దిస్ ఆగస్ట్ మంత్ – గ్రీట్స్, న్యూస్, న్యూసెన్స్-న్యూసైన్స్.

ఆగండాగండి.. శీర్షిక చూసి ఈ నెల కరెంట్ ఎఫైర్స్ అనుకుని టివి లొ చూసేయేగా లేదా పేపర్ లొ చదివేయేగా అని నిర్లక్ష్యం చేయకండి… ఓపెన్ చేసినందుకు గాను ఈ నెలలొ నా చుట్టుతా ఉన్న ప్రపంచం విశేషాలు నా అనుభూతులు ఆలకించండి మరి..!
aug

గ్రీటింగ్స్… గ్రీటింగ్స్…

ఎప్పటి లాగే కాకుండా ఈ నెల లొ నా క్లోజ్ ఫ్రెండ్స్, కొలీగ్స్ బర్త్ డే లు ఎక్కువగా ఉన్నాయ్.. ఒక్కరిని కూడ మిస్ కాకుండా జంటిల్  రిమైండర్ పెట్టుకొని మరి విష్ చేసే నేను ఈ సారి ఘోరంగా విఫలమయ్యాను.. కొందరికి చేసాను మరి కొందరిని మిస్ అయ్యాను..అదీ ముఖ్యమైన వారిని.. గజి బిజి షెడ్యులే కాకుండా ఈ నెల లొ ఓ రెండు వారాలు  పూర్తిగా ట్రావెలింగ్ కి పరిమితమయ్యాను.. పర్యవసానంగా బ్లాగ్ నుండి తెలియజేస్తున్నాను..  నేను విష్ చేయని వారికి మాత్రమే సుమా… ;)

 • ఆగస్ట్ 5 న భూమిపై మొలకెత్తిన మై డిగ్రీ దోస్త్ కిట్టు అలియాస్ రామ క్రిష్ణా రెడ్డి (వీడికీ మూడు నెలల క్రితం పెళ్ళైంది తిరుపతి లొ) మరియు పిజీ దోస్త్ శివ కుంట (ఫ్రెష్ ఫాదర్)  గార్లకి జన్మదిన శుభాకాంక్షలు..
 • నా మొదటి ప్రాజెక్టు కి దాదాపుగ రెండు సంవత్సరాలు చేసాను.. మా ఆన్ సైట్ టీం లొ క్లైంటు తరుపున  రసెల్ బేకర్ అను ప్రైమరీ కాంటాక్ట్ పర్సన్ ఉండేవాడు. నాకు చాల ఫేవరబుల్. నేను ఆ ప్రాజెక్ట్ వదిలేసి రెండు సంవత్సారాలైన ఇప్పటికి కాంటక్ట్ లొ ఉన్నాడు… మనోడి బర్త్ డే ఆగస్ట్ 6 న.. My Dear Russ.. I wish you a very happy birthday !!!
 • ఉద్యోగరీత్యా మొదటి కంపెనీ (ఇప్పుడూ అదేలేండి !) కంపెనీ లొ మొదటగ పరిచయం అయిన వ్యక్తి…  మెంటర్, టెకీ స్టార్ అంతకు మించి మంచి వ్యక్తిత్వం, మై క్యాబ్ పార్ట్ నర్ మహేష్ మాలూరు గారి పుట్టిన రోజు ఆగస్ట్ 8. నాతో చాలా ప్రొఫెషనల్ విషయాలు పర్సనల్ గా  పంచుకుంటుండేవారు. ప్రస్తుతం అమెరికాలొ స్థిరపడ్డారు. మహేష్ గారు… మీరు ఇలా  ఎన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలనుకుంటూ మీ శ్రేయోభిలాషి..
 • విషింగ్ లిస్ట్ లొ మిస్ అయిన మరొకరు Shankhath Shaik, తను నా మొదటి ప్రాజెక్ట్ టిం మెంబర్. వెరీ స్పాంటేనియస్…జావియల్..  మేమంతా ఆఫిస్ లొ ఎప్పుడు సరదాగా కబుర్లు చెబుతు, అల్లరి చేస్తూ అప్పుడప్పుడు పని కూడా చేస్తూ ఉండేవాళ్ళం, ఒక రోజు మా కుళ్ళు జోకులను గమనిస్తూ  ఎదురు క్యూబిక్ లొ కూర్చున్న మరో ప్రాజెక్ట్ లీడర్ సీరియస్ గా మీవల్ల మా టీం చాల డిస్టర్బ్ అవుతుంది.. దానికి మనవాడు బదులుగా  “ఓ మీరు ఈరోజు పని చేస్తున్నట్టు మాకెలా తెలుసు?” అని చమత్కరించాడు…. దీంతో ఆ ప్రాజెక్ట్ లీడర్ మరెప్పుడు మా టీం డిస్కషన్స్ లొ తల దూర్చేవాడు కాదు..! ఆగస్ట్ 21 న మనోడి జన్మదినం. డియర్ Shankhath Shaik… హార్దిక జన్మదిన శుభాకాంక్షలు..
 • ఆగస్ట్ 22 న మెగా స్టార్ చిరంజీవి బర్త్ డే ఐతే గుర్తుంది కాని మై జాన్ జిగ్రీ శ్రీధర్ ది అదే రోజు అయిన విష్ చేయలేక పోయాను… హే శ్రీ.. 37 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మీకు.. కంగ్రాట్యులేషన్స్ ;)  (నా పుట్టిన రోజు న హ్యపీ బర్త్ డే అని విష్ చేయకుండ.. సింపుల్ గా కంగ్రాట్స్ అంటాడు, అందుకే అలా విష్ చేసాను)

న్యూస్.. న్యూస్…

 • గత కొన్ని యుగాలుగ పెళ్ళి వేటలొ ఉన్న మై పి.జి దోస్త్ బాలు ఎట్టకేలకు తన వివాహం ఆగస్ట్ 6 న పెద్దల సమక్షం లొ తిరుమల వెంకన్న ఆశిస్సులతొ అత్యంత వైభవం గా జరిగింది.
 • అదే ఊపులొ ఉన్న మరొ పి.జి మిత్రుడు వెంకట్ రెడ్డి గారి పరిణయం ఆగస్ట్ 8 న వీనుల విందుగా చేయించి వచ్చాం..
 • అదే బాటలొ నడుద్దామనుకుంటూ ప్రస్తుతం బెంగళూరు లొ ఉన్న సదరు పి.జి క్లాస్ మేట్ అయిన వంశీ కి నిశ్చితార్దం డేట్ కన్-ఫర్మ్ అయింది…
 • ఇక మా జోగ్:రాజు అలియాస్ గంగాధర రావు వయసు 31 సం..  తన అదౄష్టాన్ని  పంతొమ్మిదవ సారి పరిక్షించుకోబుతున్నాడు… కళ్యాణ యొగం కోసం తన తన ప్రయత్నాలొ మునిగి తేలుతున్నాడు… రేపు మరొ షూటింగ్.. లెట్స్ హోప్ ఫర్ బెస్ట్..
 • పర్సనల్ న్యూస్ కొస్తె.. గత కొంతకాలం గా కంటి చూపు మందగించిన మా నాన్న గారికి ఆపరేషన్ చేయించాం. ఇప్పుడిప్పుడె కోలుకుంటున్నారు…

న్యూసెన్స్ – న్యూసైన్స్ …

 • ఏదైన pleasure గా చేస్తే గాని satisfaction ఉండె నాకు ఈ మద్య ఏ పనైన pressure గా చేయల్సి వస్తుంది.. ;( … ఇదిలా ఉండగా గత వారం నుండి ఆఫిస్ లొ ఓణం సందర్బంగా… మలయాళీ అమ్మాయిలు తనదైన శైళీ లొ సంప్రదాయ వస్త్రాలంకరణ తొ ప్రదర్శనలిస్తున్నరు.. కాస్తా రిలిఫ్* గా ఉంది…

* ఈ రిలీఫ్ తో సాంకేతిక కారణాల వలన ఇంక ప్రచురించలేక పోతున్నాను.. మీకు కలగని అనివార్యానికి చింతించుట లేదు.. .

మిగతా న్యూసెన్సులు, న్యుసైన్సులకు చూస్తూనే ఉండండి నిరంతర ప్రసారావాహినిలు అ-ఱ టి.వి ఛానెల్స్. తిరగేస్తునేవుండండి వార్తా పత్రికలు.

(సశేషం)

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: