కెమెరా కళ్ళతో నేను ..!

2009/11/23

షికార్లు, పిక్నిక్ లు, స్నేహితులతొ విహార యాత్రలు, కొలీగ్స్ తొ అవుటింగ్ లు, పార్టీలు.. ఇలా ఎటు వెళ్ళినా సరే నా చేతిలొ కేమేరా లేకుంటే ఏదొ వెలితి అనిపిస్తుంటుంది. వృత్తి రీత్యా కేరళ లొ ఉండే మా మిత్రుడు  ఈ వీకెండ్ బెంగళూరు కి రావడం.. తన గారాల పట్టిని ఆనందింపచేయాడానికి ఓ ఆరు గంటలు నిన్న ఆదివారం బన్నేరుఘట్ట నేషనల్ పార్కులో సంచరిస్తుండగా నా కంటపడి నా బుల్లి కెమెరాకు చిక్కిన అపురూప దృశ్యాలు.. ఇంకేంటి వీక్షీంచండి మరి..!

బెబ్బులి గాండ్రు – త్యజించడానికో, భుజించడానికో ఈ సంకేతం !!!

ఇది కట్ల పామా లేదా నాగు పామా అనే లొపే క్లిక్ మనిపించిన సరీసృపం

దగ్గరికొస్తానంటున్నమన రాష్ట్ర మృగం – కృష్ణ జింక

మా వాడు కాఫి అంటే… సాఫిగా సై అంటున్న జీబ్రా..

కోతి కొంచెం.. తోక ఘనం… పోలికల్లో మనం… అదే .. డార్విన్ సిద్దాంతం ;)

ఎప్పుడు గర్జించము… అప్పుడప్పుడు నిద్రిస్తామంటున్న ఓ సింహ జంట

ఫెన్సింగ్ బయట నువ్వు లోన నేను అని మావాడి తొ సవాల్ చేస్తున్న ఎలుగుబంటి

ఏనుగు – ఎందరినైనా ఎక్కడికైనా తిప్పగలను.. గజబలమా… నీకే సాధ్యమా..!

రంగుల ప్రపంచాన్ని చూడాలనే తహ తహ మాకు ఉందంటున్న పచ్చటి పిట్ట

ఇక మావాడు తన గారాల పట్టి ముద్దుల కుట్టి ప్రిన్సీ తొ  ఫోజ్..

ప్రకటనలు

ఆ౦ధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు !!!

2009/11/01

C1_0108

మా తెలుగు తల్లికి మల్లె పూ దండ
మా కన్న తల్లికి మంగళారతులు

కడుపులొ బంగారు కనుచూపులొ కరుణ
చిరునవ్వులొ శిరులు దొరలించు మా తల్లి

గలగలా గోదారి కదలి పోతుంటేను
బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను

బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి.

అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు

తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై, నిఖిలమై నిలచి ఉండేదాక

రుద్రమ్మ భుజ శక్తి, మల్లమ్మ పతి భక్తి
తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయని కీర్తి

మా చెవులు రింగుమని మారుమ్రోగే దాక
నీ ఆటలే ఆడతాం, నీ పాటలే పాడతాం
జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి

– శంకరంబాడి సుందరాచార్య

మన తెలుగు వారందరికి  ఆ౦ధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.