వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ మై ఆల్బం..

2010/11/30

ప్రకటనలు

కర కర మురుకులు.. గర గర గారెలు..!!!

2010/11/01

ఈ సాయంత్రం ఆఫిస్ నుండి బస్సు లొ ఇంటికి తిరిగి వస్తుండగా టెర్రిఫిక్ ట్రాఫిక్ తొ బుర్ర వేడేక్కుతున్న నాకు కూల్ గా ఉండాటనికి ఏం చేయాలని ఆలొచించి.. శ్రవాణానందానికై పాటలు వింటు, నయనానందానికై  సైటు సీయింగ్ చేస్తుండగా.. ఓర్వజాలని నా నోరు అమ్మోఆకలి అని ప్రాధేయపడుతుంటే.. ఓ హస్తాన్ని బ్యాగ్ లోకి తోయగా.. కరకర శబ్దం.. అప్పుడు గుర్తొచ్చింది మతి తప్పిన నాకు మా శ్రీమతి ప్యాక్ చెసిన మురుకులు మరి కొన్ని గారెలు అందులొ ఉన్నాయని గ్రహించి నిగ్రహంతో.. రెండే రెండు నిమిషాల్లొ వాటిని తినడానికి ఎవరికి అవుట్ సోర్సింగ్ చేయకుండా లాగించేసాను.. :)

ఈ దసరా పండక్కి చేసిన మురుకులు ఇంకా తింటున్నాను.. ఇంకా దీపావళి వరకు తింటూనే ఉంటాను. :)  అదెంటో అర్దం కాదు.. తినగ తినగ వేము తియ్యగానుండు అని వేమన చెప్పినట్లు ..తినగ తినగ మురుకులు ఖమ్మగా ఉండును… ఎంత తిన్నా మళ్ళి తినాలనిపించును..! మురుకులేంటి, గర్జెలు, గారెలు.. ఇలా ఎన్నొ.. :) కాని నాకు బాగ నచ్చేవి మాత్రం మురుకులేనండోయ్.

ఇప్పటికి మురుకులకి సరిపడా ముడి సరుకులు ఏం వాడుతారొ తెలీదు గాని చిన్నపటినుండి మురుకులు చేసారంటే చాలు… నా బ్యాగు లోను, బీరువా లోను.. ఇంట్లోనే రహస్యంగా కొన్ని చోట్లో దాచిపెట్టేవాడిని.. స్కూల్ కి వెళ్ళెటప్పుడు నములు కోవడానికి కావాలిగా.. :)

ఇక మా అన్నయ్య అయితే వాటిని వేడి నీళ్ళలో గాని, పాలలో గాని, చాయ్ లో గాని.. నానేసుకోని తింటూ తెలియని మజాని ఆస్వాదిస్తుంటాడు..

ఇక ఆఫిస్ లో సైతం.. పండగొస్తే చాలు డెస్కు దగ్గర ఎవరో ఓకరు.. ఏవొ ఒకటి తెచ్చేస్తారు. జంతికలని, బూరెలని, గారెలని… కం టు మై డెస్క్.. హెల్ప్ యువర్ సెల్ఫ్.. లిమిటెడ్ స్టాక్, ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్.. అంటూ అట్రాక్టివ్ గా మెయిల్ చేస్తారు.. ఇంకేముంది పండగే పండగా..!

ఇంతకి మీకేమంటే ఇష్టం.. :)