నా తొలి కంపెనికీ వీడ్కోలు పలికే తరుణం ఆసన్నం…

అక్షారాల ఐదు సంవత్సారల క్రితం..  చదువు పూర్తి చేసుకొని కాలేజి ప్రపంచం నుంచి బయటపడి ఉద్యోగ వేటకు బయలు దేరినరోజులవి. చెప్పులరిగేల తిరగడం, ఉద్యోగం దొరికేలా వెతకడం ప్రతి నిరుద్యోగిలా నా కనీస కర్తవ్యంగా భావించేవాడిని.  ఆ అఘోర ప్రయత్నాలకు ప్రయొశ్చితంగా ఒక బహుళ జాతి సంస్థ లొ ఉద్యోగం లభించింది.  అలా మొదలైన నా కెరీర్ ప్రస్థానం..ఇప్పటివరకు అంటె దరిదాపుగ నాలుగున్నర సంవత్సరాలకు పైగా అదే కంపెనీ లొ కొనసాగాను.

మొదటి చూపు.. మొదటి స్పర్శ.. మొదటి ముద్దు.. మొదటి అనుభవం ఎలా ఉంటుందో అంతే సమంగా మొదటి కంపెనీ నేను చేసిన తొలి  ఉద్యొగం.. జీవితం లొ ఎప్పటికి గుర్తుండిపోతాయ్.  ఈ రోజు మొదటి కంపెనీకీ వీడ్కోలు పలుకుతున్న సందర్భం గా.. పదవతరగతి లొ స్కూల్ నుండో, స్నేహితుల నుండో విడిపోతున్నట్లుగా మనసంతా ఏదో భారంగా ఉంది. ఒకింత భవిష్యత్ ప్రణాళిక కు  కార్యరూపం దాల్చానన్న సంతోషం ఉంది.

మద్రాస్ మహా నగరం లోనే కాకుండా, బెంగళూరు సుందర నగరం తో పాటు మన హైటెక్ హైద్రాబాద్ నగరంలొ కూడా మా కంపేనీలో నా సేవలు అందించాను.. ఈ గడచిన కాలం లొ వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎందరో మిత్రులయ్యారు. చాలా దగ్గరయ్యారు.. ఆ అనుభవాలు, అనుభూతులకు మరో టపా పోస్ట్ చేయాల్సిందే ;)

కంపెనీ నుండి తోటి ఉద్యోగులనుండి ఎన్నొ మెళుకువలు నేర్చుకున్నాను. ఏదైనా టాస్క్ అసైన్ చేస్తే నా లోని శక్తి సామర్ద్యాలను నాకంటె ముందు మా టీం మెంబర్స్ ద్వారానే తెలుచుకున్నాను. నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించన ప్రతి ఒక్కరికి, నా సహోద్యోగులకు, కంపెనీకి పేరు పేరు న ధన్యవాదాలు తెలుపుతూ..  వారు ఉన్నత శిఖరాలను అవలీలగా అధిరోహించాలని ఆశిస్తూ…


ప్రతి కలయిక ఒక వీడుకొలుకు నాంది..
ప్రతి వీడుకొలు ఒక కలయికకు పునాది…


************************************************************

ప్రకటనలు

4 Responses to నా తొలి కంపెనికీ వీడ్కోలు పలికే తరుణం ఆసన్నం…

 1. jajimalli అంటున్నారు:

  maro punaadini nirminchandi al d best.

 2. ఉష అంటున్నారు:

  ఈ విరామం కి మరో వృత్తిపరమైన బాధ్యతకి నడుమ ప్రశాంతంగా గడపండి. అనుభవాలని భద్రపరుచుకోండి. ఆల్ ద బెస్ట్.

 3. Nutakki Raghavendra Rao అంటున్నారు:

  ఆ పునాది కావాలి ,మీ మహత్తర భావి నిర్మాణానికి నాంది. వుష చెప్పినట్లు విరామమెరుగని నిరంతర జీవన యానంలో … యీ విశ్రాంతి సమయం వినోదమయం కా వాలని నాఆకాంక్ష ……….. శ్రేయోభిలాషి……..నూతక్కి

 4. nelabaludu అంటున్నారు:

  @jajimalli
  @Usha
  @Nutakki
  Thank you very much

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: