నా బ్లాగనుభవాలు – 2010

2010/12/31

ఈ రోజుతో 2010 సంవత్సరానికి (ఆంగ్ల) గుడ్ బై చెప్పబోతున్నాం. ఒక్క సారి సంవత్సరం వెనక్కి తిరిగి చూస్తే..!  గత సంవత్సరం (2009) బ్లాగాంగ్రేటం చేసిన నేను.. ఈ సంవత్సరం బ్లాగుకు  ఎక్కువ సమయం కేటాయించలేకపోయాను (ఆశుభ పరిణామం).

ఇంతకి ఏం సాధించారు?
ఏదో సాధిద్దామని బ్లాగు మొదలెట్టలేదు. కాని కొత్త బ్లాగుల తాకిడి, బ్లాగ్మిత్రులతొ పరిచయం.. కలవటాలు…వగైరా.. :)

ఏమైనా న్యూ ఇయర్ రిజల్యూషన్?
భారీగా బ్లాగింగ్ కాకపోయినా కంటిన్యుటి మైంటేయైన్ చేయాలనుకుంటున్నాను…!

ఏయే బ్లాగ్మిత్రులను కలిశారు?
శరత్ గారిని, నూతక్కి గారిని, ప్రవీణ్ గార్లపాటి గారిని.. కలిశాను… బహు ధన్యవాదాలు :)

ప్రత్యేకంగా ఎవరినైనా కలవాలని వీలు కుదురక కలవలేకపోయారా?
కత్తి మహేష్ గారిని, వేదాంతం శ్రీపతిశర్మ గారిని ఎప్పటినుండో కలవాలని అనుకుంటున్నాను.. త్వరలొ కలుస్తాను..

ఏమైనా బ్లాగర్ మీటింగ్స్ కి హాజరయ్యారా?
బ్లాగ్ముఖంగా క్షమించాలి.. కొన్ని అనివార్య కారణాల వలన  ఈ-తెలుగు బాట కు గైర్హాజరయ్యాను.. :(

మరచిపోలేని మధుర క్షణాలు ఏవైనా?
తాడు-బొంగరం రచయిత పులిగడ్డ విశ్వనాధరావు గారిని కలవటం.. థాంక్స్.. నూతక్కిగారు…

అవండి నా బ్లాగనుభవాలు. ఈ సంవత్సరం ఏదొ తొందరగా గడిచినట్లనిపిస్తుంది….  కాలం ఎవరికోసం ఆగదు కదా. నడిచే కాలచట్రం లో మనం పాత్రధారులం మాత్రమే!


ప్రకటనలు

శ్రీధర్ – వన్ మోర్ ఫ్రం గ్రేట్ హ్యూమర్ !

2010/12/30

పొద్దున ఈనాడు పేపర్  చదువుతుంటే కంటపడింది.. శ్రీధర్ కార్టున్ “ఇదీ సంగతీ!”

నవ్వాగట్లేదు.. :)   గ్రేట్ జాబ్.. ఎంత నీట్ గా ప్రజెంట్ చేసారో…!!!