ఎయిర్ టెల్ – డిప్రెస్ యువర్ సెల్ఫ్ !

మనిషి కి సర్వసాదారణంగా విరక్తి, చిరాకు, కోపం ఎప్పుడు వస్తాయ్..? ఆపదలో ఉన్నప్పుడు తనకు సహాయం చేయడానికి ఎవరు ముందుకు రాకుంటే.. కాని ఎయిర్ టెల్ కస్టమర్ కేర్ కి కాల్ చేయండి మీరు అంతకంటే పది రెట్లు ఎక్కువ తెచ్చుకోనే దౌర్భాగ్యాన్ని సంపూర్ణంగా పొందండి. ఇటువంటి అధ్బుత అవకాశం కేవలం మూడు నిమిషాలకు 50 పైసలు మాత్రమే.. త్వరపడండి.

కర్మ కాలి మొన్న ఏప్రిల్ ఫస్ట్ న మొబైల్ పోతే సిమ్ముని బ్లాక్ చేయించాను. దగ్గర్లో ఉన్న ఫ్రాంచైజీ లొ డాక్యుమెంటులు ఇచ్చి  కొత్త సిమ్ము తీసుకొన్నాను. కాని ఇంతవరకు అవుట్ గోయింగ్ ఎస్.ఎం.ఎస్ గాని, కాల్స్ గాని పోవట్లేదు.. ఇప్పటికి నాలుగు రోజుల్లొ నలభై కాల్స్ చేసాను కస్టమర్ కేర్ కి..  ఇంతవరకు అన్ బార్/ అన్ బ్లాక్ చేయలేక పోయారు.. ఆరు సంవత్సారల నుండి ఒకటె నెంబర్ కదాని అలోచిస్తుంటే వీరి వ్యవహారం టూ మచ్ గా తయారైంది, నాకు కోఫం కపాలం దాటినా వారు మాత్రం స్వీట్ గా  మీకు కలిగిన అంతరాయనికి చింతిస్తున్నాం…  అంటు.. చింతిస్తూనే నన్ను హింసిస్తున్నారు..

వారిని ఘాటు బూతులు తిట్టాలనిపించేలొపే కాసేపు ఫోనే హోల్డ్ లో పెట్టి బ్యాక్రౌండ్ లొ రెహమాన్ స్వరపరిచిన (!) మధుర గీతాన్ని ఆలపిస్తారు.. దానితొ కోపం చల్లారి మనసు ఆ కమ్మటి చిన్న పాటపై వెళ్తుంది.. గత నాలుగు రోజులుగా వారికి ఫోన్ చేసి చేసి విసిగి పోయాను… కాని ఆ మధురమైన ఎయిర్ టెల్ సంగీతం, బాణిలు మాత్రం నన్ను ఇప్పటికి వెంటాడుతున్నయ్.. ఇదిగొ మీరు వినండి.. తప్పులుంటే సవరించండి ;)

*********************************************************************

ఒక కోటి హృదయాల్ని తాకినందుకు మాకు
శతకోటి నవ్వులని అందించినందుకు
ధీటైన స్థానాన్ని అందించినందుకు
ధన్యవాదాలు మీకు
ధన్యవాదాలు మీకు
ఒకటి నుండి కోటి వరకు
నాటి నుండి నేటి వరకు
మేటి గా నిలిపి సాటిలేనిది అని తెలిపి తోడైన మీకు మా ధన్యవాదం
కోటిమంది వినియొగదారులు చేరిన సందర్భంలొ
అంధ్రప్రదేశ్ లొ నెంబర్ వన్ నెట్ వర్క్ ఎయిర్ టెల్
అంధ్రప్రదేశ్ ప్రజలకు తన ధన్యవాదాలనందిస్తుంది.

*********************************************************************

వోడాఫోన్ ఆడ్స్ లొ ఉన్న క్రియేటివిటిని, ఎయిర్ టెల్ సంగీతం లొ ఉన్న క్రియేటివిటిని   వాటి సర్విస్ లొ 10% అయినా అవలంభిస్తే తప్ప వినియోగదారులను సంతృప్తిపరచలేరు..

ప్రకటనలు

14 Responses to ఎయిర్ టెల్ – డిప్రెస్ యువర్ సెల్ఫ్ !

 1. Sarath 'Kaalam' అంటున్నారు:

  రేప్ తప్పనిసరి అయినప్పుడు ఆనదించమన్నారు. అలాగే తప్పనిసరి అయి(న) సంగీతాన్ని ఆనందిస్తున్నారన్నమాట!

 2. Siva Cheruvu అంటున్నారు:

  Ha ha.. madhura maina sangeetham… meeku aa sukhamainaa dakkindi… “మీరు రోలు అయితే నేను మద్దెల.. ఎయిర్ టెల్ తో పాటూ ఎయిర్ సెల్ కూడా వాడుతున్నా.. మొదటివాడు నా ఓపికకి పరీక్ష పెట్టి ఊరుకున్నాడు. రెండో వాడు.. బాలన్స్ ఓపికని జుర్రుకున్నాడు.. డర్టీ సర్వీసెస్ …”

 3. nelabaludu అంటున్నారు:

  @ Sarath..
  హ్మ్.. బాగా అనాలిసిస్ చేసినట్లున్నారు ;) రోట్లో తలకాయ పెట్టి రోకలి పోటు తప్పదంటె ఎలా.. అన్నట్లుంది..నాకు ;(
  @ Siva..
  అన్ని సర్విస్ లు అలానే తగలబడినాత్లున్నయ్.. వినియోగదారుడికి చిల్లు వాళ్ళకే చెల్లు.. !

 4. రవి చంద్ర అంటున్నారు:

  ఇప్పుడు ఏ కంపెనీ సర్వీసు అయినా అలాగే తగలడినట్లుంది. నా BSNL సిమ్ మారుద్దామంటే ఏ సర్వీసు చూసినా ఇలాంటి కంప్లైట్సే వస్తున్నాయి.

 5. V V Ganesh అంటున్నారు:

  Yes, I agree. What the heck is this, even for calling to customer care also, they are charging money.

 6. Kalyani అంటున్నారు:

  BSNL చాలా బాగుంటుంది. మిగతా వాళ్ళలా చిల్లర మల్లర ఆఫర్లు ఇవ్వరనే గానీ మంచి క్వాలిటి ఉంటుంది సర్వీసెస్ లో. నాకు కాల్ సెంటర్ కి ఫోన్ చేసే అవసరమే రాలేదు గత ఆరేళ్ళుగా….. ఎప్పుడైనా ఏదైనా ప్లాన్ మార్చుకోవాలన్నా ఒక్క ఎస్ ఏం ఎస్ చాలు.

 7. SRRao అంటున్నారు:

  శంకర్ గారూ !
  మీరు ఎయిర్ టెల్ బారిన ఇప్పుడు పడ్డారు. హైదరాబాద్ కి JTM పేరుతో పరిచయమైన కొత్తలో కనెక్షన్ తీసుకున్నాను. బిల్స్ విషయంలో వివరాల కోసం నరకం అనుభవించాను. విసిగి జీవితాన్ని మారుస్తుందేమోనని ఐడియాకు మారితే కనెక్టివిటీ సమస్యలు, కస్టమర్ కేర్ ను పట్టుకోలేక, వాళ్ళిచ్చే ఆఫర్స్ బాదుళ్ళు తట్టుకోలేక బి.యస్.యన్.ఎల్. సెల్ సర్వీసెస్ ప్రారంభించడంతో అక్కడ ఆగిపోయాను. ఇక టాటా ఇండికాం వారి లీలలు చెప్పాలంటే ఓ మెగా టపా రాయాలి. సో ! నా దృష్టిలో నమ్మకమైన నేస్తం బి.యస్.యన్. ఎల్. మాత్రమే !

 8. kvsv అంటున్నారు:

  కోపంతో సెల్ లు విసిరేసినట్టయితే రోజుకో 4 సెల్లులు విసిరేయాలి…నేను bsnl plus tata indicom బాధితుడ్ని..

 9. Dev అంటున్నారు:

  Airtel has won the best Service award but i love their service.I too faced the same situation when my postpaid credit limit has reached the limit.It took 2 days of time to unbar the service

 10. nelabaludu అంటున్నారు:

  @ రవి చంద్ర
  అవునండి అన్ని కంపెనీలది అదే మోటో..
  @ V V Ganesh
  అవును.. అదో బొక్కా..
  @ Kalyani
  యు లక్కి ..
  @ Dev
  since i am using airtel more than 6 years, i too love but i got frustated when loss my sim at last it unbarred request completed y’day
  @ SRRao
  మీరు బాధితులే.. గిగా టపా రాసేయండి గురూ..
  @ kvsv
  ఓ..మీరు నా.. ..;)

 11. శ్రీవాసుకి అంటున్నారు:

  బి.ఎస్.ఎన్.ఎల్ గొప్పదేమి కాదు. కాని మిగతా వాటికన్నా ఫర్వాలేదు. ఆఫర్ల గొడవలుండవు. కాని అత్యవసర సమయాలలో కొన్నిసార్లు సిగ్నల్ దొరికి చావదు. అయినా దానిని వదలను. అదో తుత్తి.

 12. aswinisri అంటున్నారు:

  miikii kashtam vachinanduku chintistunnaamu!ha ha ha! inkaa miiku meamu cheayagala sahayam eamainaa vundaa? ha ha ha…

 13. Suman అంటున్నారు:

  anna namaste…cell poyindi…kottadi konnav…kaani no new articles on blogs…no communications…no phone calls…..asalu unnava…leka ye ONSITE chekkeshava?

 14. manohar అంటున్నారు:

  ఒక్క్కొక్కరిదీ ఒక్కొక్క బాధ గదరా సుమతీ అన్నట్లు .తీరులే వేర్వేరు. తిప్పలు తప్పని తాడితులం పీడితులం మొన్ననే గద మేడే…..కుడి ఎడమల దగాదగా. …..రాగ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: