కర కర మురుకులు.. గర గర గారెలు..!!!

ఈ సాయంత్రం ఆఫిస్ నుండి బస్సు లొ ఇంటికి తిరిగి వస్తుండగా టెర్రిఫిక్ ట్రాఫిక్ తొ బుర్ర వేడేక్కుతున్న నాకు కూల్ గా ఉండాటనికి ఏం చేయాలని ఆలొచించి.. శ్రవాణానందానికై పాటలు వింటు, నయనానందానికై  సైటు సీయింగ్ చేస్తుండగా.. ఓర్వజాలని నా నోరు అమ్మోఆకలి అని ప్రాధేయపడుతుంటే.. ఓ హస్తాన్ని బ్యాగ్ లోకి తోయగా.. కరకర శబ్దం.. అప్పుడు గుర్తొచ్చింది మతి తప్పిన నాకు మా శ్రీమతి ప్యాక్ చెసిన మురుకులు మరి కొన్ని గారెలు అందులొ ఉన్నాయని గ్రహించి నిగ్రహంతో.. రెండే రెండు నిమిషాల్లొ వాటిని తినడానికి ఎవరికి అవుట్ సోర్సింగ్ చేయకుండా లాగించేసాను.. :)

ఈ దసరా పండక్కి చేసిన మురుకులు ఇంకా తింటున్నాను.. ఇంకా దీపావళి వరకు తింటూనే ఉంటాను. :)  అదెంటో అర్దం కాదు.. తినగ తినగ వేము తియ్యగానుండు అని వేమన చెప్పినట్లు ..తినగ తినగ మురుకులు ఖమ్మగా ఉండును… ఎంత తిన్నా మళ్ళి తినాలనిపించును..! మురుకులేంటి, గర్జెలు, గారెలు.. ఇలా ఎన్నొ.. :) కాని నాకు బాగ నచ్చేవి మాత్రం మురుకులేనండోయ్.

ఇప్పటికి మురుకులకి సరిపడా ముడి సరుకులు ఏం వాడుతారొ తెలీదు గాని చిన్నపటినుండి మురుకులు చేసారంటే చాలు… నా బ్యాగు లోను, బీరువా లోను.. ఇంట్లోనే రహస్యంగా కొన్ని చోట్లో దాచిపెట్టేవాడిని.. స్కూల్ కి వెళ్ళెటప్పుడు నములు కోవడానికి కావాలిగా.. :)

ఇక మా అన్నయ్య అయితే వాటిని వేడి నీళ్ళలో గాని, పాలలో గాని, చాయ్ లో గాని.. నానేసుకోని తింటూ తెలియని మజాని ఆస్వాదిస్తుంటాడు..

ఇక ఆఫిస్ లో సైతం.. పండగొస్తే చాలు డెస్కు దగ్గర ఎవరో ఓకరు.. ఏవొ ఒకటి తెచ్చేస్తారు. జంతికలని, బూరెలని, గారెలని… కం టు మై డెస్క్.. హెల్ప్ యువర్ సెల్ఫ్.. లిమిటెడ్ స్టాక్, ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్.. అంటూ అట్రాక్టివ్ గా మెయిల్ చేస్తారు.. ఇంకేముంది పండగే పండగా..!

ఇంతకి మీకేమంటే ఇష్టం.. :)

ప్రకటనలు

9 Responses to కర కర మురుకులు.. గర గర గారెలు..!!!

 1. ..nagarjuna.. అంటున్నారు:

  అవునండీ మురుకులని ఛాయ్‌లో వేసుకొని తింటే ఆ టేస్టే వేరు……మీరు ఇంకా ట్రై చేయకపోతే ఓసారి వేసుకొని చూడండి….

  మురుకులపై నేను రాసిన టపా…
  http://naa-payanam.blogspot.com/2010/10/from-home-with-love.html

 2. Sarath 'Kaalam' అంటున్నారు:

  నోరు ఊరించేస్తున్నారు కదా.

  నేను జిమ్ము చేసేటప్పుడు టివి చూస్తూ చేస్తుంటాను. అందులొ అప్పుడు ఎవరయినా ఏమయినా తింటుంటే నాకు మండిపోద్ది. జిమ్ము చేస్తుంటే నాకు అయితే బాగా ఆకలి కూడా అవుతుంది మరి. దానికి తోడు వారు ఊరించేస్తేనా… హ్మ్.

 3. geeta అంటున్నారు:

  naku kuda chala estam andi..office cabin lo oka packet pettusukuntanu.. ayipoyaka fill up anna mata..

 4. aswinisri అంటున్నారు:

  You know, our teacher said,”you have to always share and eat.”:)

 5. Nutakki Raghavendra Rao అంటున్నారు:

  ఫొటోలతో వూరించేస్తున్నావబ్బాయ్. కొన్ని పార్సిల్చేయరాదూ? అయినా చెక్కలు చూపి గారెలంటే ఎలా ? అశ్వనీ శ్రీ చెప్పిన మాట ఎవరైనా పాటించ తగ్గది. శ్రేయోభిలాషి…నూతక్కి.

 6. nelabaludu అంటున్నారు:

  @ Naagrajuna:
  వాహ్.. భలే రాసారు.. అవునండి…ఆ టేస్టే వేరు..
  @ Sarath ‘Kaalam’ :
  లాక్కొని తినేసెయండి.. తర్వాత సంగతి తర్వాత చూడొచ్చు జిమ్ము కెల్తున్నారుగా :)
  @ geeta:
  అవునవును.. :)
  @ aswinisri:
  hehehe… i used to sit in last bench.. so i never follow what teacher says :)
  @ Nutakki Raghavendra Rao:
  నో పార్సెల్.. వీలు కల్పించుకొని మా ఇంటికి రాగలరు.. :)

 7. Muralikrishna Kolli అంటున్నారు:

  Chusthu unte nee nooru ooruthundhi, chala bagundhi mee varnana Janthikalu ade nandi murugulu gurinchi

 8. nelabaludu అంటున్నారు:

  @ Muralikrishna Kolli
  Thanx :)

 9. vasantha అంటున్నారు:

  ela thayaru cheyali murukulu okasari daniki kavalasina items and thayari vidhanam cheptara

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: