, నాయందును కూడా ఉన్నాడు, అతడొక్కడే. సహనము కోల్పోయి, నిష్కారణముగా నాపై కోపముతో ఉన్నావు. నీవు శ్రీఘ్రముగా విష్ణువులో ఐక్యమును సాధింపగోరుదువేని, భేదబుద్ధిని వీడి, అంతటను సమచిత్తుడవై ఉండి గోవిందునే సేవింపుము.
  ప్రతి ఒక్కరు తమ తమ మనసులలో ఈ విధముగా ప్రశ్నించు కోవలెను. నేను ఎవడను?, ఎక్కడ నుంచి వచ్చినవాడను? ఈ జగములో నేను ఏమి చేయుచున్నాను? నాకు తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, బంధువులు, శత్రువులు, మిత్రులు, సేవకులు, గురువులు ఈ విధమైన పలు సంబంధములతో నాతో ఉన్న వీరందరూ ఎవరు? వారితో నా ఆత్మకు సంబంధమేమి? ఆ బంధము ఎంత పురాతనమైనది? ఎంత కాలము నుంచి కలదు? ఇంకెంత కాలము ఉండును? ఈ తనువు తదనంతరము ఇంకను అట్టి బంధము ఉండునా? లేకున్న వారేమగుదురు? నేనేమగుదును? ఈ దేహము ఎచ్చట నుండి వచ్చినది? తిరిగి ఎచ్చటకు పోవును? నాయొక్క నిజస్వరూపమేది? ఈ విధముగా సంసారమును గూర్చి విచారించవలెను. అప్పుడు మన ప్రశ్నలకు మనకే సమాధానము దొరుకును. ఆ సమాధానములతో ఆత్మతత్వము అవగతమగును. సంసారము ఒక కల వలె తోచును. మన బంధములన్ని ఒక మిధ్య అని జీవన్నాటకములో మనము ధరించిన పాత్రలని అర్ధమగును. దాని వలన మనసులో అలిమిన మోహము నశించి, మమకారము, వ్యామోహము, వస్తు ప్రపంచముపై ఆశా పాశములు నశించి ప్రశాంత చిత్తము కలుగును. దాని మూలముగా బంధ విముక్తులమై పరమానందము బడయగలము.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: