విద్యాదాతకు వందనం!

srdy

గురు బ్రహ్మ గురు విష్ణు:
గురు దేవో మహేశ్వరహ:
గురు సాక్షాత్ పర బ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమ:

నా జీవితం లొ నన్ను వెన్ను తట్టి ప్రొత్సహించిన గురువులందరికి వందనాలు. సకల విద్యలకు గురువే ప్రాణం అని అంటారు, నేను అభిమానించిన, నన్ను అభిమానించిన ఉపాధ్యాయులు కోకొల్లలు.నా అక్షరాభ్యాస ప్రస్థానం లొ కె. జి నుండి పి.జి వరకు ఎందరొ మహానుభావుల ద్వారా ఎంతో నేర్చుకున్నాను.. గురుపూజోత్సవం సందర్భంగా మీతో కొన్ని విశేషాలు పంచుకుంటున్నానిలా …

మార్గ నిర్దేశకుడు,  పూజనీయుడు, విద్యా దాత దైవ సమానుడు,  విద్యార్దులకు ఆదర్శప్రాయుడు కె.శివారెడ్డి తొ నా అనుబంధం ఎప్పటికి మరువలేనిది.. నా జీవితం లొ చిరస్థాయి గా మిగిలిపొయిన మహొన్నత వ్యక్తి.

srdy3శివారెడ్డి గారితొ పరిచయం 1996-1997 లొ మొదలైంది.. పదవ తరగతి చదువుతున్న రోజులవి. మా స్కూల్ ప్రిన్సిపాల్ చంద్రా రెడ్డి గారికి స్వయాన అన్నయ్య. తరచుగా మా స్కూల్ కి వస్తుండేవారు… అప్పుడప్పుడు స్టడి హవర్స్ టైం లొ ఏవొ సమధానం లేని ప్రశ్నలు (రాని అని సరిచేసుకోగలరు) అడుగుతుండేవారు. ఇదిలా ఉండగా ఒక రోజు మా క్లాస్ టీచర్ రాంబాబు గారు క్లాస్ లొఓ అనౌన్స్-మెంట్ చేసారు.. అరుణోదయ కాలేజ్ వారు పదవతరగతి వారికి మోడల్ టెస్ట్ పెట్టబోతున్నారు, టాప్ జాబితాలొ ఉన్న 10 రాంకర్స్ కి ఆ కాలేజ్ లొ ఇంటర్మీడీయట్ కోర్స్ కి ఉచిత ప్రవేశం కల్పిస్తారు అని. ఆ మోడల్ టెస్ట్ కి హయత్ నగర్ నుండి దిలుసుఖ్ నగర్ వరకు దాదాపుగ ఇరవై స్కూళ్ళ నుండి సత్తా నిరూపించికోవడానికి వచ్చిన విద్యార్దులలొ నేనొకడిని.

వారం తిరగ్గానే ఫలితాలు. ఆ టాప్ 10 జాబితాలో ఉన్న రాంకర్స్ లొ మళ్ళీ నేనొకడిని. ష్.. ఎలా వచ్చిందనేది ప్రస్తుతానికి అప్రస్తుతం… గంగాధర్ అనే మరొ మిత్రుడు కూడ దాంట్లొ చోటు దక్కించుకున్నాడు… మా స్కూల్ నుండి ఇద్దరం సెలెక్ట్ అవ్వడం తొ మా ప్రిన్సిపాల్ తబ్బి ఉబ్బయ్యాడు.. రాంకర్స్ మీట్ అని పేరంట్స్ తొ సహా సాదరంగా ఆహ్వానించారు. నేను మా మిత్రుడు అలా వెళ్ళొద్దాం పదరా అని హాలు లొకి అడుగుపెట్టాం. నా చూపు అక్కడ డయాస్ పై ప్రసంగిస్తున్న వ్యక్తి వద్దకు మళ్ళింది. తనెవరొ కాదు మా ప్రిన్సిపాల్ అన్నయ్య శివారెడ్డి గారు. అప్పుడు తెలిసింది ఈ కాలేజ్ తనదని అంతే కాక తనకింకా బొలేడు స్కూళ్ళూ, కాలేజిలు వున్నాయని.. తన ప్రసంగం లొటాప్ రాంకర్స్ ఇంటర్మీడియట్ కోర్సుకై ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని బాగ కష్టపడి ఇంటర్ లొ టాప్ రాంకులు తెచ్చిపెట్టాలని సూచించారు.. తను చెప్పిన దాంట్లొ నాకు సగం మత్రమే సరిగ్గ అర్దమవ్వడం తొ అదే కాలేజ్ లొ జాయిన్ అయ్యాను.

కళాశాల  నిర్వాహణ బాద్యతలే కాకుండా ఇంటర్మిడియట్ లొ శివారెడ్డి మాస్టారు ఫిజిక్స్ సబ్జెక్ట్ చెప్పేవారు.. కొత్తగా ఒక నిబంధన ప్రవేశపెట్టారు.. క్లాసులు పూర్తయ్యాక స్టడీ హవర్స్ అంటూ సాయంత్రం ఐదు గంటల వరకు చదువుకోవాలాని  ఆ తర్వాతే ఇంటికి పంపించేదని అనుసూయ మేడం (తను శివారెడ్డి మాస్టారు గారి భార్య) పర్యవేక్షణ లొ మొదలు పెట్టడం జరిగింది.

మాకు వౄత్తి రీత్య పాల వ్యాపారం ఉండేది, నేను స్టడీ హవర్స్ కి ఉండడం వీలు కాదని మా ఇంట్లో పనులు ఉంటాయని, నేను ఇంట్లొ పడే కష్టాన్ని మొరపెట్టుకున్నాను. అది విన్న మేడం సంతోషించి బాగ కష్టపడాలి, వౄద్దిలోకొస్తావ్ అని స్టడి హవర్స్ కి అవసరం లేదులె కాని బాగ చదువుకొ అలాగె మాకు రోజు ఒక లీటరు పాలు తేగల్గుతావా అని అనడం ఓ యస్ అని అప్పటి నుండి రోజు వారింట్లొ పాల బాటిల్ ఇచ్చేసి అటు నుండి కాలెజ్ కి వెళ్ళేవాడిని.. దానితొ ఆ మాస్టారు కి నాపై సదభిప్రాయం ఏర్పడింది..

కాని ఏ మాటకామటే చెప్పుకోవాలంటారు తను ఫిజిక్స్ లొ ఒక రొజు “కాంతి” అనే పాఠాన్ని భోదిస్తుండగా విపరీతమైన నిద్ర వచ్చేసింది. అదీ మొదటి పిరియడ్ పైగా.. దాని గ్రహించిన మాస్టారు ఏం.. శంకర్ దాదా..? రాత్రి థార్డ్ షో కెళ్ళావా అని  చలోక్తి విసిరి నన్ను నిద్ర నుండి లేపాడు… ;)  అదే నా తోటి వారు ఎవరైన నిద్రా పోతున్నట్లు తెలిస్తె ఒక ఐదు నిమిషాలు ఏవో ప్రశ్నలడిగి కంగారు పెట్టేవాడండోయ్..

ఎన్నొ తింగరి చేష్టలు చేసి మాస్టారు ముందు  ఫేం అయ్యాను, తింగరి చేష్టలకి మరొ రెండు టపాలు రాయాల్సిందే..

ఇంటర్ పూర్తయ్యాక డిగ్రీ చేయాలనుకొని ఎంసెట్ ప్రిపరేషన్ ఇష్టం లేక  BCA చేయడానికి ఆర్ధిక స్థోమత చాలక BSC (Comp) అదే కాలెజ్  లొ మాస్టారు తొ ఉన్న సాన్నిహిత్యం తొ ఫీజ్ లేకుండా మూడు సంవత్సారాలు అలా ముగించేసాను..  ఆ మూడు సంవత్సారలు తన నుండి ఎన్నో నేర్చుకున్నాను.. గురువు మాత్రమే కాక  తనలొ నాకు ఒక మిత్రుడి గా స్థానం ఉందని గ్రహించాను… ప్రతి దానికి నాకు చేదోడు వాదోడిగా ఉంటుండేవాడు.

డిగ్రీ పూర్తయ్యాక, చదివిన చదువులు చాలు.. ఇక ఏదొ చిన్న చితక ఉద్యోగం చేద్దాం అని ప్రయత్నం లొ ఉంటూ, తనకి కనపడకుండా రోజు వారింటికి వెళ్ళినా (పాల బాటిల్ ఇవ్వడానికి, కిచెన్ రూం ఎంట్రీ నుండి వారి పని మనిషికి ఇచ్చేసేవాడిని)తారస పడకుండా తిరుగుతుండేవాడిని…కనపడితె ఫ్యూచర్ ప్లాన్ అడుగుతాడేమొ అని.. అసలు నాకే క్లారిటి లేదు..! ఒక వారం సమ్మర్ హాలిడేస్ అని తన స్వస్థలం యమ్మిగనూర్ ఫ్యామిలితొ వెళ్ళారు… తిరిగొచ్చాక ఫోన్.. పాల కోసం.. శంకర్ సేఠ్…. ఈ రోజే వచ్చాం…. మీ సేవలు తిరిగి ప్రారంభించండి అంటూ..!

అప్పటికి ఏదొ రాద్దామంటె రాద్దాం అని మిత్రులతొ కలిసి I-CET వ్రాసాను…చెప్పుకోదగ్గె ర్యాంకే వచ్చింది(?). డిగ్రి కే చరమాంకం పెడదామని మెంటల్ గా ఫిక్స్ అయినా నాకు.. మాస్టారు M.C.A చెయ్యొచ్చు కదా.. ఇంతవరకు చదివావు.. మంచి ట్రాక్ ఉంది.. నీ పొజిషన్ తెలుసు నాకు..నేను హెల్ప్ చేస్తాను ఫైనాన్షియల్ గా అని అన్నాడు. నువ్వు  కెరియర్ లొ సెట్ అయ్యక ఇద్దువులే అని ప్రోత్సహించి..నువ్వైతె కౌన్సిలింగ్ అటెండ్ అవ్వు నీకు నచ్చిన కాలెజ్ లొ జాయిన్ అవ్వు.. అని కౌన్సిలింగ్ లొ చెల్లించాల్సిన ఫీజు 27,500 /- (ఇప్పటికి గుర్తుంది) ఇచ్చి బాగా మోటివేట్ చేసి మరి పంపించారు.. నేను ఫలనా కాలెజి అని అనకుండా తన కాలెజ్ Noble PG College కి కౌన్సిలింగ్ లొ ఓటు వేసాను.   కొన్ని నెలల తర్వాత మా ఇంట్లొ వారి ప్రమేయంతొ తనకి తెల్సిన మిత్రుడు అయిన అంధ్రా బాంక్ మేనేజర్ తో ఎడ్యుకేషన్ లోన్ ఇప్పించేలా ఏర్పాటు చేసాడు.. !

అటు తర్వాత మరింత దగ్గరయ్యారు.. వారి పిల్లలకి కొన్ని రోజులు ట్యూషన్ కూడా చెప్పాను.. కాలెజ్ లొ లెక్చరర్ ల పై  ఏ నిర్ణయం తీసుకోవాలన్న నాతొ చర్చిస్తూ.. నాకంటూ ఒక గుర్తింపు తెచ్చారు..

MCA పూర్తయింది .. ఉద్యోగాల వేట లొ ఉన్నాను.. అయిన నిత్యం వారిని మాత్రం దర్శిస్తుండేవాడిని… కొంత కాలం గా అనారొగ్యంగా ఉన్నారు… కిడ్నీ ఆపరేషన్ జరగడం… కోలుకోవడం… తనని కలిసినపుడు నా కెరీర్ గూర్చి అడగడం.. మళ్ళీ తన ఆరోగ్యం మరింతగా క్షీణించడం..హాస్పిటల్ లొ ఉండటం… డిసెంబర్ 24 2005 న నేను ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాను… తనతొ పంచుకుందాం అనుకున్నాను.. తను ICU లొ ఉన్నారని తెలిసింది.. ఇంతలొ విషాదం. డిసెంబర్ 26 న అస్తమించారు.. తీరని లోటు…!  ఒక గురువుని, మిత్రున్ని, విశ్వసనీయమైన వినియోగదారుడిని  శాశ్వతం గా కోల్పోవడం నా దురద్రుష్టకరం.

తొమ్మిదేళ్ళపాటు ఉన్న అనుబంధం మరువలేను..తర్వాత చెన్నయ్ వెళ్ళాను… పాల వ్యాపారం చేసేందుకు సమయం చాలక  తగ్గించేసాం  ఇప్పటికి ఆ కాలెజ్ కి నా వంతు సహాకారం అందిస్తున్నాను..

శివారెడ్డి గారే కాక ఇంకా ఎందరొ గురువులు నాకు ప్రేరణ… ఆచార్యులందరికి  శిరసానమామి!

టాప్
ప్రకటనలు

10 Responses to విద్యాదాతకు వందనం!

 1. subhadra అంటున్నారు:

  చాలా బాగా రాశారు.
  మ౦చి అనుభవాలు రాశారు,మీరు గురువుకి తగ్గ శిష్యులే..
  చేసిన మేలు మరవకు౦డా ఉ౦డట౦ నిజమైనా ధ్యా౦క్స్ అని నా అభిప్రాయ౦.
  శివారెడ్డి మాస్టారు ఆపాత్ర దాన౦ చెయలేదు నాకు అనిపిస్తు౦ది.
  మీకు,మీ మాస్టరుకి నా టీచర్స్ డే శుభాకా౦క్షలు.

 2. krishna అంటున్నారు:

  గురువులనుండి సహాయం పొందటమో, లేక గురువులు శిష్యులకు సహాయం చేయటమో గొప్ప కాదు అండి, ఇలా గుర్తు పెట్టుకొని ఇలా మా అందరితో పంచుకోవటం చాలా గొప్ప.
  దాదాపు ఓ 35 సంవత్సరాలు తను తన శిష్యులకు పాఠాలే చెప్పటమే కాకుండా, వాళ్ల భవిష్యత్తుకోసం తపించిన ఓ టీచర్ బిడ్డగా చెబ్తున్నా, మీ లాగా గుర్తు పెట్టుకొని, మాష్టారు బాగున్నారా, మేమూ బాగానే ఉన్నాము అని పలకరించే పలుకులే ఆ టీచర్లకు లక్షలతో సమానం, ముఖ్యంగా రిటైర్మెంట్ తరువాత.
  ఈ టపా వ్రాసినందుకు నా అభినందనలు.

 3. రవి చంద్ర అంటున్నారు:

  చక్కటి సంఘటనలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.

 4. nelabaludu అంటున్నారు:

  @ subhadra …
  @ krishna …
  @ రవి చంద్ర …
  ధన్యవాదాలు…

 5. Suman అంటున్నారు:

  touch chesavayya….touch chesav…

 6. kusumakumari అంటున్నారు:

  శ్రీ గురుభ్యో నమః.
  కలి కాలంలో కూడా అంత చేయూత నిచ్చిన మహోన్నత వ్యక్తులు.
  సుభద్ర గారు అన్నట్టు మీ వంటి మంచి శిష్యుణ్ణి అధ్యాపకులు సంపాదించారు
  కూడా.
  క్రిష్ణ గారు చెప్పినట్టు – కృతజ్ఞతతో ఉపాధ్యాయులను గుర్తు పెట్టుకోవడము అక్షర లక్షల విలువైనది.
  ఎందుకంటే , ఈ రోజులలో – ఉపకారం చేసిన వారిని గుర్తు ఉంచుకోవడం నేరంగా భావిస్తున్న రోజులు ivi , kadaa mari ?!?.

 7. kusumakumari అంటున్నారు:

  ” శంకర్ దాదా మూడవ షో చూసి వచ్చావా ఏంటి ? ”
  :)

 8. nelabaludu అంటున్నారు:

  @ Kusumakumari..!
  అవునండీ.. థార్డ్ షో.. .. ;)

 9. Ramsh అంటున్నారు:

  hi annaya,
  shivareddy sir gurinchi ni blog lo chadivi , Vaari photo chusi anandapaddanu. Vaari tho unna memories anni okkasariga na kalla mundara sajivama kadaladai. shivara reddy sir oka vidaya pradatha, oka manchi mitrudu, oka adarshavanthudu, oka manishi jeevitam lo unde manchi patralannitki saripoye oka mahanubavudu.
  atuvanti maha manishi tho paatu nenu 5 years unnanu. ni valla ee roju malli oka pratyekamga gurutuku techukunnanu.
  Guruvu gaaru kanipiste ekkada namaste pettali chetulu payiki etti ani namoshiga anukune ‘e’ rojullo ayanaki ni blogulo oka photo petti. ayana memories ponduparichi , devuditho samanamayina sthananni kalipichavu.
  You are great brother.

 10. nelabaludu అంటున్నారు:

  @ Ramesh ..
  ధన్యవాదాలు.. జీవన ప్రయాణం లొ శివా రెడ్డి గారు చెరగని ముద్ర వేసారు…! తన గురించి ఎంత చెప్పిన తక్కువే..!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: