ధ్రిల్ ద రియల్ ఫీల్ …

2010/07/31

ఒక్క మొమెంటు ఆగండి.. శీర్షిక చదివి..ఇది ఇన్సెప్షన్ సినిమాకి నేను రాసిన పర్సెప్షను కాదు అని తెలుసుకోండి….హ్మ్.. ఇక మిగతాది లాగించండి.. :)

ఈ మద్య ఏంటో ఎవరిని తలచుకున్నా తళుక్కున వినపడుతున్నారు లేదా కనపడుతున్నారు..  ఇది కాకతాళియమాంటరో, ఇంకేదన్నా అంటారొ తెలీదు గాని యాదృచ్చికంగా అలా జరిగిపోతున్నాయ్ అనేది నాకు బిలియన్ రూపాయ్ ప్రశ్న గా తయారైంది.

రీసెంట్ గా నా ఎయిర్ టెల్ ప్రీ పైడ్ సిమ్ము ని పోస్ట్ పైడ్ కి మైగ్రేట్ చేయడంతొ కొన్ని కాంటక్స్ పోయాయ్ :( ఒకా నొక మా పాత ప్రాజెక్ట్ మేనేజర్ (టచ్ లొ లేక రెండు నెలలు దాటుంటుంది) నెంబర్  కావల్సి వచ్చి మెయిల్స్ లొ వెతికి నా మొబైల్ లొ సేవ్ చేస్తుండగా తన నుండి కాల్ వచ్చింది.. ;) ఇక ఎక్సైట్ అవ్వడం నా వంతయ్యంది :) :)

మొన్నటికి మొన్న మా ఆఫిస్ లొ నా జూనియర్ తన సహద్యోగి తో ఫోన్ లొ మాటకు ముందు వెనుకు డార్లింగ్ అని  కులుకించిన తర్వాత తనతో.. నేను… అరే.. నాకు సునిల్ అనే మిత్రుడున్నాడు..పి.జి క్లాస్మేట్. తను నన్ను ఎప్పుడు.. డాల్, డార్లింగ్ అని అంటుంటాడు.. అని ముగించే లోపే సునిల్ నుంచి ఫోన్ రావడం నేను నాతొ పాటు మా జూనియర్ ఇద్దరు అలా ఆశ్చర్యపోవడం జరిగింది..

మరో మిత్రుడు నా పెళ్ళి కి ముందు కలిసినపుడు మా ప్రాజెక్ట్ నుండి అమెరికా వెళ్ళే చాన్సెస్ ఉన్నాయ్ రా అనడం.. అటు పై నా పెళ్ళి కి హాజరవ్వడం అన్ని జరిగి పోయాయ్. గత వారం ఎందుకొ తను నాకు గుర్తొచ్చి చాల రోజులైంది అని కాల్ చేస్తే మొబైల్ స్విచ్ ఆఫ్ అని రావడం.. అమెరికా వెళ్ళుంటాడేమో అని నచ్చచెప్పుకున్నాను… అదే రోజు ఓ గంట తర్వాత తను అమెరికా నుండి కాల్ చేసి సర్ ఫ్రైజ్ చేయడం తో థ్రిల్లయ్యాను.

నిత్యం పొద్దునే కొందరికి ఎస్.ఎం.ఎస్ లు  చేస్తుంటాను. నిన్న ఎస్.ఎం.ఎస్ చేస్తూ కాంటక్ట్స్ ని చూస్తుండగా.. రెగ్యులర్ గా తచ్ లొ ఉండే శ్రీధర్ కి ఏమైందబ్బా ఫోన్ చెయ్యట్లేదు అని అనుకున్నాను. నిన్న మధ్య్హానం కల్లా తన నుండి హాయ్ అని పలకరింపు. . నాకు పులకరింపు …

ఏంటొ.. అసలు.. ఇలా తలుచుకోగానే అలా వర్చువల్ గా ప్రత్యక్ష్మవుతున్నారు.  మీరు ఆ ఫీల్ కి లోనయ్యారా? అయ్యే ఉంటారు.. ఆ ఫీలే వేరు కదా  :)

ప్రకటనలు

నా కెమెరా కంట పడిన దృశ్యాలు …

2010/07/25

ఇందులో చాలా వరకు  ఏం పువ్వులొ తెలీదు గాని.. విరబూస్తూ చూపులకు కనివుందు చేస్తున్నాయ్..!

పావురాలంటే మక్కా మసీదే.. వీక్షించండి.. ఎంచక్కా ఫోజులిస్తున్నాయో..

పిట్ట బొమ్మ… చూపు ఇక ఆపమ్మా!!

దొరక్క దొరక్క నాకు చీమ దొరికితే నేను మీకు దొరికానా ;)

జలాకాలాడాలా? దప్పికా తీర్చుకోవాలా అనే సందిగ్దం లొ ఓ పావురం..

హ్మ్.. గిన్నె లొ ఏం లేదు.. నన్నొదిలేయ్.

కుచ్ నహి కర్ సఖ్ థా.. పరేషాన్ మే హూన్..

చూపులకు.. ఐసు… ఫోజులకు బిపాసు..

అరె.. క్యా మియా మై జో బోల్ రా హున్.. వో సునో..

మా ఇద్దరిలో ఎవరు బాగున్నారు..?

జైసా తుం బోలో వైసా మై ఫోజ్ దేతా హూ..

అరే.. అటు చూడురా.. మనల్ని ఫోటొ తీస్తున్నారు..

సరదాగా కాసేపు.. ఒక స్టిల్ అమ్మేద్దాం ;)

Timex గడియారం..   Stylex గా ఉంది కదూ.. ఇది నాదే.. :)

నా సతీమణి కి గాజులంటే ఇష్టం నాకు ఫోటోలంటే ఇష్టం.. అందుకే ఫలితం ఈ దృశ్యం

డీసెంట్ గా ఉంది కదూ.. ఇది ఫ్లోరేసెంట్ బల్బ్


చాయ్ చమక్కులంటే ఇరాని కేఫే.. తాగేయండి మరి

ఇక అన్ని ఫ్లిక్కు లు చూసారుగా…  మరి పైన ఫోటొ లు తీసిన నా వైపు ఒక చూపు చూసేయండి.. ;)