కేరళ అందాలు…

2010/09/30

ప్రకృతి దేవుడిచ్చిన వరం.. గత వారం సతిసమేతంగా కేరళ వెళ్ళినపుడు నా కెమెరా కంటపడిన దృశ్యాలు..కొన్ని ఇక్కడ భద్రపరుస్తున్నాను..

మరిన్ని చిత్రాలకు ఇక్కడ దర్శించండి.

ప్రకటనలు

అర్రెరె వాన జడి వాన..!

2010/09/29

వాన.. అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి..! శేఖర్ కమ్ముల సినిమాలొ పాటలకైన.. గుణశేఖర్ సినిమాలో ఫైట్లకైనా ప్రతి ఒక్కరికి ఇష్టమే. గత రెండు నెలల నుండి చుట్టం లా కాకుండా చుట్టు పక్కనే ఉంటూ ప్రతి రోజు పలకరిస్తుంటే ..ఆహా.. ఎగిరి ఎగిరి గంతులేయనిపిస్తుంది…  ఆ చిరుజల్లుల పూల వాన చెప్పలేని సరదాలు తీరుస్తుంటే… ఒళ్ళంత తుళ్ళింత అవ్వాల్సిందే..! పరువపు వాన జల్లు గిల్లు తుంటే మొక్కజొన్న కంకి ఒకటి నములుతుంటే ఒక పక్కన మనతో మనకిష్టమైన వారితొ కబుర్లాడుతూ(మీరింకా మరేదో అనేసుకున్నట్లున్నారు) చలాకిగా నడుస్తుంటే…  హృదయం ముసిగా మురవదు?

ఇప్పుడే వర్షంలొ ఓ పావుగంట తడిచి..ఆ మజాను ఆస్వాదిస్తున్నాను… ఈ సంధర్బం గా నాకు వర్షం లొ ఉన్న రొమంటిక్ పాటలు వినాలని.. వీడీయోలు ఐతే చూడాలని అనిపిస్తుంది.. ప్రస్తుతానికి ఆవార సినిమా లొని అర్రెరె వాన జడి వాన వీడీయో చూస్తున్నాను.. మీరు మంచి రొమంటిక్ సాంగ్స్ కొన్ని సజెస్ట్ చేసేయండి మరి.. :)