త్రివిక్రమ్ తీన్ మార్ !!!

2011/04/20

టాలివుడ్ ప్రేక్షకులకి పరిచయం అవసరం లేని వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్. పదునైన సంభాషణలను ఒకటి రెండు లైన్ లతో పంచ్ లా విసరడంలో దిట్ట. ఖలేజా తర్వాత అతని కలం లో నుండి జాలువారిన పంచ్ మంచ్ లు  తీన్ మార్ లో కనిపిస్తాయ్.  ఇంతకి తీన్ మార్ సినిమా..  “అర్జున్ పాల్ వాయ్ యుద్దం లొ గెలిచాడు, మైకెల్ యుద్దానికి వెళ్తున్నాడు” అనే వాయిస్ ఓవర్ తో  మొదలవుతుంది. పంచ్ లు మచ్చుకు కొన్ని ఇక్కడ వ్రాస్తున్నాను ..  :)

 • ఇంత సన్న నడుము మీద అంత పెద్ద బరువు ఎలా పెట్టాడో ఆ భగవంతుడికే తెలియాలి..
 • రోమియో జూలియట్, దేవదాసు పార్వతి, సీతా రాముడు, లక్ష్మి నారయణ..  ఫన్ని పార్ట్ ఈస్ ..లవర్స్ లలో మగాళ్ళ పేర్లు ముందు వస్తాయ్..పెళ్ళయిన వాళ్ళలొ ఆడాళ్ళ పేర్లు ముందు వస్తాయ్…
 • త్రిష: పెళ్ళైతె ప్రేమ పొతుందా?
  పవన్: ప్రేమ పొతె పర్లెదే.. భయం వస్తుంది…
 • దేవదాసు లొ ఏ.ఎన్.ఆర్-సావిత్రి లా,  మరోచోరిత్ర లొ కమల్ హాసన్-సరిత లా… ప్రేమ కొసం చచ్హిపోయేంత గొప్ప ప్రెమికుడిని కాదు.
 • అమ్మాయ్ పక్కన ఉన్నంత సేపే మనది..స్ట్రీట్ దాటితేనే గ్యారంటీ లేదు. అలాంటిది సముద్రం దాటి పోతుంది.
 • పవన్: హొటెల్ తొ పాటు ఫెవికాల్ డీలర్ షిప్ ఉందా?
  పరేష్ రావెల్: వాట్ ?
  పవన్: జిడ్డు లా అతుక్కపొతుంటేను.
 • త్రిష: ఎందుకు అంకుల్… ఎన్ని సార్లు కలిసిన.. వెళ్ళిపొయేటప్పుడు.. చివరి సారి గా చూడాలనిపిస్తుంది…
  పరేష్ రావెల్: చాల  చిన్న ప్రశ్న.. పెద్ద కథ మొదలుపెట్టింది.
 • దేవుడు ఎలాంటొడంటె డిప్ప మీద ఒక్కటి ఇచ్చి ఏడిచే లోపు చేతిలో చాక్లేట్ పెడతాడు
 • పవన్: ప్రెమిస్తే ప్రాణం ఇచ్చేయాలా ఇంకో ఆప్షన్స్ లేవా?
  పరేష్ రావెల్: – అప్పట్లో ఆప్షన్స్ లేవు.
  పవన్ – సేనాపతి! అది జెనెరెషన్ ప్రాబ్లం.
 • అందంగా లేదు అని అమ్మ ని, కోపంగా ఉన్నాడు అని నాన్నని వదిలేయలేము కదా..
 • రొమియో జూలియట్, లైలా మజ్ఞు, దేవదాస్ పార్వతి లాంటి గ్రేట్ లవర్స్ కావాలంటే చచ్చిపోవాలా, ట్రెండ్ మారుద్దాం.
 • నా సూట్ కేస్ పక్క రూం లో ఉంది, నేను ఈ రూం లొ ఉన్న! అంటె నేను ఎప్పటికి కంఫర్టబుల్  గా ఉండలేను.
 • ఉద్యోగం ఉంటే సంపాదన వస్తుంది కాని సంస్కారం రాదు.
 • ఏడుస్తున్నప్పుడు ఒంటరిగా ఉంటె బాధ గా ఉన్నాడని జాలి పడతారు; అదే నవ్వుతూ కూడ ఒంటరిగా ఉన్నాడనుకోండి పిచ్చాడనుకుంటారు.
 • పెళ్ళికొడుకు ఉన్నొడా లేనోడా అని కాకుండ మనసున్నోడా అలవాట్లు లేనోడా అని ఆలోచించండి..
 • మనకు జ్వరం వచ్చినపుడు అమ్మ కావాలనిపిస్తుంది; భయం వేసినపుడు నాన్న ఉంటె ధైర్యం గా ఉంటుంది; బాధలొ ఉన్నప్పుడు ఫ్రెండ్ పక్కన ఉంటె బాగుంటుంది; మరి ఆనందం గా ఉన్నప్పుడు  మనకు ఎవరుంటె కరెక్ట్ అనిపిస్తుంది? హా? ఏంటి ఆలోచిస్తావ్? మనం ప్రేమించిన వాళ్ళు ఉంటె బాగుంటుంది.
 • కొడితె అరుస్తాం, బూట్ల తొ తొక్కితే భరిస్తాం, బనెట్ల తో పొడిస్తే నరికి నడి రోడ్డు మీద పడేస్తాం..
 • వేదం,కాలం అన్నింటికి అతీతం గా ఉండే బాష భయం. అది మాకే కాదు నీకు ఉంది.
 • గీత దాటొద్దు చెరిపేస్తాం, హక్కుల్ని కాలరాయొద్దు తొక్కేస్తాం…!
 • కారణాలు లేని కోపం, గౌరవం లేని ఇష్టం, భాద్యత లేని యవ్వనం, జ్ఞాపాకాలు లేని వృద్ధాప్యం అనవసరం.
 • మీనుంచి వాడు చేసిన తప్పులకి నా బతుకు కుక్కలు చింపిన కర్టైన్ క్లాత్ లా అయిపోయింది
 • ఆ అర్జున్ గాడి ఫొటో చూపించి మా పొస్టర్ చించేసారు కదండీ!
 • ఇది నా రిసిగ్నేషన్ లెటర్. దీని మీద నీకు నచ్చిన రీజన్ రాసుకొని చల్లబడు. ఎక్కడ కంఫర్ట్ గా ఉంటె అక్కడ పెట్టుకొ!
 • స్మశానం లొ సమాధులకి సున్నలేసుకునే ఆ రంగు నువ్వు నూ!
 • పరేష్ రావెల్: కస్టమర్ కడుపు మండిపొతుంది.
  పవన్: ఇక్కడ నా గుండె మండిపోతుంది.
 •  నీ లాగ ప్రతి దానికి అడ్డం వస్తే, కింది నుంచి మంట కుడా వస్తుంది.
 • పెదాల మీదికి నవ్వు వస్తుంది, కళ్ళలోకి వెలుగొస్తుంది, గుండె తేలిగ్గా ఉంటుంది;
 • కొడితె కోడి గుడ్డు లా ఉన్నోడివి.. టమాటో పండు లోకి వచ్చేస్తావు రోయ్!
 • పవన్: కార్ ఉందా?
  త్రిష: దేనికి?
  పవన్: రైడ్ ఇస్తావేమో అని…
  త్రిష: లేకుంటే?
  పవన్: నెనిద్దామని… :)
ప్రకటనలు

శ్రీ ఖర నామ ఉగాది శుభాకాంక్షలు…

2011/04/04

కోకిలమ్మల కూతలతో

మావికొమ్మల పూతలతో

వచ్చేసింది ఉగాది

మీకు తెచ్చేందుకు సంతోషాల నిధి.

శ్రీ ఖర నామ ఉగాది శుభాకాంక్షలు..