నాలుగు మంచి మాటలు …!

2010/03/21

ఈ మధ్య హైద్రాబాద్ కి షిఫ్ట్ అవడంతొ గజి బిజి గా ఉంటున్న నేను.. ఇంట్లొ ఇదివరకు నేను ఉపయొగించే ఆర్గనైజర్, కొన్ని సి. డి లు.. మరికొన్ని పుస్తకాలు.. కనుమెరుగవ్వడంతొ నా కళ్ళను కనువిందు చేయడానికై కాస్త ఇంటిపై శ్రద్ద వహించాలని నిర్ణయం తీసుకొని ఇంట్లొ ఉన్న పిల్లల సహాయంతొ.. నా రూం ని సర్విసింగ్ చేయడానికి పూనుకున్నాను …

ముందుగా బూజు దులపడంతొ ఆరంభమైన కార్యక్రమం..తదనంతరం తవ్వకాలు- ఊడ్చడాలు తొ మొదలై, తూడ్చడాలు-సర్దడాలతొ ముగిసింది… తవ్వకాల్లో భాగంగా ఒక నోట్ బుక్ నా కంటపడింది.. ఇంకేముంది కాలాన్ని 10 సంవత్సరాలు వెనక్కి తీసుకు వెళ్ళి ఆగింది..

డిగ్రి చదివే రొజుల్లొ ఎదురుగా ఉన్న ట్రాన్స్ పోర్ట్ లొ ఉచితంగా దొరికిన తెల్ల పేపర్లని నల్ల దారమేసి కుట్టుకున్న పుస్తకం.. అంతేకాక పచ్చటి ప్లెయిన్ పాలిథిన్ కవర్ తొ అట్ట వేసి పిన్నుల కొట్టిన పుస్తకం..ముఖ పత్రం పై ఆకుపచ్చ రంగులొ “నాలుగు మంచి మాటలు…” అని వ్రాయబడి ఉంటుంది.. లోన తిరగేస్తే 400 కి పైగా మంచి మాటలు వ్రాసినవి కనిపిస్తాయ్… క్లాసు లొ, సెమినార్లలొ ఎక్కడా ఏం మంచి మాటలు చెవిన పడినా.. ఎక్కడైనా చదివినా, ఎవరి నోట విన్నా.. అంతే సంగతులు.. అలా ఆ పేజిలపై హంగులతొ వివిధ రంగు రంగుల్లొ నా చేతి రాతతొ చెక్కబడి ఉంటాయ్. నేను ఆచరించడం కన్న వ్రాయడం లొ మిన్న. అప్పట్లొ అది నాకు ఒక షోకు కాని మా స్నెహితులకి పరమ చిరాకు.. వీడేంటి పెద్ద వేద వాక్యలు వ్రాస్తున్నాడు అని పరాకు గా ఉండేవారు..

క్రమక్రమంగా కొన్ని వాక్యాలను నా జీవీతంలొ ఆచరించాలని ప్రయత్నించాను.. మరి కొన్ని ప్రయతించడంలొ మరచిపోయాను.. కొన్ని ప్రయత్నించకపొయినా నాకెదురైన అనుభవం తొ అందులొ ఉన్నాయని గ్రహించాను. కుమిలి పోయాను.. ఆ తర్వాత జీవితం అంటె అంతే అని తెలుసుకున్నాను.. ఎపుడైన ఒంటరి గానొ లేక మూడ్ ఆఫ్ గా ఉంటేనో ఆ పుస్తకం తిరగేస్తే మోటివేషన్ మస్తుగ వస్తుండేది.. పూర్తిగా ఆచరించడంలొ మాత్రం ఇప్పటికి సఫలీకృతున్ని కాలేకపోయాను..

ఇంతకి నా ఆ “నాలుగు మంచి మాటలు…” అనే నోట్ బుక్ లొ.. ఊ..ఊప్స్.. కోట్ బుక్ లొ.. నేను వ్రాసినవి గాని, సేకరించినవి గాని కొన్ని ఇక్కడ భద్రపరుస్తాను.

 1. ప్రతి రాయిలోను ఒక శిల్పం దాచుకొని ఉంటుంది. సుత్తితో బద్దలు కొడితే శిల్పం రాదు.. ఉలి తొ చెక్కాలి. అప్పుడే ఆ రాయిలోనుంచి అపురూపమైన శిల్పం బయటపడుతుంది.. అలాగే ప్రతి మనిషి జీవితం లొ అతీతమైన శక్తి దాగుంటుంది. దాన్ని ఎప్పుడైతె గుర్తిస్తామో మనమంటే ఏమిటో నిరూపించుకోవచ్చు..
 2. జీవితం అంటే అర్దం-పరమార్దం; ఈ రెండు కలిస్తేనే జీవితం. మనిషి పుట్టడం అర్దం, జీవించడం పరమార్దం.
 3. ఆకలేస్తుంది అని అన్నం తినడం ప్రకృతి; ఆకలేస్తుంది అని ఎదుటివాడిని దోచుకొని తినడం వికృతి; ఆకలేస్తుంది అని ఎదుటివారికి పెట్టి తినడం సంస్కృతి.
 4. లక్ష్యం అని నిర్దేశించుకున్నాక అది సాధించే తీరాలి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎదురొడ్డి నిలవడమే కాని తలొగ్గి మడమ తిప్పవద్దు.
 5. మెరుగు పెట్టకుండా రత్నానికి, కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి గుర్తింపు రాదు.
 6. ఆత్మ విశ్వాసంతో ఆశించేదేదైనా నిత్య జీవీతంలొ నిజమౌతుంది.
 7. జీవితం లొ సర్వం కోల్పోయినా ఒకటి మాత్రం మిగిలే ఉంటుంది, అదే భవిష్యత్తు.
 8. పూలలొ సువాసన, మనిషిలొ యోగ్యత దాచినా దాగవు.
 9. అవకాశం రావడం గొప్ప కాదు, అవకాశం నిరూపించుకోవడం గొప్ప .
 10. ఆలోచన వికసించే పుష్పం, ఆలాపన దానికి అంకురం, ఆచరణయే ఫలం.
 11. వైఫల్యం నిరాశకు కారణం కాకుడదు, క్రొత్త ప్రేరణకు పునాది కావాలి.
 12. వెలిగే దీపమే ఇతరులను వెలిగించగలదు, నిరంతరం నేర్చుకునేవారే ఇతరులకు నేర్పగలరు.

చివరగా మరొకటి,

 • సద్వచనాలు విని ప్రయోజనం లేదు. వాటిని నిత్యజీవితంలో ఎంతవరకు ఆచరణలోనికి తెస్తున్నామనేదే ముఖ్యం.

సొ అవండీ.. వినడానికి బాగున్నాయ్ కదూ!

…………………………………………………………………………………………………….

ప్రకటనలు