సంవత్సరం వెనక్కి తిరిగి చూస్తే !

abc

2009 సంవత్సరానికి వీడ్కోలు సమయం.. రోజు లాగే ఈ రోజు డైరీ రాస్తుంటే ఒక విషయం గమనించడం జరిగింది.. డైరీ లో చివరి పేజీ అంటే ఈ సంవత్సరం లొ చివరి రోజు..

ఒక్క సారి పేజిలు తిరగేసాను. మొదటి పేజి లొ మా మిత్రుడి కి 2009 డైరీ ని నాకు బహుకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతు మొదటి పేజి ని ప్రారంభించిన క్షణాలు… డైరీ లొ కెమేరా ను జూం చేస్తుంటే ఈ సంవత్సరం లొ నేనేం సాధించాను..? వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా నెనేమైనా నేర్చుకున్నానా అని ఓవారాల్ గా మెమోరి ఫ్లాష్ కార్డ్ ని ఆక్సెస్ చేస్తే.. ఎన్నో అనుభూతులు, పెనుభుతాలు, విషాదాలు, అనందాలు, అవరోధాలు.. అన్ని అనుభవించాను..

ప్రతి యేడాది లాగే ఈ సంవత్సరం కూడ కొత్త మిత్రులు పరిచయం, కొత్త కొలీగ్స్ తొ పరిచయం.. ఈ సంవత్సరం బ్లాగ్ రాయడం ఆరంభించినందుకు.. బ్లాగ్ మిత్రులు తొ పరిచయం అదనం ;)

ఈ సంవత్సరం సినిమాల పరంగా చూస్తే ఎక్కువ సినిమాలు చూసాను. గత నాలుగేళ్ళతొ పొలిస్తే ఇప్పటివరకు 2009 సంవత్సరం లొ చూసిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయ్ ;)

వ్యక్తిగతపరంగా మా తమ్ముడు చిక్కులొ పడటం.. ఇప్పుడిప్పుడె ఒక కొలిక్కి రావడం.. ఇక మా మిత్రుడి అమ్మ అకస్మిక మరణం ఇప్పటికి జీర్ణించుకోలేను..  ;(

నా తోటి మిత్రుల పెళ్ళిల్లు సంవత్సరాంతం వరస పెట్టి జరుగుతూనే ఉన్నాయ్ . ఇక మనమే మిగులు.. ;)

జాబ్ పరంగా… ఇప్పుడిప్పుడే మెళుకువలు నేర్చుకున్నాను.. ఇంకా పరిణితి ఆవశ్యకం ఎంతైనా ఉన్నది ..

ఎప్పటి లాగే ఫ్రెండ్స్ మీటింగ్స్, చాటింగ్స్, సరదా షికార్లు షరా మాములే..ఇలా ఎన్నొన్నొ ఉన్నాయ్.. నెమరు వేసుకుంటే అదొ అనుభూతి..

మన ప్రయత్నాలు మనం చేస్తూ..ఏమి జరిగినా అంతా మన మంచికే అని అనుకునే రకమైన మనుష్యులొ నేనొకన్ని.. ఈ సంవత్సరంలొ జరిగిన తప్పొప్పులు మరొక అనుభవాలు..

మీరు 2009 సంవత్సరం లొ ప్రతి క్షణాన్ని ఆస్వాదించారని ఆశిస్తూ.. 2009 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ…. కొత్త వత్సరానికి ఆహ్వానం పలుకుదాం.

ప్రకటనలు

3 Responses to సంవత్సరం వెనక్కి తిరిగి చూస్తే !

  1. చందు అంటున్నారు:

    మీ అనుభూతులు బాగున్నాయ్

  2. మరువం ఉష అంటున్నారు:

    నెలబాలుడు ఇక సం. బాలుడన్నమాట [మీ బ్లాగుమాట] మీ స్నేహితులని ఫాలో అయ్యి వచ్చే యేటికి నా పెళ్ళైపోయిందోచ్ అని చెప్తారా? :) కొత్త సం. ఆహ్వానం పలుకుతూ..

  3. nelabaludu అంటున్నారు:

    @ చందు
    ధన్యవాదాలు..
    @ మరువం ఉష
    హ హ హ.. అదే జరిగేలా ఉంది ;)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: