అందరు ఆహ్వానితులే..!

2010/05/24

ప్రియమైన బ్లాగ్మిత్రులారా…

బ్యాచిలర్ జీవితానికి స్వస్తిపలుకుతూ.. మరో బంగారు లోకం లొనికి అడుగుపెట్టబోతున్నాను. కల్యాణ ఘడియలు దగ్గర పడుతున్నాయి..
ఆహ్వాన పత్రిక ఇచట భద్రపరుస్తున్నాను. మీరు మీ కుటుంబ సభ్యులతో అలరించి వధూవరులని ఆశీర్వదింపంచేయగలరని కోరుచున్నాము.

E-card Link:  http://www.invity.com/ShankarAndVijaya


*********************************************************************

ప్రకటనలు

సృష్టికి మూలం అమ్మ..

2010/05/08


అమ్మ కడుపున పుట్టి

అమ్మ చేతితో  తొలి ముద్ద తిని

అమ్మ పాడే లాలి జో పాటలొ తొ నిద్రించి

వేసే బుడి బుడి నడకలకు ధారం పోసి

చందమామ, జాబిలమ్మ, చికుబుకు బండి

ఇలా ఎన్నెన్నొ  పరిచయం చేసి

మొదటి నేస్తంగా నిలిచింది అమ్మ.

ఆకలైన అలసటైన మనకంటె ముందు పసిగట్టేది అమ్మ.

ఆప్యాయతకు, అనురాగానికి ప్రతిరూపం అమ్మ

దేవుడు మలిచిన దైవం అమ్మ విడలేని ఆత్మీయ బంధం అమ్మ

ఓ మాతృమూర్తి హృదయం..

ఈ సృష్టి లో కొలవలేనిది అంటే అది నీ ప్రేమే..

****************************************************


నా తొలి కంపెనికీ వీడ్కోలు పలికే తరుణం ఆసన్నం…

2010/05/04

అక్షారాల ఐదు సంవత్సారల క్రితం..  చదువు పూర్తి చేసుకొని కాలేజి ప్రపంచం నుంచి బయటపడి ఉద్యోగ వేటకు బయలు దేరినరోజులవి. చెప్పులరిగేల తిరగడం, ఉద్యోగం దొరికేలా వెతకడం ప్రతి నిరుద్యోగిలా నా కనీస కర్తవ్యంగా భావించేవాడిని.  ఆ అఘోర ప్రయత్నాలకు ప్రయొశ్చితంగా ఒక బహుళ జాతి సంస్థ లొ ఉద్యోగం లభించింది.  అలా మొదలైన నా కెరీర్ ప్రస్థానం..ఇప్పటివరకు అంటె దరిదాపుగ నాలుగున్నర సంవత్సరాలకు పైగా అదే కంపెనీ లొ కొనసాగాను.

మొదటి చూపు.. మొదటి స్పర్శ.. మొదటి ముద్దు.. మొదటి అనుభవం ఎలా ఉంటుందో అంతే సమంగా మొదటి కంపెనీ నేను చేసిన తొలి  ఉద్యొగం.. జీవితం లొ ఎప్పటికి గుర్తుండిపోతాయ్.  ఈ రోజు మొదటి కంపెనీకీ వీడ్కోలు పలుకుతున్న సందర్భం గా.. పదవతరగతి లొ స్కూల్ నుండో, స్నేహితుల నుండో విడిపోతున్నట్లుగా మనసంతా ఏదో భారంగా ఉంది. ఒకింత భవిష్యత్ ప్రణాళిక కు  కార్యరూపం దాల్చానన్న సంతోషం ఉంది.

మద్రాస్ మహా నగరం లోనే కాకుండా, బెంగళూరు సుందర నగరం తో పాటు మన హైటెక్ హైద్రాబాద్ నగరంలొ కూడా మా కంపేనీలో నా సేవలు అందించాను.. ఈ గడచిన కాలం లొ వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎందరో మిత్రులయ్యారు. చాలా దగ్గరయ్యారు.. ఆ అనుభవాలు, అనుభూతులకు మరో టపా పోస్ట్ చేయాల్సిందే ;)

కంపెనీ నుండి తోటి ఉద్యోగులనుండి ఎన్నొ మెళుకువలు నేర్చుకున్నాను. ఏదైనా టాస్క్ అసైన్ చేస్తే నా లోని శక్తి సామర్ద్యాలను నాకంటె ముందు మా టీం మెంబర్స్ ద్వారానే తెలుచుకున్నాను. నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించన ప్రతి ఒక్కరికి, నా సహోద్యోగులకు, కంపెనీకి పేరు పేరు న ధన్యవాదాలు తెలుపుతూ..  వారు ఉన్నత శిఖరాలను అవలీలగా అధిరోహించాలని ఆశిస్తూ…


ప్రతి కలయిక ఒక వీడుకొలుకు నాంది..
ప్రతి వీడుకొలు ఒక కలయికకు పునాది…


************************************************************