నాలుగు మంచి మాటలు …!

ఈ మధ్య హైద్రాబాద్ కి షిఫ్ట్ అవడంతొ గజి బిజి గా ఉంటున్న నేను.. ఇంట్లొ ఇదివరకు నేను ఉపయొగించే ఆర్గనైజర్, కొన్ని సి. డి లు.. మరికొన్ని పుస్తకాలు.. కనుమెరుగవ్వడంతొ నా కళ్ళను కనువిందు చేయడానికై కాస్త ఇంటిపై శ్రద్ద వహించాలని నిర్ణయం తీసుకొని ఇంట్లొ ఉన్న పిల్లల సహాయంతొ.. నా రూం ని సర్విసింగ్ చేయడానికి పూనుకున్నాను …

ముందుగా బూజు దులపడంతొ ఆరంభమైన కార్యక్రమం..తదనంతరం తవ్వకాలు- ఊడ్చడాలు తొ మొదలై, తూడ్చడాలు-సర్దడాలతొ ముగిసింది… తవ్వకాల్లో భాగంగా ఒక నోట్ బుక్ నా కంటపడింది.. ఇంకేముంది కాలాన్ని 10 సంవత్సరాలు వెనక్కి తీసుకు వెళ్ళి ఆగింది..

డిగ్రి చదివే రొజుల్లొ ఎదురుగా ఉన్న ట్రాన్స్ పోర్ట్ లొ ఉచితంగా దొరికిన తెల్ల పేపర్లని నల్ల దారమేసి కుట్టుకున్న పుస్తకం.. అంతేకాక పచ్చటి ప్లెయిన్ పాలిథిన్ కవర్ తొ అట్ట వేసి పిన్నుల కొట్టిన పుస్తకం..ముఖ పత్రం పై ఆకుపచ్చ రంగులొ “నాలుగు మంచి మాటలు…” అని వ్రాయబడి ఉంటుంది.. లోన తిరగేస్తే 400 కి పైగా మంచి మాటలు వ్రాసినవి కనిపిస్తాయ్… క్లాసు లొ, సెమినార్లలొ ఎక్కడా ఏం మంచి మాటలు చెవిన పడినా.. ఎక్కడైనా చదివినా, ఎవరి నోట విన్నా.. అంతే సంగతులు.. అలా ఆ పేజిలపై హంగులతొ వివిధ రంగు రంగుల్లొ నా చేతి రాతతొ చెక్కబడి ఉంటాయ్. నేను ఆచరించడం కన్న వ్రాయడం లొ మిన్న. అప్పట్లొ అది నాకు ఒక షోకు కాని మా స్నెహితులకి పరమ చిరాకు.. వీడేంటి పెద్ద వేద వాక్యలు వ్రాస్తున్నాడు అని పరాకు గా ఉండేవారు..

క్రమక్రమంగా కొన్ని వాక్యాలను నా జీవీతంలొ ఆచరించాలని ప్రయత్నించాను.. మరి కొన్ని ప్రయతించడంలొ మరచిపోయాను.. కొన్ని ప్రయత్నించకపొయినా నాకెదురైన అనుభవం తొ అందులొ ఉన్నాయని గ్రహించాను. కుమిలి పోయాను.. ఆ తర్వాత జీవితం అంటె అంతే అని తెలుసుకున్నాను.. ఎపుడైన ఒంటరి గానొ లేక మూడ్ ఆఫ్ గా ఉంటేనో ఆ పుస్తకం తిరగేస్తే మోటివేషన్ మస్తుగ వస్తుండేది.. పూర్తిగా ఆచరించడంలొ మాత్రం ఇప్పటికి సఫలీకృతున్ని కాలేకపోయాను..

ఇంతకి నా ఆ “నాలుగు మంచి మాటలు…” అనే నోట్ బుక్ లొ.. ఊ..ఊప్స్.. కోట్ బుక్ లొ.. నేను వ్రాసినవి గాని, సేకరించినవి గాని కొన్ని ఇక్కడ భద్రపరుస్తాను.

 1. ప్రతి రాయిలోను ఒక శిల్పం దాచుకొని ఉంటుంది. సుత్తితో బద్దలు కొడితే శిల్పం రాదు.. ఉలి తొ చెక్కాలి. అప్పుడే ఆ రాయిలోనుంచి అపురూపమైన శిల్పం బయటపడుతుంది.. అలాగే ప్రతి మనిషి జీవితం లొ అతీతమైన శక్తి దాగుంటుంది. దాన్ని ఎప్పుడైతె గుర్తిస్తామో మనమంటే ఏమిటో నిరూపించుకోవచ్చు..
 2. జీవితం అంటే అర్దం-పరమార్దం; ఈ రెండు కలిస్తేనే జీవితం. మనిషి పుట్టడం అర్దం, జీవించడం పరమార్దం.
 3. ఆకలేస్తుంది అని అన్నం తినడం ప్రకృతి; ఆకలేస్తుంది అని ఎదుటివాడిని దోచుకొని తినడం వికృతి; ఆకలేస్తుంది అని ఎదుటివారికి పెట్టి తినడం సంస్కృతి.
 4. లక్ష్యం అని నిర్దేశించుకున్నాక అది సాధించే తీరాలి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎదురొడ్డి నిలవడమే కాని తలొగ్గి మడమ తిప్పవద్దు.
 5. మెరుగు పెట్టకుండా రత్నానికి, కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి గుర్తింపు రాదు.
 6. ఆత్మ విశ్వాసంతో ఆశించేదేదైనా నిత్య జీవీతంలొ నిజమౌతుంది.
 7. జీవితం లొ సర్వం కోల్పోయినా ఒకటి మాత్రం మిగిలే ఉంటుంది, అదే భవిష్యత్తు.
 8. పూలలొ సువాసన, మనిషిలొ యోగ్యత దాచినా దాగవు.
 9. అవకాశం రావడం గొప్ప కాదు, అవకాశం నిరూపించుకోవడం గొప్ప .
 10. ఆలోచన వికసించే పుష్పం, ఆలాపన దానికి అంకురం, ఆచరణయే ఫలం.
 11. వైఫల్యం నిరాశకు కారణం కాకుడదు, క్రొత్త ప్రేరణకు పునాది కావాలి.
 12. వెలిగే దీపమే ఇతరులను వెలిగించగలదు, నిరంతరం నేర్చుకునేవారే ఇతరులకు నేర్పగలరు.

చివరగా మరొకటి,

 • సద్వచనాలు విని ప్రయోజనం లేదు. వాటిని నిత్యజీవితంలో ఎంతవరకు ఆచరణలోనికి తెస్తున్నామనేదే ముఖ్యం.

సొ అవండీ.. వినడానికి బాగున్నాయ్ కదూ!

…………………………………………………………………………………………………….

ప్రకటనలు

26 Responses to నాలుగు మంచి మాటలు …!

 1. saamaanyudu అంటున్నారు:

  సద్వచనాలు విని ప్రయోజనం లేదు. వాటిని నిత్యజీవితంలో ఎంతవరకు ఆచరణలోనికి తెస్తున్నామనేదే ముఖ్యం.
  ఈ వాక్యంతో సంపూర్ణం అయ్యింది. మీరు దాచుకున్న నెమలికన్ను చెప్పిన విషయాలు ఆచరణీయం.

 2. Sravan అంటున్నారు:

  Nice…. But 10 years kritham degree chadivava.. “nelabaludu” kaadhu “nelauncle” ani peru marchuko Heeheh ;) ;) ;)

 3. SRRao అంటున్నారు:

  నిజంగా నిజమైన మంచి మాటలు. ఇవి నాలుగు కాదు నలభై వేల…లక్షల…కోట్ల… విలువైనవి. ధన్యవాదాలు.

 4. nagarjuna అంటున్నారు:

  very interesting…9 mATa chala nacchindi

 5. రామకృష్ణ అంటున్నారు:

  నాకు మూడోది బాగా నచ్చింది. మిగతావి మాతో ఎప్పుడు పంచుకుంటారు ? అన్నీ ఆచరించలేక పోయినా కొన్నయినా చేయటానికి ప్రయత్నించ వచ్చు. థాంక్స్ ఫర్ ది పోస్ట్.

 6. nelabaludu అంటున్నారు:

  @ saamaanyudu
  ధన్యవాదాలు.
  @Sravan..
  hmmm.. ;)
  @SRRao
  అవునండి.. థాంక్స్
  @రామకృష్ణ
  త్వరలొ పంచుతాను… థాంక్స్!
  @nagarjuna
  ధన్యవాదాలు…!!!

 7. navi అంటున్నారు:

  chala bagunnai sir. Ilanti manchi matalu inkennenno rayali meeru. Last one is very very nice

 8. శ్రీవాసుకి అంటున్నారు:

  >>ఆకలేస్తుంది అని అన్నం తినడం ప్రకృతి; ఆకలేస్తుంది అని ఎదుటివాడిని దోచుకొని తినడం వికృతి; ఆకలేస్తుంది అని ఎదుటివారికి పెట్టి తినడం సంస్కృతి
  >>జీవితం లొ సర్వం కోల్పోయినా ఒకటి మాత్రం మిగిలే ఉంటుంది, అదే భవిష్యత్తు.

  ఈ రెండు బాగా నచ్చాయి. అతిథి అభ్యాగతులకు పెట్టి తినాలని మన ధర్మా శాస్త్రాలు ఏనాడో చెప్పాయి. భవిష్యత్ అనేది ఉంది కాబట్టే మన ఇలా బ్రతుకు మీద ఆశతో జీవిస్తున్నాము.

 9. nelabaludu అంటున్నారు:

  @navi..
  thank you much!
  @ శ్రీవాసుకి..
  థాంక్ యు… అవునండి ..

 10. Suman అంటున్నారు:

  Anna….keko keka…anni baagunnayi….naaku baaga nachindi Number: Three

  ee 12 lo ye 4 to 5 implement chesina chaalu anukunta….yemantav?

 11. Krishna అంటున్నారు:

  Nice quotes Shankar. Thanks :)

 12. a2zdreams అంటున్నారు:

  toooo good. చాలా బాగున్నాయి. నా బ్లాగులో మరియు బయట, వీలైనా చోటల్లా మీ మంచి మాటలు విచ్చల విడిగా వాడేసి మరో కొంత మందికి వినిపిస్తాను. copy right అని నా మీద యుద్దానికి రావద్దు.

 13. nelabaludu అంటున్నారు:

  @ a2zdreams
  Thanks.. విచ్చల విడిగా వినిపించండి.. మంచి ని పంచడం లొ మించింది లేదు..

 14. భావన అంటున్నారు:

  చాలా బాగున్నాయి మీ కలక్షన్స్.

 15. nelabaludu అంటున్నారు:

  @ భావన
  ధన్యవాదాలు…!!!

 16. Nageshwer Reddy అంటున్నారు:

  chala bagunnayi… mukyanga 3rd one

 17. Nutakki raghavendra Rao అంటున్నారు:

  తొలి సూత్రంలొ… ప్రతి రాయిలోనూ ఒక శిల్పం దాగుని వుంటుంది. వాస్తవమే చెక్కితే. చెక్క కుండానే అనేక ఆకారాలు చెట్ల చర్మాలపై …నా ప్రియుణ్ణి చూశావా మిత్రమా లో …ఓ..లుక్కేయండి..
  అలాగేతొమ్మిదో నంబరు సూత్రం లో అవకాశం వినియోగించుకోవడం అని మార్చేసుకొంటె బాగుంటుందేమో?….గిజిగాడు

 18. nelabaludu అంటున్నారు:

  @ Nutakki,
  నా ప్రియుణ్ణి చూశావా మిత్రమా.. web link ivvaraa..
  tommido sootram savaristaanu..! thank you !!!

 19. పార్ధు అంటున్నారు:

  ఆకలేస్తుంది అని అన్నం తినడం ప్రకృతి; ఆకలేస్తుంది అని ఎదుటివాడిని దోచుకొని తినడం వికృతి; ఆకలేస్తుంది అని ఎదుటివారికి పెట్టి తినడం సంస్కృతి

  ఇది టచ్ చేసింది.

 20. manohar అంటున్నారు:

  నెలబాలా నాకు లింకెలా పంపాలో తెలియదు కాని, http://www.wordpress.com కి వెళ్ళి dt.27-03-2010 వ తేది ప్రచురణలలో చూడండి .మీకు కొద్దిగా యీశ్రమ తప్పదు.లేదా నాకు చిన్న చిన్న టిప్పులతో ట్యుటోరియల్ లెస్సెన్ పంపండి….గిజిగాడు

 21. rathnam.sjcc అంటున్నారు:

  మనసు నిలిపి మనసు నిర్మలంగా, నిమ్మళంగా వుండాలని కోరుకుంటాడేగానీ మదిని నిగ్రహించుట మిక్కిలి సాహసవంతమైన పని అని చెబుతాడు! తన సాధనాబలం చేత దాటిన జ్ఞాని మనసునిలిపి నిశ్చల స్థితిని పొంది భగవంతునిపై లగ్నమై ఉంటుంది. మనసు నిలిపి శరణాగతినే కోరుకుంటుంది ఆత్మ జ్ఞానం అనేది ఎంతటి అత్యున్నతి స్థితి సూక్ష్మచైతన్య సాధనల యొక్క అత్యున్నత లక్ష్యం ఆత్మ )సాక్షాత్కారం తన్ను వీడి తాను నిలుచు సూక్ష్మతత్త్వమే నిత్యం. తానని గ్రహించటం సూక్ష్మ తత్వం అంతటా వ్యాపించి ఉన్న సూక్ష్మ తత్వం ఆత్మా సాక్షాత్కారం .’ఉపదేశం అన్న మాటకు అర్థం ఆత్మలో ఉండడం లేక ఆత్మగా ఉండడం. అతీతమైన సూక్ష్మచైతన్య స్థితి ఒక క్షణంలోమనసు నిలిచి అమనస్కమైన ఉండాలి ఆత్మ సాక్షాత్కారం అని చెప్పారు.క్షణంలోగురువు ద్వారానే దర్శనం చేసుకోవాలి . ఉన్నది ఒకే ఆత్మ .. నేను, నీవు, ఈ బ్రహ్మ.. భవిష్యత్తులో ఆవిర్భవించనున్న వేమన ఇవన్నీ ఏకస్వరూపాలే.ఆత్మఏకస్వరూపా ము ఆత్మలో ఏ బేధం లేదని” అనుగ్రహించి తన నిజరూపంతో దర్శనమిచ్చి.. వారి అహంకారాన్ని మట్టికలిపినట్లు గురువు చెబుతున్నారు. జీవనముక్తి మార్గంలో సూక్ష్మసాధన ద్వారా “తత్వమసి” అనే సత్యాన్ని గ్రహించాలి. అనుభవించేవాడికి, అనుభవానికి భేదం లేదని సూక్ష్మసాధన ద్వారా తెలుస్తుంది. ఇలా బ్రహ్మ జ్ఞానాన్ని తెలిసికొన్నవారే జీవన్మిక్తులు, “అది” వున్నది. ఆత్మసూక్ష్మచైతన్య స్థితి దీనినే పరతత్వం, పరబ్రహ్మము అని కూడా అంటారు. అమరత్వము సాధించి పెట్టడం అనే విషయాన్ని మానవ జాతికి అందించడానికి గురువుద్వారా నూతన పరిణామము తీసుకొని వచ్చింది. మనసు నిలుపకున్న ముక్తి లేదయా చూపు నిలుపకున్న సుఖము లేదుబ్రహ్మ మనగ వేరె పరదేశమున లేడు బ్రహ్మ మనగ జూడు బట్ట బయలు, తనకు తానె బ్రహ్మ తారక మౌనయా గురువు మీద నమ్మకం ఉంటేనే జ్ఞానం లభిస్తుంది. చీకటిలో నడవడానికి దీపం మీద ఎంత నమ్మకంగా ఆధారపడతామో అదేవిధంగా మనలోని అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి గురువు మీద అంతగా ఆధారపడాలి. మనం భ్రమతో చీకటిలోకి వెళ్తున్నాం. ఈ జీవితం అంతా మాయ. ఈ పుట్టుక, మరణం కూడా మాయనే. ఈ శరీరం వీడిన తరువాత ఏదీ మనవెంట రాదు. అన్నింటికి మనం దూరం అవుతాం. శరీరం నశించిన తరువాత అసలు మనము ఉండం. అందుకే నాది, నావి, నావారు అనే భ్రమలు వదులుకోవాలి. ఈ జీవన నాటక రంగంపై నటించాలి. నాటకంలో పాత్రధారి పూర్తిగా లీనం కానట్లే జీవితంలో కూడా మీరు పూర్తిగా లీనం కావద్దు. సంతానం కలుగకపోతే తాపత్రయం, కలిగితే తాపత్రయం. వారికి ఏదీ తక్కువైనా తాప త్రయం. వారి చదువులు, పెండ్లి, ఉద్యోగం, ఆరోగ్యం ఇలా అన్నింటి గురించి తాపత్రయమే. ఇవన్నీ వదులుకోవాలి.

  సద్గురు సహాయము లేకుండా మనస్సును జయించగలవాడు యెవ్వడు ? మనస్సు ఆత్మతో విలీనమైతే మనిషి సాధించ లేనిదంటూ ఏమీ లేదు దైవమంటే ఏమిటి?మనం ప్రతిరోజు దేవుణ్ణి పూజిస్తాం. మనసు నిలకడకోసం ఒక విగ్రహాన్నో, చిత్రపటాన్నో ఎంచుకొని దేవుణ్ణి ప్రార్ధిస్తాం. గతంలో అవతరించిన అవతార పురుషులను, ప్రస్తుతం సజీవులైన మహాత్ములను, బాబాలను, స్వాములను, అమ్మలను మనం పూజిస్తున్నాం. ఐతే దైవమంటే ఏమిటి, ఎలా ఉంటాడు, ఎక్కడుంటాడు అనే ప్రశ్నలు ఉదయిస్తాయి. అసలు దేవుడనగా అకాశములోగాని, పాతాళములోగాని, పరలోకములోగాని, విగ్రహములోగాని, దేవాలయములోగాని, మరి ఏ ఇతర నిర్దేశిత ప్రదేశం లో గాని ప్రతిష్టించబడియున్న కూడిన అద్భుత శక్తి కాదు. సకల చరాచర జీవజగత్తులో నిండి, నిబిడీకృతమై వున్న అనంత అతీతమైన సూక్ష్మచైతన్య అసలైన దైవం.
  మన తాతలు, తండ్రులు, దేవుని విగ్రహాలకు, చాయా చిత్రాలకు దండం పెట్టారు. మనమూ అదే బాటలో దండాలు పెడుతున్నాం. రాముడు, కృష్ణుడు, ఏసు ప్రభువు, మహమ్మద్ ప్రవక్త, గురునానక్, షిరిడీ సాయి మొదలగు వారిని దేవుండ్లంటున్నాం. వారిని పూజిస్తున్నాం, కీర్తిస్తున్నాం.
  బాగా ఆలోచించి, విశ్లేషణ చేసుకుంటే మనం దేవుని పటానికి దండం పూజలను చేస్తున్నాం. మన మాయను ఛేదించుకోవాలంటే గురువును ఆశ్రయించాలి. అంటే గురువును ని పూజించాలి. మనం ఎవరినైతే గురువుగా ఎంచు కుంటామో వారి అనుగ్రహానికి పాత్రులు కావాలి. అప్పుడే భ్రమలు తొలగి ఆత్మనిత్య కైవల్యాన్ని అందుకుంటారు గురువు తెలుసు. అందుచేతనే వారు ఆత్మసత్యాలని చక్కటి ఉదాహరణల ద్వారా బోధించేవారు.గురుపాదపద్మాలను ఆశ్రయిస్తే పూర్వజన్మకృత పాపఫలం కూడా నశిస్తుంది. దీనివల్ల ఆదిఆత్మదైవతక మనస్సు,నిలిపి కనురెప్పపాట్లు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది

  గురువు పూజలోని అంత్రరార్థాన్ని తెలుసుకోకుండా, అదొక తంతువలె భావిస్తుంటారు.పూజను ప్రారంభించేటప్పుడు ముందుగా గురువుద్వారా భక్తునికి,మనస్సు,నిలిపి తానెవరో, తను ఇక్కడకు ఎందుకు వచ్చాడో , ఈ ప్రయాణం ఎక్కడికి పోతుందోనన్న విషయన్ని తెలుసుకుంటాడు.మనస్సును లీనం చేయడంమనసులోకి ఏ ఇతర భావనలు రాకుండా అరికట్టాడం అర్ఘ్యం. అమృతవృత్తియే స్నానం. రాగద్వేషాలకు అతీతంగా ఉండటం కర్మవాసనలకు దూరంగా ఉండటమే . మనసులో దోషాలేవీ లేకుండా మనస్సును అర్పించడమే పుష్పం. మనసులోనున్న చెడు ఆలోచనలను దూరంగా పోగొట్టు కోవడం వలన సాధ్యమవుతుంది. తనకు ఈ లోకంలో లభించినవన్నీగురువు లభించాయన్న ఉద్దేశ్యంతో నెవేద్యాన్ని మర్పిస్తుంటాం.నిశ్చలంగా మనసులో ఎటువంటి భావనలు లేకుండా ఉండటం ప్రదక్షిణం. ఆయనే నేనే అన్న భావాన్ని కలిగి ఉండటం నమస్కారం. అతీతమైన సూక్ష్మచైతన్య మౌనంగా ఉండటం అని చెప్పబడింది. బ్రహ్మపథంలో ఉన్న పరమాత్మను సేవించడమే ఈశ్వరసేవ అని చెప్పబడింది సూక్ష్మచైతన్యం ఓ సర్వాంతర్యామీ! నీవు నిరంతరం సర్వ ప్రాణూలలో నిండి ఉన్నావు. సమస్త ప్రాణులలో రాణంగా ఉన్నావు

  ఈ ఆత్మ కు కులమతములు లేవు. స్త్రీ పురుష బేధంలేదు. చావుపుట్టుకలు లేవు. అదియే సజీవాత్మ. జాగ్రత్, స్వప్న, సుషుప్తి, తురీయ సూక్ష్మచైతన్య స్ధితి
  మదిని నిగ్రహించుట మనసు నిలిపి తన సాధనాబలం చేత దాటిన జ్ఞాని మాత్రం మనసు నిలిపి నిశ్చల స్థితిని పొంది మనసు నిలిపి లగ్నమై ఉంటుంది.
  హృదయ మందిరంలో మనసు నిలిపి చూడర జగన్మిధ్యా బ్రహ్మసత్యమని నమ్మర జీవో బ్రహ్మైవ తెలియర అద్వైత మార్గంలో ఆత్మనిలుకడ చెందర ఆత్మ లోఎరుక చైతన్యం .లేని స్ధానంలేదు. ఆత్మ లో ఎరుక చైతన్యం.లేని వస్తువు లేదు. ఆత్మ లో ఎరుక చైతన్యం.లేని జగము లేదు. ఆత్మ లో ఎరుక చైతన్యంలేని జీవము లేదు. ఆత్మ లో ఎరుక చైతన్యం లేని దైవం లేదు. ఆత్మ లో ఎరుక చైతన్యం.లేని ఏ నేనే లేదు. సమస్త ఆత్మ లో ఎరుక చైతన్యం నేనే సర్వాధారం. అట్టి నన్ను తెలుసుకొనుటయే సమస్త మత ధర్మముల, సమస్త వేదాంత యోగసూత్రముల, సమస్త జ్ఞాన యజ్ఞముల ఫలితం. నన్ను మరిచి ఎన్ని గ్రహించినా సర్వం అధోగతియే. నాతో ఈ సమస్తం ఆత్మ లో ఎరుక చైతన్యం ఏకీభవించి ఆత్మ లో ఎరుక చైతన్యం నాయందే లీనమైయున్నది నేనే సర్వమునకు మూలం. మనో జగత్తులకు తేడాలేదు. జగము మనోకల్పితము

 22. ch n r anjaneyulu అంటున్నారు:

  chala bagunnayi,elantivi enka upload cheyyandi

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: