ఓ మై డియర్ ఫ్రెండ్ – హ్యపీ బర్త్ డే టు యు!!!

2011/10/16

కెరటం లా పొంగుతున్న నా ఊహల ప్రవాహానికి పరిచయమైన ఓ ప్రియరాగం ఈ నేస్తం..

నిండు జాబిలి పండు వెన్నెలా సాగే మన ప్రతి కమ్మని మజిలీ

నీ మాటల జావలితో నవ్వుల రవళిని ప్రతిబింబించే సుమగంధం..

పేరు లోనే వినోదాన్ని నిలుపుకొన్న నీవు చాటేవు బంధానికి సంతోషబలం..

నీ  పలుకుల చిలుక చిరునవ్వుల మొలకై  విరజిమ్మును ఆనందం..

నిలువెత్తు సాక్ష్యమైన ఈ స్నేహం నిరతమవ్వాలని  మనసారా ఆకాంక్షిస్తూ…

మరియు నేడు నీ జన్మదినం సందర్భంగా నేనిస్తున్న కానుక ఈ చిన్ని కవితే మిత్రమా..!

నీవు అనుదినం చిరునవ్వుతొ హాయిగా ఉండాలని కోరుకుంటూ…

హార్దిక జన్మదిన శుభాకాంక్షలు..!!!

ప్రకటనలు

గోవనస్థలి.కామ్ !!!

2011/10/16

గత వారమనుకుంటా.. పొద్దున ఒక టిఫిన్ సెంటర్ లొ టిఫిన్ చెస్తుండగా  ఒక పోస్టర్ కనపడింది.. అదే రోజు సుష్మ థియేటర్ లొ మ్యాట్నీకి దూకుడు సినిమాకి వెళ్ళినప్పుడు.. ఆ సాయంత్రం గ్రీన్ బావర్చి లొ స్నేహితులతో ఇరాని టీ లాగిస్తున్నప్పుడు.. మళ్ళి అదే రాత్రి కొత్తగా ఈ మద్యే ప్రారంభించిన ఓ రెస్టారెంట్ లొ ఫ్యామిలితో పార్టి లొ ఉన్నప్పుడు కనపడింది.  ఇదేంటో నన్ను ఫాలో అవుతున్నట్లుగా అనిపించింది… ఆత్రంగా ఆరా తీస్తే దాని పైన గోవనస్థలి.కామ్ అని వ్రాసి ఉంది.. వనస్థలిపురం వాసి అయిన నాకు ఏమిటి ఈ సైటు అని అంతర్జాలం లో విహరించగా మా వనస్థలిపురం(కొనలేదు.. :) పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి అభిమానం తొ!) గురించి ఇంఫర్మేషన్ సేకరించి భద్రపరిచారు.

వనస్థలిపురం లోని ఆలయాలు, పూజల వివరాలు, ఏ థియేటర్ లో ఏ సినిమా, పాఠశాలలు.. బిజినెస్ లు.. ఇలా ఎన్నెన్నొ వాటిగురించి తెలుసుకోవచ్చు.  ఈ సందర్బంగా సైటు నిర్వాహకులకు ..   అభినందనలు తెలియచేసుకుంటున్నాను.. త్వరలో సైటు సంపూర్తిగా అందుబాటులో ఉంటుందని ఆశిస్తూ..!

Let’s Visit…  http://www.govanasthali.com