నాలో నిలవని నా హృదయం – ప్రతి క్షణం నీకై తాపత్రయం !

2010/04/30

నా ఎద లొ ఏవో వేదనలు

నిను చూడగానే కీర్తనలు గా మారి..

నిదురించిన నా ఆశలకు

నీ ప్రేమ పలుకు తొ నిద్ర కరువయ్యేలా చేసావు…!


ఊహల పల్లకి లొ ఉర్రూతలూగి

నన్ను నే మరచి నీ చెంత చేరినట్లుగా..

పువ్వులై విరిసిన నా మనసుకి

నీ చిరునవ్వుతో సుమగంధాన్ని వెదజల్లావు…!!


గిల్లుతున్న ఈ చల్లని గాలి

నా తనువంతా  పులకించే నీ పాటగా..

కాలం తొ పాటు కదిలే నన్ను

నీ జ్ఞాపకాలతో సమయమే తెలియకుండా మార్చేసావు…!!!

***************************************************

ప్రకటనలు

ఎయిర్ టెల్ – డిప్రెస్ యువర్ సెల్ఫ్ !

2010/04/05

మనిషి కి సర్వసాదారణంగా విరక్తి, చిరాకు, కోపం ఎప్పుడు వస్తాయ్..? ఆపదలో ఉన్నప్పుడు తనకు సహాయం చేయడానికి ఎవరు ముందుకు రాకుంటే.. కాని ఎయిర్ టెల్ కస్టమర్ కేర్ కి కాల్ చేయండి మీరు అంతకంటే పది రెట్లు ఎక్కువ తెచ్చుకోనే దౌర్భాగ్యాన్ని సంపూర్ణంగా పొందండి. ఇటువంటి అధ్బుత అవకాశం కేవలం మూడు నిమిషాలకు 50 పైసలు మాత్రమే.. త్వరపడండి.

కర్మ కాలి మొన్న ఏప్రిల్ ఫస్ట్ న మొబైల్ పోతే సిమ్ముని బ్లాక్ చేయించాను. దగ్గర్లో ఉన్న ఫ్రాంచైజీ లొ డాక్యుమెంటులు ఇచ్చి  కొత్త సిమ్ము తీసుకొన్నాను. కాని ఇంతవరకు అవుట్ గోయింగ్ ఎస్.ఎం.ఎస్ గాని, కాల్స్ గాని పోవట్లేదు.. ఇప్పటికి నాలుగు రోజుల్లొ నలభై కాల్స్ చేసాను కస్టమర్ కేర్ కి..  ఇంతవరకు అన్ బార్/ అన్ బ్లాక్ చేయలేక పోయారు.. ఆరు సంవత్సారల నుండి ఒకటె నెంబర్ కదాని అలోచిస్తుంటే వీరి వ్యవహారం టూ మచ్ గా తయారైంది, నాకు కోఫం కపాలం దాటినా వారు మాత్రం స్వీట్ గా  మీకు కలిగిన అంతరాయనికి చింతిస్తున్నాం…  అంటు.. చింతిస్తూనే నన్ను హింసిస్తున్నారు..

వారిని ఘాటు బూతులు తిట్టాలనిపించేలొపే కాసేపు ఫోనే హోల్డ్ లో పెట్టి బ్యాక్రౌండ్ లొ రెహమాన్ స్వరపరిచిన (!) మధుర గీతాన్ని ఆలపిస్తారు.. దానితొ కోపం చల్లారి మనసు ఆ కమ్మటి చిన్న పాటపై వెళ్తుంది.. గత నాలుగు రోజులుగా వారికి ఫోన్ చేసి చేసి విసిగి పోయాను… కాని ఆ మధురమైన ఎయిర్ టెల్ సంగీతం, బాణిలు మాత్రం నన్ను ఇప్పటికి వెంటాడుతున్నయ్.. ఇదిగొ మీరు వినండి.. తప్పులుంటే సవరించండి ;)

*********************************************************************

ఒక కోటి హృదయాల్ని తాకినందుకు మాకు
శతకోటి నవ్వులని అందించినందుకు
ధీటైన స్థానాన్ని అందించినందుకు
ధన్యవాదాలు మీకు
ధన్యవాదాలు మీకు
ఒకటి నుండి కోటి వరకు
నాటి నుండి నేటి వరకు
మేటి గా నిలిపి సాటిలేనిది అని తెలిపి తోడైన మీకు మా ధన్యవాదం
కోటిమంది వినియొగదారులు చేరిన సందర్భంలొ
అంధ్రప్రదేశ్ లొ నెంబర్ వన్ నెట్ వర్క్ ఎయిర్ టెల్
అంధ్రప్రదేశ్ ప్రజలకు తన ధన్యవాదాలనందిస్తుంది.

*********************************************************************

వోడాఫోన్ ఆడ్స్ లొ ఉన్న క్రియేటివిటిని, ఎయిర్ టెల్ సంగీతం లొ ఉన్న క్రియేటివిటిని   వాటి సర్విస్ లొ 10% అయినా అవలంభిస్తే తప్ప వినియోగదారులను సంతృప్తిపరచలేరు..


అంతర్జాలం ఓ మాయాజాలం!

2010/04/03

గత కొన్ని సంవత్సరాలనుండి  రోజుకు ఒక సారైన అంతర్జాలం(Internet) లొ విహరించనిదే నాకు రోజు గడిచినట్టుండదు..  తొలిసారిగా  అంతర్జాలం లొ గాలించింది అంటే.. ఇంటర్ అవ్వగానే అనుకుంటా..ఇంటర్నెట్ లోకి అడుగుపెట్టింది… అప్పట్లొ  గంటకి పాతిక రూపాయలు..కాలేజ్ అవ్వగానే మిత్రులతొ కలిసి నెట్ సెంటెర్ కి వేళ్ళేవాడిని.. ఒక క్యూబ్ లొ ముగ్గురం కూర్చునేవాళ్ళం. అప్పట్లొ అదో క్రేజ్ లేండి.. అంతర్జాలం లొ ఓనమాలు నేర్చుకుంటున్న రోజులవి. ;)

కంప్యూటర్ అంటె బాగ ఆసక్తి వలన సాఫ్ట్ వేర్ రంగంలొ స్థిరపడాలనుకునేవాడిని. ఇక డిగ్రీ, పి.జి చదివే రోజుల్లో.. దిల్ సుఖ్ నగర్ లొ కాలేజ్ కి దగ్గరగా నెట్ సెంటర్ లు కుప్పలు కుప్పలు గా ఉండేవి.. ఆదివారల్లో, సెలవు దినాల్లో ఐతే  ఇంటిదగ్గర.. కొన్ని బ్రౌజింగ్ సెంటర్ లొ..  సర్ఫింగ్.. నెలకు లేదా పది గంటలు అనే రకరకాల  పాకెజ్ లు తీసేసుకొని విచ్చల విడిగా విహరించేవాడిని.. ముఖ్యం గా చాటింగ్… బాగా చేసేవాడిని.. అప్పట్లొ ఏర్పరుచుకున్న చాటింగ్ ఫ్రెండ్స్ దాదాపు ఇప్పటికి కాంటక్ట్ లొ ఉన్నారు..

బహుళజాతి సంస్థ లొ ఉద్యోగం కాబట్టి ఆఫిస్ లొ జాయిన్ అయిన రోజు నుండి ఇప్పటి వరకు అంతర్జాలం లొ విహరించని రోజు ఇంకా నమోదు కాలేదు అంటే అతిశయోక్తి అనాలేమో ;) యాహూ, రెడిఫ్, ఎం.ఎస్.ఎన్ జి-టాక్ మెసెంజర్లొ  ఉండె నా సేవలు క్రమ క్రమంగా సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ కి విస్తరించాయ్. ఆర్కుట్, ఫేస్-బుక్, ట్విట్టెర్, లింక్డ్ ఇన్..ఇలా ఎన్నొ సైట్ల లొ… క్రాప్స్, మెస్సేజస్…ఫోటొస్ స్టొరింగ్..కామెంట్స్.. ఎన్నో. అసలు టైమే తెలియదు.. ఆఫిస్ లొ వర్క్ లేకుంటె వీటి దర్శనం ఖచ్చితం గా ఉంటుంది. వర్క్ ఉంటే ఉండదని కాదు.. దేనికదే ;)

నిత్యం విహరిస్తు ఉండటం వల్ల, లాగిన్ అవుతున్నప్పుడు.. యూజర్ ఐ.డి పాస్వర్డ్ లు గుర్తుకు రావాలంటె  మన క్యాచి మెమోరి ఫలితమేమొ మెయిల్ యూజర్ ఐ.డి కి బాంక్ అకొంట్ యూజర్ ఐ.డి ఇస్తూ ఉండటం ఒకదాని పాస్ వర్ద్ మరొక దానికి ఇవ్వడం యాదృచ్చికంగా జరిగిపోతాయ్. నాకు అంతర్జాలలొ విపరీతం గా విహరించడం అటు పై  మతిభ్రమించడం సర్వసాధారణం అయిఫొయింది.

సినిమాల కోసం, న్యూస్, స్పోర్ట్స్.. ..అంతకు మించి.. దేనికైనా అంతర్జాలం లొ గూగుల్ కోసం విహరించాల్సిందే. గత ఆదివారం మా అక్కయ్య వాళ్ళ ఊరెళ్ళినప్పుడు… అక్కడ ఒక్క రోజు ఉండలేకపోయాను. రోజంతా నెట్ లొ విహరిస్తూ ఉండే నేను.. అక్కడ ఏదొ వెలితిగా అనిపించింది నాకు. బహుశా అంతర్జాలనికి దాసోహాం అయినట్లున్నాను. రోజుకు 10 గంటలకు పైగా అంతర్జాలం లొ గాలిస్తుండటం వలనేమో ఈ అంతర్జాల పిశాచి నన్ను వదలట్లేదు.. ఇది ఒక అవశ్యకత గా మరింది.. ఈ అంతర్జాల మాయాజాలనికి బానిసనయ్యాను !!