అంతర్జాలం ఓ మాయాజాలం!

గత కొన్ని సంవత్సరాలనుండి  రోజుకు ఒక సారైన అంతర్జాలం(Internet) లొ విహరించనిదే నాకు రోజు గడిచినట్టుండదు..  తొలిసారిగా  అంతర్జాలం లొ గాలించింది అంటే.. ఇంటర్ అవ్వగానే అనుకుంటా..ఇంటర్నెట్ లోకి అడుగుపెట్టింది… అప్పట్లొ  గంటకి పాతిక రూపాయలు..కాలేజ్ అవ్వగానే మిత్రులతొ కలిసి నెట్ సెంటెర్ కి వేళ్ళేవాడిని.. ఒక క్యూబ్ లొ ముగ్గురం కూర్చునేవాళ్ళం. అప్పట్లొ అదో క్రేజ్ లేండి.. అంతర్జాలం లొ ఓనమాలు నేర్చుకుంటున్న రోజులవి. ;)

కంప్యూటర్ అంటె బాగ ఆసక్తి వలన సాఫ్ట్ వేర్ రంగంలొ స్థిరపడాలనుకునేవాడిని. ఇక డిగ్రీ, పి.జి చదివే రోజుల్లో.. దిల్ సుఖ్ నగర్ లొ కాలేజ్ కి దగ్గరగా నెట్ సెంటర్ లు కుప్పలు కుప్పలు గా ఉండేవి.. ఆదివారల్లో, సెలవు దినాల్లో ఐతే  ఇంటిదగ్గర.. కొన్ని బ్రౌజింగ్ సెంటర్ లొ..  సర్ఫింగ్.. నెలకు లేదా పది గంటలు అనే రకరకాల  పాకెజ్ లు తీసేసుకొని విచ్చల విడిగా విహరించేవాడిని.. ముఖ్యం గా చాటింగ్… బాగా చేసేవాడిని.. అప్పట్లొ ఏర్పరుచుకున్న చాటింగ్ ఫ్రెండ్స్ దాదాపు ఇప్పటికి కాంటక్ట్ లొ ఉన్నారు..

బహుళజాతి సంస్థ లొ ఉద్యోగం కాబట్టి ఆఫిస్ లొ జాయిన్ అయిన రోజు నుండి ఇప్పటి వరకు అంతర్జాలం లొ విహరించని రోజు ఇంకా నమోదు కాలేదు అంటే అతిశయోక్తి అనాలేమో ;) యాహూ, రెడిఫ్, ఎం.ఎస్.ఎన్ జి-టాక్ మెసెంజర్లొ  ఉండె నా సేవలు క్రమ క్రమంగా సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ కి విస్తరించాయ్. ఆర్కుట్, ఫేస్-బుక్, ట్విట్టెర్, లింక్డ్ ఇన్..ఇలా ఎన్నొ సైట్ల లొ… క్రాప్స్, మెస్సేజస్…ఫోటొస్ స్టొరింగ్..కామెంట్స్.. ఎన్నో. అసలు టైమే తెలియదు.. ఆఫిస్ లొ వర్క్ లేకుంటె వీటి దర్శనం ఖచ్చితం గా ఉంటుంది. వర్క్ ఉంటే ఉండదని కాదు.. దేనికదే ;)

నిత్యం విహరిస్తు ఉండటం వల్ల, లాగిన్ అవుతున్నప్పుడు.. యూజర్ ఐ.డి పాస్వర్డ్ లు గుర్తుకు రావాలంటె  మన క్యాచి మెమోరి ఫలితమేమొ మెయిల్ యూజర్ ఐ.డి కి బాంక్ అకొంట్ యూజర్ ఐ.డి ఇస్తూ ఉండటం ఒకదాని పాస్ వర్ద్ మరొక దానికి ఇవ్వడం యాదృచ్చికంగా జరిగిపోతాయ్. నాకు అంతర్జాలలొ విపరీతం గా విహరించడం అటు పై  మతిభ్రమించడం సర్వసాధారణం అయిఫొయింది.

సినిమాల కోసం, న్యూస్, స్పోర్ట్స్.. ..అంతకు మించి.. దేనికైనా అంతర్జాలం లొ గూగుల్ కోసం విహరించాల్సిందే. గత ఆదివారం మా అక్కయ్య వాళ్ళ ఊరెళ్ళినప్పుడు… అక్కడ ఒక్క రోజు ఉండలేకపోయాను. రోజంతా నెట్ లొ విహరిస్తూ ఉండే నేను.. అక్కడ ఏదొ వెలితిగా అనిపించింది నాకు. బహుశా అంతర్జాలనికి దాసోహాం అయినట్లున్నాను. రోజుకు 10 గంటలకు పైగా అంతర్జాలం లొ గాలిస్తుండటం వలనేమో ఈ అంతర్జాల పిశాచి నన్ను వదలట్లేదు.. ఇది ఒక అవశ్యకత గా మరింది.. ఈ అంతర్జాల మాయాజాలనికి బానిసనయ్యాను !!

ప్రకటనలు

2 Responses to అంతర్జాలం ఓ మాయాజాలం!

  1. Nutakki raghavendra Rao అంటున్నారు:

    అదో వ్యసనం మాష్టారూ.పేకాట,గుర్రప్పందేలూ,బ్రాకెట్టాటా,రాజకీయం,దొంగతనం లాటి అనేక వ్యసనాలోకెల్లా ఎక్కువ దురదుండే వ్యసనం అంతర్జాల విహారం. అందులో యీబ్లాగింగూనూ,అన్ని వ్యసనాలలో లానే యిక్కడా పెళ్ళాలు కాపురాలు వదిలిపోయే ప్రమాదంవుండొచ్చు.అట్లాంటి పరిస్థితి రాకుండా జర జాగ్రత్త బాబూ. ఏదో పెద్ద ముండావాణ్ణి చెబుతున్నాననుకోకు…….గిజిగాడు.

  2. nelabaludu అంటున్నారు:

    @ Nutakki
    అయ్యో, భలె వారే మీ సూచనలు/సలహాలు కు స్వాగతమండి. వ్యసనాలోకెల్లా ఎక్కువ దురదుండే వ్యసనం అంతర్జాల విహారం.– ముమ్మాటికి నిజం.. ఎంతవరకైతె అవసరమొ అంతవరకే విహరించాలి..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: