పరవాలేదు.. పరవాలేదు…!!!

2010/10/31

” పరవాలేదు పరవాలేదు…
చూడచక్కగా ఉన్నా లేకున్నా..
ఏం పరవాలేదు.. నువ్వు ఎలా ఉన్నా పర్లేదు..”

గీతామాధురి పాడిన ఈ పాట “మనసారా…” చిత్రం లోనిది. మొదటి సారి వినగానే తెగ నచ్చేసింది… మీరు ఆలకించండి.. :)

ప్రకటనలు

త్రివిక్రమ్ ‘ఖలేజా’ పంచ్ లు…

2010/10/18

పదునైన పంచ్ డైలాగు లంటె మనకు ముందుగా గుర్తొచ్చేవారు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఒక లైను కి అటు ఇటు గా ఉండే తన సంభాషణలు సినిమా హాలు నుండి బయట పడ్డాక కూడా అదే పనిగా అలోచించేవిదంగా ఉంటాయ్…

ప్రస్తుతానికి ఖలేజా సినిమా టాక్ లు రివ్యూలు ఎలా ఉన్నాయి అనేది అప్రస్తుతం. కాని ఆ సినిమాలో కొన్ని  కామెడి సన్నివేషాలు,  త్రివిక్రమ్ మార్కు డైలాగులు.. పుష్కలంగా ఉన్నాయ్ అనేది ముమ్మాటికి నిజం.. ప్రతి సీన్స్ లొ ప్రాస కోసం పరితపిస్తూ అసలు విషయం అర్దమయ్యెలా చెప్పించడం లొ త్రివిక్రమ్ సిద్దహస్తులు.

ఈ మద్యనే ఖలేజా సినిమా చూసాను.. చూసినప్పడి నుండి కొన్ని పంచు డవిలాగులు, కామేడి ట్రాక్స్ నన్ను వెంటపడి వేదిస్తున్నాయ్. ఉపశమనం కోసం ఇక్కడ పొందుపరుస్తున్నాను.. మీకు గుర్తొస్తే కామేంటేయండి మరి.. :)

 • దుమ్ము భయ్యా.. దులుపుకుంటె వస్తది.   తుమ్ము భయ్యా… ఆపుకుంటె పొతది..!
 • అరిస్తె పారిపొయేవారు అస్సిస్టెంట్లు కాదు బాబ్జి.. మిగతాది తట్టలేదు తర్వాత చెప్తా.. :)
 • వినటానికి ఇదే బాగుంది…  అనటనికి అదే బెటర్ భయ్యా..!
 • ఇందాకటిని నుంచి ఒకటి కొట్టేస్తుంది.  అడగనా?  మీరు ఆరు నెలలు తీర్ధయాత్ర కు వెళ్తే  తొమ్మిది నెలల్లొ కొడుకెలా పుట్టేసాడా అని?
 • ఆడది కనపడగానే మగాడు..  కత్తి కనపడగానే  దేవుదు…:)
 • చూడ్డానికొచ్చావా… ?  చంపేయడానికొచ్చావా..?
 • మనషులకన్నా మొక్కలు ఎక్కువైపొయారా..? .
 • బాగ నీరసం గా ఉంది,  బలం రావాలంటే భొం చేయకుండా ఇంకేం చేయాలొ చెప్పండి.. :)
 • విన్న నీకె ఇంత షాకింగ్ గా ఉంటే .. చూసిన నా  పరిస్తితేంటి భయ్యా.. హార్టు పాంటు లొకి వచ్చేసింది తెలుసా.
 • ఆరొజు నేను తిన్న ఆట్లు మా తాత తిట్టిన తిట్లు మర్చిపోలేను భయ్యా..
 • ఎడారిలో దారి తప్పిపోయి… తెచ్చుకున్న డబ్బులు అయిపోయి.. చివరికి  నీళ్ళు దొంగతనం చేసే స్థితికొచ్చేసాను భయ్యా..
 • కోత కొయ్యకుండా పంట చేతికొస్తుందా.. మేత వెయ్యకుండా ఆవు పాలిస్తుందా.. రక్త పాతం జరిగి తీరాల్సిందే..
 • వర్షపాతం లేక ఏడుస్తుంటే.. రక్తపాతం ఎందుకు….?
 • భయ్యా!  మీ అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను.. వాళ్ళంటే భయం లేదు.. ఇదంటె ఇంటెరెస్టూ లేదూ..
 • నేను వెరీ రేర్ గా ఇస్తాను.. ఇచ్చినపుడు తీసుకోండి.. ఏంటది.?  రెస్పెక్టూ ..
 • అధ్బుతం జరిగేటప్పుదు ఎవరు గుర్తించలేరు? జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు…
 • రాత్రి నిద్ర లేదు.. పగలు తిండి లేదు.. :)
 • నువ్వె మా దేవుడు అని నమ్మే  పని లెదు,  మాకు నమ్మించె అక్కెర లేదు..
 • వాడు చూసావా… దెయ్యాలను అమ్ముకునేవాడిలా.. :)
 • ఒంటరిగా పుట్టావ్.. ఒంటరి గా పొతావ్.. ఏం..?  ఒంటరిగ జాగింగ్  చేసుకోలేవా?
 • వినపడక అడుగుతున్నావా.. అర్దం కాక అడుగుతున్నావ?   –   తెలియక అడుగుతున్నాను.. :)
 • టెలిగ్రాం లొ బ్యాడ్ న్యూస్ వస్తే.. పోస్ట్ మాన్ ని చంపెస్తారా?
 • ఏం పరిగెత్తాడు భయ్యా.. గుర్రానికి గాడిద కి క్రాసింగ్ చేస్తే  పుట్టేసినట్లున్నాడు..

ఇవండి మదిలొ మెదిలిన డైలాగులు… మీకు ఏమైనా  గుర్తొస్తే కామెంటేయండి మరి ;)