జెర్రమొచ్చింది.. నాకు జెర్రమొచ్చింది..!!!

jwaram

కార్యక్రమం: జ్వరం తగ్గేదెలా!

తేది: గత మంగళవారం అక్టోబర్ 20

వేదిక: గ్రీన్ సిటి హాస్పిటల్, బెంగళూర్

ఇంతకి విషయం ఏంటో: నేను నాకు తెలియకుండా దవఖానా లొని ఒక రూంలొ బెడ్ పై పడుకొని ఉండటం,  చుట్టుముట్టూ మలయాళీ నర్సమ్మలతొ నా చేతికి ఇంజక్షన్స్, పక్కకి చూస్తే ఒక సెలెన్ బాటిల్ నుండి నా చేతికి కనెక్షన్, అది అయిపోగానే ఇంకొక బాటిల్ యుద్దానికి రెడీ గా ఉన్నట్లు అదీ చాలక మరొ పక్క టేబుల్ పై ఇంకొ అరడజను సెలెన్ బాటిల్లు కాచుకొని ఉన్నాయ్.. ఒక మల్లమ్మ ప్రతి పావుగంటకి టెంపరేచర్ టెస్టు చేస్తే మరొ మల్లమ్మ బి.పి పరికరాన్ని భుజానికి తగిలించుకొని  ప్రతి అర గంటకి రూం లొ కి వస్తూ చేతి కండారలు ఇరిగేటట్టుగా ఆ మ్యాట్ చేతికి చుట్టీ బి.పి పరిక్ష చేస్తుండటం, ఆనక రక్త పరిక్ష, మూత్ర పరిక్ష, X పరిక్ష Y- ఫరిక్ష, స్కానింగ్, ఎక్స్- రేలు.. వెరసి నన్ను తీవ్ర ఒంటరితనానికి గురి చేసాయ్..

మానసికంగా ఏదో ఒత్తిడికి లోనయ్యనేమో అని నాలొ నాకు భయం మొదలైంది.. బూరు పీకిన కోడి లా బక్క చిక్కిపోయాను.. స్వతహాగా ఇంజెక్షన్ అంటే భయమయిన నాకు సెలెన్ బాటిల్ పైన బాటిళ్ళు ఎక్కించేసరికి విపరీతమైన భయంతొ ఉన్నదాంట్లొ సగమయ్యాను. అయిదు రొజుల వరకు హాస్పిటల్ లొ ట్రీట్మెంట్ అవసరం ని డాక్టరు పదే పదే చెబుతున్నా మనసంతా హైద్రాబాదుకు వచ్చేయ్యాలని జ్వరం ఉన్న సరే ఇంట్లొ వారితొ గడపాలని నిర్ణయించుకొని మరుసటి రొజే  డాక్టర్ కి ఒక కథ వినిపించి డిశ్చార్జ్ అయి హైద్రాబాద్ కి బయలుదేరాను..

కార్యక్రమం: జ్వరం తగ్గవచ్చిలా!

తేది: ఈ మంగళవారం అక్టోబర్ 27

వేదిక: స్వగౄహం, హైదరాబాదు.

ఇంతకి విషయం ఏంటో: నాకు తెలియకుండ మా అమ్మ నాన్న తొ కలిసి ఒక మాస్టర్ ప్లాన్ వేసింది.. ఊరెళ్ళి ఈత కల్లు తెమ్మనడం, నాన్న తెచ్చే లోపు అమ్మ నాకిష్టమైన వేడీ వేడీ పకొడిలు చేసి పెట్టడం, ఎత్తిన గ్లాసు దించానని తెలియకుండా మూడు గ్లాసులు(?) కల్లు లాగించేయడం నంజుకోవడనికి వేడీ వేడీ పకొడిలు తినడం క్షణాల్లొ జరిగిపోయాయ్.

ఆ తర్వాత మిత్రులతొ కలిసి మిగిలి ఉన్న వైద్యానికై బెండు అప్పారావ్ అర్.ఎం.పి ని కలొసొచ్చాను..! కాస్త ఆరోగ్యం కుదుట పడింది..!!! ఈ శనివారం కల్లా పూర్తిగా కోలుకొని ఏక్ నిరంజన్ ని కూడా కలిసి తిరిగి బెంగళూర్ కి వెళ్దామనుకుంటున్నాను.. ఇప్పటికే మా మేనేజర్ ఇంకేం వస్తావ్ అక్కడే ఉండిపో అని స్టేట్మెంట్లు ఇస్తుంది… వినడానికి బానే ఉన్నా తనకి ఆ చాన్స్ ఎందుకు ఇవ్వడం..?

కొసమెరుపు: నోటు వైద్యం కన్నా నాటు వైద్యం మిన్న,సొ ఐ విష్ మై సెల్ఫ్ స్పీడీ రికవరీ !

—————————————————————————————–

ప్రకటనలు

10 Responses to జెర్రమొచ్చింది.. నాకు జెర్రమొచ్చింది..!!!

 1. రవి చంద్ర అంటున్నారు:

  అదరగొట్టేశారండీ బాబూ! :-)
  get well soon…

 2. అబ్రకదబ్ర అంటున్నారు:

  రికవరీ! అసలు మీకు జ్వరమొస్తే కదా. ఏదో, ఇంటికెళ్లి పకోడీలు తినటానికీ, బెండప్పారావుని కలవటానికీ వేసిన ఎత్తులా ఉంది :D

 3. nelabaludu అంటున్నారు:

  అబ్రకదబ్ర గారు..
  హ్మ్.. బెండు అప్పారావ్ నైతె బెంగళూర్ లోనే కలిసేవాడినండి.. ;) ;)

 4. Nutakki Raghavendra Rao అంటున్నారు:

  కల్లే పరమౌషధమని అందరికీ వుపదేసించినట్లుంది మాష్టారూ.. కధనం బాగుంది….మొత్తానికి రికవరైనందుకు అభినందనలు. నా బ్లాగు మీదా రోజూ ఓ లుక్కెయ్యి బాబూ…..శ్రెయోభిలాషి….నూతక్కి

 5. venkat అంటున్నారు:

  get well soon…….

 6. aswinisri అంటున్నారు:

  mottaaniki mii homesickness ki mandu kanipetteasearanna maata! vraasina vidhaanam nachchindi kaani “kallu” maata konchem gontuki addupadinatlaindi! inkoka mandu twaraloe kanipedataarani aasiddaam!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: