అనుక్షణం నీకై… ఈ నిరీక్షణ..!

2009/10/28

waiting

అనుక్షణం నీకై… నీ కొరకై..
నిండు వెన్నెలొ జాబిలి లా
ఎండమావిలొ వర్షం లా
లేత నిద్దురలొ పచ్చని కల లా
వేచి చూస్తున్నాను..

నువ్వెక్కడున్నావో తెలీదు గానీ..
తిన్నా తినకున్నా
పడుకున్నా లేచినా
ఆలొచించినా ఆరాధించినా
నా వెంట పడుతున్నావ్..

ఊహలతొ గందరగోళం చేయిస్తున్నా..
జ్ఞాపకాల ఊబి లొకి లాగుతున్నా..
నా ఈ ఒంటరితనాన్ని దూరం చేస్తావని
నీకై ఎదురు చూస్తున్నా..
అనుక్షణం నీకై తపిస్తున్నా..

ప్రకటనలు

జెర్రమొచ్చింది.. నాకు జెర్రమొచ్చింది..!!!

2009/10/27

jwaram

కార్యక్రమం: జ్వరం తగ్గేదెలా!

తేది: గత మంగళవారం అక్టోబర్ 20

వేదిక: గ్రీన్ సిటి హాస్పిటల్, బెంగళూర్

ఇంతకి విషయం ఏంటో: నేను నాకు తెలియకుండా దవఖానా లొని ఒక రూంలొ బెడ్ పై పడుకొని ఉండటం,  చుట్టుముట్టూ మలయాళీ నర్సమ్మలతొ నా చేతికి ఇంజక్షన్స్, పక్కకి చూస్తే ఒక సెలెన్ బాటిల్ నుండి నా చేతికి కనెక్షన్, అది అయిపోగానే ఇంకొక బాటిల్ యుద్దానికి రెడీ గా ఉన్నట్లు అదీ చాలక మరొ పక్క టేబుల్ పై ఇంకొ అరడజను సెలెన్ బాటిల్లు కాచుకొని ఉన్నాయ్.. ఒక మల్లమ్మ ప్రతి పావుగంటకి టెంపరేచర్ టెస్టు చేస్తే మరొ మల్లమ్మ బి.పి పరికరాన్ని భుజానికి తగిలించుకొని  ప్రతి అర గంటకి రూం లొ కి వస్తూ చేతి కండారలు ఇరిగేటట్టుగా ఆ మ్యాట్ చేతికి చుట్టీ బి.పి పరిక్ష చేస్తుండటం, ఆనక రక్త పరిక్ష, మూత్ర పరిక్ష, X పరిక్ష Y- ఫరిక్ష, స్కానింగ్, ఎక్స్- రేలు.. వెరసి నన్ను తీవ్ర ఒంటరితనానికి గురి చేసాయ్..

మానసికంగా ఏదో ఒత్తిడికి లోనయ్యనేమో అని నాలొ నాకు భయం మొదలైంది.. బూరు పీకిన కోడి లా బక్క చిక్కిపోయాను.. స్వతహాగా ఇంజెక్షన్ అంటే భయమయిన నాకు సెలెన్ బాటిల్ పైన బాటిళ్ళు ఎక్కించేసరికి విపరీతమైన భయంతొ ఉన్నదాంట్లొ సగమయ్యాను. అయిదు రొజుల వరకు హాస్పిటల్ లొ ట్రీట్మెంట్ అవసరం ని డాక్టరు పదే పదే చెబుతున్నా మనసంతా హైద్రాబాదుకు వచ్చేయ్యాలని జ్వరం ఉన్న సరే ఇంట్లొ వారితొ గడపాలని నిర్ణయించుకొని మరుసటి రొజే  డాక్టర్ కి ఒక కథ వినిపించి డిశ్చార్జ్ అయి హైద్రాబాద్ కి బయలుదేరాను..

కార్యక్రమం: జ్వరం తగ్గవచ్చిలా!

తేది: ఈ మంగళవారం అక్టోబర్ 27

వేదిక: స్వగౄహం, హైదరాబాదు.

ఇంతకి విషయం ఏంటో: నాకు తెలియకుండ మా అమ్మ నాన్న తొ కలిసి ఒక మాస్టర్ ప్లాన్ వేసింది.. ఊరెళ్ళి ఈత కల్లు తెమ్మనడం, నాన్న తెచ్చే లోపు అమ్మ నాకిష్టమైన వేడీ వేడీ పకొడిలు చేసి పెట్టడం, ఎత్తిన గ్లాసు దించానని తెలియకుండా మూడు గ్లాసులు(?) కల్లు లాగించేయడం నంజుకోవడనికి వేడీ వేడీ పకొడిలు తినడం క్షణాల్లొ జరిగిపోయాయ్.

ఆ తర్వాత మిత్రులతొ కలిసి మిగిలి ఉన్న వైద్యానికై బెండు అప్పారావ్ అర్.ఎం.పి ని కలొసొచ్చాను..! కాస్త ఆరోగ్యం కుదుట పడింది..!!! ఈ శనివారం కల్లా పూర్తిగా కోలుకొని ఏక్ నిరంజన్ ని కూడా కలిసి తిరిగి బెంగళూర్ కి వెళ్దామనుకుంటున్నాను.. ఇప్పటికే మా మేనేజర్ ఇంకేం వస్తావ్ అక్కడే ఉండిపో అని స్టేట్మెంట్లు ఇస్తుంది… వినడానికి బానే ఉన్నా తనకి ఆ చాన్స్ ఎందుకు ఇవ్వడం..?

కొసమెరుపు: నోటు వైద్యం కన్నా నాటు వైద్యం మిన్న,సొ ఐ విష్ మై సెల్ఫ్ స్పీడీ రికవరీ !

—————————————————————————————–


ఆగేనా..! ఈ కన్నీటి వాన …!!

2009/10/04

varsham1

ఈ వర్షం ఏంటొ అసలు అర్దం కాదు.. ఇంతవరకు ఎరుగని ప్రకౄతి విళయ రూపం..  మొన్నటి దాక వర్షాలు లేవని అనావౄష్తి తొ సతమతమయితె, ఇప్పుడేమొ కుండపోత వర్షాల కారణంగా అతివౄష్టితొ అంధ్రరాష్ట్రమంత జల ప్రళయం దాటికి దిక్కుతోచని దయనీయ స్థితిలొ ఉంది ;(

గత రెండు మూడు రోజులుగ ఎడ తెరిపిగా కురుస్తున్న వర్షాలతొ మన అంధ్రా రాష్ట్రమంతా విలయాంధ్ర గ మారడం చాల విచారకరం. తుంగభద్రా, క్రిష్ణా నదుల వరద ఉదౄతి తొ ఇప్పటికె కొన్ని గ్రామాలను, ఎంతొ మందిని పొట్టన పెట్టుకున్న ఈ ఉగ్ర సాగర ప్రవాహాం ఇంకా పెరుగుతుందంటున్నారు… రాష్ట్రం లొ సగానికి పైగా జిల్లాలను అతాలకుతలం చేస్తుంది..  రాయలసీమ, ఆంధ్రా జిల్లాల్లొ నదులు, వాగులు, వంకలతొ జరాగల్సిన నష్టం చేకుర్చిన వరుణిడి దాహం మరొ 24 గంటల్లొ తెలంగాణ లొ మరికొన్ని జిల్లాలకు కూడా విస్తరింపజేస్తున్నాడట..!

భీభత్సమైన వరదల వలన సంభవించిన నష్టం అంతా ఇంతా కాదు..ఆస్తి నష్టం… రాక పోకలకు అంతరాయం.. అంధకారం… ఇవన్ని మెరుగుపరుచుకోవచ్చెమొ కాని ఎంతో మందిని బలి తీసిన కుటుంబాల పరిస్థితి తలచుకుంటే హ్రుదయ విదారకంగా ఉంది..

ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టిన ఆలస్యం చేసారనిపిస్తుంది.. ఇంకా ముందుగా స్పందించి ఉంటే కొంతనైన మేలు జరిగేది…కొందరినన్నా మౄత్యువు బారిన పడకుండా కాపాడేది.

varsham

ఎందరో ఆపన్న హస్తాల కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.. వారిని మనం ఆదుకోవడం కనీస మానవతా ధర్మం.. మానవతా దౄక్పధంతొ ఎందరొ ముందుకు వచ్చి వివిద మార్గాలనెంచుకొని తోచినంత సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను..