సినిమాల్లొ ట్రైను సీనులు..!

2010/08/30

అదెంటొ..! సినిమాల్లో ట్రైను సీనులంటె నాకు భలే ఇష్టం..  నాటి  పలాన (ఏంటి…గుర్తుకు రావట్లె) సినిమా  నుండి నేటి రాజమౌళి మర్యాద రామన్న సినిమా వరకు ట్రైను సీన్స్  ప్రతీవి ఎంజాయ్ చేయదగ్గవే.. బాలయ్య తొడ కొడితే వెనక్కి వెళ్ళే ట్రైన్ సీను ఐతే మరీనూ.. :)

ప్రస్తుతానికి ట్రైను లో ప్రయాణిస్తూ మా అన్నయ్య కానుక గా ఇచ్చిన ఆపిల్ మాక్ బుక్ ప్రో i7 (చో చ్వీట్ మై బ్రదర్ దీని గురించి త్వరలొ మరో టపా వ్రాయాల్సిందే) ఓపెన్ చేసి  ట్రైను సీన్స్ లున్న సినిమాలు తెలుసుకోవాలని ఈ టపా రాస్తున్నాను..  మీరు కామెంటు గా మీకు తెలిసిన ట్రైను సీక్వెన్సులు ఉన్న మరిన్ని సినిమాలు తెలియ చేయగలరు.. సినిమాలు పాతవైన, కొత్తవైన.. ఏ బాష అయిన.. నాకు ఓకే.. మీకు ముందస్తుగా బహు ధన్యవాదాలు..  ఎలాగైన ఆ సినిమాలు సంపాదించి చూసేంతవరకు నా పిచ్చి కుదిరేటట్లు లేదు..

  • ట్రైను సీను లంటె ముందు గా గుర్తొచ్చే సినిమా వెంకి. దాదాపు గా ముప్పై నిమిషాల  నిడివిలో.. రవితేజ, బ్రహ్మి అలియాస్ గజాల ఏ వి ఎస్ …  ల కామెడి.. హిలేరియస్   :)
  • ఆర్య సినిమా లొ మాట్లడితే పంచ్ ఉండాలంటు ట్రైను టి సి గా నవ్వించే సునిల్ ఎపిసొడ్
  • లవర్ బాయ్ తరుణ్, రాజివ్ కనకాల, బ్రహ్మి.. సీన్స్ ఇన్ నిన్నే ఇష్టపడ్డాను.. నవ్వించక మానవు..
  • అల్లరి నరేష్ దొంగల బండి లొ మత్తు బిస్కెట్లు తినిపించి బంగారం దొంగిలించే సీన్స్..
  • సూర్య s/o కృష్ణన్ సినిమాలొ .. సూర్య- సమీరా రెడ్డి  లవ్ ప్రపోసల్ సీన్స్.. భలే క్లాస్ గా, కామెడీ గా ఉంటాయ్
  • అతడు లో లొకల్ ట్రైన్ సీన్స్ (భాజిరెడ్డి గాంగ్ మనిషి.. డబ్బులు….) మహేష్ బాబు – రాజివ్ కనకాల సీన్స్.. టూ అదుర్స్..
  • విశాఖ ఎక్స్ ప్రెస్ సినిమా మొదట్లోనే మొదలయ్యే అల్లరి నరేష్ – రాజివ్ కనకాల సీన్స్..
  • రాంగోపాల్ వర్మ క్షణ క్షణం క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్స్
  • అంతేగాక మణి రత్నం సఖి,  యువ చిత్రాలు..
  • రీసెంట్ గా మర్యాద రామన్న సినిమా లొ సునిల్, సలొని, కాంచి ల మద్య జరిగే కామెడి బిట్స్..

సొ.. ఇవండి నాకు ఇప్పటివరకు గుర్తొచ్చినవి.. :)

ప్రకటనలు

ఆదివారం వచ్చిన అనందం కన్నా సోమవారం వస్తోందన్న భయం ఎక్కువగా వుంది!

2010/08/15

వీకెండ్ వస్తోంది గదా అని  ఫ్రైడే రోజు రాత్రి పదిగంటల వరకు ఉన్న పని లొ కొద్ది పనిని బుద్దిగా  చేసేసి..  వీక్ మొత్తం ఉన్న ఆఫిస్ టెన్షన్స్ అంతా.. ఆ డెస్కు లొ వదిలేసి  చక్కగా లాక్ వేసి.. మరి..ఇంటికి చేరాను.. ఇంకేముంది.. రావడం.. పడుకోవడం.. తెల్లరి లేచేసరికి తొమ్మిది.. ఇక మొదలవుతాయి కుటుంబరావు పనులు…

వాళ్ళు పిలిచారనో, వీల్లు రమ్మన్నారనో… అటని.. ఇటని…. మీటీంగులు.. గ్రీటింగులు. శనివారం సమాప్తం…ఇక మిగిలింది.. ఆదివారం.. మార్నింగ్ రైతుబజార్,  ఈవినింగ్ బిగ్ బజార్…అంటు సందడి.

రాత్రి సరాదాకి అలా సినిమాకి వెళ్దామంటే తెల్లరితే సోమవారం.. పొద్దున్నే లేవాల్సి ఉంటుంది.. ఆఫిస్ గుర్తుకు రావడం.. ఆఫిస్ లొ చేయాల్సిన పెండింగు పనులు.. అన్ని గుర్తొచ్చి.. సినిమా ఊసే ఉండదు.. షికారు అసలే ఉండదు..

ఈ ఆదివారం సాయంత్రం.. అలా జాలి గా గడుపుదామనుకున్న  కొంచెం సమయం కూడా ఖాళి లేని పరిస్థితి.. డేవుడా .. ఎందుకు  నాకు ఈ దుస్థితి..?