నే పెద్దగా బ్లాగని సంవత్సరం – 2011

2011/12/31

ప్రియమైన బ్లాగ్మిత్రులారా..

ఈ ఏడాది లో జరిగిన రెండు ముఖ్యమైన విషయాలు మీరు మనస్పూర్తిగా తెలుసుకోవాలి ఒకటి సచిన్ టెండూల్కర్ వందో శతకం చూసే భాగ్యం మనకి దక్కకపోవడం(హొపింగ్ ఇన్ 2012)  రెండు ఈ నెలబాలుడి బ్లాగోతముగా నేను పెద్దగా బ్లాగక పోవడం .. కావున బ్లాగ్ముఖంగా మనవి చేసుకుంటున్నదేమనగా ముజే మాఫ్ కర్నా..!

ఇక 2011 సంవత్సరం నాకు మంచి అనో చెడు అనో  చెప్పలేను.  మంచి చెడు అనేది చేసు పనుల్లో ఉంటుంది.. కాలానిదేముంది! కాని మంచో చెడో మరిచిపోలేనిదైతే ఓ జ్ఞాపకం గా ఎప్పటికి గుర్తుంటుంది.. అలాంటి జ్ఞాపకాలేమైన ఉన్నాయంటారా..ఈ సంవత్సరం నాకు ఆఫీస్ లో అంతర్జాలానికి ప్రవేశం లేక ఇంట్లో లాప్టాప్ అందుబాటులో లేక సరిగా బ్లాగింగ్ చేయలేకపోయాను..ఏ మాత్రం వీలు దొరికిన త్రైమాసికానికో చతుర్మాసికానికో ఒకటో రెండు టపాలు వ్రాసాను..

బ్లాగు విషయాలు వదిలేసి మిగతావాటిని పరిశీలిస్తే…

ప్రస్తుతం నా  బరువు = 74 కిలో గ్రాములు (కొవ్వు తో కలిపి)  కాని గత సంవత్సరం నా వయసు 28 సం: మరియు నా  బరువు 68 కిలో గ్రాములు. ఎంతగానో ఇంప్రూవ్ అయ్యాను కదండీ! అందుకే డాక్టర్లు నా ఈటింగ్ హాబిట్స్ మార్చుకొమ్మని సజెస్ట్ చేస్తున్నారు. ఎందుకనగా నేను తింటే ఆయాసం గా తినకపోతే నీరసంగా కన్పిస్తున్నాను మరి!

సినిమాల సంగతులు:
సినిమాలు మస్తుగా చూసాను.. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, తమిళ, మలయాళీ సినిమాలతో పాటు కొరియన్ సినిమాలు కూడా చూసాను.. :)

దైవ దర్శనాలు:
చిలుకూరు, యాదగిరిగుట్ట ప్లస్ తిరుపతి విత్ మై బిగ్ ఫామిలీ!

విహార యాత్రలు,షికార్లు వగైరా:
చుట్టుపక్కల ఇటు అటు.. స్టేట్ దాటి వెళ్ళలేదు కాని బానే తిరిగాను.. మిత్రుల వివాహ వేడుకలకు హాజరు.. టీం అవుటింగులు చాలా చాలానే ఉన్నాయ్.

క్రీడానందాలు:
క్రికెట్ అంటే అభిమానం.. కాబట్టి వరల్డ్ కప్ మ్యాచులన్ని తిలకించాను మరియు వీరేందర్ సెహ్వాగ్ వరల్డ్ రికార్డ్ మ్యాచ్..!

మరిచిపోలేని మధురానుభూతి:
మా ఆఫీస్ స్టాఫ్ తో కలిసి మూడు ప్రైమరీ స్కూల్ పిల్లలకు కావలిసిన కోరికలు తీర్చడానికి చిన్న ఈవెంట్ కండక్ట్ చేసి ఉచితంగా పుస్తకాలు, బ్యాగులు, బూట్లు..ఇలా వారికి కావలసినవి అందజేయడం లో పాలు పంచుకున్నాను. వారితో ఒక రోజంతా గడిపాం.థాంక్స్ టు టీం..!

సో మై ఫ్రెండ్స్.. అవండి కబుర్లు.. పాత సంవత్సారానికి వీడ్కోలు పలుకుతూ ముగిస్తున్నాను.. :)

ప్రకటనలు

పారిపోవాలని ఉంది.. పది దినాలు ఆఫిస్ కి దూరంగా..!

2011/12/29

ఏంటో..అసలేంటేంటో.. ఈ మద్య ఆఫిస్ అంటె చాలు తెగ  భయమేస్తుంది.. :(  నచ్చని పని నేను చేయలేకో  లేదా నేను చేస్తున్న పని నాకు నచ్చలేకో వర్క్ ఎక్కువగా ఉండటం చేతనో లేక మేనేజర్ ఏ మాత్రం నచ్చక పోవడం వల్లో… కారణం మాత్రం తెలీదు!

గత మాసం చివర్లో ఇలాగే అన్పిస్తే ఏకంగా ఏడుకొండల స్వామీ దగ్గరికి కుటుంబ సమేతంగా వెళ్లి మొర పెట్టుకున్నాను! దానితో కాస్త మనసుకి ఉపశమనం దొరికినట్లైంది. మళ్లీ ఈ నెల చివర్లో అలాగే అన్పిస్తుంది.. మంత్ ఎండ్ మానియా నా లేక ఆఫీస్ ఫోబియానా నాకైతే అర్ధం కావట్లేదు…:(

అసలు కష్టాలు ఉద్యోగం మొదలు పెట్టాక మొదలయ్యాయేమో అనిపిస్తుంది ..ఓ పది రోజులు ఆఫీస్ కి సెలవ్ పెడదామంటే లివ్ బాలెన్స్ నిల్లు.. నో చాన్స్.. అదే స్కూల్ లేదా కాలేజి రోజుల్లో కాలు నొప్పనో కడుపు నొప్పనో పబ్బం కానిచ్చే వాడిని. ఇప్పుడలా చేయాలంటే మనసోప్పట్లేదు :(   కాని ఏదేమైనా పది రోజులు కాకపోయినా రెండో మూడో రోజులు అయిన ఆఫీస్ కి దూరంగా ఉంటూ దగ్గరైనవారితో ఎటైనా దూరంగా వెళ్ళాలని ఉంది :)