మన ముందు మరొ కొత్త సంవత్సరం!

2009/12/31

ఈ నూతన సంవత్సరo లో….

మీరు అనుకున్నవి సాధించాలని,

మీరు ఆశించినవి అందుకోవాలని,

మీరు కోరుకున్నవి ఫలించాలని,

మీరు కావలనుకున్నవన్ని దక్కాలని

సదా ఆకాంక్షిస్తూ…

.. మీ నేస్తం

ప్రకటనలు

సంవత్సరం వెనక్కి తిరిగి చూస్తే !

2009/12/31

abc

2009 సంవత్సరానికి వీడ్కోలు సమయం.. రోజు లాగే ఈ రోజు డైరీ రాస్తుంటే ఒక విషయం గమనించడం జరిగింది.. డైరీ లో చివరి పేజీ అంటే ఈ సంవత్సరం లొ చివరి రోజు..

ఒక్క సారి పేజిలు తిరగేసాను. మొదటి పేజి లొ మా మిత్రుడి కి 2009 డైరీ ని నాకు బహుకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతు మొదటి పేజి ని ప్రారంభించిన క్షణాలు… డైరీ లొ కెమేరా ను జూం చేస్తుంటే ఈ సంవత్సరం లొ నేనేం సాధించాను..? వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా నెనేమైనా నేర్చుకున్నానా అని ఓవారాల్ గా మెమోరి ఫ్లాష్ కార్డ్ ని ఆక్సెస్ చేస్తే.. ఎన్నో అనుభూతులు, పెనుభుతాలు, విషాదాలు, అనందాలు, అవరోధాలు.. అన్ని అనుభవించాను..

ప్రతి యేడాది లాగే ఈ సంవత్సరం కూడ కొత్త మిత్రులు పరిచయం, కొత్త కొలీగ్స్ తొ పరిచయం.. ఈ సంవత్సరం బ్లాగ్ రాయడం ఆరంభించినందుకు.. బ్లాగ్ మిత్రులు తొ పరిచయం అదనం ;)

ఈ సంవత్సరం సినిమాల పరంగా చూస్తే ఎక్కువ సినిమాలు చూసాను. గత నాలుగేళ్ళతొ పొలిస్తే ఇప్పటివరకు 2009 సంవత్సరం లొ చూసిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయ్ ;)

వ్యక్తిగతపరంగా మా తమ్ముడు చిక్కులొ పడటం.. ఇప్పుడిప్పుడె ఒక కొలిక్కి రావడం.. ఇక మా మిత్రుడి అమ్మ అకస్మిక మరణం ఇప్పటికి జీర్ణించుకోలేను..  ;(

నా తోటి మిత్రుల పెళ్ళిల్లు సంవత్సరాంతం వరస పెట్టి జరుగుతూనే ఉన్నాయ్ . ఇక మనమే మిగులు.. ;)

జాబ్ పరంగా… ఇప్పుడిప్పుడే మెళుకువలు నేర్చుకున్నాను.. ఇంకా పరిణితి ఆవశ్యకం ఎంతైనా ఉన్నది ..

ఎప్పటి లాగే ఫ్రెండ్స్ మీటింగ్స్, చాటింగ్స్, సరదా షికార్లు షరా మాములే..ఇలా ఎన్నొన్నొ ఉన్నాయ్.. నెమరు వేసుకుంటే అదొ అనుభూతి..

మన ప్రయత్నాలు మనం చేస్తూ..ఏమి జరిగినా అంతా మన మంచికే అని అనుకునే రకమైన మనుష్యులొ నేనొకన్ని.. ఈ సంవత్సరంలొ జరిగిన తప్పొప్పులు మరొక అనుభవాలు..

మీరు 2009 సంవత్సరం లొ ప్రతి క్షణాన్ని ఆస్వాదించారని ఆశిస్తూ.. 2009 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ…. కొత్త వత్సరానికి ఆహ్వానం పలుకుదాం.


ఆర్య-2 లొ నాకు నచ్చినవి…

2009/12/02

ఆర్య -2 సినిమా హిట్టా లేక ఫట్టా అనే విషయం పక్కన పెడితె ఆ చిత్ర దర్శకుడు సుకుమార్ క్రియేటివ్ థాట్స్,లాజిక్స్, స్క్రీన్ పైన పండించిన విధానం,  డైలాగ్స్  నాకు భలే నచ్చాయ్.  అందులొభాగంగా కొన్ని నాకు బాగా గుర్తున్నవి ఇక్కడ పొందుపరుస్తున్నాను.

* ఆర్య లాంటి ప్రెండ్ వుంటే చాలు వేరే శత్రువులు అక్కర్లేదు…

* టైటిల్స్ కూడ క్రియేటివ్ గా ఉండటం..

ఫ్రెండ్ సెలెక్షన్ కాన్సెప్ట్: నాకొక ఫ్రెండ్ కావాలి.. బబుల్ గం తొక్కినవాడే నా ఫ్రెండు  అని సెలెక్ట్ చేసుకోవడం

* ఏ హెల్ప్ చెసావ్ అని నీతో ఫ్రెండ్ షిప్ చేయాలి అని హీరొని అజయ్ అడిగితే చెరువు లోకి తోసెసి మరి హెల్ప్ చేసే సీన్ కాస్త ఓవర్ గా అనిపించినా హిరో క్యారక్టర్ ప్రెజెంటేషన్ తెలియజేయడం, ఫ్రెండ్ కోసం ఏదైనా చేస్తాడు అనే విదంగా తర్వాత వచ్చే సీన్స్ కి ఎస్టాబ్లిష్ మెంట్ గ ఉన్నట్లుంటుంది

* టాస్ గెలిచినపుడు హీరో నేను గెలిచాను కాబట్టి నేను చెప్పినట్లు నువ్వు చేయాలి అనే సీన్ – సింప్లీ సూపర్బ్

* మొదటి సారి ఆఫిస్ లోకి అడుగుపెడుతుంటే ఎడమొహం -పెడమొహం ధ్రువాలుగా ఉన్న చెప్పుల్ని గమనించి వాటిని సరిచేయడం.. చివరి సారిగ ఆఫిస్ నుండి వదిలి వెళ్ళీపోతుంటే సరిగా ఉన్న ఆ చెప్పుల్నిచూసి మరి వెర్రి తొ  తన్నడం…. గ్రేట్ థాట్

*  బ్రహ్మానందం హెలొజినేషన్ డిఫెరెంట్ ఫేజస్ గురించి సీన్ తగ్గట్టు హాస్యాన్ని పండించినా ఆర్య ఆఫిస్ నుండి వదిలి వెళ్ళిపోతుంటే హేలొజినేషన్ అని, ఎవరికి అంటే నాకే అని బ్రహ్మి చెప్పడం.. వెరీ ఫన్నీ..!

* చేయాల్సిన  పని ని పుస్తకం లొ రాసుకుని మరీ ఆచరించడం.. ఫస్టాఫ్ లొ ఒక ఫైట్ సీన్ లొ హీరొయిన్ ని వేధించనివారిని ఎలా చితక్కొట్టాలి అని పుస్తకం లొ రాసుకొని వారిని అలాగే బాదడం లెంత్ ఎక్కువనిపించినా చివర్లొ అజయ్ కి సారి చెప్పాలి అని అజయ్ తోనే రాయించి మరి అజయ్ అలోచించేలోపె తన చెంప చెళ్ళుమనడం…

* సీమ ఇంట్రడక్షన్ సీన్ — టూ ఫన్

* సీమ ఫైట్ సీన్ లొ అంబులన్సెస్ వెనుక రావడం.. ;)

* ఫ్రెండ్ కోసం పచ్చబొడుపు బొడిపించుకోవడం మొదట్లొ  అంత కన్విన్సింగ్ గా అనిపించకపోయిన ఇంటర్వెల్ తర్వాత సుబ్బారెడ్డి(అజయ్) సీమ నుండి తిరిగి వెళ్తున్న ఆర్య కి టాటా చెబుతుంటే తన చేయికి కూడా ఆర్య అని పచ్చబోడిపించుకున్నది చూపించడం  – సూపర్ థాట్ !

* ట్రాన్సిటివ్ ఫ్రెండ్షిప్ రిలేషన్ సీన్: ఆజయ్ –> ఆర్య, ఆర్య –> సుబ్బారెడ్డి..  సొ సుబ్బారెడ్డి – అజయ్ ;)

* హీరొకి అజయ్ విషయంలొ  తప్పనిపిస్తే అజయ్ సారీ.. అజయ్ సారీ అని మూడు సార్లు చెంపదెబ్బలేసుకోవడం

* హాపి అంటె హాపి బర్త్ డే లొ హాపి కదా.. (సుబ్బారెడ్డి  — ఆర్య సీన్)

* జీప్ లొ ముగ్గురు ప్రేమికులు (ఆర్య, అజయ్, సుబ్బారెడ్డి) + గీత ప్రయాణిస్తున్నప్పుడు మిర్రర్ సీన్ నవ్వు తెప్పిస్తుంది.. అంతే కాక గీత తుమ్మినపుడు ముగ్గురు కర్చీఫ్స్ ఇవ్వడం హైలైట్.. ;)

* తనకి చంపేంత కోపం ఉంటే నాకు చచ్చిపోయే అంత ప్రేమ ఉంది..(ఆర్య – గీత & గీత – అజయ్ సీన్స్)

* చివరి సాంగ్ ఐతె  (కరిగే లోగా ఈ క్షణం.. గడిపేయాలి జీవితం…) ఇప్పటికి నా నోట్లొ కరిగి పోకుండ నానుతుంది. లిరిక్స్ ఆర్ టూ గుడ్… ఆ సాంగ్ లొ హీరో కంఫ్యూజన్ మైండ్ … మూడు గ్లాస్ ల సీన్

ఇలా  ఇంకా ఎన్నొ నచ్చాయ్ కాని గుర్తు రావట్లేదు, మీకేవైన నచ్చితే కామేంట్ చెయండి.. నేను గుర్తు తెచ్చుకుంటాను.. నచ్చక పొతె మాత్రం లైట్ తీసుకోండి … నాకు నచ్చినవి కావాలి ;)