ఓ చిలుక.. మాను నీ అలక!

2010/06/29

నీ అలకతో నా మనసుకి తెలియని కలవరం..

ఇది నమ్మలేని నిజం !

ఓ చిలుకా ఎలా తీర్చను నీ అలకా..

ముద్దులతోనా.. మురిపాలతోనా ..

బుజ్జి  బుజ్జి బుజ్జగింపులతోనా..

సయ్యాటల సరాగాలతోనా..

జామురాతిరి జాబిలి తోనా..

అల్లుకున్న అనురాగాలతోనా .

చెలరేగే చేష్ఠలతోనా..!

అలకతో నీ అందం పది రెట్టింపులైనా..  నాపై నీకు అలకేలా…!

అమావాస్య చీకటొస్తే చందమామ అలిగినట్టు

నీ ద్యాసలొ ఉండే నాపై నువ్వలిగి అటుపై నన్ను కుదిపేస్తావా..!

చిలిపిగ పలికే నీకు అలక మొలకేలా.?

చిరాకుతోనైనా,  పరాకుతోనైనా,  ప్రేమతోనైనా..

కోపంతోనైనా ఎలా చేరిందోగాని  నిన్ను..

మాను నీ అలకా.. నా చెంత చేరిక..!!!
.

ప్రకటనలు

కళ్యాణం.. కమనీయం..!

2010/06/20

జీవితం లొ ఓ అపురూప ఘట్టం వివాహం.. పచ్చని తోరణాలు.. ముత్యాల పందిరి.. వేద మంత్రాలు.. జీలకర బెల్లం….మంగళ వాద్యం..మూడు ముళ్ళు.. ఏడు అడుగులు..  సౌభాగ్య  వైభోగం..బంధు జన సంద్రం..  పెద్దల ఆశిస్సులతో ఒకటయ్యాం.

మరిన్ని ఫోటోలు: