హైద్రాబాద్ కి తిరిగొచ్చేసా…!

2010/02/28


హైద్రాబాద్ నుండి బెంగుళూర్ కి ఉద్యోగ నిమిత్తం 18 నెలల క్రితం బదిలీ అయ్యాను.. ఇంట్లొ వారికి.. ఒక మూడు నెలల ప్రాజెక్ట్, అది పూర్తవ్వగానే తిరిగి వచ్చేస్తానని సత్య పలుకులు పలికిన నేను..ప్రాజెక్ట్ ఎక్స్ టెండ్ అవడంతొ అప్పటినుండి రేపొ మాపొ వస్తానని చెబుతూ ఏదొ ఒకటి మానేజ్ చేస్తూ. ఇక ఖచ్చితంగా ఒక డేట్ నిర్ణయించేసి రెండు రోజుల క్రితమే వచ్చేసాను.

కలవడం, విడిపోవడం మన జీవీతం లొ సహజమే కదా..  మనతొ పరిచయమైన వ్యక్తులే కావచ్చు, మనం నివసించే ప్రదేశమే కావొచ్చు మనతొ ఉన్నంత కాలం అవొక అనుభూతులు, మనతో విడిపోయినంత కాలం దేనికవే అనుభవాలు.పుట్టి పెరిగింది హైద్రాబాద్ లొనైనా 18 నెలలు ఒక ప్రదేశాని కి పరిమితమై అలవాటైన నేను మరలా హైద్రాబాద్ ఎన్విరాన్మెంట్ కి అలవాటుపాడాల్సి ఉంది.. బెంగ తొ ఉన్న నాకు బెంగుళూరు నుండి విముక్తి కలిగినా.. నా సరదా ప్రయాణానికి బెంగుళూరుతొ ఆ అనుబంధం ఓ కమ్మని మకరంధం ;)

ఓపిక తొ తీరిక చేసుకొని గడిపింది కొంత కాలమైన బెంగుళూరు విషయాలు,  వీకెండ్ షెడ్యూల్స్,  కొత్త స్నేహితులు..  కొత్త పరిచయాలు .. కొత్త విశేషాలు.అక్కడ ఏ సినిమాకి ఏ థియేటర్ అవసరమనుకునే అప్పటికప్పుడు నిర్ణయించేసి మిత్రులతొ ఎంటర్టైన్ మెంట్స్, విండొ షాపింగ్స్.. సరి కొత్త ముచ్చట్లు పంచుకోవాలని ఉంది.. త్వరలొ మీతో పంచుకుంటాను

సొ మీరు చదవాల్సింది చాలా ఉంది..  ఎందుకంటె  నేను రాయాల్సింది మిగిలి ఉంది.. ;)

——————————————————————————————-

ప్రకటనలు

ఏమిటా ఒరవడి.. ఎందుకా అలజడి…!

2010/02/18

పరువం పిలిచిన కులుకులతొ
తనువంత తన్మయత్వమై  వణికిస్తుంటె

మైకం లా కళ్ళెదుట ఉదయించావ్..!


మనసు వాకిలి తీసి
శ్వాసలొ నిన్ను ధ్యానిస్తుంటె
పసిడి నవ్వు విసిరి
పులకింతలతొ మురిపించావ్..!


ఆ ఆనంద తాపానికి
పెదవి గడప దాటని మాటలకు
గుండె చప్పుడు కరువై…
రెప్ప వేయని కనుబొమ్మలు..
చూపుల్తొ గుచ్చి చూస్తుంటే
అమాంతం నా దరి చేరి
బదులీయక అస్తమించావ్..!


ఆ తియతీయని క్షణాలను..
రేయిపగలు ఊహ గాలుల్లొ విహరింపజేస్తూ
నాలొ ఏదో అలజడిని కంపించి
పరుగులు పెట్టిస్తున్నావ్..!


తెలిసి తెలియని నా మనసుకు
ఇది స్వప్నమా.. లేక సత్యామా..
అనే ఏకాంతమాయలొ ముంచేస్తూ
ఓ సరికొత్త ఒరవడిని సృష్టించావ్..!

——————————————————————