అసలు నాకెందుకు ఇలా జరుగుతాయ్?

మనం తీసుకునే నిర్ణయాల ఆధారంగా మన భవితవ్యం ఎలా ఉంటుందో ఊహించుకుంటాం.. ఏది జరిగిన అంతా మన మంచికే అని అనుకునే నాకు ఈమధ్య కాలంలొ మరేది అనుకూలంగా జరగట్లేదు..! కాలం నా పై కన్నెర్ర జేస్తుందొ.. విధి నాతొ వింత ఆటలాడిస్తుందో లేదా ఎవరైన నాపై విభిన్న అస్త్రాలు సంధిస్తున్నారో నాకైతే అర్దం కావట్లేదు గాని ప్రతికూల సంఘటనలను ఎదుర్కొంటున్నాను.. అనుకున్నట్లుగా ఏది జరగట్లేదు.. ఏది కలిసి రావట్లేదు.. జీవితం లొ అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఒప్పుకుంటాను కాని ఇలా నాపై పక్షపాత దోరణిని ప్రదర్శిస్తు.. నన్ను ఏదో జనిగ లా పట్టేసి ఉన్నదంతా పీల్ఛెస్తున్నట్లుగా అనిపిస్తుంది….

mood

 1. నాకు గుర్తొచ్చినప్పుడు (ఒళ్ళు పెరిగినప్పుడు అంటే కరెక్టేమో) వెళ్ళే  జిమ్మ్ కాస్త మూతపడింది.. ఇంకేముంది..  నాకు కొంత కాలం పాటు  అసలు గుర్తుకురాకుండా చేసేసింది..
 2. సెప్టెంబర్ మాసం లొ బెంగళురు కి గుడ్ బై చెప్పి హైద్రాబాద్ కి తిరుగు ముఖం పడదామనుకున్న నాకు మరొ ఐదు నెలల పాటు ఎటు వెళ్ళలేకుండా ఉన్న పని కాస్త ఎక్కువై ఒత్తిడి తొ ఏమి చేయలేక ఉన్నది చేయాల్సి వస్తుంది…
 3. నా మొబైల్ కాస్త గుడ్డిదైందని (డిస్ప్లే పోయిందని) సర్విసె సెంటర్ లొ రిపేర్ కిచ్చినా ఫలితం లేక పోవడం తొ నా మిత్రుడు, నిపుణుడు అని చెప్పుకునే మా జొగ్ రాజ్ కిస్తె  ఇంతకి తిరిగి నా చేతికి రాలేదు.. వస్తుందన్న ఆశ లేదు.. వచ్చినా తిరిగి దానిని ఇంతకు ముందు లా ఉపయోగించుకోగలనన్న ఆత్రుత అంతకన్నా లేదు…
 4. అసలు ఎప్పుడు ఏమి పలకరించని మా రూం ఓనరు.. వచ్చె నెల నుండి రెంటు పెద్ద ఎత్తున పెంచబోతున్నట్లు మా రూం మేట్ నుండి అందిన సమచారం…. సైకిల్ రిక్షాకి ఫ్లైట్ ఫేర్ అన్నట్లు గా ఉంది తన ప్రకటన.. అసల రూం కి ఇచ్చే కిరాయే ఎక్కువ అని మేమనుకుంటుంటే  ఇంకా పెంచుతానంటాడేంటో.. వెధవ నస…
 5. మా అఫిస్ లొ ఉన్న లిఫ్టులు నాకెంత ఓర్పు ఉందొ అని నిత్యం పరిక్షిస్తూ ఉంటాయ్. నేను సరిగ్గా టాప్ ఫ్లోర్ కి వెళ్దామనుకున్నప్పుడు ఉన్న మూడు లిఫ్టులు పైనే సంచరిస్తూ ఉంటాయ్…పైనుండి కిందికి రావు.. ఎపుడైన నేను పై ఫ్లోర్ నుండి కిందికి వద్దామనుకున్నప్పుడు కిందనుండి పైకి త్వరగా రావు….కిందనే తగలబడతాయ్… రోజు ఒక పది నుండి పదిహేను నిమిషాలు నాకు నేను చాలా ఓపికతొ ఎదురుచూస్తు ఉండాలి వాటికోసం..
 6. అసలు దేశమంతా స్వైన్ ఫ్లూ భయం తొ వణికిపొతున్న ఈ టైము లొ నాకు జలుబు ఎందుకు చేయాలి, దగ్గు ఎందుకు రావాలి…. భయపడకండి.. కోలుకున్నాను.. మాములు మనిషి గా మారడానికి మూడు రోజులు పట్టింది.. హైద్రాబాద్ లొ మిత్రులతొ లవ్లీగా గడపాల్సిన క్షణాలు లోన్లీగా గడిపాను.
 7. ఇదిలా ఉంటే ప్రస్తుతం లండన్ లొ ఉన్న మా అన్నయ్య నాకోసం హై-ఫై లాప్టాప్ తీసుకుందామనీ ఎవడో ఇంగ్లీష్ లోఫర్ గాడి చేతిలొ లోప్రైస్ మత్తు తో మోసపొయడటా… ఖర్మ బాబు ఖర్మ..!
 8. ఎడమ చేతిలొ మొబైల్ ఉంచుకుని ఎక్కడ ఉందో అని కుడి చెత్తో వెతికే మా జోగ్-రాజ్, మా మిత్రుడు శ్రీనివాస్ మరియు నేను జన్యూన్ గా లోన్ సెటిల్మెంట్ చేస్తామంటూ ఒక నివేదిక సమర్పించి ముడుపులందుకున్న ఓ సుపరిచితుడి అపరిచిత వ్యక్తి ఏ పని మొదలెట్టకుండా జాలీ గా తప్పించుకుని తిరుగుతున్నాడు….ఆర్ధికంగా కష్టాలు తగ్గుతాయేమో అనుకుంటె ఆనక పెరిగిపోయాయ్..

ఇలా ఎన్నో నన్ను కలవరపెట్టిస్తున్నాయ్…! త్వరగా ఉపశమనం కలుగుతుందని మీతో పంచుకుంటున్నాను.. ;)

ప్రకటనలు

9 Responses to అసలు నాకెందుకు ఇలా జరుగుతాయ్?

 1. anu అంటున్నారు:

  ఎన్ని కస్తాలండీ ! ఈ రోజు మీకు జరిగిన పది మంచి పనులేంతో కూడా రాయండి.ఈ రోజు మంచి కూర తిన్నా లాంటివి కూడా ! ఎందుకంటే లిఫ్ట్ కస్టాలు కూడా చెప్పారు కదా !
  వెంటనే ఉపసమనం కలక్క పొతే అడగండి.

 2. Suman అంటున్నారు:

  anna namaste…maa room ki vachey…nee kosam maa room talupulu yeppudu teriche untayi….

  LIFT Prob: Idi andariki jarugutune untundi …baadha padaku….
  for ex: nenu Majestic Bus kosam wait chestu unte Shivaji Ngar and KR Market buses vasatyii and vice versa…

 3. nelabaludu అంటున్నారు:

  @Anu …
  మీ లాజిక్ బాగుందండి.. ;)
  @ Suman ..!
  Back 2 banglore?
  Well… room talupulu prastutaniki moosey.. nenochchinappudu terudduv kaani ledante evaraina vastaru ;) ;)

 4. Sri అంటున్నారు:

  same thing with me for the last 8 months. Nothing works out, so many pending issues..enough issues for the next year. You know, I have bought a car in January and I could get it registerd only this month.To conclude, it happens with everyone at times. so, do not worry.

 5. prasad అంటున్నారు:

  బావున్నారండీ, మీరు అసలు నాముందు గడ్డి పోచ, మా మిత్రుడు రమేష్ అని ఉన్నాడు ఆయన ముందు నూలు పోగు అనుకోండి మా కేసులు సిక్కిం బంపర్ లాటరీ టైపు. లక్ష మంది కొంటే ఒకరికి తగులుతుంది కదా, అలాగే లక్ష మందిలో ఒకరికి వచ్చే వెధవ టెక్నికల్ సమస్యలు నాకు వస్తుంటాయి. అలాగే లక్ష మందిలో ఒకరికి ఎదురయ్యే చిన్నాచితక సమస్యలు ఆయనకు వస్తుంటాయి. ఉదాహరణకు : బ్యాంకు అకౌంట్లు, ఫోన్ సమస్యలు… ఇట్లాంటివి నాకు సర్వ సాధారణం. రమేష్ అయితే ఈ మధ్య కార్బన్ సెల్ పీస్ కొన్నాడు. దానికి వెనుక వైపు వున్న కవర్ పోయింది. షాపు కూడా మామిత్రుడిదే వెళ్ళి అడిగితే ఇది మొదటి కేసట. రోజుకు పదికి పైన అమ్ముతాము ఎన్నో నెలలు అయింది. ఎవరికీ ఈ సమస్య రాలేదు అన్నారు. అసలు విషయం ఏమంటే ఆ కవర్ స్పేర్ గా దొరకదు. ఇలా చెబితే చేంతాడంత అవుతాయి.

  కానీ నిజంగా ఆలోచిస్తే కొన్ని మనం అనుకున్న దానికంటే సాఫీగా జరిగిపోయి ఉంటాయి. అవి మనకు గుర్తు ఉండవు. మన సహనాన్ని పరీక్షించిన ఘటనలు మాత్రమే మనకు దురదృష్టపు గీటురాళ్ళుగా నిలబడి గుర్తుకొస్తుంటాయి. ఏమంటారు?

 6. nelabaludu అంటున్నారు:

  @ Sri..
  Thankyou… Ohh.. is it… At last you registration done.. good to know ;) Hope things all set right for you…
  @Prasad
  అయ్యో రమేష్….. ;(
  కార్బన్ సెల్ పీస్ అంటె గుర్తొచ్చింది.. మా ఫ్రెండ్ ఒకరు రింగర్ ప్రాబ్లెం ఉందని షో రూం లొ ఇస్తె నెల రోజులకు గాని తిరిగి ఇవ్వలేదట..
  మన సహనాన్ని పరీక్షించిన ఘటనలు మాత్రమే మనకు దురదృష్టపు గీటురాళ్ళుగా నిలబడి గుర్తుకొస్తుంటాయి. ఏమంటారు? — అవునండి చాలా బాగా చెప్పారు.. అలాంటివి కూడ నా ఖాతా లొ బద్రం గా ఉన్నాయ్… అప్పుడప్పుడు నేను సహనశీలిని అని అనిపిస్తుంది..

 7. a2zdreams అంటున్నారు:

  ఇలా లిస్టు చేసుకుంటే వాటి భారం తప్పకుండా ఒకొటొకటి తగ్గుకుంటూ పోతుంది. Photo bagundi. :)

 8. aswinisri అంటున్నారు:

  baaabu! ivi kashTalu kaanea kaavu! just bratuku sandiTloeni irukulu antea! nityam mrtyu mukham chearukuni ayinaa oesaari venukaki tirigi “chal rea hum loeg tum koe paar kar kea aayea hai” ani navveaseavallu koekollalu. adii sangati! nela—baaludugaaruu! maream bhayam leadu! lift vunDipoetea, “aa louT kea aajaa merii miit ani paaDutuu akkaDea nilchuni viilaitea krinda chimala baarula parigeDutunna manushulani chuuDanDi! veh veh veh! (simply to make you smile, that is all! take it easy nela—baaludugaaru!u! life is just a file holding several incident without those nothing is interesting to recollect later on!!

 9. nelabaludu అంటున్నారు:

  @ a2zdreams ..
  thank you
  @ aswinisri.
  బాగా మోటివేట్ చేసారు.. కాని ఏదొ చిరాకుగా అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు ..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: